బుధవారం, ఫిబ్రవరి 04, 2015
ఇక మీదట రెగ్యులర్ గా
గాయపడిన కవి గుండెలలో
రాయబడని కావ్యాలెన్నో ... !
బ్లాగ్ బోసిపోయి చాలా కాలం అయిపొయింది. రాయడం అలవాటయిన చేతిని కట్టేసుకోవడం కష్టం... అలాగే మాట్లాడే నోటికి తాళం వేసుకోవడం కూడా.. !
కానీ ఆలోచనల కోసం మిత్రులింకా వెతుకుతున్నారు. బ్లాగ్ గణాంకాలలో చూసినప్పుడు ప్రతిరోజూ వందల మంది వస్తూ పోతున్నారు. పాత పేజీలే మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నారు.
***
కొందరు కొత్తగా ఏమీ రాయలేదని నిట్టూరుస్తున్నారు.
నిజానికి రాయడానికి, మిత్రులతో పంచుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ అన్నీ రాయలేని స్థితి. ఉన్నదున్నట్టుగా చెప్పుకోలేని పరిస్థితి. కనిపించని కంచెలు దాటి ఎగురలేని నిస్సహాయత. "పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటారు" అంటాడు ఒకాయన. "అసలు నువ్వు పబ్లిక్ లోనే ఉండొద్దు" అని ఇంకొక మేధావి హితోపదేశం. కానీ నేను మనసెలా చంపుకుంటాను. ఉద్యోగ ధర్మం గీసిన గిరి దాటకుండానే నేను మాట్లాడాలి కదా. భావ వ్యక్తీకరణను కాపాడుకోవాలి కూడా! కాబట్టి ఇదొక నియమంగా పెట్టుకుని నా ఆలోచనలు పంచుకోవడం అవసరమని భావిస్తున్నాను.
***
ముందుగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ తరువాత కొన్ని మాటలు ఇక మీదట రెగ్యులర్ గా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
'When a person really desires something, all the universe conspires to help that person to realize his dream. ఇదొక పాపులర్ రచయిత చెప్...
-
ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని మీట్ కోసం వెళ్ళినప్పుడు తారసపడ్డ అనేక మంది యూనివర్సిటీ అధ్యాపకుల నియామకం విషయం గురించి ప్రస్తావించార...
-
ఒ క్కసారి అక్కడికి వెళ్ళిరండి రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ఆ ప్రాంతానికి గతించిన కాలంలో బతికి చెడ్డ పురాస్మృతుల దుఖ్ఖ భ...