సోమవారం, సెప్టెంబర్ 30, 2013

మా వూరి జీవనదిలా.

నేనివాళ ప్రతిరోజులాగే 
మా మానేటి వాగులో మునుగుతూ తేలుతూ 
తెప్పమీత తేలిపోయాను. 
అర్దరాత్రి దాటిన తరువాతినుంచి కలలో కూడా మెలకువగా వింటోన్న
నా చెవుల్లోఎవరో అచ్చేస్తున్న ఒక పాట 
సరిగ్గా కొమ్ము బూరలోంచి వచ్చిన జ్ఞాపకాల గానప్రవాహమై 
నా ప్రవాసాన్ని మరోసారి తడిమింది

మావాగు ఊట, మా కన్నీటి పాట మా గుండెల మీద 
సరిగ్గా కొమ్ము బూరలా వంపుతిరిగిన చోట
ఎవడో కట్టిన ఆనకట్ట మమ్మల్ని ముంచేసి కాందిశీకుల్ని చేసిన చోటినించి 
ఒక చిన్నపాయ నా కళ్ళల్లోకి చేరి ప్రవహించింది.. 
సరిగ్గా కొమ్ముబూరలా వంపుతిరిగిన చోట 
ఆ వాగులో వరదలా, నురగలా కొట్టుకుపోయిన మా బతుకు
సుప్తశిదిల స్వరమై మళ్ళీ అక్షరమై ఆవిష్కృతమైంది 

సరిగ్గా కొమ్ముబూరలా మా వాగు వంపుతిరిగిన చోట 
నేనింకా నిరుటి నా నిర్వాసిత జ్ఞాపకాలను తడుముకుంటూ 
నిద్రలో మానేరును ఈదుకుంటూ మా ఊరిని కలవరిస్తో ..
 తెప్పలమీద అలనై  తెలిపోతోన్న వేళ  
సరిగ్గా కొమ్ముబూరలా మా వాగు వంపుతిరిన చోట 
దరిచేరే కొమ్మ దొరుకుతుందేమోనని 
కలలోనే వెతుకుతోన్న వేళ 
గుండెల్లో ఒక కాలింగ్ బెల్... 

నిద్రకళ్లతో పేపర్ తెరిస్తే.. 
సరిగ్గా నేనుకలగన్న నది.. మా వూరి జీవనది.. 
మా మానేరు మున్నేరు దాటి 
మూడు దశాభ్దాల తరువాత 
సరిగ్గా కొమ్ముబూరలా వంపుతిరిగిన చోట 
నేనుండే మూసీకి మోసుకోచ్చింది 

సరిగ్గా కొమ్ముబూరాల వంపుతిరిగిన చోట 
నా యింటి కిటికీలు తెరిచి చూసాను 
సరిగ్గా కొమ్ముబూరలా మా మూసీ వంపు తిరిగిన చోట 
కనుమరుగైన నా వూరు యాస్వాడ, అందులో మా వాడ .. 
నేనిప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నా దోస్తులు .. 
మా వూరి బడి, శివుని గుడి.. 

సరిగ్గా కొమ్ముబూరలా మావూరి దారి 
మలుపు తిరిగే చోట..
మేమంతా చిర్రగోనే ఆడుకునే 
చింత చెట్టు కింద 
నా దోస్తుల నడుమ అలాగే నవ్వుతూ  
నడుస్తూ అరుణ సాగర్! ! 
అలాగే మా వూరి జీవనదిలా.. 


ఘంటా చక్రపాణి 


థాంక్స్: ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించారు


ఆదివారం, సెప్టెంబర్ 29, 2013

కాంగ్రెస్ కసరత్తు ఏమైనట్టు?


సీమాంధ్ర సిఎంగా మాట్లాడారు


'' రాష్ట్రానికి సిఎం గా ఉన్న వ్యక్తి ఇరు ప్రాంతాలపై మాట్లాడాలి. మాట్లాడిన వాటిలో కూడా అనేక అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి చరిత్రమీద అవగాహన లేదు. చరిత్రను వక్రీకరించారు. తప్పుడు గణాంకాలు చెప్పారు. వాస్తవ విరుద్ధమైన అంశాలు మాట్లాడారు. సిఎంకు సొంత వ్యూహం ఉందని తెలుస్తోంది. రెచ్చగొట్టే ధోరణిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సిఎం సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు సిఎం గా కొనసాగే అర్హత లేదు. సిఎం వ్యాఖ్యలు జగన్ పార్టీపై తిరుగుబాటు చేసేందుకే అన్నట్లు ఉన్నాయి. సమైక్య ఉద్యమం కొంతవరకే పరిమితమైంది. సిఎం తన స్థాయికంటే దిగజారి మాట్లాడుతున్నారు. లీడర్ గా ఎదగాలని ఆరాటపడుతున్నారు. ఇరు ప్రాంతాల మధ్య సమస్య వచ్చినప్పుడు సిఎం అంపైరా గా ఉండాలి. కానీ ప్రత్యర్థి బ్యాట్ మన్ గా మారాడు. చేతగాని ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటారనే భయంతోనే సిఎం సమైక్యవాదంపై మాట్లాడుతున్నారు''.
https://www.youtube.com/watch?feature=player_embedded&v=GoEKlvC0xcQ#t=1872

శనివారం, సెప్టెంబర్ 28, 2013

CM శుద్ధ అబద్ధాలు..

http://www.10tv.in/news/CM-Comments-Provoking-People-over-Irrigation-Projects

ఘంటా చక్రపాణి : ''సీఎం మాట్లాడిన దానిలో విజ్ఞప్తి, రెచ్చగొట్టే ధోరణి, ధిక్కరించే ధోరణి కనబడింది. ఒకవైపు సమ్మె విరమించాలంటూనే రెచ్చిపొండని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు. నెహ్రూ, పటేల్ బంధం వేశారని చెప్పారు. కాని వాళ్లు వేయలేదు. బహుశ పటేల్ అప్పటికి చనిపోయారు. సమైక్య రాష్ట్రం 1956 ఏర్పడే నాటికి వీళ్లు ఎవరూ అధికారంలో లేరు. నెహ్రూ, పటేల్ పోయిన తరువాత పొట్టి శ్రీరాములు బంధం వేసి ఆంధ్రలో కలిపారు. పొట్టి శ్రీరాములు కూడా సమైక్యతకు బంధం వేయలేదు. సమైక్యతకు బంధం వేశారని అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య, ఇతరులు బంధం వేశారు. ముఖ్యమంత్రి పేర్కొనడం తప్పు. 1955లో నాగార్జున సాగర్ ను నెహ్రూ ఫౌండేషన్ వేశారని చెబుతున్నారు. దీని ప్లాన్ 1952-55 మధ్యలో జరిగింది. అప్రోవల్స్ అన్ని 1952-56 మధ్య జరిగాయి. 1952-56 మధ్య సమైక్య రాష్ట్రం లేదు. 1956లో సమైక్య రాష్ట్రం వచ్చింది. ఫౌండేషన్ వేసిన తరువాత జలాశయాల మధ్య ఒక స్పష్టత వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే జరిగాయి. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద నల్గొండకే నీళ్లు రావడం లేదు. బోర్డు విఫలమైందని చెబుతున్నారు. బోర్డు విఫలమైంది. విఫలం కాకుండా పటిష్టమైన బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చట్టబద్ధంగా లక్షా 60వేల మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగస్తులున్నారని సీఎం చెప్పారు. అక్రమంగా వచ్చారని గ్లిర్ గాని చెబుతుండడాన్ని నిర్దారిస్తున్నారు. మరి అలా రావడానికి చట్టం ఒప్పుకొంటుందా ? ఒక నిర్ణయం తీసుకున్న తరువాత రద్దు చేయడం లేదా. వాన్ పిక్ భూములు ఇచ్చి మళ్లా రద్దు చేయలేదా ? న్యాయం ఏమిటో ఆలోచించడం లేదు.
''ఇక సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే ఒక ప్రాంతం మీద విషం గక్కి ఇంకో ప్రాంతంలో హీరో కావాలని కనబడుతోంది. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి తలబిరుసు మాటలు మాట్లాడడం కరెక్టు కాదు. సోనియాగాంధీ భిక్ష వల్లే ఉన్నానని పేర్కొంటూ సోనియాను ధిక్కరించడం పార్టీ వాళ్లే తేల్చుకోవాలి.

ముఖ్యమంత్రి కార్యాలయంలో అలా మాట్లాడడం కరెక్టు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం బట్టి చూస్తే ఒక హెచ్చరికలాగా కనబడుతోంది. ఆడిస్తున్న నాటకంలో పాత్ర అదుపుతప్పిందని భావిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం ఒక పాత్రదారిగా ప్రవేశ పెట్టారు. రోశయ్య నిర్వహించిన ఘనకార్యాన్ని మీరు నిర్వహించండని ముందుకు పంపించారు. ఆయన మాటల్లో ఒక ఉద్యమకారుడిగా మారాల్సినవసరం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులు, రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు''.

Congress Working Committee Resolution on Telangana


https://docs.google.com/file/d/0B83ZsWz8vlwRQVhVRWwySTNCTlU/edit?usp=drive_web https://docs.google.com/file/d/0B83ZsWz8vlwRQVhVRWwySTNCTlU/edit?usp=drive_web

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

ఒక మనిషి రెండు నాలుకలు!!

PIL on T samme

Common man is suffering: CM

Posted by Picasa

GO 177 against T Samme

Posted by Picasa

Task force to counter the movement

Review on Industrial

Posted by Picasa

CM on Strike


Impose President Rule: Seemandhra JAC

Posted by Picasa

on Teachers

Posted by Picasa

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2013

Ghanta Chakrapani Discussion on Save Andhra Pradesh Sabha by Sangappa - Part 5


Ghanta Chakrapani Discussion on Save Andhra Pradesh Sabha by Sangappa - Part 2


Ghanta Chakrapani Discussion on Save Andhra Pradesh Sabha by Sangappa - Part 1Ghanta Chakrapani Discussion on Save Andhra Pradesh Sabha 1


Ghanta Chakrapani Discussion on Save Andhra Pradesh Sabha


HMTV Dasha Disha Andhra Pradesh