ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ్గర్‌ను అప్రమత్తతకు ప్రతీకగా భావిస్తారు.యుద్ధరంగంలో ఉన్న యోధుపూప్పుడూ ట్రిగ్గర్‌పై వేలు ఉంచి దాడికి, ప్రతిఘటనకు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కోదండరాం అదే ప్రతీకను వాడుతున్నాడు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ సాధనకు ట్రిగ్గర్‌గా వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన భూమికను పోషించిన టీజేఎఫ్ సభలో కీలక ఉపాన్యాసం చేసిన సందర్భంగా నేను రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన తెచ్చాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ముందుకు తేవాలన్నది నా సూచన. నిజానికి తెలంగాణవాదుపూవ్వరూ అధికార కూటమి తరఫున రాష్ట్రపతి ఎన్నికల రంగంలోఉన్న ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదన్నది నా అభివూపాయం.
టీజేఎఫ్ ఈ సమస్యను సీరియస్‌గానే చర్చకు పెట్టినట్టుంది. సాయంకాలం ముగింపుసభలో ఆయన స్పందించారు. కానీ ఆయన ప్రకటనకు రాజకీయ పక్షాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఓటు హక్కు ఉన్న ఒక్కరు కూడా తెలంగాణ కోసం మందుగుండుగా మారతామని, మాట వినకపోతే పేలుతామని తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల కోసం పరితపిస్తోన్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కనీసం బెదిరించలేదు. కానీ ఢిల్లీ నుంచి ఇప్పుడు రాయల తెలంగా ణ పేరుతో సరికొత్త సంకేతాలు పంపిస్తున్నారు. ఆశ్చర్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తాజాగా రంగ ప్రవేశంచేసి ఈ కొత్త నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. రాయలసీమలోని, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపి తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు రాయలసీమ రెడ్లు ప్రతిపాదిస్తే, దానికి తెలంగాణ కాంగ్రెస్ రెడ్లు సరేనన్నారని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఒక రహస్య ఒప్పందం జరిగిందని అంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు కుల పంచాయితీ కాదు. ఇదొక ప్రజా ఉద్యమం, ఏ నిర్ణయమైనా ప్రజల సమక్షంలో బహిరంగంగానే జరగాల్సి ఉంటుంది. ఆ నిర్ణయానికి తెలంగాణ ఉద్యమం ఆమోదం అవసరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్య మో, సరిహద్దులు కూడా తెలంగాణవాదులకు అంతే ముఖ్యం. ఆ విషయాన్ని అందరూ గమనించాలి.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తెలంగాణ వ్యతిరేకుల దిమ్మ తిరగాలని, ఎన్నికల ఫలితాలతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలనీ తెలంగాణ నేతలు ప్రజలకు పిలుపునివ్వడం పరిపాటి. ఈ రెండేళ్లలో తెలంగాణ ప్రజలు ఎన్నిసార్లు దిమ్మదిరిగే తీర్పులిచ్చినా ప్రభుత్వాలు దిగిరాలేదు. తెలంగాణలో గెలిచినా ఓడి నా, తమ పీఠాలకు ఎసరు రాదన్న ధీమాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉం ది. ఆ పార్టీకి నిజంగానే దిమ్మ తిరగాలంటే ఇప్పుడు ఆ పార్టీ తరఫున రం గంలో ఉన్న ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ నుంచి చెక్ పెట్టాలి. అలా చేయాలంటే తెలంగాణవాదులమని చెప్పే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ ప్రక్రియ మొదలుపెడితే తప్ప, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ను సమర్థించేది లేదని తేల్చి చెప్పాలి. ఇప్పుడున్న బొటాబొటి మెజారిటీతో ప్రణబ్‌ను గెలిపించడానికి తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండాదిగివస్తుందన్నది నా అభివూపాయం.
రెండోది ప్రణబ్ ముఖర్జీ తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఇంతకాలం నానడానికి ఆయన కూడా ఒక కారణం. ఆయన రాష్ట్రపతి అయితే తెలంగాణ బిల్లు ఆయన ద్వారానే పార్లమెంటుకు రావాలి. రాజ్యాంగంలోని మూడో ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రాల ఏర్పాటును పార్లమెంటుకు ప్రతిపాదిస్తారు. మొదటి నుంచీ తెలంగాణను వీలయినంత వరకు అడ్డుకుంటూ వస్తున్న ప్రణబ్ తెలంగాణ విషయంలో నిష్పాక్షికంగా ఉంటాడనే నమ్మకం లేదు. పైగా ప్రణబ్ సాదా సీదా నాయకుడో, రబ్బ ర్ స్టాంప్ లాంటి వ్యక్తో కాదు. ఆయన యూపీఏకు ఇంతకాలం వెన్నెముకగా ఉన్నవాడు. యూపీఏ వన్, టూ రెండింటిలో ఆయనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నప్పటికీ యూపీఏ నెగ్గుకు రావడం వెనుక ప్రణబ్ చాణక్యం ఉంది. లోక్‌సభకు ఆయన కాంగ్రెస్ పక్ష నాయకుడు. గడిచిన ఎనిమిదేళ్ళలో ఏ సమస్య ఎదురైనా కేవలం దాడి చేసి తిప్పికొట్టకుండా ఆ సమస్య నీరుగారే విధంగా తన చాకచక్యాన్ని వాడిన వ్యక్తి. ఆర్థిక సంక్షోభాలు మొదలు, అవినీతి కుంభకోణాలు, అవిశ్వాస తీర్మానాలు సందర్భం ఏదైనా చక్రం తిప్పిన చాణక్యుడు మాత్రం ఆయనే!.
తెలంగాణ విషయంలో కూడా ఆయన అదే చేశారు. 2004 టీఆర్‌ఎస్ పొత్తు ఒప్పందం మొదలు కాంగ్రెస్ మేనిఫెస్టో, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో తెలంగాణ అంశాన్ని చేర్చేవిషయం అన్నీ ప్రణబ్ కనుసన్నల్లోనే జరిగాయి. అది రాసినప్పుడే ఆయన అతిజాక్షిగత్తగా ‘ఏకాభివూపాయాన్ని సాధించడం’ అనే సాకును జత చేశారు. ఆ ఏకాభివూపాయ సాధన బాధ్యతను కూడాతానే తలకెత్తుకున్నాడు. టీఆర్‌ఎస్, ముఖ్యంగా జయశంకర్ వంటి వారి కృషివల్ల జాతీయ రాజకీయాల్లో ఉన్న దాదాపు 56 పార్టీలు తమ తమ అభివూపాయాలు ప్రణబ్ కమిటీకి లిఖితపూర్వకంగా చెప్పినప్పటికీ, ఆయన మాత్రం నోరువిప్పి ఆ లేఖల్లో ఏముందో చెప్పలేదు. కమిటీ చైర్మన్‌గా తన నిర్ణయం ఏమిటో కూడా వెల్లడించకుండానే ఐదేళ్ళ కాలాన్ని గడిపేశాడు. 2009కి పరిస్థితి మారిపోయింది. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమానికి కేంద్రం తలవంచక తప్పలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ కోర్ కమిటీ తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాయి. వాటిలోవూపణబ్ సభ్యుడు మాత్రమే కాదు.
ఆ నిర్ణయాల్లో క్రియాశీల పాత్రధారి. అయినా డిసెంబర్ 9 ప్రకటనతో తనకు సంబంధంలేదని, ఆ రోజు తాను ఢిల్లీలో లేనని, తన విమానం ఆలస్యమయిందనీ, లేకపోతే తెలంగాణ ప్రకటన రాకుండాఅడ్డుపడే వాడినని బహిరంగంగా చెప్పిన వ్యక్తి. ఆ తరువాత కూడా పార్లమెంటులో తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి దాన్ని దాటవేసింది, ఆ ప్రస్తావన తెచ్చిన సభ్యులను దబాయించి నోళ్ళు మూయించింది కూడా ఆయనే!. ఇటీవల సుష్మాస్వరాజ్ తెలంగాణ గురించి పార్లమెంటులో ప్రణబ్ వివరణ కోరినప్పుడు ఆయన తల అడ్డంగా ఊప డం, తెలంగాణ పార్లమెంటు సభ్యులను నిలువునా చీల్చి చెండాడడం టీవీలలో చూశాం కూడా. అక్కడితో ఆగకుండా నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని పార్లమెంటు ముందు నిరసన తెలిపిన పాపానికి తెలంగాణ ఎంపీలను బెదిరించింది కూడా ఆయనే. ఇవన్నీ అభియోగాలు కాదు, ఆయన పార్టీకే చెంది న గౌరవ పార్లమెంటుసభ్యులు చెప్పిన సంగతులు. అటువంటి వ్యక్తిని అసలైతే అడ్డుకోవాలి. కనీసం అడ్డుకోకపోయినా ఆమోదయోగ్యుడు కాదని తెలంగాణవాదులు చెప్పగలగాలి. ఇదొక అవకాశంగా వాడుకుని ఒక కచ్చితమైన ప్రకటనను సోనియాగాంధీ నుంచో, ప్రధాని నుంచో పొందాలి.
ఇప్పుడు అధికార కూటమి తరఫున ప్రణబ్ నామినేషన్ కూడావేశారు. ఈ తంతు పూర్తిచేయడానికి కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా తల మునకలై ఉంది. ప్రధాని ముఖ్యమంవూతితో సహా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలంతా దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలోని అన్ని పనులనూ పక్కన పెట్టి ఈ పెద్దలంతా ఢిల్లీ చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు. తర్జన భర్జనలు పడుతున్నారు. పరకాలలో కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ కూడాదక్కకుండా చేసి, టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రజలు గెలిపించిన రోజునే ప్రధాని స్వయంగా హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్టు, పనిలో పనిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలపవలసిందిగా కోరిన ట్టు వార్తలు వచ్చాయి. దానికి కేసీఆర్ ఎలా స్పందించాడో ఆ వార్తలో లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం టీఆర్‌ఎస్ ఓట్లను ఇప్పటికే తామ ఖాతాలో కలిపేసుకుని విజయంపై ధీమాతో ఉంది. రేపో మాపో ప్రణబ్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశం అవుతారు. బహుశా టీఆర్‌ఎస్ అధినేతను కూడా కలిసి స్వయంగా మద్దతు కోరే అవకాశం ఉంది.
ఈ దశలో కోదండరాం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. నిజంగా నే టీఆర్‌ఎస్ వ్యూహత్మకంగానైనా ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఏదో ఒక కచ్చితమైన హామీ వచ్చి తీరుతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ తీసుకునే నిర్ణయం మిగతా తెలంగాణ ప్రజావూపతినిధులనైనా ఆలోచింపజేస్తుంది. కనీ సం పౌర సమాజానికి, ప్రజలకు ఒక నమ్మకాన్ని, కొత్త ఆశను ఉత్సాహాన్ని ఇస్తుంది. కోదండరాం ట్రిగ్గర్ నొక్కాలన్నాడు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ జేఏసీ పక్షాన కనిపించడంలేదు. పార్టీలను కలిసినట్టుగానీ, తెలంగాణ ప్రజావూపతినిధులను ఒత్తిడి చేసినట్టుగానీ కనిపించడం లేదు. ఆ దిశగా జన సమీకరణ కూడా లేదు. ప్రణబ్ హైదరాబాద్ రాబోతున్నాడు. ఆరోజైనా పెద్ద ఎత్తున నిరసన తెలిపే విధంగా కార్యక్షికమాలు ఉంటే కొంత కలవరం ఉండేది. నిజానికి ప్రణబ్ కు తెలంగాణ ఓట్లు చాలా కీలకం. ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభసభ్యులను కూడా కలిపితే కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎంపీలు (రేణుకాచౌదరి కూడా ఆమె తెలంగాణ అనుకుంటే) , టీ డీపీకి నలుగురు, టీఆర్‌ఎస్‌కు ఇద్దరు, మజ్లిస్ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో ఒక్కొక్క ఎం పీ ఓటు విలువ 708. మొత్తం తెలంగాణకు 17 మంది లోక్‌సభ, 8 రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
మొత్తం ఈ ఎంపీల ఓట్ల విలువ 17 ,900. అలాగే 119 మంది శాసనసభ్యులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ 47, టీడీపీ 36, టీఆర్‌ఎస్ 18 (ఒక అనుబంధ సభ్యుడితో కలిపి), మజ్లిస్ ఏడు, బీజేపీ మూడు, సీపీఐ, నాలుగు, సీపీఎం ఒకటి, లోక్‌సత్తా (తెలంగాణ ప్రజావూపతినిధినని ఆయన అనుకుంటే) ఒకటి, నాగం జనార్దన్‌డ్డితో పాటు మరో స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. వీరందరి ఓటు విలువ 17,612 . మొత్తంగా తెలంగాణ ఓట్లు 35,512. ఇవి గెలుపు ఓటములను నిర్ణయిస్తాయా లేదా అన్నది వేరే చర్చ. కానీ ప్రణబ్ గెలవడానికి ఇవి చాలా కీలకం. తెలంగాణ ఓట్ల విలువ దేశంలో చాలా రాష్ట్రాల ఓట్ల కంటే ఎక్కువ. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం తెలంగాణ ఓటు బ్యాంకు దేశంలోనే ఏడవ అతిపెద్దది!. ఇందులో నామమావూతపు ఓటు విలువ కూడాలేని జగన్‌ను కలవడం కోసం బీజేపీ మద్దతుతో రంగంలో దిగుతున్న సంగ్మా చంచ ల్ గూడా జైలుదాకా వెళ్ళాడంటే, తెలంగాణ ప్రజావూపతినిధులు ప్రజల కోసం ఒక్కమాటమీద నిలబడి ఉంటే ప్రణబ్ ఎక్కడికి దిగిరమ్మన్నా వస్తాడు.
అది జరగాలని కోదండరాం కోరుకుని ఉంటాడు. ఇంతకాలం తెలంగా ణ ప్రజలు ఎలాగైతే తమ వెంట నిలబడి పదే పదే గెలిపించారో అలాగే ప్రజావూపతినిధులు కూడా ఈ ఓటును ఒక ఆయుధంగా మలచుకుని ఇప్పుడు తెలంగాణను గెలిపించాలి. కోదండరాం ట్రిగ్గర్‌గా వాడాలన్నది కూడా అందుకే. కానీ ట్రిగ్గర్ నొక్కే ముందు లక్ష్యం గురిచూసి ఉంచుకోవాలి. అంతకంటే ముందు మన తుపాకిలో తూటాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కోదండరాం చేతిలో జేఏసీ లాంటి అత్యాధునికమైన తుపాకీ ఉన్నది. కానీ గుళ్లే చెల్లా చెదురైపోయాయి. కోదండరాం మాటలు ఇంకా ఉపఎన్నికల మత్తువదలని మన రాజకీయ నాయకులకు వినిపించినట్టు లేదు. దానికి ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు. ఒకప్పుడు కోదండరాం ఒక మాట చెప్పాడంటే అది తూటాకంటే వేగంగా రాజకీయావర్గాలలోకి దూసుకెళ్ళి కలకలం సృష్టించేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. అన్ని ఆయుధాలూ ఇప్పుడు మౌనముద్ర దాల్చాయి.
తెలంగాణ ఉద్యమం ముందెన్నడూ లేనంత ఉదాసీనతలో ఉంది. ఒక రకంగా ఇప్పుడు ఉద్యమంలేదు. ఆయన నాయకత్వంలో ఏర్పడ్డ రాజకీయ జేఏసీని రెండు ఉపఎన్నికలు, రెండు రాజకీయపార్టీలు అతలాకుతలం చేశాయి. మిగతా సంఘా లు, అందులోని నాయకులు ఎవరికి తోచిన తోవలో వాళ్ళు నడుస్తున్నారు. ఎటు నడవాలో తెలియని వాళ్ళు అయోమయంలో పడిపోయారు. ఆ అయోమయాన్ని వదిలించి ప్రజలను అప్రమత్తం చేయాలనుకున్నా ఇప్పు డు మందుగుండులేని తుపాకీతో ఆ లక్ష్యం కూడానెరవేరే సూచనలేవీ కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలం మందుగుండుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు డమ్మీలయిపోయారు. ప్రతిపక్షపార్టీల పరిస్థితీ ఈ ఎన్నికల్లో దయనీయమే. ప్రణబ్‌ను నిలువరించే స్థాయి వారికి లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్, ఆ పార్టీకి మద్దతునిచ్చే పార్టీలు. అవి కూడా కోదండ రాం కమాండ్‌కు స్పందించలేదంటే అవి ఎందుకూ పనికిరావు. కేవలం సోనియాగాంధీకి, ఆమె ప్రతినిధిగా రంగంలో ఉండి రాష్ట్రానికి రానున్న ప్రణబ్ ముఖర్జీకి గౌరవ వందనం చేయడానికి తప్ప!.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి