మంగళవారం, మే 27, 2014

మోడీ మొదటి దెబ్బ

శ్రీమాన్ నరేంద్ర మోడీ తన మొదని ముసుగు తొలగించాడు.   తెలంగాణా ప్రజల మీది వ్యతిరేకతను ఆయనమొదటి రోజే చాటుకున్నాడు. ఇంకా మొదటి పార్లమెంటు కొలువుదీరకముందే పార్లమెంటు హక్కులను, రాజ్యాంగ నిబంధనలను పోలవరంలో కలిపి ఆయన ఏకంగా ఏడూ మండలాలను సీమాంధ్ర లో కలిపేశాడు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ బిల్లులో కొన్ని  (పోలవరం ముంపు) గ్రామాలే సీమాన్ధ్రకు పోతాయి. కానీ ఆంధ్రా నాయుడు గార్ల నమ్మిన బంటుగా  మోడీ కొత్త ఆర్డినెన్సు ద్వారాతెలంగాణా లోని ఖమ్మం జిల్లా కూనవరం, చింతూరు, భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్ఘంపాడు మండలాలను ఆంధ్రాలో కలిపి 205 గ్రామాలను నీటిలో ముంచే పథకానికి ఆమోదముద్ర వేశాడు.  
వాస్తవానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్3 ఇలా చెపుతోంది. 
Article 3 
3. Formation of new States and alteration of areas, boundaries or names of existing States: Parliament may by law
(a) form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;
(b) increase the area of any State;
(c) diminish the area of any State;
(d) alter the boundaries of any State;
ఆంద్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లు ఇప్పటికే చట్టమై పోయింది. దాని ప్రకారం తెలంగాణలో ఖమ్మం జిల్లా అందులోనే పై ఏడు మండలాలు కూడా అంతర్భాగం. దాన్ని సవరించకుండా, పార్లమెంటు ప్రమేయం లేకుండా ఒక్క సంతకంతో ఆయన రాష్ట్రపతి ఇప్పుడు లక్షలాది మంది ప్రజల జీవితాలు తారుమారు చేశారు. ఎన్నికల ప్రచారపర్వంలో బీజేపీ, టీడీపీలు పోలవరం కట్టితీరుతామంటూ శపథం చేశాయి. వారి పంతాన్ని నెగ్గించుకునేందుకు తొలి క్యాబినెట్‌ను వేదికగా చేసుకోవడం గమనార్హం. ఈ నిరంకుశ చర్యకు వ్యతిరేకంగా బంద్ బంద్ పాటిద్దాం. తెలంగాణా ఆదివాసుల పోరాటానికి మద్దతునిద్దాం. తెలంగాణా ను కాపాడుకుందాం! . 

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇంగ్లిషోన్నితరిమి కొట్టి మరి ఇంగ్లీష్ భాష ఎందుకు వాడుతున్నట్టో మరి అన్న గారు సెలవియ్యాలి. భాష ఎవనయ్య జాగీరు కాదు. నీకు ఎమన్నా దాని మీద పేటెంట్ ఉంటె పొయ్యి కోర్ట్ లో దావా వేసుకో

      తొలగించండి
    2. ayyaoniva ....... abbaoniva ......... Thelanganoniki Nuvvemaina Paloniva............Telanagana Telugu gurinchi matladuthunnav Kumarjavasa

      తొలగించండి