శుక్రవారం, జనవరి 24, 2014
ఇదేనా రాజ్యంగా నిబద్ధత?!
సాధారణంగా మనుషుల్లో చాలామంది తమకు గత్యంతరంలేని స్థితిలో సమస్యను ఎదుర్కోలేని సందర్భంలో నిరాశ పడిపోతారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే అంతా తమ దురదృష్టమని వాపో-తుంటారు. సరిగ్గా ఆంధ్రలూపదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అగమ్యగోచరమైన ఈ దశలో ఆయన అంతా తన దుర దృష్ట-మని అనుకుంటున్నారు. అదే మాట ఆంధ్రలూపదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చ జరిగిన సందర్భంగా శాసనసభలోనే అనేశారు. ఆ మాట అన్నప్పుడు ఆయన నిజంగానే చిత్తుగా ఓడి పోయిన టీం కెప్టెన్గా కనిపించాడు. నిజానికి ఈ పరిస్థితి ఆయన స్వయంకృతం. ఆరునెలల క్రితం దాకా అందరూ వర్తమాన రాజకీయాల్లో కిరణ్ను మించిన అదృష్టవంతుడు ఇంకొకరు లేరనే అనుకున్నారు. ఆయన కూడా పదేపదే అదే చెప్పేవాడు. ముఖ్యమంత్రి కావడం తన అదృ-ష్టమని, సోనియాగాంధీ దయ అని ఆయన తరచూ చెపుతుండేవాడు. ఈసారి మాత్రం అమ్మ దయ అంటూనే ఆయన తన మాట మొదట్లోనే ఓటమిని ఒప్పుకున్నారు. తన ఓటమికి దురదృ-ష్టాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేశారు. కారణం ఏదైనప్పటికీ కిరణ్ తన ఓటమిని నిండు సభలో ఒప్పుకోవడం విశేషం.
గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆయన ఆడిన ఆటే అనైతికం. సాధారణంగా క్రీడాకారులు ఉదార విలువలతో ఉంటారని, నిబంధనలకు అనుగుణంగా నడచుకునే క్రమశిక్షణ కలిగి ఉంటారని అంటుంటారు. కానీ కిరణ్లో అది లోపించింది. ఒక్క క్రీడాస్ఫూర్తి మాత్రమే కాదు ఆయనలో ఒక ముఖ్యమంలూతికి ఉండాల్సిన రాజ్యాంగ
నిబద్ధత కూడా కొరవడింది. ఆయన బిల్లు సందర్భంగా వ్యవహరించిన తీరు సభా నాయకుడి హోదాకే కళంకం తెచ్చేదిగా ఉన్నది. సాధారణంగా ముఖ్యమంలూతిగా ఉన్న వ్యక్తి సభ లోపల అయినా వెలుపల అయినా మంత్రివర్గ సమష్టి నిర్ణయానికి నిబద్ధుడై నడుచుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ముఖ్యమంలూతికి సంపూర్ణమైన అధికారాలు ఇవ్వలేదు. ఆయన కేవలం సభా నాయకుడు. శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి అయినందున ఆయన సభానాయకుడుగా, ప్రభుత్వ అధినేతగా ఉండవచ్చు. ఆ మొత్తం సభకు ప్రతినిధిగా ఆయన రాజ్యాంగ విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ద్వారా ఈ విధులన్నీ అమలు చేస్తారు. సభా నాయకుడు సభ్యుల మనోభావాలకు భిన్నం గా ఉన్నా, మంత్రివర్గ సమష్టి నిర్ణ-యానికి విరుద్ధం గా వ్యవహరించినా ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిం చి పక్కకు తప్పించే అధి-కారం సభ్యులకు ఉన్నది. కిరణ్ ఇప్పుడు బొటాబొటీ మెజారిటీతో బతుకు వెళ్లదీస్తున్నాడు. ఆయనకున్న మెజారిటీలో దాదాపు యాభై మంది తెలంగాణ శాసనసభ్యులే ఉన్నారు. మంత్రివ-ర్గంలో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం ఉన్నది. అయితే ఇటు మంత్రివర్గంలో తెలంగాణ ప్రతిని-ధులను సంప్రదించకుండా, ఆయకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుపువరినీ సంప్రదించకుండా, ఆయనను ముఖ్యమంలూతిగా నియమించిన పార్టీ విధానానికి విరుద్ధంగాఆయన మాట్లాడవచ్చునా అన్నది ప్రశ్న. ఇదే ప్రశ్నను మంత్రి జానాడ్డి అడిగారు, కానీ ముఖ్యమంత్రి నుంచి జవాబు లేదు. ఎందుకంటే సహచర మంత్రుల విశ్వాసం లేకుండాతనను ఎన్నుకున్న వారిలో సగంమంది ప్రమేయం లేకుండా ఎవరైనా నాయకులుగా చెలామణి కావ డం చెల్లదని ఆయనకు తెలుసు. అదే సభలో వాళ్ళంతాలేచి నిలబడి ఈయనను మేం మా ప్రతినిధిగా అంగీకరించలేము అని చేతుపుత్తేస్తే ఆ వెంట నే ఆయన ఇంటికి వెళ్ళాల్సి వస్తుందనీ తెలుసు. రాజ్యాంగం కూడా అదే చెపుతున్నది. ఇదేదీ జరగకపోయినా మొత్తం చర్చంతా రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నదని భావిస్తే రాజ్యాంగ ధర్మంగా గవర్నర్ నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉన్నది. రాజ్యాంగం-లోని ఆర్టికల్ 163, 164
(1),356 ఇదే విషయం చెపుతున్నాయి. బహుశా కిరణ్ ప్రవర్తన ఇంకా ఇదే రీతిలో కొనసాగితే రాజ్యాంగంలోని నిబంధనల మేరకు రాష్ట్రపతి పాలన మినహా మరో మార్గం కనిపించడంలేదు.
అయినా సరే మంత్రి మండలి విశ్వాసం లేకపోయినా, (ఆంధ్ర ప్రాంతంలోని కొందరు సభ్యులు కూడా రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారు కాబట్టి) మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యంగా లేక-పోయినా ముఖ్యమంత్రి కిరణ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పోనీ ఆ ప్రసంగం అయినా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానో, రాష్ట్రపతి సూచించిన మేరకు ఉందా అంటే అదీ లేదు. కేంద్ర కేబినెట్ రూపొందించిన బిల్లును రాజ్యంగ నియమాల మేరకు రాష్ట్రపతి శాసనసభకు పంపించారు. ఆ బిల్లు పైన అందులోని అంశాలపైన సభ్యుల అభిలూపాయాలను తెలియజే యాల్సిందిగా ఆయన అందు లో కోరారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి బద్ధుడైతే హుందాగా చర్చను కొనసాగనివ్వాలి. కానీ ఆయన రెండువారాల పాటు చర్చే లేకుండా చేసి సభా వ్యవ హారాల శాఖ మంత్రినే మార్చివేశారు. సభ సజావుగా సాగే విధంగా చూడడం నాయకుడుగా ఆయ న బాధ్యత. కానీ ఆయన సభకు అడుగడుగునా ఆటంకాలు కల్పించే వారిని ఉసిగొల్పి కెప్టెన్గా ఉండాల్సిన మనిషి నెలరోజుల పాటు బుకీగా మారిపోయాడు. పనిలో పనిగా నియ-మాలకు విరుద్ధంగా అందరితో లిఖితపూర్వక అఫిడవిట్లు తీసుకున్నారు. చర్చ బిల్లు అంశాల మీద కాకుండాతీరిగ్గా చరిత్ర చర్చిస్తూ కాలయాపన చేస్తున్నారు. పైగా చరిత్ర నేర్చుకోండని సభ్యులకు హితబోధ చేస్తున్నారు. నిజానికి చరిత్ర చదువుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది నల్లారి వారే. నిజానికి ఇదంతా రాజనీతిజ్ఞులు చేయాల్సిన పనికాదు. చరిత్రలో రాష్ట్రాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మద్రాసు రాష్ట్ర ముఖ్య-మంత్రి రాజగోపాలచారి సభ చర్చ ను చేపట్టిన తరువాత విభజనను వ్యతిరేకిస్తున్న తమిళ సభ్యులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. బిల్లును వ్యతిరేకించేవాళ్లు ఎవరూ సభలో మాట్లాడ-వద్దని, ఎందుకు విడిపొవాలనుకుంటున్నారో తెలుగు సభ్యులు వివరిస్తారని వాళ్ళ మనోభా-వాలు, అభిలూపా యాలు సభ గౌరవించాలంటే వారిని అడ్డుకోకుండా సంయమనం పాటించాలని కోరారు. అలా గే చేశారు కూడా. అందుకే రాజాజీ రాజనీతిజ్ఞత గురించి అరవై ఏళ్ళ తరు-వాత కూడా చరిత్రలో చరిత్ర కారులు చెప్పుకుంటున్నారు. కానీ కిరణ్ అలా లేరు, అయినా చరితలో ఆయన గురించి కూడా చెప్పుకుంటారు. కానీ రాజాజీ మాదిరిగా రాజనీతిజ్ఞుడని మాత్రం కాదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు . రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి ...
-
'When a person really desires something, all the universe conspires to help that person to realize his dream. ఇదొక పాపులర్ రచయిత చెప్...