శనివారం, జూన్ 16, 2012

జయశంకర్ స్పూర్తిని మరిచిపోయామా!?




  శంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరి గౌరీ శంకర్ 'తెలంగాణా జాతిపిత సర్ జయశంకర్' పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడు వందల పేజీలకు పైగా ఉన్న పుస్తకంలో దాదాపుగా డెబ్బై మంది రాసిన వ్యాసాలున్నాయి. వివిధ విశ్వవిద్యాయాలలో జయశంకర్ గారి  శిష్యులు, సహాధ్యాయులు, సహచరులు మొదలు తెలంగాణా కోసం క్షేత్ర స్థాయిలో తెలంగాణా సాధనే ఊపిరిగా పనిచేస్తోన్న సామాన్య  కార్యకర్తల దాకా అందులో ఆచార్య జయశంకర్ గారి  గురించి రాసిన వ్యాసాలూ, వ్యాఖ్యలు ఉన్నాయినాకు తెలిసినంత వరకు ఒక మనిషి మరణం తరువాత అంతటి స్పందన ఇటీవలి చరిత్రలో ఇంకెవరికీ రాలేదు. తెలంగాణలో రాయగలిగే అలవాటు ఉన్న ప్రతిఒక్కరూ   తమ వేదనను వ్యాసాల రూపంలో వివిధ పత్రికల్లో ఆవిష్కరించారు. వాటిల్లో జయశంకర్ గారి  వ్యక్తిత్వం, జీవితం, పోరాటం, ఆరాటం ఇలా జయశంకర్ జీవితంలో ఎన్ని చాయలున్నాయో పుస్తకంలో అన్ని రంగులున్నాయి
  వ్యాసాలన్నిటినీ ఒక్కచోట పేర్చి అచ్చువేసిన గౌరీశంకర్ నెలరోజుల్లోనే   పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. పుస్తకానికి 'మరువరాని మనిషి' అనే టాగ్ లైన్ ను కూడా చేర్చారు. కానీ ఆయన చనిపోయిన ఏడాది తరువాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన క్రమక్రమంగా కనుమరుగావుతున్నట్టే అనిపిస్తోంది. ఆయనను ఇప్పుడు చాలామంది మరిచిపోయారుఇలా ఆంటే ఆయన విగ్రహాలు ప్రతిష్టించిన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నేను  అంటున్నది ఆయన మూర్తిని గురించి కాదు, మరిచిపోయిన ఆయన స్పూర్తిని గురించి.!


 జయశంకర్ గారు లేని  ఏడాది కాలంలో తెలంగాణా ఉద్యమం ఏం సాధించిందో చూసుకుంటే కథ మూడేళ్ళు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తోంది.  పరకాల ఎన్నికలు, ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన తెలంగాణా వాదంలోని వైరుధ్యాలు ఇప్పుడు సగటు తెలంగాణా వాదిని కలవరపెట్టేవిలాగే కనిపిస్తున్నాయి. జయశంకర్ ఆశించిన ఐక్యత, పోరాట స్ఫూర్తి రాజకీయ ఏకాభిప్రాయ సాధన పూర్తిగా కొరవడి పోవడమే కాకుండా ఇప్పుడంతా ఆయన స్పూర్తికి భిన్నంగా కనిపిస్తోంది. దీనికి తెలంగాణా వాదుల్లో ఒక్కరినో తప్పుపట్టలేం, సాధారణంగా అవకాశవాద రాజకీయాల తీరే అది. అందులోనే ఇప్పుడు తెలంగాణా వాదం చిక్కుబడి పోయింది

ఒక సంక్షోభాన్ని ప్రజలు మరిచిపోవడానికి మరో సంక్షోభాన్ని సృష్టించడమే సరి అయిన పరిష్కారం అన్నది పాతకాలపు రాజనీతి ఎత్తుగడ.  కొత్తగా ఇది అవకాశవాద రాజకీయాలకు బాగా ఉపయోగపడుతోంది. తెలంగాణా విషయంలో అవకాశవాదమే తమ  విధానంగా అనుసరిస్తోన్న రాజకీయ వర్గాలన్నీ ఇప్పుడు ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. దానంతట అదే వచ్చిందో, కావాలనే తెచ్చారో కానీ జగన్ రాష్ట్రంలో సృష్టించిన సంక్షోభం ఇప్పుడు తెలంగాణా వాదాన్ని తెరమరుగు చేసేసింది. దాదాపు మూడేళ్ళుగా ప్రజల  జీవన్మరణ సమస్యగా కనిపించిన తెలంగాణా ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా పోయింది. ఉన్నట్టుండి    జగన్  వ్యక్తిగత సమస్య  ఇప్పుడు తెలుగు ప్రజలసమస్యగా మారిపోయింది. గత రెండునెలలుగా ఉపఎన్నికల్లో జగన్ గెలుస్తాడా లేదా ఆన్న బాధ చాలామందినే వేధించిందిఉపఎన్నికల్లో జగన్ ఆన్నీ గెలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమౌతుంది, కొన్నే గెలిస్తే రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు ఊహించని విధంగా ఓటమి పాలయితే ఆయన, ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది లాంటి అనేక ప్రశ్హ్నలు ప్రజలకు ప్రధానం అయిపోయాయి.  సి బీ కంటే వేగంగా విచారణ జరుపుతూ , కోర్టులకంటే ఎక్కువ సాధికారంగా తీర్పులు చెపుతున్న ప్రసార సాధనాలు ఒకవైపునేర విచారణ వ్యవస్థలురాజ్యాంగ శాసనాలు, ధర్మాసనాలు అన్నీ బూటకమని జగనే సత్యం, అతనే సర్వం అని వాదిస్తోన్న మీడియా మరోవైపు రాష్ట్రంలో ఇంకే సమస్యని కూడా తెరమీదికి రాకుండా చేసాయిఅందులో తెలంగాణా కూడా ఒకటి.  జగన్ కోసం పదిహేడు నియోజక వర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల వల్ల ఎవరికీ లాభమో తెలియదు కానీ తెలంగాణా ఉద్యమానికి మాత్రం అది తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణా నినాదం కేవలం ఒక్క పరకాల కు పరిమితమై పోయింది.   ఉప ఎన్నికల్లో బహుశా మొట్టమొదటి సారిగా టీ ఆర్ ఎస్ తన సొంత బలంతో పోటీ చేసింది.  ఇది ఖచ్చితంగా పోటీలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితికే కాదు, మొత్తం తెలంగాణా ఉద్యమానికొక పరీక్ష


ఎప్పుడైనా పరీక్షలు అయిపోయాకే చేసిన తప్పులేమితో తెలిసోస్తాయి. రాజకీయాల్లో కూడా ఎన్నికలు అయిపోయాకే జరిగిన లోపాలేమితో తెలుస్తాయిఇప్పటివరకు తెలంగాణా వాదానికి తిరుగులేని చిరునామాగా ఉన్న టీ ఆర్ ఎస్ గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల కోసం కష్ట పడాల్సి వచ్చిందికేవలం టీ ఆర్ ఎస్ ను ఓడించడం కోసమే ఎన్నికల్లో ఇంతమంది పోటీ పడుతున్నారని పార్టీ అంటోంది. అది నిజమే కావొచ్చు, కానీ దానికి కారణాలు  వెతకాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద ఉన్నది. మొదట ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తులతో పోటీ చేసిన టీ ఆర్ ఎస్ 2009 తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఒంటరిగా పోటీ చేసి సునాయాస విజయాలు నమోదు చేసుకుంది. ఉద్యమం ఉవ్వెత్తున లేచిన కాలంలో జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసుకుంది. విజయాలన్నీ కేవలం పార్టీ సొంతం అనుకోవడానికి వీలులేదు. దాని వెనుక ప్రొ. జయశంకర్ అందించిన ఐక్యకార్యాచరణ ఉన్నది. దానికి ప్రతిరూపమైన జే, సి,  జే సి కి తోడుగా తెలంగాణా పౌర సమాజం కూడా ఉందన్నది వాస్తవం తెలంగాణా సాధనకోసం కే సి ఆర్ చేసిన నిరాహార దీక్ష, తదనంతర పరిణామాలు పార్టీని ప్రజలకు చేరువ చేసాయి. ఒక సాధారణ రాజకీయ పార్టీగా దాదాపు దశాబ్ద కాలం ఎన్నికల రాజకీయాలకు మాత్రమే పరిమితమైన టీ ఆర్ ఎస్ 2009  ఒక ఉద్యమ పార్టీగా అవతరించింది. తెలంగాణా పల్లెల నుంచి ఢిల్లీ దాకా తెలంగాణా ఆంటే కేరాఫ్ టీ ఆర్ ఎస్ అన్నంతగా పార్టీ ఎదిగింది. దానివెనుక ప్రొ. జయశంకర్ కృషి, శ్రమ, ఆలొచనా ఉన్నాయన్న వాస్తవాన్ని కే సి ఆర్ కూడా కాదనలేడు


అంత బలంగా ఎదిగిన పార్టీ ఇప్పుడు ఒక్క పరకాల సీటు కోసం చెమటోడ్చ వలసి రావడం వెనుక ఇతర పార్టీల ఎత్తుగడలతో పాటు పార్టీ వ్యూహాత్మక తప్పిదాలూ ఉన్నాయి. తెలంగాణా ఉద్యమాన్ని ఏకధాటిగా నడిపించకుండా ఢిల్లీ పెద్దల హామీలను నమ్ముతూ పోవడం వల్ల ఇప్పుడు పరిస్థితి వచ్చింది. కే సి ఆర్ నిరాహార దీక్ష విరమణ తరువాత, దీక్ష విరమించినా పోరాట మార్గం వదిలేది లేదని కరాఖండిగా చెప్పి ఉంటే  పరిస్థితి వేరుగా ఉండేది. తరువాత కూడా రాజకీయ ఒత్తిడి పెంచే అవకాశాలు అనేక సందర్భాల్లో వచ్చాయి. పార్టీ  పిలిచినప్పుడల్లా ప్రజలు స్పందిస్తూ వచ్చారు. సహాయ  నిరాకరణ, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి వాటికి ముందుకు వచ్చారు. ఒత్తిడి పెంచారు. కేంద్రం లో అధికారం లో ఉన్న వాళ్ళ హామీలు, మాటలు పదే పదే నమ్మి టీ ఆర్ ఎస్, జే సి లతో పాటు తెలంగాణా ప్రజలు మోసపోతూ వచ్చారు.  చిట్ట చివరగా ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల  ఎన్నికల  తరువాత ఏదో జరుగాబోతుందన్న  నమ్మకాన్ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఐదు రాష్ట్రాల సమస్యకూడా తెలంగాణా సమస్యే అన్నంతగా ఉద్యమం ఎదురు చూపులకే పరిమితమయ్యింది.  తెలంగాణా రాష్ట్ర ప్రకటనకోసం ఎదురు చూస్తున్న వారికి ఉపఎన్నికల ప్రకటన తెచ్చి దాన్ని కూడా  పార్టీ తెలంగాణా వాదాన్ని కనుమరుగుచేసేందుకే వాడుకుంటోంది. జగన్ కేసులను తిరగదోడి ఆంధ్రా రాజకీయాలను అయోమయంలో పడేసిన కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల జయాపజయాలను బట్టి రాష్ట్రంలో కొత్త రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం  చేస్తోంది


అందుకు లగడపాటి రాజగోపాల్ తాజా వ్యాఖ్యలే అద్దం  పడుతున్నాయి. ఎన్నికల్లో సీమాంధ్ర జిల్లాల్లో కలియ తిరిగిన ఆయన   ఏకంగా తెలంగాణ ఇవ్వకూడదని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు.  ఆంధ్రాలో గెలిస్తే రాష్ట్రాన్ని విడిపోనివ్వమని, తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి తెలంగాణాకు వ్యతిరేకంగా ఆగస్టు లోగా ప్రకటన చేయిస్తానని అంటున్నాడు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి కూడా తెలంగాణా ఏర్పాటుకంటే అభివృద్దే ముఖ్యమని పరకాల వచ్చి మరీ చెప్పివెళ్ళాడు. అంతటితో ఆగకుండా 2014 దాకా తానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినని కూడా చెపుతున్నాడు. తెలంగాణలో ఉపఎన్నికల్లో కనిపించని గులాం నాభి ఆజాద్ దగ్గరుండి మరీ మాటలు చెప్పించాడు.  లగడపాటిని చాలామంది తెలంగాణా వాదులు రాజకీయ బఫూన్ గా కొట్టిపారేయవచ్చు. ముఖ్యంగా తెలంగాణఉద్యమకారులు ఆయనను చూసి నవ్వుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో బఫూన్ లే కథను మలుపు తిప్పుతారు. కొన్ని కథల్లో బఫూన్ లే హీరో లుగా మారిపోతారు కూడా. 2009 లో చూసాం. లాగడ పాటి రాజగోపాల్ తన నవ్వు తెప్పించే వెగటు చేష్టలతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఒంటిచేతితో అడ్డుకున్నాడు. రాష్ట్రాన్ని సమైఖ్యం గా ఉంచిన  వాడిగా ఆయనకు ఇటు ఆంధ్రాలో, అటు అధిష్టానం దగ్గరా పలుకుబడి ఉంది. ఆయన తనకున్న అర్థబలంతో  తిమ్మిని బమ్మి చేయగల సమర్థుదన్న పేరుకూడా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల  ప్రచార రంగంలోకి దింపింది. లగడపాటి మాటలకు ఆంధ్రా ప్రజలు ఎలా స్పందిస్తారో తెలియదు గానీ తెలంగాణా వాదులు మాత్రం ఎవ్వరూ ఇప్పటి దాకా దీనిపై గట్టిగా స్పందించలేదు. ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్రం కాదు అభివృద్ధి ముఖ్యమని అన్నప్పుడు వరంగల్ మంత్రులు, ఎం ఎల్ లు మరీ ముఖ్యంగా వీర తెలంగాణా వాదులమని చెప్పుకునే ఎంపీ లు కొందరు ఆయన వెంట ఉన్నారు. ఒక్కరు కూడా మాకు తెలంగాణా మాత్రమే ముఖ్యమని అనలేదు. వారినలా వదిలేద్దాం,  తామే నిఖార్సయిన తెలంగాణా వాదులమని పరకాల బరిలో బీరాలు పలుకుతున్న భారతీయ జనతా పార్టీ కూడా పెదవి విప్పలేదు. తెలంగాణా పేరు చెప్పుకుని చంద్రబాబు నాయుడు దగ్గర పరపతి పెంచుకుంటున్న ఎర్రబాల్లి దయాకర్ రావ్ ఒక ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి మాటలను తప్పు పట్టలేదు. ఒక్క రాజకీయ నాయకులే కాదు, ప్రజాసంఘాలు, ఉద్యమ సంస్థలు, వీర, శూరా తెలంగాణా ఉద్యమ కారులు ఎవ్వరూ అసలు మాటలేవీ విననట్టే ఉంటున్నారు. ఎందుకంటే అదంతా టీ ఆర్ ఎస్ తలనొప్పి తప్ప తమ కడుపునొప్పి కాదనుకున్నారు. అది గుర్తించి టీ ఆర్ ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ముఖ్యమంతికి గట్టిగానే సమాధానం చెప్పారు. కానీ మిగిలిన అందరూ సైలెంట్ అయి పోయారు.    మాటలకు తెలంగాణా వాదులు స్పందిస్తే ఖచ్చితంగా అది తెలంగాణా వాదాన్ని చిక్కబరిచేది, తెలంగాణా ప్రజలను ఒక్కటి చేసేది, తెలంగాణా వాదం రూపంలో బలపడ్డా ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ కే లాభం కాబట్టి అన్నిపార్టీలు మాటలేవీ తమకు వినబడనట్టే ఉన్నాయి.





రాజకీయ పార్టీల గారడీ అయోమయంలో పడవేస్తుందన్న సత్యం జయశంకర్ సార్ కు తెలుసు అందుకే ఆయన ఉద్యమానికి ఒక కార్యాచరణ ఉండాలన్నాడు. కార్యాచరణను అన్ని సామాజిక, పౌర శ్రేణులను ఒక్క ఐక్యం చేయడానికి దోహద పడాలని ఆశించాడు. అది ఆయన బతికి ఉన్నప్పుడే జరిగింది. కానీ పోరాటం సుధీర్గమై ఆతుపోట్లలో తెలిపోతున్నప్పుడు ఐక్య కార్యాచరణ నిలబడలేకపోతోంది. నిజానికి జయశంకర్ తన జీవితంలో ఐక్య కార్యాచరణ ప్రయత్నాలను అనేక సందర్భాలలో చేసారు. అవన్నే విఫలమయ్యాకే తాను  ఒక రాజకీయ శక్తి అవసరమని భావించానని తన కల కు దగ్గరగా ఉన్న ప్రతిరూపం టీ ఆర్ ఎస్ అని కూడా ఆయన ఒక సందర్భంలో అన్నారు. టీ ఆర్ ఎస్ ను వేదికగా చేసుకుని ఢిల్లీ లో రాజకీయ పార్టీల ఇల్లిల్లూ తిరిగి తెలంగాణా సమస్య వివరించి వారిలో సానుకూలత కు ప్రయత్నించారు.  ఆయన కృషి వల్లే జాతీయ పార్టీల వైఖరులు మారి ప్రనభ్  ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు లేఖలను ఇచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీలన్నీ ఎవరి దారి వారివే అంటున్నాయి.  

రాజకీయ పార్టీల వేరు వేరు దారులు రాజకీయ జే సి ని కూడా అయోమయంలో పడేశాయి.   జే సి లో భాగస్వాములుగా ఉన్న బీ జే పీ- టీ ఆర్ ఎస్ రెండూ పరకాల స్థానానికి పోటీ పడడంతో సహజంగానే జే సి సందిగ్ధంలో పడింది.  ఉద్యమ లక్ష్యం తో పనిచేయాల్సిన పార్టీలు స్వార్థ ప్రయోజనాలకోసం ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రధానంగా బీ జే పీకి పార్టీ అధినేత కిషన్ రెడ్డికి ఇప్పుడు 2014 మాత్రమే కనిపిస్తోందిదీనికి మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లోనే భీజం పడింది. ఉద్యమంలో పెద్దరికం కలిగిఉన్న టీ ఆర్ ఎస్ బీ జే పీ ని లెక్కచేయడం లేదని అందుకే జే సి లో చీలిక వచ్చిందని కొందరు వాదిస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది జే సి లో మూడో ముసలం. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జే సి వదిలి వేరు వేరు సందర్భాల్లో వెళ్ళిపోయాయి. అది జే సి కి గానీ, టీ ఆర్ ఎస్ కు గానీ ఏమాత్రం నష్టం కలిగించలేదు సరికదా మరింత బలోపేతం చేసాయి. టీ ఆర్ ఎస్, జే సి మాత్రమే తెలంగాణా ఉద్యమ ప్రతినిధులు, మిగితా వాళ్ళు ద్రోహులన్నంతగా ప్రచారం జరిగి పార్టీలకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని స్థితి వచ్చింది. బహుశ బీ జే పీ కూడా జాబితాలో చేర్చాలని టీ ఆర్ ఎస్ భావిస్తుంద వచ్చు

జే సి లో మిగిలిఉన్న పార్టీలలో టీ ఆర్ ఎస్, భారతీయ జనతా పార్టీ రెండూ ఎన్నికలే ఎజెండాగా పనిచేస్తున్నాయని  మొన్న మహబూబ్ నగర్ లో, ఇప్పుడు పరకాలలో రుజువయ్యింది. రాజకీయ పార్టీలుగా అది వారి హక్కు, దాన్ని అడ్డుకోలేము. కానీ ఆదిపత్యపోరులో జే సి అస్థిత్వాన్నే మిగలకుండా చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఒక దశలో జే సి నాయకత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరిగాయి. టీ ఆర్ ఎస్ తమ మాట వినని కోదండ రాం ను తొలగించి, అనుకూలంగా తలాడించే వ్యక్తికి జే సి పగ్గాలు ఇవ్వాలని చూసిందని,   ప్రయత్నాన్ని జే సి శ్రేణులు వ్యూహాత్మకంగా అడ్డుకోగాలిగాయని వార్తలొచ్చాయి. ఇవి సహజంగానే జే సి-టీ ఆర్ ఎస్ మధ్య అఘాదాన్ని సృష్టించాయి. చివరకు జే సి పరకాలలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. శాస్త్రీయ అధ్యయనం అనే మెలిక పెట్టి జే సి మొత్తానికి సంక్షోభం నుంచి బయటపడగలిగింది. కానీ బీ జే పీ దాడులను తిప్పికోట్టలేక పోయిందిబీ జే పీ ఎన్నికల్లో గెలువడానికి ఉద్యమం అంతో ఇంతో సాధించిన కులమత సమైఖ్యతను కూడా దెబ్బ  తీయగలదని అది కుదరనప్పుడు, తెలంగాణా వాదులను రాళ్ళతో తరిమికొట్టి మరీ ఓట్లు వేసుకోగలదని రుజువయ్యింది. మహబూబ్ నగర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణా-లాల్-కిషన్ రెడ్డి చూపించిన  నరేంద్ర మోడీ అవతారాన్ని మరిచిపోకముందే శాసన సభలో బీ జే పీ నాయకుడుగా ఉన్న లక్ష్మినారాయణ   పరకాలలో బాల్ థాకరే భాషతో ప్రత్యక్షమయ్యారు. ఆయనకు  ఆవేశం ఎందుకు ఆవహించిందో గానీ తెలంగాణా ఉద్యమానికి  గుండె కాయలా  పనిచేస్తోన్న ప్రొ. కోదండ  రామ్  ను మానుకోట రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చాడు. తనమీద వచ్చే విమర్శకూ  స్పందించని   ప్రొ. కోదండ రామ్ కు బీ జే పీ వేస్తోన్న రాళ్ళు కూడా తగిలినట్టు లేవు కానీ చాలా మంది తెలంగాణా ఉద్యమ కారులను అవి గాయపరిచాయి. కరీంనగర్ తో సహా చాలా చోట్ల కాషాయ దళాలు కోదండ  రామ్  దిష్టిబొమ్మలు, జే సి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి అధికారంలోకి రాకముందే గుజరాత్ ను గుర్తుకు తెచ్చారు. ఖచ్చితంగా తెలంగాణా వాడమంటే కాషాయ వాదం మాత్రమే అనే ధోరణి బలపడితే  ప్రాంతంలోని, ముస్లింలు, దళితులు, వామపక్షంలో ఉన్న ప్రజల్లో అభద్రతా పెరగడం ఖాయం. అదే వారి ఎజెండా అయితే ప్రాంతం గుజరాత్ గా మారడంకంటే ఆంద్ర ప్రదేశ్ లో ఉండడమే మేలు!. ఇప్పుడు ధోరణిని అడ్డుకుని, ఉద్యమాన్ని కాపాడవలసిన బాధ్యత జే సి మీద ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ ను స్మరించుకుంటూ ఇప్పుడు తెలంగాణా విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్ఫూర్తి వారోత్సవాలు జరుగుతున్నాయి. నిజానికి ఇది ఉద్యమ దశను సమీక్షిన్చుకోవాల్సిన సమయం. గడిచిన ఏడాదిలో తెలంగాణా సాధనలో ఒక్క  అడుగుకూడా ముందుకు పడలేదు. పైగా సకల జనుల సమ్మె లాంటి అనేక సందర్బాలలో ఉద్యమమే వెనకడుగు వేసిందిపరకాల ఫలితం ఎలా ఉన్నా జే సి వెనువెంటనే ఒక సమిష్టి పోరాటానికి సన్నద్ధం కావాలిరాజకీయ పార్టీలు నాయకత్వాల ఎత్తుగడల వల్ల ఇప్పటికే చాలామంది తెలంగాణా వాదులు, బాధ్యతా యుతమైన సంస్థలు జే సి కి దూరంగా ఉన్నాయి. వారిని కూడా కలుపుకుని జే సి ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వం గల శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందిఇప్పటిదాకా జే సి ఆంటే టీ ఆర్ ఎస్ అనుబంధ సంస్థ  ఆన్న భావన బలంగా ప్రచారంలో ఉంది. ముందుగా అందులోనుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. జేఏసీ తమలో భాగస్వాములుగా ఉంటూనే ఉద్యమ స్పూర్తికి విఘాతం కలిగేలా ఎన్నికల వేటలో ఉన్న అన్నిపార్టీలను బయటకు పంపించాలి. అలాగని రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదని కాదు.  జే సి స్వతంత్రంగా కార్యాచరణను రూపొందించుకుని అందులో అన్ని పార్టీలనూ నేతలను కలుపుకుని పోవాలి.  ఇంకా పార్టీలు వైఖరులు ఆన్న పాత వ్యూహాలు వదిలేసి జెండాలు వదిలేసి జే సి ఎజెండాతో పనిచేసే అందరినీ ఐక్య కార్యాచరణలో భాగం చేయాలి. దీనికోసం  కొత్తగా మేధో మధనాలు అక్ఖర్లేదు. ప్రొ. జయశంకర్ చూపిన మార్గాన్ని మరిచిపోకుండా నడిస్తే చాలు.!

( Edited version of this article is published in GHANTAPATHAM  Namasthetelangaana on Friday, 15, June 2012)

2 కామెంట్‌లు:

  1. i reaaly liked the article...i think political analysts should be in the advisory board and suggest and direct in this process..I really like your analysis..but there are other factors that worked in favor of YSRCP in Parakala...i think Pro. Jayshanker sir saved us Parakal but as you said TRS, BJP and JAC should start thinking in their discussions....

    Jai T

    రిప్లయితొలగించండి
  2. I do accept with your views at some extent. But, you have deliberately ignored some mistakes and blunders of TRS. Why we could not resist TDP vote share in Parkal.. It is because of TRS attitude of vote bank politics.. You have said that, present status is better than hinduthva Telangana.. If BJP come and say, present status is better than leftist telangana, what would u say ?? Shall we maintain present status because of leftist and rightist differences ??

    రిప్లయితొలగించండి