శుక్రవారం, మే 30, 2014

Telangana Bill- precautions, TRC -100th discussion,speech of Prof.Ghanta...

Telangana Bill- precautions, TRC -100th discussion,speech of Prof.Ghanta...

Telangana Bill - precautions, TRC -100th discussion,speech of Prof.Ghant...

మోడీ అండతో మొదలయిన దాడి..!


రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో అరణ్యవాసం చేశా డని, అడవిలో ఆకులలము లు తిని కాలం గడిపాడ ని, శబరి అనే గిరిజన మహిళను కలిశాడని, ఆమె రాముడికి రేగుపళ్ళు (కొరికి రుచి చూసి మరీ) తినిపించిందని కథల్లో ఉంది. రాముడు భద్రాచలం అడవుల్లోనే అరణ్యవాసం చేశాడని నమ్మిన కంచర్లగోపన్న అనే గోలకొండ తహసిల్దారు ప్రజలు కట్టిన శిస్తుతో భద్రాచలంలో రాముడి కోసం గుడి కట్టించి జైలు పాలయ్యాడు. భద్రాచలానికి, దాని చుట్టూ ఉన్న అడవికి అటువంటి మహత్యం ఉందని నమ్ముతుంటారు. నమ్మకం ఎలా ఉన్నా శబరి పేరున ఒక నది అదే అడవిలో ఉన్నది. ఒడిశా అడవుల్లోని తూర్పుకనుమల్లో పుట్టిన శబరి ఒడిశా, ఛత్తీస్గఢ్ల్లో దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించి తెలంగాణ చేరి భద్రాచలం దగ్గర కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇప్పుడు శబరి మాయం కాబోతు న్న ది. రాముడికి ఆతిథ్యమిచ్చిన శబరి సంతతికి చెందిన అడవి బిడ్డలంతా అనాథలు కాబోతున్నారు

అప్పు డు రాముడిని ఆదరించినందుకు రాక్షస మూకలో వారిమీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నా రనుకుంటె పొరపాటు. నిత్యం జై శ్రీరాం పారాయ ణం చేసే రామ భక్తులే శబరీ నదిని, నది పొడవు నా ఉన్న అడవిని, అందులోని శబరి వారసులైన ఆదివాసుల ఉనికిని మాయం చేసే పనికి పూనుకున్నారు. మోడీ దీనినొక పవిత్ర కార్యంగా భావించారేమో! మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ జారీ చేసి రాముడు తలదాచుకుని, ఆకలి తీర్చుకున్న అడవిని పోలవరంలో కలిపేశాడు

మోడీతో ప్రమాదం ఉందని అంటే కొందరు అంగీకరించలేదు. మోడీకి భారత దేశాన్ని హిందూ జాతీయ మార్గంలో నడిపించాలన్న పెద్ద ఎజెండా ఉంది కాబట్టి చిన్న విషయాలు పట్టించుకోడేమో అనుకున్నాం. కానీ పోలవరం విషయంలో ఆయన పట్టుదల చూసిన తరువాత తెలంగాణ ప్రజలకు అనేక రూపాల్లో ముప్పు పొంచి వుందనిపిస్తున్నది. మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన అరగంటలోనే ఆయన మంత్రివర్గం జారీ చేసిన శాసనం వల్ల పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలే కాకుండా, గ్రామాలున్న మండలాలు కూడా సీమాంధ్ర వశం అయిపోతాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 20చైగామాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ అవుతాయి. ఇదంతా చంద్రబాబు, వెంకయ్య నాయుడుల వల్లనే జరిగిందని ఆంధ్రా పత్రికలు వారిద్దరినీ ఆకాశానికెత్తేశాయి. జోడీ మోడీ నీడలో సీమాంధ్రను తమ శాశ్వత సామ్రాజ్యంగా చేసుకోవాలని తహతహలాడుతున్నది. అందుకోసం వాళ్ళు దేనినైనా ఆక్రమించుకోగలరు

పోలవరం సమస్య ఇప్పటిది కాదు. దాదాపు 70 ఏళ్ళ ముందు నుంచీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలనే ఆలోచన ఉంది. బ్రిటిష్ హయాంలో పోలవరం నిర్మాణానికి 1940లోనే ప్రతిపాదన వచ్చింది. ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాచలం రాముడి పాదాల వరకు నీళ్ళు వస్తాయి కాబట్టి రామపాద సాగర్ అనే పేరు ఖరారు చేసి సర్వే పూర్తి చేశారు. కానీ పోలవరం సైట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుకూలంకాదని వదిలేశారు. తూర్పు కొండల చివర పాపికొండ సానువుల మధ్య డ్యాం నిర్మాణం కష్టమని, ఖర్చుతో కూడుకున్న్డదని వదిలేశారు.ఆతరువాత ప్రయత్నాలు జరిగినా జలవనరుల నిపుణులు కెఎల్ రావుతో సహా అనేక మంది వారించారు. ఇంత భారీ ప్రాజెక్టు కొండలమధ్య సరైన పునాది లేకుండా కడితే వరదల ఉధతికి తట్టుకోవడం కష్టమని ప్రతిపాదన వదిలేశా రు. ఆతరువాత అనేక చిన్న డ్యాంలు, బ్యారే జ్ కోసం ప్రతిపాదనలు చేశారు

కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. 2004లో రాజశేఖర్రెడ్డి అధికారంలోకి రాగా నే ఆయన కన్ను మళ్ళీ భారీ ప్రాజెక్టు మీద పడిం ది. వెంటనే ఆయన ఢిల్లీలో పావులు కదిపి కొన్ని అనుమతులు తెచ్చి పనులు మొదలుపెట్టారు. అప్పు డే ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల నుం చి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. పోలవరంవల్ల భారీ ఎత్తున ప్రజలు నిర్వాసితులవుతారన్నది మొదటి అభ్యంతరం. దాదాపు 150కిలోమీటర్ల దూరం వరకు ఎగువ ప్రాంతం ముంపునకు గురవుతుంది. తెలంగాణతో పాటు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టా గ్రామాలు కూడా అందులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఆదివాసీ గ్రామాలున్నాయి. అలాగే పోలవరంలో ముంపునకు గురవుతున్న వారిలో ఎక్కువ భాగం తెలంగాణ ప్రజలు. ప్రాజెక్టు ద్వారా వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం పోలవరం మీద పెడుతున్న ఖర్చుకు, దానిద్వారా ఒనగూ రే ప్రయోజనానికి పొంతనలేదని, లాభంకంటె నష్టమే ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి. ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టు 291వేల హెక్టార్లుగా పేర్కొన్నా రు. కష్ణ,గోదావరి జల వినియోగం మీద అధ్యయనం చేసిన శ్రీలంకకు చెందిన ఒక సంస్థ పోలవరం ప్రతిపాదిత ఆయకట్టులో 95 శాతం భూమికి నీటి వసతి ఉన్నదని, వాళ్ళు చెపుతోన్న ఆయకట్టులో ఐదు శాతమే కొత్తగా సాగులోకి వస్తుందని పేర్కొన్న ది

పోలవరంలో నీటిని నిలువచేయాలంటే దాదా పు 46మీటర్ల ఎత్తు, రెం డున్నర కిలోమీటర్ల పొడవాటి డ్యాం నిర్మించాలి. ఎత్తయిన కొండలమీద అం ఎత్తు డ్యాం ప్రమాదకరమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని దష్టిలో పెట్టుకునే డిజైన్ మార్చాలని పట్టుబడుతున్నారు. అయినా సరే వినకుండా సీమాంధ్ర నాయకులు తామేదో సాధించామని చాటుకోవడం కోసం ఇప్పుడు విధ్వంసానికి పూనుకున్నారు
దీనివెనుక వనరులు స్వాధీనం చేసుకోవాలన్నవలసాధిపత్య విస్తరణ ధోరణి కనిపిస్తున్నది. ఏదో ఒక సాకు చూపి అపార జలవనరులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఆర్యుల కాలంనుంచీ అమలవుతున్న వలసాధిపత్య ధోరణే. తమ ఆర్ధిక పురోగతే ముఖ్యం అనుకున్న వాళ్లకు అస్తిత్వాలు కనిపించవు. వాటిని ధ్వంసం చేయడం అవసరమని కూడా అనుకుంటారు. ఇప్పుడు నాయుడు జోడీ అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఆదివాసుల అభ్యంతరం వాళ్లకు ఆనడం లేదు. ఉక్కుమనిషి అని ప్రచారం చేసుకున్న మోడీ వాళ్ళిద్దరి ముందు కీలుబొమ్మగా మారిపోయాడు. మొత్తం తతంగాన్ని చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా పూర్తి చేశారు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్లోని గండిపేటలో మామగారి ఆశ్రమంలో ఆయన రోజంతా తెలుగుజాతికోసం ప్రాణాలు ఇస్తానని ప్రతిన చేశారు.

తెలంగాణ అభివద్ధిని కోరుకుంటున్నానని, తనకు రెండు ప్రాం తాలు ఒకటేనని చెప్పారు. కానీ అదే సమయంలో ఆయన అనుయాయులు అశోక్ గజపతి, కంభంపాటి రామ్మోహన్రావు ఢిల్లీలో గ్రామాల బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేశారు. తెలంగాణ తమ్ము ళ్ళు తిరగబడతారేమోనని అనుకుని మంత్రివర్గ మొదటి భేటీలోనే పనిపూర్తయినా దానిని మహానాడు ముగిసేదాకా రహస్యంగా ఉంచారు. బాబుగారికి తెలియని విషయం ఏమిటంటే ఆయన శిబిరంలో ఉన్న తెలంగాణ తమ్ముళ్ళు తాము తెలంగాణ బిడ్డలమని మరిచిపోయి చాలాకాలమే అయింది. అందుకే మహానాడులోనే కాదు మరునాడు కూడా ఒక్కరూ కిక్కురుమనలేదు. తెలంగాణ టీడీపీ బాబు కు దాసోహం అయిపోతే ఇక్కడి బీజేపీ పూర్తిగా భావదాస్యంలో పడిపోయి తెలంగాణ అంటేనే మండిపడే మోడీ ముందు మోకరిల్లుతున్నది. ఎన్నికల ముందు పోలవరం విషయంలో తెలంగాణ బీజేపీ మాట్లాడిన దానికి ఇప్పటి మౌనానికి పొంతనే లేదు. పైగా కాంగ్రెస్ పార్టీనే ఆర్డినెన్సు రూపొందించిందని చెబు తున్నది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకున్నట్టు లేదు.

టీఆర్ఎస్ కూడా రాష్ట్రం రావాలన్న తొందరలో పోలవరం ఇక్కడి ఆదివాసులకు శాపం కాబోతుందన్న విషయాన్ని పట్టించుకున్నట్టు లేదు. ఇప్పుడు పొరపాటును బంద్ ద్వారా సవరించుకోలేము. కోర్టులకు వెళ్లి కేసులు వేసినా కోర్టులు, న్యాయమూర్తులు ఇటువంటి విషయాల్లో ప్రజలపక్షాన ఉండడమన్నది అనుమానమే
ఇట్లా రాజకీయ పార్టీలన్నీ పదేళ్లుగా చేస్తూ వస్తు న్న తప్పుల వల్ల ఇవాళ ఖమ్మం ప్రజలకు ముప్పు ముంచుకు వచ్చింది. అందులో భూములున్న గిరిజనేతరులకు పెద్దగా నష్టం లేదు. వాళ్ల కు పరిహారం వస్తుంది. ఎక్కడో ఒకచోట మళ్ళీ జీవితాలు మొదలు పెడతారు. కానీఅడవిని నమ్ముకుని బతుకుతోన్న ఆదివాసీలకే సమస్య. ఇప్పుడు వాళ్ళకోసం నిలబడవలసిన బాధ్యత అందరిమీద ఉన్నది. నిజానికి ఇది వాళ్ళు సష్టించుకున్న సమస్యకాదు. సీమాంధ్ర నేతల ఆర్ధిక రాజకీయ వ్యూహం, తెలంగాణ నాయకత్వ వ్యూహాత్మక మౌనంవల్ల తలెత్తిన సంక్షోభం. ఆర్డినెన్సుతెచ్చిన క్రమంలోప్రభుత్వం అనేక తప్పులు చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది. జూన్ 2 ఏర్పాటు కానున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే న్యాయ పోరాటానికి పూనుకోవాలి. మరోవైపు ఇప్పటికే పోరాటంలో ఉన్న ప్రజా సంఘాలు దీనినొక ఆత్మగౌరవ ఉద్యమంగా మార్చాలి
ముఖ్యంగా ఖమ్మం నుంచి గెలిచిన టీడీపీ, వైసీపీ ఎమెల్యేలు, ఎంపీ ఎటువైపో తేల్చుకోవాలి. పార్లమెంటు సమావేశాలు మొదలయ్యేలోపు ఒక ఐక్య కార్యాచరణకు తెలంగాణ పార్లమెం టు సభ్యులంతా పూనుకోవాలి. కుట్రను ఎదిరించాలి.నిజానికి ఇది ఆరంభం మాత్రమే


రానున్న అయిదేళ్ళలో మోడీ అండతో వెంకయ్య, బాబు నాయుడులు ఇటువంటి అనేక ఎత్తులు వేస్తారు. అయిదేళ్ళలో ఇద్దరు నాయుళ్లు హైదరాబాద్ను తమ టార్గెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే చిన్న నాయుడు తరఫున తలబిరుసు నేతలు ముందుకు వచ్చి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనే టీడీపీ నాయకుడు పోలవరం విషయంలో నోరుమూసుకుని పడి వుండం డి, అరిచి గీ పెడితే హైదరాబాద్ను కూడా ఆక్రమించుకుని కేంద్ర పాలి ప్రాంతం చేసేస్తాం అని బెదిరిస్తున్నాడు. దీన్ని ఉట్టి ప్రేలాపనగా కొట్టిపారేయలేం. రేపు రెండో అంశంగా వాళ్ళు హైదరాబాద్ను ముం దుకు తీసుకు రారనే నమ్మకం ఏమీ లేదు. వాటిని చిత్తు చేయక పోతే తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు చేసిన త్యా గాలకు విలువుండదు. తెలంగాణ కూడా భద్రాద్రి రాముడి లాగే అనాథగా మిగిలి పోవచ్చు