‘దున్నేవాడికే భూమి కావాలి’ అన్న నినాదం ఇప్పుడు గోడల మీద లేదు. తెలంగాణ గడీల మీద, వూరి దొరల తెల్ల సున్నం గోడల మీద దశాబ్దాల పాటు దర్శనమిచ్చిన ఎర్రటి జాజు రాతలు క్రమక్షికమంగా కనుమరుగైపోయా యి. గుండెల్లో ఉన్న ఆశలను గోడల మీద రాసిన వాళ్ళు, కొన్ని దశాబ్దాలపాటు ఆ గోడల మీది రాత లు చదువుకుని తమ తల రాతలు మార్చుకోవాలని కలలుగన్న వాళ్ళు కూడా ఇప్పుడు కనుమరుగైపోయారు. పెచ్చులూడిపోయి, కూలిపోవడానికి సిద్ధం గా ఉన్న ఆ గోడల లాగే భూమి మీది ఆశలు కూడా అంతరించిపోతున్న సమయమిది. ఇటువంటి తరుణంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే దున్నేవాడికి భూమి అంటోంది. జీవనాధారం ఏదీ లేక రెక్కల కష్టం మీదే ఆధారపడిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు మూడేసి ఎకరాల సాగుభూమి ఇస్తామని అంటున్నది. దీనికోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో కసరత్తు మొదలయ్యింది. రాబోయే ఆగస్టు15న ఏకకాలంలో అన్ని మండలాలలో ఈ భూపంపిణీ ప్రారంభం కాబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగితే నిజంగానే ఈ దేశంలో ఇంకా తమకు స్వాతంత్య్రం రాలేదనే అనుకుంటున్న లక్షలాది కుటుంబాల్లో ఒక కొత్త విశ్వాసం కలుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్నొక జనాకర్షక పథకం గా కాకుండా ఒక సమగ్ర అభివృద్ధి విధానంగా ముం దుకు తేవాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన ఈ విధాన పాత్ర రూపకల్పన కోసం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించారు.
నాతో పాటు ఈ రంగంలో గతంలో పనిచేసిన ప్రొఫెసర్ వెంకటయ్యను అలాగే దాదాపు దశాబ్దకాలానికి పైగా ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ కోసం అవిక్షిశాంతంగా పనిచేస్తున్న మల్లెపల్లి లక్ష్మయ్యను కూడా ఆహ్వానించారు.
కొందరు దాన్ని తప్పుపట్టవచ్చు. ప్రభుత్వం రూపొందించవలసిన విధానంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని అడగవచ్చు. అడుగుతున్నారు కూడా. కానీ మేము ఇంతకాలం కేవలం మౌన ప్రేక్షకుల్లా లేము. మేమే కాదు తెలంగాణ సమాజంలో ఎదిగివచ్చిన ఎవరు కూడా కేవలం ప్రేక్షకుల్లా లేరు. ఎదిగివస్తున్న క్రమంలో ఎదురైనా సమస్యల మీద విశ్లేషణలు చేసి మూలాలు వెతికే ప్రయత్నం చేస్త్తూ వచ్చా రు. వాటి మూలాలు ఆధిపత్య ఆంధ్రా పాలక వ్యవస్థలో ఉన్నాయని గమనించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వివిధ దశల్లో నాయకత్వం వహించా రు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ఇప్పటిదాకా కొనసాగిన వివక్ష, అసమానతలు తొలగిపోవాలని ఆరాటపడ్డారు.
చదువుకున్న వాళ్ళుగా, మేధావులుగా, ఈ సమాజం నుంచి ఎదిగివచ్చిన నాయకులుగా తెలంగాణ అన్ని రంగాల్లో ఒక కొత్త మార్పు రావాలని కోరుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. నాయకత్వం మారింది. విధానం కూడా మారాలి. కానీ అదే ఆధిపత్యవర్గాలైన రాజకీయ నాయకత్వం, పాల నా యంత్రాంగం విధాన రూపకల్పన చేస్తే ప్రజల ఆలోచనలను అది ప్రతిబింబించే అవకాశం ఉండ దు. కాబట్టి విధాన నిర్ణయంలో తెలంగాణ పౌరసమాజం జోక్యం అవసరం అవుతుంది. ఇక్కడి ప్రొఫెసర్లు, విద్యావంతులు,
ఇంజనీర్లు, ఇతర సామాజిక కార్యకర్తల సలహాలు సూచనలు అవసరమవుతా యి. ప్రభుత్వం కూడా ఆయా రంగాల నిపుణులను పిలుస్తుంటుంది.
నిజానికి ఇదొక మంచి అవకాశం. మన తలరాతలను మనమే మార్చుకోవాల్సిన సంద ర్భం. కాబట్టి అది పారిక్షిశామిక విధానం అయినా, విద్యావిధానం అయినా, సామాజిక సంక్షేమ విధా నం అయినా మరే అభివృద్ధి విధానం అయినా ఇక్క డి ఆలోచనాపరుల భాగస్వామ్యం అవసరం. ఈ ఆలోచనతోనే ఒక్క సంక్షేమ రంగమే కాదు. నా వర కు నేను అవగాహన ఉన్న అన్ని రంగాల అభివృద్ధి రూపకల్పనలో ఆలోచనలు పంచుకోవడానికి సిద్ధమేనని చెప్పాను. ఆ మేరకు పారిక్షిశామిక విధాన రూపకల్పనకు సంబంధించిన చర్చలో కూడా పాల్గొన్నాను. రేపు విద్యా విధాన రూపకల్పనలో కూడా పాల్గొంటాను. ఎవరికీ ఏ అభివూపాయం ఉన్నా ఇదొక బాధ్యతగా భావించాలన్నది నా అభివూపాయం. ప్రభు త్వం చేసిన మంచిపనులకు చేయుతనిచ్చినప్పుడే ఎవరికైనా సరే ఆ ప్రభుత్వం చెడు చేసినప్పుడు నిలదీసే నైతిక హక్కు ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే ఒక కొత్త దిశలో వెళుతున్న ట్టు కనిపిస్తున్నది. ఇప్పటిదాకా సాగిన ఆర్భాటాలకు పూర్తిగా భిన్నంగా పునాది నుంచి సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారం ఆలోచిస్తున్నది. ఈ విషయం ఇప్పటికే అధికార యంత్రాంగానికి అర్థమైంది. కుల సమస్యను కేవలం కొందరికి పదవులిచ్చో, నాలుగు కొత్త పథకాలు రూపొందించి దానికి కావాల్సిన ప్రచారాన్ని చేసుకుని, పైరవీకారులుగా మారిపోయి న కొందరిని చేరదీసి చేతులు దులుపుకోకుండా అది పారిక్షిశామిక విధానం అయినా, సామాజిక అభివృద్ధి ప్రణాళిక అయినా సామాజిక మార్పుకు దోహదపడాలని, ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోని వర్గాలకు ముందుగా చేరాలని భావిస్తున్నదని అర్థమవుతున్న ది. రాజ్యాంగం అలాగే ప్రణాళికా సంఘం సూచించినట్టుగా అభివృద్ధి ముఖ్యంగా దళితుల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచాలని, తద్వారా వారి లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ప్రగతి పథంలో నడిపించాలని అదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తన అధికారులతో చెప్పారు.‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది కొన్ని దశాబ్దాల కల, ఈ కల సాకారం వెనుక కోట్లాదిమంది ఆశలు ఆకాంక్షలున్నాయి. వాటిని నెరవేర్చడం మా ప్రభుత్వ మొదటి కర్తవ్యం, అందులో దళితులను సామాజిక జీవన స్రవంతిలో భాగస్వాములను, వారికి చెందాల్సిన న్యాయమైన వాటా వారికి అందించడానికి కావాల్సిన ప్రణాళిక ఇవ్వండి అని ఆయన ఆదేశించారు. సబ్ప్లాన్ రూపొందించే క్రమంలో కూడా ప్రణాళికా సంఘం ఇదే లక్ష్యాన్ని నిర్దేశించింది. సమాజంలో దళితులకు మిగతా వర్గాలకు ఉన్న అంతరాలు పూడ్చడానికి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడం ఒక ప్రధానమని భావించింది. దీనికోసం దళితులకు ఉత్పాదకతకు దోహదంచేసే వనరులు అందుబాటులోకి తేవాలని తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలని సూచించింది. దీనితోపాటు మానవాభివృద్ధికి మూలమైన విద్యావకాశాలు, విద్య సేవలు అందుబాటులోకి తేవాలని నిర్దేశించింది. గృహవస తి, తాగునీరు వంటి మెరుగైన జీవనానికి అవసరమై న అన్ని సౌకర్యాలను కల్పించాలని అభివూపాయపడిం ది. దీనికోసం ప్రణాళికా వ్యయంలో దళితులకు, ఆదివాసీలకు వారి జనాభాను బట్టి నిధులు ప్రత్యేకించాలని,
అందుకోసం ఒక చట్టం తేవాలని ఆదేశించింది.
ఈ ఆదేశం వచ్చి మూడు దశాబ్దాలు దాటినా ప్రభు త్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించినప్పటికీ అనేక లొసుగుల వల్ల అది సమక్షిగంగా లేదన్న విమర్శలు వచ్చాయి. చట్టం సూచించిన మేరకైనా నిధు లు విడుదల కాకపోవడంతో అది పనికిరాని చిత్తు కాగితంగా మిగిలిపోయింది.
ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక కూడా అంతే ప్రగతి కాముకంగా కనిపిస్తోంది. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి, మూడు గదుల ఇల్లు, పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో ఆశ్రమ విద్య ఇవన్నీ వారి ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా వాటిని అమలు చేయవలసిన అవస రం ఉంది. ఇప్పటివరకైతే ముఖ్యమంత్రి పట్టుదలతో కనిపిస్తున్నారు. స్వయంగా ఆయనే దళిత అభివృద్ధి విధానం ఎలా ఉండాలో చెప్పారు. ముఖ్యమంవూతితో పాటు సమాలోచనలో పాల్గొన్న అధికారులు, మేధావులు కూడా ఆయన ఆలోచనలు విని ఆశ్చర్యపోయారు.
ఆయన రాజకీయ ప్రత్యర్థులు దొరగా అభివర్ణించే చంద్రశేఖర్రావు, ముఖ్యమంత్రి స్థానంలోఉండి ‘దున్నేవాడికి భూమి కావాలని’, దళితుల దరి ద్రం తొలగిపోవాలని అదే తన ప్రభుత్వ మొదటి లక్ష్యమని ప్రకటించారు. ఇది ప్రకటన వరకే పరిమి తం కాకుండా ఉండాలంటే చిత్తశుద్ధి అవసరం, లౌకి క దృష్టి కార్యదక్షత కలిగిన పరిపాలనా యంత్రాంగం అవసరం. ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచించాలి.
భూమి పట్ల బృహత్ కల ఒక్క తెలంగాణ ప్రజల కే కాదు ప్రపంచ వ్యాప్తంగా పీడిత ప్రజలందరికీ ఉన్నదే. భూమి తోటే భుక్తి దొరుకుతుందని, దానితోనే విముక్తి ఉందని అర్థం చేసుకున్న ప్రజలు అన్ని దేశాల్లో దాన్నొక నినాదంగా మార్చివేశారు.
ముఖ్యం గా వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న అనేక దేశాల్లో ప్రజలు తమ బంధాన్ని భూమితోనే పెనవేసుకున్నారు. ఆభూమిలోంచే నవ సమాజ ఆవిర్భవిస్తుందని నమ్మారు. ఆ నమ్మకంతోనే తెలంగాణ ప్రజ లు కూడా భారతదేశంలో మొట్టమొదటి సాయుధ రైతాంగ పోరాటాన్ని చేశారు. జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరకంగా సాయుధ పోరాటం చేశారు. అయినా ఆ కల నెరవేరలేదు. ఆ పోరాట వారసత్వం గా కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జగిత్యాల లో వ్యవసాయ కూలీలు, పాలేర్లు కలిసి రైతుకూలీ సంఘాలు పెట్టుకున్నారు,
మొదట కూలీరేట్లు, వెట్టికి వ్యతిరేకం గా పోరాటాలు నిర్మించారు. చట్టాలు వచ్చాయి తప్ప మార్పు రాలేదు. ఈ అనుభవాల నేపథ్యంలోనే భూమి ద్వారానే విముక్తి సాధ్యం అన్న నిర్ధారణకు వచ్చారు. అందులోంచే దున్నేవాడికే భూమి కావాలన్న నినాదం వచ్చింది. ఆ నినాదానికి భూస్వాము లు, దొరలు ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వాన్ని పురమాయించారు. పోలీసులను ప్రయోగించారు.
ఉత్తర తెలంగాణ కల్లోలిత ప్రాంత చట్టంలోకి వచ్చింది. అదొక సాయుధ సంఘర్షణకు దారి తీసింది. రెండు దశాబ్దాలపాటు తెలంగాణ అల్లకల్లోలం అయ్యింది. భూమి అడిగినందుకు ప్రజలను తీవ్రవాదులుగా ముద్రవేసిన పాలక వర్గాలు నిరంకుశంగా అణచివేశాయి.హతమార్చాయి. అయినా భూపోరాటాలు ఆగలేదు తెలంగాణ నుంచి మొదలయిన కల అలా భారతదేశమంతా విస్తరించింది. భూమికి సంబంధించిన కల అలాగే మిగిలిపోయింది.
ఇప్పుడు ఆ కల నెరవేర్చడానికి కేసీఆర్ పూనుకోవడమే కొందరికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన సమీక్షలో పాల్గొన్న ఒక ఆంధ్రా అధికారి మూడు ఎకరాల భూ పంపిణీ అనేది తెలంగాణలో రాబోయే నిశ్శబ్ద విప్లవానికి నాందిగా అభివర్ణించారు. అయితే ఇది ఏమేరకు ఆచరణలోకి వస్తుం దో వేచిచూడాలి.