శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

తెలంగాణా పోరాటం కులమతాల గోడలు దాటి ఒక జాతీయతా భావంగా ఎలా ఎదిగింది?!


రాంకీ రాక్షసత్వంకాంగ్రెస్-తెరాస విలీనం పై వింత వాదనలు వాదనలు ?!

కాంగ్రెస్-తెరాస విలీనం పై వింత వాదనలు వాదనలు ?! 

H M T V మార్నింగ్ షో


కేసీఆర్‌ను అభినందిద్దాం !!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన వెలువడ్డ డిసెంబర్ 9, 2009 రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సంబరాల్లో పాల్గొన్న నన్ను ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను మీరు ఎలా చూస్తారు అని ఒక విలేకరి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన మహాత్ముడు అని చెప్పాను. అంటే తెలంగాణ ప్రజలకు ఆయన మహాత్మా గాంధీ అంటారా అని ఆ విలేకరి మళ్ళీ అడిగాడు, నాకు అవుననక తప్పలేదు. ఆ తరువాత నా చుట్టూ ఉన్న మిత్రులు, లైవ్‌లో అది విన్న వాళ్ళు చాలామందే నన్ను నిజంగానే నువ్వు కేసీఆర్‌ను మహాత్ముడు అనగలవా? అని అడిగారు. నేను చెప్పాల్సింది చెప్పాను. మహాత్ముడు అనేది పేరు కాదు. అదొక భారతరత్న లాంటి బిరుదు అంతకంటే కాదు. అశేష ప్రజావాహిని ఆకాంక్షలకు ప్రతినిధిగా ఉండి వాళ్ళ కలను నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా సరే మహాత్ముడే అవుతాడన్నది నా అభిప్రాయం. కొందరు అంటున్నట్టు ఆయన కారణజన్ముడని, త్యాగ ధనుడని కీర్తించనవసరం లేదు కానీ ఆయనను తెలంగాణ ప్రజలు, ఉద్యమం మాత్రం మహాత్ముణ్ణి చేసింది. 

ఈ నేపథ్యంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఒక్క కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చిందా? అన్నది. తెలంగాణ ఉద్యమంలో మిగతా ఎవరికీ అందులో పాత్ర లేదా అంటే ఉంది. భారతదేశానికి కూడా స్వాతంత్య్రం ఒక్క గాంధీ పోరాడితే మాత్రమే రాలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాగా గాంధీ పెద్ద త్యాగాలేమీ చేయలేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో అలాంటి వాళ్ళు వేలాదిమంది బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అయినా వాళ్లకు ఎవరికీ రానంత ఖ్యాతి ఒక్క గాంధీకే ఎందుకు వచ్చింది అంటే ఆయన ఒకే పద్ధతిలో, ఒకే సిద్ధాంతంతో అప్పటి పాలకులు, చట్టాలు అనుమతించే రీతిలో పోరాడారు. అది సత్యా గ్రహమని, శాంతి మార్గమని చెప్పారు. హింసకు తావు లేకుండా, సహాయ నిరాకరణ ద్వారా తన కాలంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులకు వారి పద్ధతులకు భిన్నంగా తన పోరాటం కొనసాగించారు. నిజానికి గాంధీని మహాత్ముడు అన్నది స్వాతంత్య్రం తెచ్చినందుకు కాదు. ఆయనను 1915లో సబర్మతి ఆశ్రమం ప్రారంభించినప్పుడు తన గుజరాతీ అనుచరుడు అలా పిలిచారు. ఆ తరువాత ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలో అక్కడి ప్రవాస గుజరాతీ షావుకార్ల తరపున కేసులు వాదించి వారి హక్కులు కాపాడినందుకు  దేవ్‌చంద్ ఉత్తంచంద్  ఫరేఖ్ అనే ప్రముఖుడు ఒక పౌర సన్మానంలో గాంధీని మహాత్మా గాంధీ అన్నారు. జన బాహుళ్యానికి ఆత్మతృప్తిని  మిగిల్చిన ఎవరినైనా సరే మహాత్ముడు అనడానికి మొహమాటం ఎందుకు? పైగా యావత్ ప్రజానీకం ఎలుగెత్తి నీరాజనాలు పలుకుతున్నప్పుడు శషభిషలు దేనికి? 

ఒక్క కేసీఆర్  పోరాడితేనే తెలంగాణ రాలేదు. అనేక త్యాగాలు, పోరాటాలు సంస్థలు, వ్యక్తులు కానీ ఈ అన్నిటినీ ఉద్యమంగా మలిచి నిలబెట్టింది ఎవరో కూడా ఆలోచిద్దాం. స్వాతంత్రోద్యమం గాంధీ గారొక్కరే నిర్మించలేదు. ఇంకో రకంగా గాంధీ పుట్టడానికి పదేళ్ల ముందే మొదటి స్వాతంత్య్రసంగ్రామం జరిగింది. అలాగే గాంధీ లండన్ వెళ్ళడానికి ముందే ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమ బాటలో ఉంది. కానీ గాంధీ ఉద్యమం మార్గం ప్రజలను ఆకట్టుకుంది. ఆయన వేషం, భాష,  ఉత్తర దక్షిణ కోణాలను కలిపాయి. ఆయన పర్యటనలు ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసాయి. ఇవన్నీ ప్రజల్లో చాలామందికి ఆమోదయోగ్యం అయ్యాయి. తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ నిర్మించిందే కాదు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఒక్కరే పోరాడితే వచ్చింది కూడా కాదు. అరవై దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్న స్పృహను ఆయన తట్టిలేపారు. గతంలో కూడా చెన్నారెడ్డి మొదలు చిన్నారెడ్డి దాకా అనేకమంది అలాగే తట్టి లేపారు. కానీ వాళ్ళెవరూ ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టలేకపోయారు. వాళ్ళు కూడా నిలబడలేకపోయారు. నిజానికి 1969 ఉద్యమం నిలబడి ఉండాల్సింది. అప్పటి ఉద్యమం వీరోచితం కానీ పరిమితం, కొందరు విద్యావంతులు, యువకులు, ఉద్యోగులు నగరాల్లో పట్టణాల్లో మొదలుపెట్టిన ఉద్యమం గ్రామాలను తాకలేదు. కానీ ఇప్పుడు అలాకాదు తెలంగాణ జెండాలేని గ్రామం లేదు. కేసీఆర్ పేరు వినని గడప లేదు. ఇదంతా ఆయన రాజకీయ చతురతతో సాధ్యమయ్యింది. ఎదుటి వారు ఎంతటి వారయినా తనవైపు తిప్పుకోగల నేర్పరి తనం ఆయనది. ఆ నేర్పు వల్లనే ఆయన కాంగ్రెస్ పార్టీని (2004)లో, తెలుగుదేశం పార్టీని (2009)లో తన వైపు తిప్పుకోగాలిగారు. ఆయా పార్టీల ఓటర్లనూ తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. కేవలం పార్లమెంటరీ పార్టీలే కాదు ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు  ఇట్లా తెలంగాణ పౌర సమాజం అంతా ఏదో ఒక దశలో కేసీఆర్‌ను అనునయించడమో కుదిరితే అనుసరించాడమో చేసిన వాళ్ళే. కేసీఆర్ కంటే ముందు నుంచి పనిచేస్తున్న వివిధ సంఘాలు వేదికలు, వ్యక్తులు తమ వంతు భావవ్యాప్తికి తోడ్పడ్డారు. కార్యాచరణకు దిగారు. అందులో ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్‌రావు మొదలు అనేకమంది ప్రొఫెసర్లు ఉన్నారు. గద్దర్, విమలక్క, మందకృష్ణ,  ఆకుల భూమయ్య లాంటి ఎందరో ఉద్యమకారులు కూడా ఉన్నారు. కుల సంఘాలు, ఇతర రాజకీయపక్షాలు ప్రత్యామ్నాయ వేదికలూ వచ్చాయి. అందరికంటే మిన్నగా కేసీఆర్ మొండితనాన్ని భరించి గడిచిన నాలుగేళ్ళు ఆయనతో నడిచి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఓర్పు, సహనం కూడా ఉన్నాయి. ఆయన సారథ్యంలో గ్రామగ్రామానా పౌరసమాజాన్ని రూపొందించిన జేఏసీ ఉంది. ఈ అందరికీ ఆయనతో అనేక విభేదాలు ఉండవచ్చు, ఆయన పార్టీ పట్ల, వ్యవహార శైలి పట్ల అభ్యంతరాలు ఉండి ఉండవచ్చు. కానీ ఈ అందరూ ఏదో ఒక దశలో ఆయనతో ఏకీభవించిన వాళ్ళే. ఆయనతో భుజం భుజం కలిపి నడించిన వాళ్ళే. అలాగే భిన్న సిద్ధాంత భావజాలాలు ఉన్న వాళ్ళను కూడా ఆయన ఒక చోటికి తేగలిగారు. కొన్ని నక్సలైటు పార్టీలను అనేక బూర్జువా పార్టీలతో కలిసి పనిచేసే పరిస్థితులు సృష్టించారు. ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి కేంద్ర బిందువు కాగలిగారు. దీనివెనుక ఎదుటివాళ్ళను అంచనా వేయగలిగే చతురత, ఎదుటి వాళ్ళను నమ్మించగలిగే నేర్పు, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడ, పనికొచ్చే ఎవరినైనా వాడుకోగలిగే చొరవ, అవసరమైనప్పుడే ఆయుధాలు సంధించే యుద్ధ వ్యూహం ఆయనలో ఉన్నాయి. ఈ అన్నిటినీ మించిన మొండితనం కూడా ఆయనకే సొంతం. ఇవి చాలా మందికి నచ్చే గుణాలు. అందుకే కొందరు ఆయనను ఇప్పుడు గాంధీతో పోల్చుతున్నారు. గాంధీ గారిలో కూడా ఇలాంటి మొండితనం మంకుపట్టు ఉండేవని చరిత్రకారులు చెపుతుంటారు. 

1969 మొదలు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉత్థాన పతనాలు చూసింది. ఒక దశలో తెలంగాణ ఒక కలగానే మిగిలిపోతుందనే అంతా అనుకున్నారు. కానీ అదిప్పుడు ఊహకు అందని రీతిలో నిజమయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనచేతిలో ఉన్న పనినే ఎప్పుడు చేయగలమో చెప్పలేం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే కాలం కాదిది. రాజకీయాల్లో అది ఊహించలేము కూడా. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటవుతుందని, అయి తీరుతుందని పైకి ఎన్ని గంభీరమైన మాటలు చెప్పుకున్నా ఎప్పుడవుతుందో ఎవరూ సరిగ్గా ఊహించే సాహసం చేయలేదు. టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని పార్లమెంటు ఉభయసభల్లో సాగిన ప్రహసనాన్ని ఊపిరిబిగపట్టి చూసినవాళ్లకైతే తెలంగాణ ఇక రాదేమో అనే అనిపించింది. పెప్పర్‌పాటి రాజగోపాల్ అతని ఆత్మాహుతి దళం ఒకవైపు, వెంకయ్యనాయుడు  అదృశ్య కూటమి ఇంకొకవైపు చివరి నిమిషం దాకా తెలంగాణ అంశాన్ని వీలయినంత వరకు అడ్డుకోవాలని కుదరకపోతే సాగదీయాలనే చూశాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సస్పెన్స్‌ను అలా సాగదీస్తూ వచ్చింది. మొత్తానికి ఒక సంక్లిష్ట రాజకీయ పరిణామాల మధ్య అనూహ్యరీతిలో తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. రాజకీయం ఇంతకంటే అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు  ఢిల్లీ వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళుతున్నాను. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతాను అని ఒక మాటన్నారు. యధాలాపంగా తన అనుచరులను ఉత్సాహపరచడానికి అన్నారో లేక నిజంగానే ఆయన ఆ నమ్మకంతో ఉన్నారో తెలియదు గానీ ఆ మాట అనడానికి ముమ్మాటికీ గుండె ధైర్యమో, మొండితనమో ఉండి తీరాలి. లేకపోతే ఈ కాలపు రాజకీయాలు తెలిసిన ఎవరూ అటువంటి శపథం చేయరు. ఆ రెండూ ఉండడం వల్లనే ఆయన అందరూ ఇక అసాధ్యం అని వదిలేసిన తెలంగాణ అంశాన్ని తలకెత్తుకున్నారు. ఎన్ని విమర్శలు, నిందలు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా తన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఉపయోగించి ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు ఢిల్లీ తెలంగాణ ప్రజలకు మోకరిల్లేలా చేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారైనా సరే ఇది కాదనలేని సత్యం. 

తెలంగాణ ప్రకటన వచ్చి పదిరోజులు దాటినా ఎవరూ పెద్దగా సంబరాలు చేసుకున్నట్టు లేదు. కానీ కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణకు తిరిగొచ్చిన రోజు మొదటిసారిగా నగరం తెలంగాణ నినాదాలతో  మారుమోగిపోయింది. ఆయనను కారణ జన్ముడని, త్యాగాధనుడని పార్టీ శ్రేణులు కీర్తిస్తున్నాయి. మరి కొందరు ఆయనను తెలంగాణ గాంధీ అంటున్నాయి. ఈ లోగా ఆంధ్రా మీడియా తెరాస-కాంగ్రెస్ విలీనానికి తెరతీసింది. కూపీలు లాగి మరీ చర్చలు పెడుతోంది. ఆ చర్చల్లో రక్తి కట్టించే కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని అన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తానే ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడని ఒకరంటే అలాంటప్పుడు ఆయన మహాత్మా గాంధీ ఎలా అవుతాడు మహా అయితే రాహుల్ గాంధీకి అనుచరుడు అవుతాడని ఇంకొకరు అంటున్నారు. గాంధీ స్వాతంత్య్రం తెచ్చాక ఎలాంటి అధికారం పదవీ ఆశించలేదు. ఆయన పిల్లలు, కుటుంబం ఎవరెవరో ఎక్కడున్నారో తెలియదు. అలాంటప్పుడు ఈ పోలికలు ఎందుకు అనేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు బిరుదులు ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఆయన ఒక చరిత్ర సృష్టించారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా ఆయన  ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం. అందరి పక్షాన నిలబడి అన్ని ప్రతికూలతలకు ఎదురొడ్డి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పటికైతే ఆయనను మనసారా అభినందిద్దాం! వీలయితే ఆయన ప్రజల పక్షాన నిలబడేటట్టు చూద్దాం.!!  

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

V6 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి చర్చ

V6 విశ్లేషకులపై విశ్లేషణ !

v6 ON ANALYSTS
PLEASE FOLLOW THIS LINK


తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత తొలి ఇంటర్వ్యూ .. v 6 లో

Telagana Bill Approved in Loksabha
PLEASE FOLLOW THIS LINK


మళ్ళీ తెలంగాణా మీద జగన్ కన్ను!!


శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

BJP CHANGING MOODS: V^6 Telangana series with me

 మిత్రులు కొందరు బీ జే పీ ని నమ్మాలంటారు. ప్రాణం పోయేదాకా చితగ్గొట్టి చివరినిమిషంలో తెలుగు సినిమా హీరోల మాదిరిగా కాపాడి, వాళ్ళ దయాదక్షిన్యాలకు మనం రుణపడి ఉండాలని వారి కోరిక అయితే నేను దానికి సిద్ధంగా లేను.  తెలంగాణా కేవలం ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదు.రాజకీయ పార్టీల బతుకుదెరువు. వాళ్ళ భవిష్యత్తు అనే విషయం ఈ నేతలంతా గమనించాలి. నేతలారా మాకోసం కాదు, మీకోసం, మీ ఓట్ల కోసం ఇంకా మీ పదవులకోసమయినా తెలంగాణా తెచ్చుకోండి. లేదంటే వదిలేయండి ప్రజలే ఆలోచించుకుంటారు...
CH Vidyasagar Rao 5th Feb 2014

Kodandram 07th Feb 2014

Ponnam 08th Feb 2014

గురువారం, ఫిబ్రవరి 13, 2014

సీమాంతర తీవ్రవాదం కాదు... సీమాంధ్ర ఉగ్రవాదం!


భారతపార్లమెంటు మీద దాడికి సూత్రధారి అన్న అభియోగం తో అఫ్జల్ గురు అనే ఒక కాశ్మీర్ యువకున్ని భారత ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం (ఫిబ్రవరి9. 2013ఉరితీసింది. 2001 డిసెంబర్ లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అఫ్జల్ గురు అక్కడ లేడు. పార్లమెంటు మీదికి దూసుకు వచ్ఛి కాల్పులు జరిపిన ఐదుగురిని భద్రతాదళాలు దారిలోనే కాల్చి చంపేసాయి. తరువాత దాదాపుఒక దశాబ్దంపాటు దీనిని భారతదేశం మీద దాడిగా దేశ భక్తులంతా భావించారు. పార్లమెంటు మీద దాడి ద్వారా దేశ సార్వభౌమాదికాన్ని సవాలు చేశారన్నది అఫ్జల్ మీద మోపిన అభియోగం. నిజానికి అఫ్శల్ గురు పార్లమెంటుకు వెళ్ళలేదు, కనీసం పరిసరాలలో కూడా లేడు. అయినప్పటికీ కుట్రకు కారణమని పోలీసులు చూపిన సాక్షాల మేరకు అదొక సీమాంతర ఉగ్రవాద చర్యగా కోర్టు తీర్పు చెప్పింది. దేశమంతా నిజమేనని నమ్మింది.  మరి సీమాంధ్ర ఉగ్రవాదం సంగతి ఏమిటి? సీమాంతర ఉగ్రవాదులను తుదముట్టిస్తామని చెప్పే భారతీయ జనతాపార్టీ ఇప్పుడు   సీమాంధ్రఉగ్రవాదులను ఎందుకు వెనకెసులు వస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసి రాజకీయ అస్థిరతను సృష్టించడమే ఉగ్రవాదం లక్షణం. అదే అస్థిరతను ఇప్పుడు సీమాంద్ర ఉగ్రవాదులు సృష్టిస్తున్నారు

 తెలంగాణా బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా ఎం పీ లగడపాటి రాజగోపాల్ నిజంగానే సభలో పిచ్చిపట్టినవాడిగా ప్రవర్తించాడు. అతని ఉన్మాద ప్రవర్తన భయవిహ్వాలత కు కారణమయ్యింది. ఆయన నిండుసభలో కారం, మిరియాల పొడి కలిపిన ద్రవాన్ని వెదజల్లడంతో సభ అవాక్కయ్యింది. ఒక్క లోక్ సభ ను మాత్రమే కాదు. తెలంగాణా ఉక్కిరిబిక్కిరి అయ్యింది.  యావత్ దేశం అవాక్కయ్యిందిఈదేశ ప్రజలను కాపాడడానికి చట్టాలు చేసి దేశ భద్రతకు పూచీ ఇవ్వాల్సిన పార్లమెంటు సభ్యులు ఎం జరుగుతోందో తెలియని అయోమయంతో బయటకు పరుగులు తీశారు. సరిగ్గాటెర్రరిస్టుల దాడి సందర్భంగా పార్లమెంటు భవనం వెలుపల ఆవరించిన భయమే ఇప్పుడు పార్లమెంటు లోపల ఆవరించింది.  పార్లమెంటు బయటే కాదు పార్లమెంటు లోపలకూడా టెర్రరిస్టులు ఉంటారని రాజగోపాల్ నిరూపించాడు. అది ఇప్పుడు యావత్ భారత దేశాన్ని కలవర పెడుతోంది

సాధారనంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తారు. 2001 లో మాదిరిగా కారణాలు అడగకుండానే కాల్చిపారేస్తారు. తరువాత అదొక టెర్రరిస్టు చర్యగా చెపుతారుకానీ లగడపాటికి మాత్రం మినహాయింపు దొరికింది. ఎందుకంటే ఆయన ఒక పెట్టుబడి దారుడు. అలాగే డబ్బుసంచులతో ఎవరినయినా కొనేయగలిగే శక్తిమంతుడు. అధికార పక్షాన్నీ ఇంతకాలం మేనేజ్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకొగలుగుతున్నాడు. లేకపోతే తల పండిన పార్లమెంటేరియన్ ఎల్ కే అద్వానీ అంత అద్వాన్నంగా ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనను పార్లమెంటులో కలిసిన విలేకరులు లగడపాటి ఎపిసోడ్ మీద మాట్లాడవలసింది గా కోరారు. ఆయన మాత్రం అన్నీ చెప్పి బడ్జెట్ తప్ప ఇంకేదీ చర్చలోకి రావొద్దని చెప్పాడు. వెంటనే అప్పటిదాకా తెరవెనుక వుండి వ్యూహాలు రచించిన చంద్రబాబు నాయుడు ప్రత్యక్షమయ్యాడు.ఐదువందల మందికి పైగా సభ్యులున్న లోక్ సభలో కేవలం ఐదుగురు సభ్యులే ఉన్న ఆయనకు ఢిల్లీ లో ఎం పని అని అడగకండి.ఇప్పుడు సీమాంద్రఉగ్రవాదులకు తర్ఫీదు ఇస్తున్నది ఆయనే! సాధారణంగా ఇలాంటి సమయంలో ఆయన చేతనయితే సమర్ధించాలి, చేవ ఉంటె వ్యతిరేకించాలి, కానీ ఆయన తెలంగాణా వ్యతిరేకులను కూడగట్టే  దళారీ పనిలో ఉన్నాడుఅప్పటిదాకా తెరవెనుక  ఉన్న ఆయన ఉత్సాహం ఆపుకోకుండా టీవీ ముందుకు వచ్చి లబో దిబోమంటూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడుఇదంతా కాంగ్రెస్ఆడిస్తోన్న నాటకమని ఆడిపోసుకున్నాడు. ఇంకేముంది తెలుగు చానెల్స్ అన్నీ అసలు విషయం వదిలేసి ఇప్పుడు రాజగోపాల్ ను రక్షించే పనిలో ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే ఆయన మిరియాల రసం సభలోకి తెచ్చాడని చెప్పిస్తున్నాయి.

 రాజగోపాల్ ప్రవర్తనలో  కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు, ఆయన 2009 నాడే తెలంగాణా వాదులతో కసబ్ అనే పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది నిరూపించుకున్నాడు.ఇప్పుడు అతనికి తోడయిన మరో దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మోదుగుల వేణుగోపాలరెడ్డి. ఆయన తెలంగాణాను పీల్చి పిప్పి చేస్తోన్న రాంకీ గ్రూప్ కు దగ్గరి బంధువు. ఆయన గతంలోనే రైళ్ళు పేల్చి వస్తానని, మానవ బాంబుగా మారిపోతానని చెప్పాడు. ఇప్పుడు సరిగ్గా అదే పని చేసాడు. ఆయన లోక్ సభలోకి కత్తి తో ప్రవేశించాడని అంటున్నారు. అదెఇ ఎంతవరకు నిజమో విచారణలో తేలుతుంది కానీ ఆయన గత చరిత్ర అలాంటి మనస్తత్వం ఉండనే చెపుతోంది. ఇద్దరే కాదు సీమాన్ధ్ర నేతలంతా పార్లమెంటులో తీవ్రవాదులనే తలపింప జేశారు. అనకాపల్లి ఎం పీ సబ్బంహరి సభలోనే ఆత్మాహుతికి దళపతి అవతారం ఎత్తారు. ఆయన నిండుసభలో ఆత్మాహుతికి పాల్పదతానని బెదిరించడం తో  ఆయన సభలో ఉన్నంత సేపూ ఆయనను, మార్షల్స్భద్రతాసిబ్బంది కనిపెడుతూనే ఉన్నాయి. మైకులు విరిచేసి టేబుళ్లు విసిరేయడం, కంప్యూటర్లు ఎత్తేయడం అద్దాలు పగులగొట్టడం ఇట్లా సభలో సీమాన్ధ్ర ఎం పీ లు చేయని హింస లేదు. చర్యలు గమనించిన వారు ఎవరైనా సరే టెర్రరిస్టు చర్యలకు తీసిపోవనే అంటారు. ఇది కేవలం సభాహక్కులకే కాదు, దేశ సార్వభౌమాధికారానికి కూడా ముప్పుగానే భావించాలి

భారతదేశానికి  రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు చాలామంది దేశంలో న్యాయబద్ధమైన, ధర్మ బద్ధమైన పరిపాలనకు అంకురార్పణ జరుగుతుందని ఆశపడ్డారు. భారత రాజ్యాంగం ప్రజలకొక పెట్టని కోటగా ఉండి కాపాడుతుందని, పౌరులందరికీ సమానమైన హోదా, విలువ, గౌరవం దక్కుతాయనీ భావించారు. సమాజంలో అప్పటిదాకా ఉన్న ఆధిపత్య ధోరనులన్నీ అంతమైపోతాయనీ అనుకున్నారు. అందుకే రాజ్యాంగ పీఠికలో 'భారతీయులమైన మేము రాజ్యాంగాన్ని రాసుకున్తున్నమని ప్రకటించారు. సర్వజన ప్రాతినిధ్యం ఉన్న రాజ్యాంగ సభ దీనిని రూపొందించింది. రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలుచేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు.  ఇప్పుడు పార్లమెంటే ఇటువంటి చర్యలకు వేదికయితే ఇక దేశాన్ని ఎవరు కాపాడగలరు. దీనంతటికీ కాంగ్రెస్ పార్టీ బలహీనతే కారణం. పార్టీ 2009 తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిన్చినప్పుడే లగడపాటిని పార్టీనుంచి బయటకు పంపించి ఉంటే సభలో పరిస్థితి వచ్చేది కాదు. ఇదొక్క లగడపాటి మనోవైకల్యం మాత్రమే కాదు. ఆధిపత్య ధోరణికిఅధికారానికీ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సీమాంధ్ర సామూహిక నాయకత్వ వైపరీత్యం. ఒక కసబ్ వెనుక, ఒక అఫ్జల్ గురు వెనుక రకరకాల  తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెబుతుంటారు. రాజగోపాల్ వెనుకకూడా రాజకీయ తీవ్రవాదులు ఉన్నారు. వారు చద్రబాబు నాయుడు,  వెంకయ్య నాయుడుజగన్ రెడ్డి,  కిరణ్ రెడ్డి  ఇలా రూపంలో ఉన్నా వీరిని ఎదుర్కోకపోతే ఒక్క తెలంగానకే కాదు  దేశానికే ముప్పు.  తెలంగాణా వచ్చినా రాకపోయినా ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తూ భారత రాజ్యాంగ పునాదులనే ద్వంసం చేస్తోన్న ఇలాంటి టెర్రరిస్టులను తరిమికొడితే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ కష్టం