శుక్రవారం, డిసెంబర్ 30, 2011

బాబు వెడలె రభసకు..శనీశ్వరుడి మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నేను అలాంటివేమీ నమ్మను గానీ నమ్మిన వారి విశ్వాసాలు గౌరవిస్తాను. శని చాలా ప్రభావశీలి అని, ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని నమ్మినవాళ్ళు చెపుతుంటారు. వెనుకటికి అధికారం చేతిలో ఉందని విర్రవీగిన ఒక రాజు ఉండేవాడట. అతనికి శని దేవుడికి తగాదా వచ్చింది. ఏడేళ్ళ పాటు పరిపాలించిన రాజు శనిని మరిచిపోయే విధంగా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాడట. పరపీడన పరాయణత్వంలో తననే మించిపోయిన రాజును చూసి ఆగ్రహించిన శనిదేవుడు ఏడేళ్లకు మరో ఏడేళ్ళు కలిపి పద్నాలుగేళ్ళు ప్రజల్ల్లో తిరగకుండా చేస్తానని శపించాడట.

అంతే... రాజు పదవీచ్యుతుడైపోయాడు. అతని వెంబడి ప్రజపూవ్వరూ మిగలకపోగా అతనికి మంత్రులుగా ఉండి మంత్రాంగము నడిపినవారు, భటులుగా, బంట్లుగా ఉండి సేవలు చేసిన వాళ్ళు ఒక్కొక్కరు దూరమైపోయారు. లోగా ఏడేళ్ళు గడిచిపోయాయి. ఏడేళ్ళలో ఆయన అనేక చిక్కుల్లో పడిపోయాడు. స్థితిలో ఎలాగైనా జనంలో తిరిగి శని దేవుడిని శాపం నుంచి విమోచన పొంది తే తప్ప మార్గాంతరం లేదని ఆస్థాన జ్యోతిష్కులు సెలవిచ్చారు. చావో రేవో తేల్చుకు తీరాలన్న అతను తన సేవకులను, అంగరక్షకులను, కిరాయిసైనికులను వెంటేసుకుని దేశాటనకు బయల్దేరాడు. అలా వెళ్తూవెళ్తూ కొన్నిరోజులు ప్రయాణించి ఒకచోట వెనక్కి తిరిగి చూసుకున్నాడట.

 తన వెంట వేలాదిమంది జనం. అంత మందిని ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని రాజు ఉబ్బి తబ్బిబ్బయి తనను శని ఏమీ చేయలేకపోయాడని ఇక తనదే రాజ్యమని ప్రకటించుకున్నాడట. అతని తలమీదే కొలువై ఉన్న శనిదేవుడు అది విని ఫక్కున నవ్వి బాబూ! అంతలా విర్రవీగకు. నువ్వింకా ప్రజల్లో తిరగలేదు. నీ వెంట ఉన్న వాళ్ళలో ప్రజలేవరూ లేరు. వీళ్ళం తా నీ కిరాయి సైనికులే! అంతేకాదు ప్రజల రక్షణ చూడాల్సిన నువ్విలా వేలాదిమంది కిరాయి సైనికులను రక్షణగా వెంటేసుకొని తిరగాల్సిన దుస్థితి రావ డం కూడా నా మహిమే అన్నాడట!!. 

సరిగ్గా చంద్రబాబు నాయుడు సంగతి కూడా ఇలాగే ఉంది. పదవీచ్యుతుడైన ఏడేళ్లకు అవినీతి ఆరోపణల్లో చిక్కి బిక్కచచ్చిన ఆయన ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చే పనిలో పడ్డారు. రాజీనామాలు, వలసలతో క్షీణించి నానాటికీ శల్యమైపోతోన్న తన పార్టీని తెలంగాణలో తిరిగి నిలబెట్టుకునేం దుకు ఆయన యాత్రలను వాడుకుంటున్నాడు. తప్పులేదు. కానీ రైతు యాత్ర పేరుతో ఆయన సాగిస్తున్న యాత్రలను చూస్తున్నవారు ఆయన మాట తీరును పరిశీలిస్తున్నవారు అది ప్రజల కోసం అనుకోవడం లేదు. కేవ లం పంతం కోసమే చంద్రబాబు పర్యటిస్తున్నాడని పటాటోపం గమనించిన వారికెవరికైనా అర్థమౌతుంది. పంతం కోసం పర్యటించి అదే విజయమని ప్రకటించుకుంటే అంతకంటే ఆత్మ వంచన ఇంకేముంటుంది.

తాజాగా కరీంనగర్ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రైతుల సమస్యలకంటే రాజకీయాలే ఎక్కువగా మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు ముందెన్నడూలేని విధంగా నాలుగంచెల రక్షణలో ఉన్నాడు. మొదటిది బ్లాక్ క్యాట్ కమెండో లు. రెండోది చంద్రదండు పేరుతో సొంత సైన్యం. మూడోది స్థానిక పోలీసు లు. ఇక నాలుగోది నర్సింహులు నాయకత్వంలో ఉన్న ఆత్మాహుతి దళం. ఇది వన్మాన్ ఆర్మీనే అయినా బాబు వెంట తెలంగాణలో తిరుగుతున్న మొత్తం పటాలం ఐదువేల మంది దాకా ఉంటున్నారని ఒక అంచనా. అంటే ఇప్పుడాయన ప్రతి పర్యటనలో ఒక బహిరంగ సభను వెంట తీసుకుని వెళుతున్నాడు. ఆయన అలిసిపోయినప్పుడల్లా ఆగిన ప్రతిచోటా అదే బహిరంగ సభలో ప్రసంగిస్తున్నాడు. మూడు రకాల రక్షణ వ్యవస్థలతో చంద్రబాబు నాయుడు గారిప్పుడు తెలంగాణలో పర్యటిస్తున్నాడు. అవి విజయవంతం అయినట్టు మన తెలుగు మీడియా ప్రచారం కూడా చేస్తోంది. ప్రత్యేక చర్చలు పెడుతోంది. రకంగా మీడియా చంద్రబాబు సేవలో తరిస్తోంది.

చంద్రబాబుకు తెలుగు నేలమీద ఇంకెవ్వరికీ లేని రక్షణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. అలిపిరిలో నక్సలైట్ల దాడి తరువాత చంద్రబాబు రక్షణ కోసం ప్రభుత్వం కనీసం ఏడాదికి ఐదు కోట్లు ఖర్చు చేస్తోందని అంచ నా. రాష్ట్ర ముఖ్యమంత్రికిలేని రక్షణయోగాన్ని ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. తెలంగాణ టూర్లో బాబును అంటిపెట్టుకుని ఉన్నది కమెండోలే. రక్షణ వలయం చాలదన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం అధినేత స్వయంగా ఒక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తెలంగాణలో జిల్లా వెళ్ళినా దండు కాపలా కాస్తుందని చెపుతారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రోజు బాబు గారితో తెలుగుదేశం ప్రధాన నాయకులతో పాటు, చంద్రదండు కార్యకర్తలు కూడా వేల సంఖ్యలో వెళ్ళారు.

ఆయన కాన్వాయ్లో హైదరాబాద్ నుంచి 90 వాహనాలు వెళ్లాయని పోలీసులు లెక్క చెపుతున్నారు. వీటిలో కనీసం ఐదు వందల మంది ఉంటారని అంచనా! అలాగే వరంగల్ ప్రాంతం నుంచి దాదాపు యాభై వాహనాల్లో మరో రెండువందలమంది వచ్చి బాబు చేరుకునే లోపే హుస్నాబాద్ను స్వాధీనం చేసుకున్నారు. వీరికి జిల్లా తెలుగుదేశం నేతలు తోడై దాదాపు వెయ్యి మందిని సమావేశానికి మోహరించారు. ఒకటి రెండుచోట్ల సాహసించి ప్రశ్నించిన వారిని నోళ్ళు మూయించింది, అడ్డుకో ప్రయత్నించిన వారి మీద భౌతిక దాడులకు దిగింది దళాలే! విచివూతమేమిటంటే బాబు పర్యటనలో ఎక్కువ హడావిడి చేసింది ఆంధ్రా నాయకులే!
చంద్రబాబు గుంటూరులో, అనంతపురంలో పర్యటించినప్పుడు ఒక్క తెలంగాణ నాయకుడు కూడా వెళ్ళలేదు. కానీ తెలంగాణ తమ్ముళ్ల మీద నమ్మ కం లేకనో మరేమిటో కానీ సీమాంధ్ర జిల్లాకు చెందిన మాజీ హోం మంత్రి తో పాటు అనేకమంది ఆంధ్రా నాయకులు బాబు గారిని అనుసరించారు. ఆయనతో పాటు ఉన్న ఆంధ్రా నేతల్లో చాలామంది రెండేళ్లుగా తెలంగాణలో అడుగు పెట్టనివాళ్ళే. వాళ్ళను ఎలాగైనా తెలంగాణలో తిప్పాలన్న బాబు లక్ష్యం రకంగా నెరవేరింది. వీరందరికీ రక్షణ కల్పించడం కోసం కరీంనగర్ పోలీసులు మూడో అంచెలో నిలబడి కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబుకు అతని వెంట ఉన్న చంద్రదండుకు రక్షణ కవచం నిర్మించారు. జిల్లా అదనపు ఎస్పీ అమ్మిడ్డి నాయకత్వంలో 15 వందల మంది సాయుధ పోలీసులు చంద్రబాబు జిల్లా లో అడుగుపెట్టినప్పటి నుంచి దండు మళ్ళీ జిల్లా దాటే వరకు కంటికి రెప్పలై కాపాడారు. ముందస్తుగా తెలంగాణవాదులను అరెస్టులు చేయడంతో పాటు, తెలుగుదేశం కార్యకర్తలు మినహా ప్రజపూవరూ అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు అదనంగా చంద్రబాబు ఒక సరికొత్త ఆత్మాహుతి దళాన్ని తయారు చేశాడు. దళం చేతిలో ఉరితాడు పట్టుకుని ఇప్పు డు ఊరేగుతోంది. తలారి పనికి ఒక దళితుడిని పురికొల్పడమే ఒక అవమానం! శాసనసభలో, పార్లమెంటులో, పార్టీలో చివరకు శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో సహా తెలంగాణ టీడీపీ పగ్గాలు కూడా అగ్రవర్ణాలకే అప్పగించిన చంద్రబాబు ఉరితాడును మాత్రం ఒక దళిత నాయకుడికి ఇవ్వడంలోని ఔచిత్యం ఏమిటో మనకు సరే సదరు నాయకుడికి అర్థమైనా బాగుండేది. పాపం ఆయన అదే తనకు అందివచ్చిన పదవి అనుకుని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మాటలకు తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్రా విశ్లేషకులు కూడా అసహ్యించుకుంటున్నారు. చివరకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా మోత్కుపల్లి నర్సింహులు గారి మాటలకు లెంపలేసుకుంటున్నారు.

ఇంత జరిగినా చంద్రబాబు నాయకుడికి క్రమశిక్ష గుర్తు చేయలేదు. బహుశా ఒక దళిత నాయకుడిచేత తెలంగాణ ఉద్యమా న్ని భూస్థాపితం చేయాలని తెలుగుదేశం పార్టీ భావించి ఉండవచ్చు. దళిత నాయుకుడిచే తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని, ఉద్యమంలో అమరులైన వారిని తిట్టించి ఆకాంక్షను పలుచన చేయాలనే ఆలోచనలో వారు ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా ఎదురు మాట్లాడితే దళిత కార్డ్ వాడి వేధించాలనే వెర్రి ఆలోచనేదో పార్టీ మదిలో ఉండి ఉండవచ్చు. కానీ ఆయనొక్కడే దళితుల ప్రతినిధి అనుకుంటే ఉద్యమంలో ముందువరుసలో నిలబడిపోరాడుతున్న దళితులను అవమానించినట్టే అవుతుంది. కేసీఆర్ నిరాహారదీక్షకు దిగినప్పుడు ఆయన వెన్నంటి ఉండి ఉద్యమానికి భుజం భుజం కలిపి నిలబెట్టి గద్దర్, మందకృష్ణ కంటే ఉస్మానియా, కాకతీయ జేఏసీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని దావానలంలా పదిజిల్లాలకు విస్తరింపజేసిన వేలాదిమంది దళిత విద్యార్థులకంటే, చంద్రబాబు చెరలో ఉన్నవాళ్ళు చేసిన సాహసం గొప్పదం తెలంగాణలో దళితుడూ ఒప్పుకోడు.

నిజానికి మోత్కుపల్లి తనకు తానుగా అలా చేసి ఉంటాడని నేననుకోను. ఒకవేళ ఆవేశంలో అలా ప్రవర్తించినా మంచేదో చెడేదో గ్రహించగలిగేవాడు. చంద్రబాబు ఉత్తర తెలంగాణ పర్యటనకు ముందు ప్రజలను, ఉద్యమకారులను నిరుత్తరులను చేసే కుట్ర ఇందులో ఉన్నది. కుట్రను అమలు చేయడానికి తెలుగుదేశం అధినాయకత్వమో లేక తెలంగాణ తెలుగుదేశం అగ్రనాయకులో నర్సింహులు ను అలా తోసేసి వుంటారు. లేకపోతే ప్రతిరోజూ మైకు నిండా తానే అయి మాట్లాడే ఎర్రబెల్లి ఉరితాడు వ్యవహారం జరిగిన రోజు మీడియా ముందు మౌనంగా ఎందుకు ఉన్నాడు. ఇద్దరూ పసుపురంగు ఉరితాడును పార్టీ ఆఫీ సు నుంచే తెచ్చారు. తాడేదో నర్సింహులు భుజం మీద వేసే బదులు తనే పని చేసి ఉండవచ్చు. ఇంత జరిగినా చంద్రబాబు మాటవరసకైనా అతన్ని మందలించలేదంటే ఉరితాడు సూత్రధారుపూవరో అర్థమైపో తోంది. రాజకీయాలలో నీతి నియమాలు ఉండాలని తపించే బాబు కనీసం జరిగిన తప్పుకు విచారం వ్యక్తంచేసి ఉండాల్సింది.

ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థ కూడా గౌరవ శాసనసభ్యుడి మాటలకు విలువలేనట్టుగా చూడడం విడ్డూరం! ఉద్యమంలో రెండేళ్లలో ఏడు వందల మందిని చంపిన హంతకుపూవరో తనకు తెల్సునని గౌరవ శాసనసభ్యులు చెపుతున్నా వినకపోవడం విడ్డూరం కాకపొతే మరేమిటి? అంతే కాదు అదే శాసనసభ్యుడు సాక్షాత్తూ శాసనసభ ముందు తాడుతో సహా ఉరివేసుకుంటానని వచ్చినప్పుడు, అలా కుదరకపోతే ఇతరులకు ఉరివేస్తానని తిరుగుతున్నప్పుడు కనీసం చట్టమైనా తనపని తాను చేసుకోవాలి కదా!

వాళ్ళ సంగతి అలా వదిలేద్దాం విషయంలో స్పీకర్ గారైనా స్పందించి శాస నసభ్యుడి హక్కులను కాపాడి ఉండాల్సింది. స్పీకర్ గారు తెలంగాణ కోసం వారు చేసిన రాజీనామాలను మన్నించలేదు. కనీసం అట్లా బహిరంగంగా చస్తామన్నప్పుడైనా చర్యలు తీసుకోకపోతే చట్ట సభలమీద గౌరవం ఎలా పెరుగుతుంది? విచివూతంగా వీళ్ళెవరూ స్పందించలేదు సరికదా హటాత్తుగా వారం పది రోజులనుంచి టీఆర్ఎస్తో సహా అన్నిపార్టీల నుంచి దళితులే స్పందిస్తున్నారు. ఇది అన్యాయం. ప్రజల ఆకాంక్షల కు భిన్నంగా మాట్లాడే వారికి కులమతాలు ఉండవు. ఉండకూడదు కూడా.! 

మూడు దశాబ్దాల క్రితం మొదలైన తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలే ఇంతకాలం బతికించారు. రెండేళ్ళ క్రితం నాటికి తెలుగుదేశంపార్టీకి తెలంగాణలోనే ఎక్కువ బలం ఉన్నది. నాయకత్వం కూడా ఇక్కడే పటిష్టంగా ఉంది. ముఖ్యంగా దళిత బహుజన కులాల్లో ఇక్కడి నాయకులు తెలుగుదేశం పాలనలో చాలా ఎదిగారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో పార్టీ ఊసర వైఖరి ఇక్కడి నాయకత్వం పాలిట శని దేవుడి శాపమై కూర్చుంది. ప్రభావం వల్లనేనేమో చంద్రబాబు 2009 డిసెంబర్ ఏడు నుంచి పది తేదీల్లో తన వైఖరిని పరస్పర విరుద్ధంగా రోజుకో రకంగా మార్చుకుని చిక్కు ల్లో పడ్డారు. చిక్కుముడి విప్పుకునే అవకాశం ఇటీవల ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా వచ్చినా ఆయన గుర్తించలేదు. దాదాపు మూడున్నర గంటలు గుక్కతిప్పుకోకుండా అరవై రెండు అంశాల మీద సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తెలంగాణ పేరే ఎత్తలేదు.

పోనీ అది ఆయనకు సరిపోదనుకుంటే తనదైన శైలిలో- ఇచ్చేవాళ్ళు మీరైనప్పుడు ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, దాన్ని మేం గౌరవిస్తాం అని సభలో మాట మాత్రంగా చెప్పి ఉన్నా కొంతయినా విరుగుడు ఉండేది. పాపం ఆయన ఇది గమనించకుండా తెలంగాణపై అనవసర విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు మాట్లాడిన ప్రతిచోటా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయన ముందే జైతెలంగాణ అంటూ ఆయనకు కర్తవ్య బోధ చేస్తున్నారు. అందుకే ఆయన అడుగడుగునా తాను తెలంగాణ వ్యతిరేకిని కాదని చెప్పుకోవాల్సి వచ్చింది. చాలా విషయాలను క్షణాల్లో అర్థం చేసుకునే రాజకీయ మేధావికి తెలంగాణ విషయంలో ప్రజలు అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న అర్థం కాకపోవడం బహుశా శనిదేవుడి ప్రభావమేనేమో!

పోయిన ఏడాది సమయానికి ఎస్ఎంఎస్లతో మీ సెల్ఫోన్ ఇన్బాక్స్ లు నిండిపోయి ఉంటాయి. మెసేజ్లు పంపిన చాలామంది 2011ను తెలంగాణ సంవత్సరం కావాలని కోరుకుని ఉంటారు. అప్పటికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా వచ్చి ఉన్నందున రెండుమూడు నెలల్లో తెలంగాణ ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు. క్యాలండర్ మారింది తప్ప తెలంగాణ పరిస్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు. ఈసారి ఎవరూ ఇంతవరకు అలాంటి ఎస్ఎంఎస్లు పంపలేదు. ఏడాది ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశి ద్దాం! హాపీ న్యూ ఇయర్!!