మంగళవారం, అక్టోబర్ 11, 2011

కాలం వంతెన పై కవాతు..!




మీకు కోదాటి సుధీర్ గురించి చెప్పాలి. ప్రస్తుతం కెనడా రాజధాని ఒట్టా వాలో నివసిస్తోన్న సుధీర్ కొన్నేళ్లుగా తెలంగాణ కోసం తపస్సు చేస్తున్నాడు. తెలంగాణ కోసం ఎక్కడో ఖండాంతరాల్లో చేసేదేముంటుంది అనుకుంటే పొరపాటే. సుధీర్ది కరీంనగర్ జిల్లా దండేపల్లి. 1980 దశకం చివరి నాటికి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువు పూర్తిచేసుకున్న సుధీర్ తరువాత అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం లో పరిశోధనలో చేరారు. సమయంలో అమెరికాలో పర్యటించి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచ పరివ్యాప్తం చేసిన జాతిపిత జయశంకర్ ప్రసంగాలతో స్ఫూర్తిని పొందాడు. అంతే పరిశోధన సంగతి పక్కన పెట్టి అమెరికా ఖండంలో ఉన్న తెలంగాణ బిడ్డల్ని ఏకం చేసే పనికి పూనుకున్నాడు. అందు కు ఆయన తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మను ఎంచుకున్నాడు.

అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు అంటే నెలనెలా లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు మాత్రమే అని, కేవలం డబ్బు సంపాదన కోసమే తపిస్తారని, వారాంతాల్లో వీలయినప్పుడు కలుసుకుని విందులు వినోదాలు మాత్రమే చేసుకుంటారనీ, రకరకాలుగా కథలు ప్రచారంలో ఉన్న కాలమది. పైగా అక్కడ కులాల గొడవ ఇక్కడికంటే ఎక్కువ. తానా, ఆటా పేరుతో కులాల వారీగా ఆంధ్రా ఎన్ఆర్ఐలు విడిపోయి ఉన్న రోజుల్లో మధుడ్డి లాంటి మరికొందరు మిత్రులతో కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఫోరంలో పనిచేస్తూనే స్వయంగా అమెరికాలోనే అన్ని రాష్ట్రా లూ తిరిగి తెలంగాణ వారిని ఒక్కచోటికి కలిపే ప్రయత్నం చేశాడు. కేవలం మాట ముచ్చట కోసం కాకుండా తెలంగాణను ఒక అస్తిత్వంగా మలచడం కోసం వాళ్ళు బతుకమ్మ పండుగను వాడుకున్నారు.

అట్లా ప్రతిఏడాది ఒకటి రెండు నగరాల్లో నలుగురైదుగురితో మొదలైన బతుకమ్మ పండుగ ఇప్పుడు అమెరికా అంతటా ఒక ప్రధాన పండుగగా మారిపోయిం ది. ఏడాది అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలూ, పట్టణాలలో వేలాదిమంది బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒక్క అమెరికా ఖండమే కాదు, ఆస్ట్రేలి యా, సింగపూర్, దుబాయి ఇట్లా తెలంగాణ ఆడబిడ్డలున్న ప్రతిదేశం బతుకమ్మ పాటలతో పునీతం అయ్యింది. సరిగ్గా బతుకమ్మ పండుగ రోజే సుధీర్ తో పాటు అమెరికా తెలంగాణ ఎన్ఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి మేరెడ్డి రవి ప్రకాష్ నాతో మాట్లాడారు. సకల జనుల సమ్మె గురిం చి, కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి గంటల తరబడి మాట్లాడారు. నేను ఉద్యమంలో ఉన్న ఒడుదొడుకులు వివరిస్తుం సుధీర్ మాత్రం కచ్చితంగా ఫలితం ఉంటుందన్న ధీమాతో మాట్లాడా డు. అంతే ఉత్సాహంతో అమెరికాలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు చలో డీసీ కార్యక్షికమం చేపట్టినట్టు, సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్ఆర్ఐలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో నెల 15 తెలంగాణ కవాతుపేరిట ఒక భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

అమెరికాలో భారీ ప్రదర్శన సాధ్యం కాకపోవచ్చు గానీ కొన్ని వందలాది మంది కలిసినా దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. భారత ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఇది దోహద పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా అదే వైఖరితో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే దేశదేశాల్లో ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టే ప్రయత్నాలను సైతం తెలంగాణ ఎన్ఆర్ఐలు పరిశీలిస్తున్నారు. కొందరు ఇప్పటికే తెలంగాణ ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కును భారత ప్రభుత్వం ఎలా తృణీకరిస్తున్నదో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగేహ్యూమన్ రైట్స్ వాచ్వంటి హక్కుల సంఘాల ప్రతినిధులను కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ ప్రతినిధుల ప్రయత్నాలు ఫలిస్తే ఇది తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక అరుదైన ఘట్టం కాబోతుంది. ‘ఇండియాలో ఉన్న ప్రభుత్వం స్పందించక పొతే అమెరికాలో ఆందోళన చేసి ఏమి లాభంఅని కొందరికి అనిపించవచ్చు. ఇవాళ ఇండియాలో ఉన్నది ఒక కీలుబొమ్మ ప్రభుత్వం.

ప్రభుత్వపు ఆయువు పట్టు అమెరికాలోనే ఉన్నది. అక్కడి ప్రదర్శన ప్రభుత్వం దృష్టికి, అంతర్జాతీయ మీడియా దృష్టికి తెలంగాణ సమస్యను మరోసారి తీసుకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వంతో సహా అక్కడి పెట్టుబడి దారీ సంస్థలు, ప్రభుత్వేతర వర్గా లు, లాబీలు నిర్వహించే సంస్థల దృష్టిలో చెడ్డపేరు రాకూడదని భారత ప్రభుత్వం అనుకుంటున్నది. అలా జరిగితే పరువు పోతుందని, పైసా పుట్టదని ఇక్కడి ప్రభుత్వం భయం. అందుకే అన్నా హజారే విషయంలో ప్రభు త్వం లొంగిపోయి పార్లమెంటుకు ఉన్నహక్కులని సైతం ఆయన పాదాల చెంత ఉంచడానికి అమెరికాలో వెల్లడైన అభివూపాయాలే కారణమన్న వాదన లు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఇటువంటి అంతర్జాతీయ ఒత్తిడిని ఇప్పటి కే పెంచి ఉండాల్సింది. ఇదే విషయం సుదీర్, రవివూపకాష్ నేనక్కడికి వెళ్ళినప్పుడు నాతో సుదీర్ఘంగా చర్చించారు. చికాగో తెలంగాణ మిత్రులు శ్రీను పాల్తేపు, కిషన్ లాంటి వాళ్ళు కూడా అక్కడి యునివర్సిటీల్లో మేధావులను కదిలించే ప్రయత్నం చేశారు.

బోస్టన్లో అమర్ కరిమేల్లి, వెంకట్ లాంటి మిత్రులు గత శనివారం అక్కడ ఇలాంటి ప్రదర్శన ఒకటి నిర్వహించి నిరస తెలిపారు. అమెరికాలో ప్రభావవంతంగా ఉన్న తెలంగాణ సంస్థతేనా ఫోరం ప్రదర్శన నిర్వహించింది. ఇప్పుడు అక్కడ కత్తులై మెరుస్తోన్న తెలంగాణ యువతరం తెగువ వెనుక పదేళ్లకు పైగా అక్కడ వాదానికి సాన పట్టినతేనా ఫోరం’, ‘డెవలప్మెంట్ ఫోరంలాంటి సంస్థలతో పాటు సుధీ ర్ లాంటి అనేక మంది వ్యక్తుల శ్రమ, కృషి ఉన్నాయి. అట్లా బతుకుదెరువు కోసం ప్రవాసం వెళ్లినా ఇంకా నేలతో వాళ్లకు పేగుబంధం తెగిపోలేదు. కేవలం ప్రదర్శనే కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రవాస సమాజం ఉద్యమానికి అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటోంది. నెల తిరిగే లోపు జీతం వస్తే తప్ప పూటగడవని లక్షలాదిమంది ఇవాళ సమ్మెలో ఉన్నారు. వారిలో కొందరైనా మొన్న దసరా పండుగ చేసుకున్నారంటే అది తెలంగాణ ఎన్ఆర్ బిడ్డలు అందించిన ఆపన్న హస్తమే కారణం.
గతంలో ఆత్మహత్యల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇతోదిక సాయం అందించి, వాళ్లకు చేదోడుగా నిలిచిన వాళ్ళు, ఉద్యమ జ్యోతి ఆరిపోకుండా తాము సంపాదించిన డబ్బులతో చమురు నింపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు

ఇంకొంత మంది తెలంగాణ కోసం ప్రత్యేక వెబ్ సైట్లు, పత్రికలూ నడిపిస్తూ అక్కడి ప్రవాస భారతీయుల్లో భావవ్యాప్తి కలిగిస్తున్నారు. చాలామంది తెలంగాణ పిల్లలు దేశంలో ఉన్నా వాళ్ళ ప్రాణాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ప్రతిరోజూ తమ పనుల్లో తలమునకలౌతూ ఉన్నా ఏదో ఒక చోట పది మంది కలుసుకోవడం, ఇక్కడికి ఫోన్లు చేసి విషయాలు తెలుసుకోవడం, ఇల్లు చేరగానే టీవీలకు అతుక్కు పోయి ఇక్కడి పరిణామాలు చూసి కుమిలిపోవడం, ఉద్యమాన్ని చూసి ఊరటిల్లడం వాళ్లకు అలవాటైపోయింది. అలాంటి మమేకత తెలంగాణ ఆత్మలోనే ఉన్నది. లేకపోతే పరాయి దేశంలోనో పౌరులైపోయి, అక్కడి యాంత్రికతలో కొట్టుకుపోతూ జీవితాలను గడుపుతున్నవాళ్ళు ఇంకా ఇక్కడి సకల జనులలో భాగం కావాలని తపించడం సామాన్యమైన విషయం కాదుగదా

తెలంగాణ సమ్మెకు సకల జనుల సమ్మె అని పేరుపెట్టింది ఎవరో గానీ వాళ్ల సాహసం గొప్పదిసాహసమని ఎందుకంటున్నానంటే సమ్మె అంటే ఉద్యోగులో కార్మికులో మాత్రమే చేస్తారన్నది ఒక చారివూతిక అవగాహన. దాన్ని పునర్నిర్మించడం అంటే చరివూతను తిరగరాయాలన్న ప్రయత్నం. అది విజయవంతం అవుతుందన్న వాళ్ళ విశ్వాసం, తదనుగుణంగా వాళ్ళు చేసిన వ్యూహ రచన సాహసోపేతమయినది కాక మరేమౌతుంది! పైగా అన్ని హక్కు లూ ఉండి, పోరాటం చేయగలిగే వెసులు బాటున్న భద్ర జీవులు సైతం సమ్మె అంటేనే వెనకడుగు వేస్తోన్న కాలం ఇది. సమ్మె ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక ఆయుధమే అయినా తమ పాలనలో అలాంటివి చెల్లబోవని పాలకులు, కోర్టులూ శాసిస్తోన్న కాలంలో పాలనలో అంతర్భాగమైన ఉద్యోగులు, అదే కోర్టుల్లో వాదిస్తోన్న న్యాయవాదులు మొదలు సామాన్య ప్రజల దాకా సమ్మెలో దిగి ఇలా కాలానికి ఎదురు నిలవడమంటే మాటలుకాదు.

నిజంగానే కాలం ఆగిపోవడమంటే ఏమిటో మనం ఇప్పుడు చూస్తున్నాం. గడిచి నెలరోజులుగా తెలంగాణ సమస్తం స్తంభించిపోవడం ఒక చారివూతిక సన్నివేశం. ప్రజా ఉద్యమాల చరివూతలో ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి దాఖలాలు లేవు. ఇంతటి చరివూతకు కారణమైన తెలంగాణ బడుగు ఉద్యోగులను, వారికి అండదండగా నిలిచిన ప్రజానీకాన్ని అభినందించి తీరాలి. సకల జనుల సమ్మె కాలాన్ని ఆపేయడమే కాదు, ఇప్పుడు కాలానికి ఎదురుగా ఒక కొత్త వంతెన నిర్మించి మళ్ళీ మనల్ని 9 డిసెంబర్ 2009 కి తీసుకేళ్లే దిశగా సమ్మె నడుస్తోంది.

దాదాపు రెండేళ్లుగా నాలుగుకోట్ల మంది ఆకాంక్షలను అణచిపెట్టిన ప్రభుత్వాలు తమ కాళ్ళకిందకు నీళ్లొస్తున్నాయని ఇప్పుడిప్పుడే గుర్తించాయి. అవి మామూలు నీటి అలలు కాదని, అలల వెనక తమ అధికారాన్ని అల్లకల్లోలం చేయగల సునామీ ఉందని కూడా వాళ్ళు భయపడుతున్నట్టు కనిపిస్తోంది. బహుశా నల్లగొండ గుండా ఆంధ్రాకు వెళ్ళే జాతీయ రహదారిని నాలుగైదు గంటలు నిలిపివేయడం, హైదరాబాద్ నడిబొడ్డున వీరంగం వేయాలని చూసిన లగడపాటిని కారుతో సహా క్రేన్ సహాయంతో తరలించా ల్సి రావడం కూడా ఇందుకు దోహదపడి ఉండవచ్చు. ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, ప్రకటనల పరంపర ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సమస్యను మరింత సాగ దీసి జటిలం చేయాలని అనుకుంటోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా విషయాన్ని నాన్చాలని చూస్తోం ది! ఆంటే అది పార్టీ నైజం. పంజాబ్, అస్సాం, జార్ఖండ్ ఇలా రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సామరస్య పూర్వకంగా ఏర్పాటు చేయలేదు. బుజ్జగించడం, భయపెట్టడం, బెదిరించడం వినక పొతే అణగదొక్కడం పార్టీకి అలవాటు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులను, శాసనసభ్యులను లొంగ దీసుకున్న తెలంగాణ ప్రజలను కూడా లోబరచుకోవాలని పార్టీ చూస్తోంది.

కానీ పైకి మాత్రం పార్టీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోన్నట్టు చర్చలు, సంప్రదింపులని సాగదీస్తోంది. ఒక వైపు చర్చల పేరుతో ఢిల్లీలో నాటకం నడుస్తుండగానే ఇక్కడ సకల జనుల సమ్మె విరమింపజేసే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని పురమాయించింది. జాతీయ మీడి యా కథనాల ప్రకారం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం సమ్మె పట్ల వ్యవహరిస్తోన్న తీరు పై ఆయనకు తలంటు పోసింది. ప్రజలను పరిపాలించడమంటే కేవలం ఎమ్మెల్యేలను మేనేజ్ చేసినంత సులభం కాదని ఆయనకు పాటికే అర్థమయి ఉండాలి. అయినా తప్పు ఆయనది మాత్రమే ఎలా అవుతుంది? ఆయన తన జీవితంలో ఇంత త్వరగా ముఖ్యమంత్రి అవుతానని కనీసం కలలో కూడా అనుకుని ఉండడు. అర్జునుడు శ్రీ కృష్ణుడి గీతను అనుసరించినట్టు శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని నమ్ముకుని ఆయన దుగ్గల్ ఉపదేశాలను పాటిస్తున్నాడు. ఇక మిగిలిన అన్ని వ్యవహారాలను గవర్నర్ నరసింహావతారంలో నిర్వహిస్తూనే ఉన్నాడు.

బహుశా ధైర్యంతోనే యువ కిరణం దూకుడుగా ముందుకెళ్లాలని చూస్తున్నాడు. సమ్మెను పరిష్కరించి నెల రోజుల్లో మామూలు పరిస్థితులు నెలకొల్పాలని, లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని అధిష్ఠానం ఆదేశించినట్టు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఆఖ రి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. సమ్మెను అణచివేయడానికి ఆయన రెండు పద్ధతులను ఎంచుకున్నాడు. అందులో ఒకటి నిర్బంధం. కాగా రెండోది ప్రజలను రెచ్చగొట్టి సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడించడం. సింగరేణి సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న జాక్ నేతలను అరెస్టు చేసి అడ్డుకోవడం అయన మొదటి ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. ఈసారి రైల్ రోకో ను అడ్డుకోవడానికి బలవూపయోగం చేస్తామన్న హెచ్చరికలు కూడా అందులో భాగమే. అందుకు అనుగుణంగానే ఇప్పటికే సాయుధ బలగాలను మోహరిస్తోంది. ఉద్యమాన్ని ఎలాగైనా సరే హింసా మార్గానికి మళ్ళించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక రెండోది ప్రజలను సమ్మెకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఉద్యమాన్ని నీరు గార్చడం. అందుకు నిరంతరం అందుబాటులో ఉండే కొందరిని ముఖ్యమంత్రి వాడుకోవాలని చూస్తున్నారు. సంగాడ్డి పట్టణంలో సమ్మెకు వ్యతిరేకంగా ర్యాలీలు జరిగినా, హైదరాబాద్లో స్కూళ్ళు తెరవాలని కొందరు కూనిరాగాలు తీసినా అది కుట్రలో భాగంగానే అర్థం చేసుకోవాలి. సమ్మె నిరంతరం కొనసాగాలని ఎవరూ కోరుకోరు. అలాగే తెలంగాణ పిల్లలు చదువులకు దూరం కావాలనో, ఉద్యోగులు పస్తులుండాలనో ఎవరూ అనుకోవడం లేదు. ఎప్పుడైనా సమస్యకు పరిష్కారం కనుగొనడానికే ఎవరైనా పోరాటంలోకి దిగుతారు తప్ప పూట పూటకు రాజీ పడిపోవడానికి కాదుగదా!? అయినా సరే ఉద్యమం ప్రశ్నలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఇంకా అనిశ్చితి కొనసాగిస్తే ఏం చేయాలో కూడా ఆలోచించాలి.

ఇవాళ సమ్మెను ప్రశ్నిస్తున్నవాళ్ళు, నష్టం జరుగుతోందని గుండెలు బాదుకుంటున్నవాళ్ళు ఎందుకని సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదు? ఎందుకని తమ తమ మార్గాలు, పద్ధతుల్లో ప్రయత్నించడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వాళ్ళు ప్రజలను విడదీసి ఎంత కాలం నిలబడగలరో కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటిదాకా తెలంగాణ సమాజం కలిసి కట్టుగా ఉన్నది. అయితే ఇప్పుడొస్తోన్న సూచనలను గమనిస్తే రాను రాను మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురు కావొచ్చు. తెలంగాణ సమాజంనుంచే కొందరు కుట్ర దారులను ప్రభుత్వమే ప్రోత్సహించవచ్చు. అటువంటి కుట్రలను భగ్నం చేయాలంటే ప్రజలను ప్రత్యక్ష కార్యాచరణలోకి దించాలి. సకల జనుల సమ్మె ఇప్పటిదాకా తెలంగాణ సమాజం అవలంబించిన శాంతియుత పోరాట సత్యాక్షిగహ మార్గాల్లో ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. రైల్ రోకోకు, జైల్ భరో లాంటివి జోడిస్తే ఫలితం ఉండవచ్చు. వాటి గురించి ఉద్యమకారులు ఆలోచించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి