శుక్రవారం, నవంబర్ 18, 2011

పెనం వేడయ్యేదాకా వంట ’చెరుకు’ ను కాపాడాలి..!!



దాదాపు ఆరు నెలల క్రితంటీ న్యూస్ఛానల్ లో ఉద్యమ తీరు తెన్నుల మీద ఒక చర్చ జరిగింది. నాతోపాటు చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి ఫైర్ బ్రాండ్లలో ఒకరైన దాసోజు శ్రావణ్ ఉన్నారు. అది ఉద్యోగులు సహా నిరాకరణ చేస్తోన్న సందర్భం. సహాయ నిరాకరణ పట్ల రాజకీయ నాయకులు అంటీముట్టనట్టు ఉంటున్నారని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమి తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మల్లగుల్లాలు పడుతోందని నేనన్నాను. నా విమర్శను తిప్పికొడుతూ శ్రావణ్ ఇంకాతవా గరం కాలేదనిఅన్నాడు. ఆంటే పెనం వేడికాలేదని అర్ధం. రొట్టెలు వేయాలంటే పెనం వేడెక్కాలని, వేడి పెంచడం కోసమే సహాయ నిరాకరణ అని ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు గుర్తు.

తెలంగాణ కొలిమి రెండేళ్లుగా నిరంతరాయంగా మండుతూనే ఉంది. నిరాహార దీక్షతో కేసీఆర్ రాజేసిన మంట ఆరిపోకుండా ఉండడానికి ఇప్పటికి ఏడువందలకు పైగా యువకులు సమిధలై పోయారు. ఉద్యమం ఆరిపోతుందేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు ఒక్కరేమిటి తెలంగాణ పౌర సమాజమంతా ఒక్కటై ఊపిరూదుతూ వస్తోన్నారు.

ఇక సకల జనుల సమ్మె మంటను దావానలం చేసింది. తెలంగాణ అంతా మన ఉద్యోగులు, కార్మికుల పుణ్యమా అని నలభై మూడు రోజులపాటు అగ్గిమండింది. మంట లో రొట్టెలే కాదు గుట్టలైనా కాల్చిపారేయవచ్చని అనుకున్నాం. కానీ అందరి అంచనాలు, ఆకాంక్షలు తలకిందులయ్యే రీతిలో మంట మీద కొందరు నీళ్ళు చల్లారు. మంటకు భయపడి తెలంగాణ వ్యతిరేకులంతా రాజీనామాలు చేసేసి సంక్షోభం సృష్టిస్తే ఢిల్లీ దయ్యాలు దిగి వస్తాయనీ అనుకున్నాం. కానీ ఇదేదీ జరగలేదు. ఒకరిద్దరు పార్టీలు మారడం మినహా వారి వైఖరిలో మార్పూ రాలేదు. విచివూతంగా వేడి పుట్టించాల్సిన మంట ఇప్పుడు తెలంగాణ ఎంపీలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చలికాచుకోవడానికి పనికొస్తోంది. అలాగే వెచ్చదనం కొందరికి పాదయావూతలకు ఉపయోగపడుతోంది. ఇంకొంత మంది మంట ఎలాగూ ఆరిపోతోంది కాబట్టి బొగ్గులను అమ్ముకుని పబ్బం గడపాలని చూస్తున్నారు.

ఇవన్నీ మన ప్రధాన మంత్రికి బాగా తెలుసు.అందుకే మంట ఉన్నప్పుడు ఒక్క మాటకూడా మాట్లాడని ఆయన ఇప్పుడు మళ్ళీ పెనం ప్రస్తావన తెచ్చారు. మంటల్లో ఎవరు మాడి పోయినా ఫరవాలేదు గానీ పెనం మీది రొట్టెలు ఎవరికి దక్కాలో ఆయన ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆయనపెనం లోంచి పొయ్యి లో పడలేము కదా!’ అంటున్నారు. అయినా తెలంగా మౌనంగానే ఉంది. అదే మంటలో ఒకరోజు ప్రధా ని బొమ్మల్ని కాల్చేసి నిరసన తెలిపిందే తప్ప వారికి ఇబ్బంది కలిగించే పనీ చేయలేదు

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే టీ న్యూస్ ఛానల్లో గత వారం జరిగిన చర్చ సందర్భంగా గౌస్ అనే ఒక సాధారణ పౌరుడు ఫోన్ చేసి ఆవేదనతో ఆరునెలల క్రితం దాసోజు శ్రావణ్ ప్రస్తావించిన పెనం సంగతి గుర్తు చేశాడు. టెలివిజన్ ఛానళ్ళు, చర్చలు తెలంగాణ ప్రజలకు చాలా విషయాలు అర్థం చేయిస్తున్నాయి. ము ఖ్యంగా టీ న్యూస్ తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుత భూమికను పోషిస్తోంది. టీ న్యూస్ చర్చలను చాలా మంది తెలంగాణ పల్లెల్లో చూడడమే కాదు ఫాలో అవుతున్నారు. ఛానల్ కు ఫోన్ చేసి కొన్ని వందల మంది చర్చలో పాల్గొంటున్నారు. ఎలా అడగాలో తెలియక పోయినా వారి ప్రశ్నల్లో భావాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు. గౌస్ అడిగింది కూడా అదే. ‘ఆరు నెలల క్రితం పెనం ఇంకా వేడికాలేదు అన్నారు. మరి ఇంకా వేడెక్కలేదా’? అని
నిజమే ఆకలి దహిస్తున్నప్పుడు ఎవరైనా పెనం వైపే చూస్తారు. పెనం వేడెక్కితే దశాబ్దాలుగా ఎదు రు చూస్తోన్న రొట్టెముక్క నేడో రేపో దొరుకుతుందన్న ఆశతో తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందుకోసం తమ విలువైన సమయాన్ని,జీతాలను, జీవితాలను వంట చెరుకుగా చేసి మంటను రగిలిస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు, నాయకులు మాత్రం మంటతో చుట్టలు వెలిగిం చు కుంటున్నారు. కిక్కు 2014 దాకా కొనసాగాలన్న కోరిక వాళ్ళది.

ఎందుకోగానీ తెలంగాణ ఉద్యమంలో నిస్సత్తువ కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఉద్యమ నాయకులు చాలా సహన పరులైపోయారు. ఎంత సహనం ఆంటే రాజ్యం ఏలుతున్న వాళ్ళు ఉద్యమ మూలాలను నరికేస్తున్నా చలించడం లేదు. స్పందించడం లేదు. నల్లగొండ జిల్లా నకిరేకల్లుకు చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్ సంగతే తీసుకోండి. ఆయన ప్రజల్లో పేరు ప్రతిష్ఠలున్న పెద్దమనిషి. ఆంతే కాదు టీఆర్ఎస్లో పెద్ద నాయకుడు. పార్టీ రాజకీయ వ్యవహారాలు నిర్ణయించే పొలిట్ బ్యూరోలో సభ్యుడు. ఆయనను పోలీసులు అరె స్టు చేసి రెండు వారాలుగా నానా తిప్పలు పెడుతున్నారు. మొదట నేరాలే వృత్తిగా పెట్టుకుని అలజడులు సృష్టించే సంఘ విద్రోహక శక్తులమీద పెట్టె పీడీ యాక్టు పెడుతున్నట్టు చెప్పారు. వెంటనే ఆయనను దేశవూదోహుల మీద, దేశ భద్రతకు ముప్పుగా మారిన వాళ్ళమీద పెట్టెనాసాఅనే చట్టం పెట్టిబెయిలుకు కూడా నోచుకోకుండా వరంగల్ సెంట్రల్ జైలులో తోసేశారు. చెరుకు సుధాకర్ జన మెరిగిన డాక్టర్. వెనుక బడిన కులాల నుంచి ఎదిగిన చెరుకు సుధాకర్కు తెలంగాణ పట్ల, తెలంగాణ పీడిత వర్గాల పట్ల లోతైన అవగాహన ఉంది. తెలంగాణ పీడిత వర్గాల విముక్తి తెలంగాణ విముక్తితోనే సాధ్యమన్న స్పష్ట్టతా ఉంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచీ టీఆర్ఎస్ లో ఉన్నాడు. అంచెలంచెలుగా పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. సకల జనుల సమ్మె లో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నప్పుడు నల్లగొండ జిల్లా జాతీయ రహదారి మీద విజయవాడ, హైదరాబాద్ మధ్య నడుస్తోన్న ప్రయివేటు బస్సులను ప్రజలు అడ్డుకున్నారు. కొన్ని బస్సుల అద్దాలు పగులగొట్టారు. అయితే ఒక్కరికి గాయాలు గానీ, హానీ గానీ జరుగలేదు. నిజానికి సర్కారుకు సకల జనుల సెగ తగిలింది ఆరోజే. అప్పటిదాకా మౌ నంగా ఉన్న ప్రభుత్వం మొదటిసారిగా మాట్లాడింది. అన్నిటికీ బాధ్యుడిగా డాక్టర్ చెరుకు సుధాకర్ ను అరెస్టు చేశారు.

అక్కడి వరకు ఫరవాలేదు. అతనలా చేసి ఉంటే కోర్టు విచారించి అతనికి తగిన శిక్ష వేయవచ్చు. కానీ అక్కడే అసలు కుట్ర మొదలయ్యింది. అరెస్ట్ చేసిన కొన్ని రోజులకు పోలీసులకు శ్రీ కృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్ గుర్తొచ్చింది. ఉద్యమానికి పునాదిగా ఉన్న ఇటువంటి వారిని ఊరికే వదలకూడదనుకున్నారేమో వెంటనే ఆయన పై నిందారోపణలు మొదలు పెట్టారు. అతన్నొక హింసోన్మాది అని, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొట్టాడని పోలీసులు నేరారోపణ చేశారు. వార్తలు చదివినప్పుడు నేను పాపం ఊరికే పోదు అనుకున్నాను. ఇప్పటికే మండిపోతోన్న ఉద్యమకారుల మీద తప్పుడు కేసులుపెట్టడం కొరివితో తలగోక్కోవడమే అనుకున్నాను. నల్లగొండ జిల్లా భగ్గుమంటుందనీ అనుకున్నాను. కానీ అదేమీ జరుగలేదు.

కనీసం ఒక్క రోజు బందో, రాస్తారోకోనో కూడా జరుగలేదు. అందరూ కలిసి పనిచేసిన ఉద్యమంలో అరెస్టయిన ఒక ప్రధాన పార్టీ నేత అరెస్టు పట్ల జేఏసీ కూడా పెద్దగా స్పందించలేదు. అలాంటి అరెస్టుల పైన, నల ్లచట్టాలు ఉపయోగించడం పైన తమ కార్యాచరణ ఏమిటో కోదండరాం ప్రకటించలేదు. మరుసటి రోజే అక్కడికి వెళ్ళిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ మాట వరసకైనా సంఘటనను తన ప్రసంగంలో ప్రస్తావించ లేదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే టీఆర్ఎస్,కేసీఆర్ కూడా సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ తనకు అత్యంత ఆత్మీయుడైన తన సహచరుడు అరెస్ట్ అయి, జైలులో ఉంటే స్పందించకుండా ఉంటాడని నేననుకోను. కానీ పార్టీ వ్యవహారశైలి వల్ల బహుశా కొందరికి అటువంటి భావన కలుగవచ్చు. ఒక ఉద్యమం మీద ప్రభుత్వం ఉక్కు పా దం మోపినప్పుడు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నప్పుడు, నల్ల చట్టాల ను ప్రయోగిస్తున్నప్పుడు కేవలం బెయిల్ కోసం ప్రయత్నించడం, జైలు నుంచి ఆస్పవూతికో ఇంటికో తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాదు కదా రాజకీయ పార్టీలు చేయాల్సింది. కచ్ఛితంగా చర్యలను ఖండించి, అటువంటి చట్టాలను ఎదిరించే దిశగా పోరాటాన్ని మలచాల్సింది

మల్లీ ఇంకొకరి మీద అలాంటి నేరారోపణలు చేయకుండా ఇదొక రాజకీయ ఉద్యమమన్న స్ఫక్షుహ పాలకులకు కలిగించాల్సింది. అటువంటి ప్రయత్నమేదీ జరుగక పోవడం ఇప్పుడు టీఆర్ఎస్ మీద విమర్శలకు కారణం అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరసలో ఉన్న టీఆర్ఎస్ మీద చాలా మం ది దృష్టి ఉంది. ఇది సహజం. ఇందులో టీఆర్ఎస్ చేసే తప్పుల కోసం ఎదురుచూసే వాళ్ళు ఉన్నట్టే, టీఆర్ఎస్ తప్పులు చేయకూడదని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు.

ఇప్పుడు టీఆర్ఎస్ ఏది చేసినా ఏమీ చేయక పోయినా చర్యలను కులం కోణంలో చూసే దశ మొదలయ్యింది. ఇప్పుడున్న సామాజిక చైతన్యంలో అది సహజంగానే ప్రధాన అంశం. రైల్ రోకో సందర్భంగా బీసీ, ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీదే కేసులు పెట్టారని అన్నవాళ్లు ఉన్నారు. నాకు తెలిసి కవిత, కేటీఆర్ మీద కూడా కేసులు పెట్టారు. మొన్న మొన్నటి వరకు మంత్రి పదవిలో ఉన్న కోమటిడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుని ఒక కాంగ్రెస్ నాయకుడి గా ఆమరణ నిరాహార దీక్షకు దిగితే పార్టీ గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. కనీసం కాంగ్రెస్ తెలంగాణ ఫోరం కన్వీనర్గా ఉన్న జానాడ్డితో సహా జిల్లా శాసన సభ్యుపూవరూ ఆయన శిబిరం వైపు తొంగి చూడలేదు. అలాగే ఉద్యమ ఆవేశంలో డీఎస్పీ నళిని తన ఉద్యోగం వదులుకుంది. ఆమె నిరుపేద కుటుంబం నుంచి చ్చింది. గతంలో కేసీఆర్ నిరాహార దీక్ష సందర్భంగా ఉద్వేగానికి లోనై రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చింది. కేసీఆర్, హోంమంత్రి సబితా ఇంద్రాడ్డితో సహా అప్పుడు ఆమెను మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఒత్తిడి చేశారు. ‘మళ్ళీ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పోలీసు అధికారులు తనకు నరకం చూపిస్తున్నారని ఆమె పదే పదే వాపోయింది.

అవకాశం చిక్కినప్పుడల్లా ఇంద్రాడ్డిని గుర్తు చేసి తనూ తెలంగాణ ఆడబిడ్డనే అని చెప్పే హోం మం త్రికి కూడా మొరపెట్టుకుంది. ఉద్యమం కూడా ఆమెకు ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. చివరకు ఆమెను సస్పెండ్ చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేని స్థితి మన ఉద్యమానిది. పార్టీల్లో ఉన్నవాళ్ళే కాదు, బయట ఉండి ఉద్యమానికి బాసటగా నిలబడ్డ వాళ్ళు తెలంగాణ వాదులుగా ముందుకొచ్చిన అనేక మంది సామాన్యులు ఇవాళ పరిస్థితులు చూసి కలవర పడుతున్నారు. కొందరు పెద్దలు ఇది మంచి పరిణామం కాదని చెపుతున్నారు. అలా వేలెత్తి చూపేవాళ్లను తప్పు పట్టలేం. విమర్శల కో సం కాదు గానీ ఒక రాజకీయ పార్టీగా అందునా ఉద్యమ కీలక దశలో అంతటి ఉదాసీనత టీఆర్ఎస్ కు పనికి రాదని, అది ఒక్క టీఆర్ఎస్ కే కాదు, మొత్తంగా ఉద్యమానికే మంచిది కాదని నేను కూడా భావిస్తాను. చెరుకు సుధాకర్ ఒక్క డే కాదు అట్లా ఉద్యమానికి ముడి సరుకుగా మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఆత్మస్థయిర్యం నింపడానికి, మిగిలిన వారి ధైర్యం చెడకుండా ఉండడానికైనా నిర్బంధానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడాల్సింది.

ఇపుడు ఎవరైనా వేలెత్తి చూపుతున్నది కూడా ఉద్దేశ్యంతోనే. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకే రక్షణ లేని స్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నదనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాలేందుకు? నిర్బంధ పరిస్థితిని ఇప్పుడు ఎదిరించకపోతే, ప్రభుత్వం ఒక్కొక్కరిని ఏరి మరీ బోను లో బంధించే అవకాశం ఉంటుంది. అది మొత్తంగా ఉద్యమానికే ముప్పు అని గుర్తించాలి. సకల జనుల సమ్మె పోరుతో.. ఎంత నిప్పులు చేరిగినా పొయ్యి రొట్టె ముక్క చేతికందలేదు. కనీసం వంటచెరుకునైనా రేపటి కోసం కాపాడుకోకపోతే యెట్లా అన్నదే ఎవరి ఆవేధనైనా. విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత టీఆర్ఎస్ మీదే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ నాయకులు, వేదికలు, ప్రజా సంఘాలు, అన్ని జేఏసీ లు మారుతోన్న పరిణామాలను గమనించి అయినా పరస్పర నిందలు మానుకుని ఆత్మ విమర్శ చేసుకోగలిగితే ఉద్యమాన్ని కాపాడుకోగాలుగుతాం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి