దీపావళిలోగా
తెలంగాణ పై తమ నిర్ణయాన్ని
ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కబుర్లు నమ్మిన వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది.
దీపావళి కూడా దాటిపోయింది కానీ
తెలంగాణ పై ప్రకటన మాత్రం
రాలేదు. గత రెండేళ్లుగా ఇలాంటి
వాయిదాలను అనేకం చూసి వున్నందువల్ల
ఈ సారి ప్రజలు కూడా
పెద్దగా నమ్మినట్టు లేరు. కానీ రాజకీయ
పార్టీల నాయకులే కొందరు అలాంటి ప్రచారాన్ని పుట్టించారు. సకల జనుల సమ్మె
ఒత్తిడిని తట్టుకోలేని ప్రభుత్వం అలాంటి ఆచరణ సాధ్యం కాని
ప్రచారానికి పూనుకుంది. నిజానికి సకల జనుల సమ్మె
తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక
అపూర్వఘట్టం. తెలంగాణ ప్రజలు మొండి ప్రభుత్వం మెడలు
వంచడానికి వాడి న అరుదైన
ఆయుధం. అది అంచనాలను మించి
విజయవంతమైనప్పటికీ విమర్శలు మాత్రం తప్పడంలేదు.
ఈ సమ్మె వల్లనైనా సాకారం అవుతుందనుకున్న కల నెరవేరలేదన్న దిగులుతో కొందరు, ఇప్పుడు ఉద్యమాన్ని నడిపిస్తోన్న నాయకత్వం విఫలం కావాలన్న కోరికతో కొందరు విమర్శలు చేస్తుండవచ్చు. కానీ ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిష్పాక్షికంగా చూసేవారికి మాత్రం ఇదొక చరివూతాత్మక సందర్భం. ఉద్యోగులు సమ్మె చేస్తే రాష్ట్రం వస్తుందన్న భ్రమలు సమ్మె చేసిన ఉద్యోగులతో సహా ఉద్యమాలలో ఉన్నవారికి ఎవరికీ లేవు. సకలజనుల ఆకాంక్షను ప్రపంచానికి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎంచుకున్న పోరాట రూపాలలో ఈ సమ్మె ఒకటి. ఈ సమ్మె వల్ల, పాలన, పౌర జీవనం స్తంభించడం వల్ల పాలక వర్గాలు సమస్య తీవ్రతను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాయని ఉద్యోగులు భావించారు.

పైగా తెలంగాణ పౌర సమాజంలో ఒక బలమైన శక్తిగా ఉన్న ఉద్యోగు లు అది తమ బాధ్యతగా కూడా భావించారు. ముఖ్యంగా ఈ సమ్మె తెలంగాణ రాజకీయ శక్తులను ఏకం చేయడానికి దోహదపడుతుందని అనుకున్నారు. కానీ మనవి అవకాశవాద, ఆధిపత్య రాజకీయాలని ఈ రాజకీయవ్యవస్థలో ప్రజలకంటే పార్టీలు, వాటి ప్రయోజనాలే ముఖ్యం అయిపోయాయని గుర్తించడానికి 43 రోజులు పట్టింది. అదే ఉద్యమంలో అసలు విషాదం. అయినా ఉద్యమంలో భాగంగానే సమ్మెను చూడాలి తప్ప సమ్మె మాత్రమే ఉద్యమం అనుకోవడం పొరపాటు. అలాగే సమ్మె శాశ్వతంగా కొనసాగాలని అనుకోవడం కూడా అత్యాశే! పైగా సమ్మెను సాకుగా చూపి తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అత్యంత నిర్దయగా శిక్షించించింది.
అటువంటి
పరిస్థితుల్లో ముందు కు రావాల్సిన
ఈ ప్రాంతపు నేతలు రాజకీయ ఎత్తుగడలకు
పాల్పడి సమ్మె లక్ష్యానికి తూట్లు
పొడిచే విధంగా పనిచేశారు. ప్రభుత్వం దీనినొక అవకాశం గా తీసుకుని సమ్మె
వ్యతిరేక ప్రచారం చేసి ఉద్యోగులను విలన్లుగా
చూపే ప్రయత్నమూ చేసింది. ఈ పరిస్థితుల్లో సమ్మె
సడలింపు మినహా మరో మార్గం
ఏముంటుంది? ఇప్పుడు సమ్మె చేసినందుకే కాదు
సమయస్ఫూర్తితో వాయిదా వేసుకున్నందుకు కూడా మనం ఉద్యోగులను
అభినందించాలి. అదే సమయంలో సమ్మె
మీద నీళ్ళు చల్లి ఉద్యమాన్ని ఆర్పేయాలని
చూసిన వాళ్ళ గురించి కూడా
నాలుగు మాటలు చెప్పుకోవాలి.
ఉద్యమం వల్ల ఎవరు ఎంత నష్టపోయారన్న సంగతి వదిలేస్తే లాభపడింది మాత్రం కచ్చితంగా రాజకీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని రాజకీయ పార్టీలు కొన్ని వాళ్ళ బలాన్ని, బలగాలను పెంచుకుంటే, కొందరు నేతలు తమ తమ పార్టీల్లో వారి వారి పట్టు పెంచుకుంటున్నారు. కొత్త కుంపట్లు పెట్టుకున్నారు. ప్రజా ఆకాంక్షను, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని తమ అధినేతల దగ్గర, అధిష్ఠానాల వద్ద అయాచిత లబ్ధి పొందుతున్నా రు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఇలా సజీవంగా కొనసాగడం అందరికంటే ఎక్కువ వాళ్ళకే అవసరం. బాధ్యతను వారిమీదే పెట్టవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమయింది.

తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు చరిత్ర పొడవునా ద్రోహం చేస్తూ వస్తో న్న పార్టీ కాంగ్రెస్. ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాస్ నుంచి వేరుచేసి మూడేళ్లకే తెలంగాణతో కలిపి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేసింది మొదలు ఇప్పటిదాకా అన్ని దశల్లో కాంగెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ వాదం ఒక ముసుగు అయ్యింది. అవసరానికి జై తెలంగాణ అని తమ అధినేతలను, అధిష్ఠానాలను బెదిరించి పదవులు పొందడం చెన్నాడ్డి నుంచి జానాడ్డి దాకా ఆ పార్టీలో అందరికీ అలవాటై పోయింది. వారివారి వనరులతో, శక్తి యుక్తుల తో పదవులు పొందలేని ప్రతి నాయకుడూ కాంగ్రెస్ పార్టీలో ఇదే నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో, పదవుల్లో ఉన్నవాళ్ళు ఎప్పు డూ తెలంగాణ అనలేదు.
ఇప్పుడు కూడా అనడంలేదు. ఒకరిద్దరు అలా అంటున్న వాళ్ళు ఉన్నా వాళ్లకు ఇప్పుడున్న పదవిపట్ల అసంతృప్తి వల్లనో, నాయకత్వంతో పొసగకపోవడం వల్లనో తెలంగాణ వాదాన్ని వాడుకోవాలనుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదని వాళ్ళ కార్యాచరణతో తేలిపోయిం ది. పార్టీగా కూడా కాంగ్రెస్ తాను అధికారంలోకి రావడానికి తెలంగాణను ఒక నిచ్చెనగా వాడుకుంటూ వస్తోందే తప్ప ఆ పార్టీకి ఒక విధానమేదీ లేదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు బాధ్యుడైన జవహర్‌లాల్ నెహ్రూ ‘వీలు కాదనుకున్నప్పుడు విడిపోవచ్చు’ అన్నాడని చెప్పేవాళ్ళు ఆ పార్టీలో ఉన్నట్టుగానే, ‘తెలుగు వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కలిసే ఉండాలి’ అని ఇందిరాగాంధీ పార్లమెంటులోనే చెప్పిందని తప్పించుకునే వాళ్ళూ ఉన్నారు. ఎప్పుడో పోయినవాళ్ళు చెప్పిన మాటలను పక్కనబెట్టి ఇప్పుడు సోనియా గాంధీ ఏమంటుందో ఏ ఒక్కడూ చెప్పడు. ఆమె కూడా పెదవివిప్పదు.
ఇప్పుడు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో పాలన గాడిన పడుతోన్న
సంకేతాలిస్తున్నారు, తెలంగాణ మంత్రులు కూడా ఆయనకు వీర
విధేయులుగానే ఉంటున్నారు. తెలంగాణ విషయాన్ని సోనియా గాంధీ అంత ముఖ్యమెన
విషయంగా భావించడం లేదని ఆమె వ్యవహార
శైలిని గమనిస్తేనే అర్థమౌతుంది. నిజంగానే ఇదొక ముఖ్యమెన సమస్య
అనుకుంటే చిదంబరం, మొయిలీ, ఆజాద్, అహ్మద్ పటేల్ ఇట్లా ఎవరికి
తోచిన రీతిలో వాళ్ళు ఆడుకునే అవకాశం ఉండేదికాదు. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యాయని ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. తెలంగాణ
కోసం ప్రాణ త్యాగాలకు కూడా
వెనుకాడం అని ప్రగల్భాలు పలికిన
ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు
కూడా ఇప్పుడు ప్రజలకోసం పదవిని వదులుకునే స్థితిలో లేడు. విసిగిపోయిన ప్రజలు
అత్యంత విచారకరమైన పద్ధతుల్లో తద్దినాలు, పిండ ప్రదానా లు
చేస్తున్నా మంత్రులు పదవులకు వేలాడుతున్న తీరు దారుణం.
రాయపాటి సాంబశివరావు అంటే ఏమో అనుకున్నాంగానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవులు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని బలహీనులని ఇప్పు డు వారికి వారే నిరూపించుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాంత్ర మంత్రుల కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యేది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆ తరువాత అన్నిగడువులు అయిపోయాక ఎంపీలతో పాటు మంత్రులు, కనీసం ఒక పదిమంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీని వదులుకోవడానికి సిద్ధపడితే రాష్ట్ర ప్రభుత్వ పునాదులు కదిలేవి. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా సోనియా గాంధీ నోరువిప్పక తప్పేది కాదు. కానీ మన మంత్రులు మళ్ళీ ఎన్నికలదాకా ప్రజలతో పనిలేదని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగానైనా సరే కనీసం ఈ రెండేళ్ళు పదవిలో ఉన్నా చాలని అనుకుంటున్నారు.

అలాగే ఎమ్మెల్యేలు కూడా బేరాన్ని బట్టి
మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామందికి తెలంగాణ అనకుండా నోరుమూసుకుని పడిఉన్నందుకు డబ్బు సంచులు అందుతున్నట్టు
చెబుతున్నారు. ఢిల్లీ వెళ్ళే ముందు సమ్మెకు సంఘీభావం
తెలిపి తాము కూడా రంగంలోకి
దిగుతామన్న ఉత్తరకుమారులు ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే
‘సమ్మె విరమించాలని’ అన్నారంటే వాళ్ళ ఆయువుపట్టు ఎక్కడుందో
అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు
కదా! ఇవన్నీ తెలిసీ ఇంకా ఢిల్లీకి మొర
పెట్టుకోవడం ఆంటే గోడకు తలబాదుకోవడం
వంటిదే.
ఇక మరో పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ గురించి ఎంత మాట్లాడకుంటే అంత మంచిది. ప్రత్యేక తెలంగాణ విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో ప్రాచుర్యం పొందిన ఆ పార్టీ అధినేత హఠాత్తుగా తమ వైఖరి తటస్థం అని తేల్చేశారు. రాజకీయాల్లో తటస్థం ఉండదు. ఏదో ఒక పక్షం వైపు ఉండాలి, లేదా రెండు పక్షాలను కూర్చోబెట్టి సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం వెతకాలి. రాజనీతి ఆంటే అదే. అలాంటి వైఖరి సమంజసం కాదని తెలిసీ తెలంగాణ తెలుగుదేశం నాయకులు మీడియాలో తెలంగాణ వాదులుగా తెగ రెచ్చిపోతున్నారు.
వీరు సమ్మె విషయంలో ఎలా వ్యవహరించారో ప్రజలం తా గమనించే ఉంటారు. ముందు సమ్మెకు మద్దతు అన్నారు, ఆ తరువాత తమనెవరూ పిలవడం లేదని అలిగారు. అలా పిలవలేదని ఉద్యోగ సంఘాలను, సంఘాల నేతలను ఆడిపోసుకున్నారు. అమ్ముడుపోయారని, ఎన్నిక ల్లో టికెట్ల కోసం రాజీ పడుతున్నారని ఇట్లా అనేక అభాండాలు వేశారు. చివరకు నలభై మూడో రోజు పోలవరానికి సమ్మెకు లింకు పెట్టి అవమానకరంగా మాట్లాడారు. ఈ నలభై రోజులు ఆ పార్టీ పోషించిన విదూషక పాత్ర చూసిన ఎవరైనా పోగాలమనే అంటారు. అలా నిజాలు చెప్పినా వాళ్ళు భరించలేరు. అలా అంటే ఎవరినైనా సరే టీఆర్ఎస్ తొత్తులని మీడియాలో ముద్ర వేస్తారు. అట్లా అటు ఇటు కాకుండా ఉండడం ఆ పార్టీ అధినేతకు అలవాటైనట్టే, అడ్డదిడ్డంగా మాట్లాడడం తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలకు అలవాటయ్యింది. పోలవరం టెండర్ల విషయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఆ పార్టీ పేలవత్వానికి అద్దం పడుతుంది. నిజమే పోలవరం టెండర్లు ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి సంబంధం ఉన్న కంపెనీకి వచ్చాయనుకుం దాం.
ప్రధాన
ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ అధినేత వెంటనే ఈ విషయాన్ని స్వయంగా
ఎండ గట్టాల్సింది. టెండర్లు రద్దు చేయాలని అడగాల్సింది.
కానీ ఆయన అలా చేయలేదు.
ఆయనకంటే ముందుగా ఆయన పార్టీలోని సీమాంధ్ర
నేతల కంటే ముందుగా రెచ్చిపోయింది
రేవంత్ రెడ్డి. సాధారణంగా రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లారనే నేను ఇంతకాలం అనుకున్నాను.
ఆయన జేఏసీ చైర్మన్ కోదండరామ్
ఢిల్లీ వెళ్లి పోలవరం ఒప్పందం కుదిర్చాడని అనడం ఆశ్చర్యం కలిగించింది.
అంతటితో ఆగకుం డా అందుకు
బహుమానంగా సకలజనుల సమ్మె విరమించారని యావత్
తెలంగాణను అవమానించారంటే వాళ్ళను ఏమనుకోవాలి? అలా మాట్లాడే వాళ్ళు
ఉంటారు, ఉన్నారు కూడా. కానీ ఒక
రాజకీయ పార్టీ అలా మాట్లాడడం ఒక్క
భావ దారివూద్యమే కాదు కుట్ర పూరితం
కూడా.! తెలుగు దేశం పార్టీ, టీఆర్‌ఎస్‌ల మధ్య
ఒక రాజకీయ యుద్ధం జరుగుతున్న మాట వాస్త వం.
తెలంగాణ వైఖరి విషయంలోనే ఈ
గొడవ మొదలయింది. ఒకే ఒక్క రాత్రిలో
మానిఫెస్టో మరిచిపోయి, ఇచ్చిన మాటల్ని మరిచిపోయి అంతకు ఒక్క రోజు
ముందు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మరిచిపోయి
చంద్రబాబు సిసలైన సమైక్యవాదిగా మారిపోవడం సమస్యకు మూలం. ఇది ప్రజా
వ్యతిరేకతకు, పార్టీ క్షీణతకు కారణం.
కానీ టీడీపీ దివాలాకు టీఆర్ఎస్ కారణమని అనడం ఆడలేక అన్న.. సామెతను గుర్తు తెస్తుంది. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం వైఖరికి నిరసనగా ఆ పార్టీని మిగలకుం డా చేయాలని కుట్ర చేసినా అది రాజకీయాల్లో అతి సాధారణ విషయం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుటి పార్టీ ఉండకూడదనే అనుకుంటుంది. ఆ పార్టీ సిద్ధాంతం, ఎజెండా ఏదీ లేకపోతే ఎత్తుగడతోనైనా ప్రజలను నమ్మించాలి, గెలవాలి తప్ప, నేను మొనగాడినే కానీ ఎదుటివాళ్ళు ఓడించారని ఆడిపోసుకోవడం చేతగానితనం అవుతుంది. ఆ చేతగాని తనాన్ని అంగీకరించలేక సమ్మెకు, పోలవరానికి ముడిపెట్టినట్టు ఉంది తప్ప మరోటి కాదు. విచివూతమేమిటంటే పోలవరం సమస్యను రాజకీయంగా వాడుకునే తెలివికూడా తెలుగుదేశం పార్టీకి లేకుం డా పోయింది. పోలవరం విషయంలో ఒక కాంట్రాక్టర్గా లక్ష్మీ రాజంను నిలదీయలేరు. ఎందుకంటే అలాంటి కాంట్రాక్టర్లకు తెలుగుదేశంపార్టీ పెట్టిం ది పేరు. పైగా పోలవరం పాపం మొదటి దశలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులే కాలువలు తవ్వి చేతులు కడిగేసుకున్నారు. అలాగే నమస్తే తెలంగాణలో వచ్చి న వార్తకు ఇప్పటికే ఆ పత్రిక వివరణ ఇచ్చుకుంది. ఆ వివరణ ఎలా ఉన్నా ఆ వార్త చదివి నేను కూడా విస్మయానికి గురయ్యాను.

పోలవరాన్ని
ఎవరూ సమర్థించరు. సమర్థించకూడదు. అది తెలంగాణ దుఃఖదాయిని.
ఆ ప్రాజెక్టు మీద తెలంగాణలోని పార్టీలన్నీ
కచ్చితంగా తమ తమ వైఖరులు
ప్రకటించాలి. ప్రత్యక్షంగా అక్కడి ప్రజల పోరాటానికి నాయకత్వం
వహించి వెంటనే పనులు ఆపించాలి. ఇన్ని
అభాండాలు వచ్చిన నేపథ్యంలో న్యాయ పోరాటాన్నే కాదు
న్యాయం జరిగేదాకా ప్రజా పోరాటాన్ని నడిపించాల్సిన
బాధ్యత కూడా టీఆర్ఎస్
తీసుకోవాలి. ఇప్పట్లో తెలంగాణ తేలినా తేలకపోయినా ఉద్యమం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజాసంఘాలు, సంస్థలు,
రాజకీయ పార్టీలది. తెలంగాణ జేఏసీ కూడా రాజకీయ
పార్టీల మీద ఒత్తిడి పెంచి
కొంతకాలం సకల జనులకు విరామం
ఇవ్వడం మంచిదేమో ఆలోచించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి