శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

అధ్యక్షా ! ఆలకించండి...



ఆంద్ర ప్రదేశ్ శాసన సభకు స్పీకర్ ఎవరు? ప్రశ్నకు ఎవరైనా సరే నాదెండ్ల మనోహర్ అనే సమాధానం చెపుతారు. సాంకేతికంగా అది నిజమేకానీ ఇప్పుడు శాసన సభలో నెలకొన్న గందరగోళం గమనిస్తోన్న వారికి అలా అనిపించడం లేదుఎందుకంటే నాదెండ్ల మనోహర్ యువకుడు ఆధునిక చట్టసభల తీరుతెన్నులు తెలిసిన వ్యక్తి , ఎం బి చదివిన ఆయనకు నిర్వహణ శాస్త్రం తెలియదనుకోలేము. శాసన సభకు మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచీ శాసన సభ బయటిరాజకీయాలకంటే లోపలి వ్యవహారాల పైనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్న వ్యక్తి. శాసన సభ గ్రంధాలయ కంప్యుటరీకరణ మొదలు ఇప్పుడు శాసన సభ ఆధునీకరణలో అత్యంత శ్రద్ధ కనబరుస్తున్న వ్యక్తి ఆయన. సభలో గెలుపొందిన ఒక్కొక్క గౌరవ శాసన సభ్యుడికి లాప్ టాప్, టాబ్లెట్ ఫోనెల వంటి ఆధునిక సమాచార సాధనాలు ఇచ్చి అవి ఎలా వాడాలో శిక్షణ కూడా ఇప్పించారు. అలాగే వారు సభలో జరిగే సుదీర్ఘ  చర్చల సందర్భంగా అలిసి పోకుండా అత్యాధునిక హంగులతో కుర్చీలు, టచ్ స్క్రీన్ లు, కొత్త మైకులు సమకూర్చారు.

పైగా శాసన సభ్యులకు విజ్ఞానం వినోదం కూడా అవసరమని గుర్తించిన వ్యక్తి ఆయన. అందులో భాగంగా ఇటీవల కొందరిని ఆహ్లాదభరిత వినోద విడిది కేంద్రమైన అరుకు తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద అవగాహన కల్పించారు. ఇలా శాసన సభకు సంబంధించిన  అన్నిటిమీదా ఆయన ముద్ర కనిపిస్తున్నా సభలోపలి వ్యవహారాలు మాత్రం అతని చేతిలో లేకుండా పోయినట్టు విమర్శలోస్తున్నాయి.  కుర్చీలు మారాయి తప్ప కుర్చీల్లో కూర్చుండే గౌరవ సభ్యుల తీరు మాత్రం మాత్రం మారలేదనే చెప్పుకోవాలి. ఒక్క సభ్యల ప్రవర్తనే కాదు స్పీకర్ సభను నిర్వహిస్తున్న తీరును, సభలో తమ పట్ల వ్యవహరిస్తున్న తీరునూ ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సభలో చర్చ సరిగా జరుగుతుందన్న విశ్వాసం లేక ప్రధాన ప్రతిపక్షమే సభావ్యవహారాలు రూపొందించే కమిటీలను బహిష్కరిస్తుందంటే అది ఆలోచించ వలసిన విషయమే!

 ఇది ఒక్క సమావేశంలోనే కాదు. దాదాపుగా గడిచిన రెండేళ్లుగా సభ తీరు ఇలాగే ఉంది. సభలోని సభ్యులంతా శాసన సభ మీద, సభా వ్యవహారాల మీద విశ్వాసం ప్రకటించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇది ముమ్మాటికీ మంచిది కాదు.   పరిణామాల పట్ల  కేవలం సభాపతినే తప్పుపట్టలేం. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు రాజకీయ పార్టీలు, సభానాయకుడు, ప్రతిపక్షనేత ఇలా అంతా కూడబలుక్కునే సభను నిర్వీర్యం చేస్తున్నారని అర్థమౌతోంది. స్పీకర్ ఒత్తిడికి గురవుతున్నారని అర్థమౌతోంది

కానీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఒత్తిడులకు తలోగ్గితే అది కేవలం అతనికి,  సభాపతి పదవికి ఉన్న గౌరవానికే కాదు, మొత్తం ప్రజల సార్వభౌమాధికారానికే తలవంపు అవుతుంది.  ఎందుకంటే స్పీకర్ అనే వ్యవస్థ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సార్వభౌమాధికారానికి జవాబుదారీ.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, అక్కడి చర్చలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభిస్తాయని రాజ్యాంగ కర్తలు భావించారు. అటువంటి ప్రజల సభకు అధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు, రాగద్వేషాల ప్రమేయం లేకుండా  ధర్మకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే భారతదేశపు తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రు స్పీకర్ పదవిని దేశ స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రతీకగా అభివర్ణించాడు. స్పీకర్ చట్టసభ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసన సభ అనేది ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజల స్వేచ్చకు, స్వాతంత్ర్యానికి అదొక నిజమైన నమూనాగా ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం ఉద్దేశ్యానికి అనుగుణంగాన చాట సభల విధులు, బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారుశాసన సభ పరిధిలో అందరూ సమానమైన హక్కులు, బాధ్యతలు ఉన్న సభ్యులుగా మాత్రమే ఉండాలి. సభానాయకుడుగా ఉండే ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల సభాపక్షాల నేతలు, సభ్యులు అందరూ సభాపతి  దృష్టిలో సమానమే. సభలో ఎవరు మాట్లాడినా సభాపతి ద్వారానే మాట్లాడాలి. సభ తనంతట తాను స్వతంత్రమైనది కాదు. రాజ్యాంగ పరిధిలో దేశ సార్వభౌమాధికారానికి అది లోబడి ఉంటుంది. సభలో జరిగే చర్చలు, సభ చేసే తీర్మానాలు, చట్టాలు రాష్ట్ర ప్రజలు వారి తరఫున ఎన్నికైన ప్రతినిధులు ఉమ్మడిగా స్పీకర్ గారికి నివేదిస్తారు. మనం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటీష్ పాలనా విధానం నుంచి తీసుకున్నాం.  బ్రిటన్ లో దేశ సార్వభౌమాధికారం రాణి  గారి చేతుల్లో  ఉండేదిబ్రిటీష్ పార్లమెంటు  చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను సభాపతి ద్వారా సార్వభౌమాదికారికి నివేదించే పధ్ధతి ఉండేది. అట్లా పార్లమెంటు తరఫున సభ అధికార ప్రతినిధిగా మాట్లాడే వ్యక్తిగా సభాపతి ఉండేవాడు. రకంగా ఆయనను స్పీకర్ అన్నారు.

భారతదేశంలో జాతీయ స్తాయిలో రాష్ట్రపతిని, రాష్ట్రాల స్తాయిలో గవర్నర్ వ్యవస్థలను రాజ్యాంగ పరమైన సార్వభౌమాధికార ప్రతీకగా పరిగనిస్తారు. స్పీకర్లు సభా వ్యవహారాలను ప్రధానంగా సభ చేసే తీర్మానాలను, చట్టాలను స్పీకర్ ద్వారా రాజ్యాంగ ప్రతినిధికి నివేదిస్తారు. రకంగా స్పీకర్ స్థానం శాసన సభలో అత్యంత ఉన్నతమైనది, రాజకీయాలకు అతీతమైనదిగౌరవనీయమైనదిగా భావిస్తారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం, సభలోపల తమ ఆదిపత్యం కోసం, రాజకీయ స్వార్థంతో  స్పీకర్ స్థానాన్ని, స్థానానికున్న హుందాతనాన్ని మలినం చేస్తున్నారు

శాసన సభలో ఎవరెవరి పాత్ర ఏమిటి, సభలో ఎలా ప్రవర్తించాలిఎలా ప్రసంగించాలి మొదలుకుని ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి వరకు అన్నీ భారత రాజ్యాంగం నాలుగో భాగంలో చట్టసభల నిబంధనల్లో ఉంటాయి. సభ్యులు నియమనిబంధనలకు అనుగుణంగానే మసలుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సాంప్రదాయానికి విరుద్ధంగా నడుస్తోంది.  ఇప్పుడు సభలో ముందేన్నదూలేని గందరగోళం నెలకొని ఉన్నది. ఎవరు అధికార పక్షమో ఎవరు ప్రతిపక్షమో తెలియని అయోమయం రాజ్యమేలుతున్నది.   అధికార పక్షం  ప్రతిపక్ష పాత్రను, ప్రతిపక్ష పార్టీ అధికారపక్షం పాత్రనూ పోషిస్తున్నాయి.  శాసన సభ వెలుపల మాత్రమే ఉండాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు ఇప్పుడు సభలో ప్రవేశించడంతో సభాపతి చేతులేత్తేయాల్సిన పరిస్థితిని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం

  సంగతిని అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి  బొత్సా సత్యనారాయణ కూడా సభ ఆవరణలోనే నిర్ధారించినట్టు మీడియా లో వార్తలొచ్చాయి. సభ బయట ఎవరు ఎవరితో లాలూచిపడ్డా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ సభలో ప్రతి[పక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి లాలూచిపడడం నిజమే అయితే అది ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే పార్లమెంటరి వ్యవస్థలో ప్రతిపక్షాన్ని ప్రజల గొంతుగా గుర్తిస్తారు. అలా గుర్తించి, ప్రజల తరఫున నిలబడి మాట్లాడమనే సభానాయకుడితో సమానమైన హోదా ప్రతిపక్షనాయకుడికి కూడా కట్టబెట్టారు. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి అధికార పక్షానికి లాలూచీ పడిపోతే సభలో జరిగే చర్చల్లో, సభ తీసుకునే నిర్ణయాల్లో, చేసే చట్టాల్లో  ప్రజల ఆకాంక్షలు ఎలా ప్రతిబింభిస్తాయి? నిజంగానే అలా లాలూచీ పడాలనుకుంటే సభ వెలుపలే అయన తన తెలుగుదేశం పార్టీని చిరంజీవిలాగా కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రభుత్వంలో భాగం కావచ్చు. అలా చేస్తే సభకు మరో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఇచ్చినట్టవుతుందిఅంతేతప్ప శాసన సభను వంచనకు వేదికగా వాడుకోకూడదు

ఇక అధికార పక్షంలో పరిస్థితి కూడా అయోమయంలోనే ఉన్నది. సభలోపల, వెలుపలా ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను ఆయన నాయక్ల్మంత్రివర్గ సహచరులే విమర్శించే స్తితిలో ఉన్నారుశాసన సభలో సభ్యులు కూర్చున్న తీరును గమనిస్తే ఎవరెవరు ఎపార్తీలో ఉన్నారో పోల్చుకోవడం కష్టం. చట్టసభలోపల, బయట ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కదివరకు ఎవరిని అనుమతించాలి అనే విషయాల్లోనూ నియమాలున్నాయి. వీటి ప్రకారం ముందు స్పీకర్ కు కుడి వైపున అధికార పక్షం, ఎడమ వైపున ప్రతిపక్షం ఉంటాయి. ముందు వరసలో సభాపక్షం నాయకులు , ఉపనాయకులు కూర్చుంటారు. తరువాతి స్థానాల్లో మంత్రులు, విప్ లు ఉంటారు. సాధారణ సభ్యులు వాళ్ళు ఎన్ని సార్లు సభకు ప్రాతినిధ్యం వహించారన్న సీనియారిటీని బట్టి స్తానాలు కేటాయించాలని నిబంధనలు  చెపుతున్నాయికానీ మన సభలో మాత్రం ముందు వరుసలో మెగా స్టార్ చిరంజీవి కనిపిస్తారు. నిజానికి ఆయన మొదటి సారే గెలిచినందున సాధారణ సభ్యుడిలా చివరి వరుసలలో కూర్చోవాలి. కానీ పదవి లేకున్నా ఆయనకు ముందు వరుస వడ్డించడం విడ్డూరమే! ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఫరవాలేదు. పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయాక, ఆయన అనుచరులు కాంగ్రెస్ విప్పులైమంత్రులై పోయాకా, స్వయంగా ఆయన, ఆయన శాసన సభ్యులు కాంగ్రెస్ కండువాలతో సభలో తిరుగుతుంటే ఆయనకు ముందువరుసలో స్థానం  ఇవ్వడం అమర్యాద కిందికే వస్తుంది. ఒకవేళ ఇంకా విలీనం ప్రక్రియ పూర్తికాలేదని దబాయించినా ప్రజారాజ్యం శాసన సభ్యులు కాంగ్రెస్ విప్ లుగా ఎలా ఉంటారు?  అలాగే విలీనం అయిపోయాక కూడా వంగా గీతను పీ ఆర్ పీ విప్ గా ఎలా గుర్తిస్తారు.

ఇదంతా కప్పల తక్కెడను తలపిస్తోంది. ఇక అన్నిటికీ  పరాకాష్ట జగన్ వర్గాన్ని అధికార పక్షం కింద లెక్కేసుకోవడంతాము అధికార పార్టీ కాదని చెప్పేందుకు వారంతా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కండువాలతో సభలోకి వచ్చినా వారిని మాత్రం అధికార పక్షంలోనే కూర్చోబెట్టారు. వారు ఇప్పటికే స్పీకర్ కు రాజీనామాలు ఇచ్చారు. వాటిని విచక్షనాధికారాలు ఉపయోగించి తిరస్కరించారాణే అనుకుందాం.   తరువాత అదే సభ్యులు ప్రభుత్వం మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సభలోనే స్పీకర్ ముందే వోటు వేశారు. వాళ్ళు అధికార పక్షం జారీ చేసిన విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు వేశారని అధికార పార్టీ, సభలో పార్టీ విప్ కూడా ఫిర్యాదు చేసారు. వారిని తొలగిన్చావలసిన్డిగా వేడుకున్నారు.  గౌరవ సభ్యులు కూడా అడినిజమేనని ఒప్పుకుంటున్నారు. అయినా వారి సభ్యత్వాలు రాద్దుచేయకుండా  సభలోకి అనుమతించడం, అధికార పక్షం స్థానాల్లో కూర్చోబెట్టడం విస్మయం కలిగించే విషయం

 ఇవన్నీ గమనిస్తున్నవారికి సహజంగానే సభ నిర్వహణ తీరు రాజ్యాంగ పరిధి దాటుతున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా స్పీకర్ మీదే ప్రతిఫలిస్తుందిస్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా చట్టసభల్లో ఉన్నవాళ్ళు, శాసన సభావ్యవహారాలు గమనిస్తున్నవాళ్ళు అంటున్నారుగతంలో తెలంగాణా శాసన సభ్యుల రాజీనామాల విషయంలో స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. మూకుమ్మడి రాజీనామాలు చెల్లవనడంతో పాటు భావోద్వేగాలను తాను పరిగణలోకి తీసుకోనని బాహాటంగానే చెప్పేశారు. స్పీకర్ ఒక ప్రాంతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ సభ్యుల స్వేచ్చను హరిస్తున్నాడని అనేక మంది శాసన సభ్యులు వాపోయారు. నాగం జనార్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాజీనామా ఆమోదిమ్పజేసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చిందిఅయినా అది స్పీకర్ విచక్షనాదికారాల్లో భాగమని కొందరు సమర్ధించే ప్రయత్నం చేసారుకానీ ఇప్పుడు వై ఎస్ జగన్ అనుకూల శాసన సభ్యుల విషయంలో ఆయన వ్యవహార శైలి గమనిస్తే విమర్శకుల వాదనే నిజమనిపిస్తోందిఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు  స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికి కీడు చేసేవిధంగా ఉందని విమర్శించారు. ఎన్ని విమర్శలు ఉన్నా  స్పీకర్ ధోరణిలో మార్పు కనిపించక పోవడం చూస్తే నిజంగానే అతని వెనుక ఏదో ఒత్తిడి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒత్తిడి రాజ్యాంగ పరమైనది కాదని, పూర్తిగా రాజకీయప్రేరేపితమైనదని పరిణామాలను గమనిస్తే అర్థమౌతుంది.

ఇవన్నీ ఆలోచిస్తే బొత్స సత్యనారాయణ మాటల్లో సత్యమున్నదనిపిస్తోంది. ఇప్పుడు సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కలిసి పోయారనే భావన కలుగుతోంది. అలా లాలూచి పడి పోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి జగన్ రూపంలో కనిపిస్తే రెండోది తెలంగాణా రూపంలో వారిని వెంటాడుతోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా భయపెడుతోన్న  రెండే  ఇద్దరినీ ఒక్కటయ్యేలా చేస్తున్నాయి.   ఇప్పుడు రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ ప్రత్యక్షంగా జగన్ ప్రజాబలం ఏమిటో తెలిసిపోతుంది. జగన్ కనీసం సగం స్థానాల్లో గెలిచినా మిగితా ఇద్దరు చెరో పావు స్థానాలకు పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ మొత్తం జగనే గెలిస్తే తమ పరువు పోవడమే కాకుండా, తమతో ఉన్న మిగితా శాసన సభ్యులు ఆలోచనలో పదే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ మనుగడ కష్టమై పోతుంది. అది  మధ్యంతరానికి మార్గం చూపితే గాలిలో సీమాంధ్ర లో తమ ఆచూకీ మిగలకుండా పోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న స్థానాల్లో డిపాజిట్లు కూడారాని వాతావరణం ఉంది. ఒక వైపు తెలంగాణా ఉపఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలోతెలంగాణా అంశం తిరిగి తిరిగి మళ్ళీ శాసన సభకు చేరుకుంది.

సమావేశాల్లో తెలంగాణా తీర్మానం చేయాలని టీ ఆర్ ఎస్ తో సహా మరికొన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి.  దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక సభగా భావించే పార్లమెంటులో స్వయానా కేంద్ర  హోంమంత్రి చేసిన ప్రకటనకే దిక్కులేకుండా పోయిన నేపధ్యంలో ఇంకా చట్టసభల మీద విశ్వాసం ఉంచడంలో అర్థం లేదని అనిపించవచ్చు. పైగా శాసన సభ తీర్మానం అనేది ఒక అనవసర ప్రహసనంగా కూడా కనిపించవచ్చు. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రభుత్వాలయితే ఆర్టికల్ లో సూచించినట్టుగా నేరగా పార్లమెంటు తీర్మానం ద్వారా ఇప్పటికే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే వారు. అలా చేయకపోగా తెలంగాణా ప్రజల సహనానికి నిరంతరం పరీక్షలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు పదే పదే ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల తమ విశ్వాసాన్ని  ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ శాసన సభ వేదిక ద్వారా అదేపని చేయబోతున్నారు. ఇది ఫలితం లేనిదని తెలిసినా ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితిని చేధించాలంటే తీర్మానం కోసం పట్టుబట్టడం తప్పనిసరి అని టీ ఆర్ ఎస్ భావిస్తోంది తీర్మానం ద్వారా ఎవరెవరు ఎటువైపో తేలిపోతుంది. సభలో తీర్మానం సందర్భంగా చర్చ జరుగుతుంది. చర్చలో వ్యక్తులుగా కాకుండా పార్టీలుగా అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని చెప్పాల్సి ఉంటుందికానీ ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది ఇప్పుడున్న ప్రశ్న


అధ్యక్షా
గడిచిన రెండేళ్లుగా స్వార్థ రాజకీయ ఎత్తుగడల వల్ల రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ప్రజాపాలన పూర్తిగా కుంటుబడి పోయిందిఇప్పుడు అదే పరిస్తితి సభలో కూడా కనిపిస్తోంది. ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  ప్రజల అభిమతాన్ని మన్నించినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం ఉంటాయి. ప్రజాస్వామ్యానికే తలమానికమైన స్థానంలో మీరున్నారు. ప్రజల స్వేచ్చకు, స్వాతంత్ర్యానికి, ఆకాక్షలకు ప్రతిరూపమైన స్థానం అది. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా మీకు రాజ్యాంగం కల్పించిన  అధికారలాను వినియోగించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ పక్షాలను నడిపించాలి తప్ప రాజకీయాలు రాజ్యాంగ వ్యవస్థల మీద అధికారం చేకాయించాలని చూడకూడదు. ఇప్పుడు రెండవ ప్రయత్నం కనిపిస్తోంది. మీకున్న అధికారాలను ఉపయోగించి మీరు సభా సాంప్రదాయాలను కాపదగలరని అనడంలో ఎలాంటి సందేహం లేదు. శక్తి, స్వాతంత్రం మీకు రాజ్యాంగమే కల్పించింది.  

ఇక రెండోది ఇప్పుడున్న రాజకీయ సక్షోభానికి మూలమైనది తెలంగాణా సమస్య.  అసాధారణ రీతిలో తెలంగాణా ప్రజలు అర్ధ శతాబ్దికి పైగా తమ  స్వరాష్ట్రంకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో  పోరాడుతున్నారు. ప్రజల మనోభావాలను మన్నించి భారత ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా, మనందరికీ శిరోదార్యమైన భారత రాజ్యాంగానికి లోబడి  తన నిర్ణయాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిపోయింది మేరకు ఒక తీర్మానం చేయవలసిందిగా మీకొక సూచన కూడా చేసిందిరెండేళ్లుగా మీ నిర్ణయంకోసం అటు పార్లమెంటు, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులో ఎందరో నిరాశా నిస్పృహలకు లోనయి రాలిపోతున్నారు. రాజకీయ సందిగ్దంలో పరిపాలన సాగదు. అది మీరుకూడా గమనించే వుంటారు.  ఇటువంటి  ప్రతిష్టంభన పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత శాసనకర్తలకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణా ప్రజలు పార్లమెంటుతో సంబంధం లేకుండా తమమాటే చెల్లుబాటు కావాలని పట్టుపట్టడం లేదు. కేవలం మీ నేతృత్వంలో ఉన్న సభలో తమ ఆకాంక్షను చర్చించే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు. చర్చ సారాన్ని దేశ సార్వభౌమాధికారానికి నివేదించే ప్రతినిధిగా వ్యవహరించమని వేడుకుంటున్నారు.  అది దేశ పౌరులుగా జన్మతా సంక్రమించిన హక్కు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం. . దాన్ని కాపాడే ధర్మకర్తగా మీరొక నిర్ణయం తీసుకోండి. మీ విధిని మీరు రాగద్వేషాలకు అతీతంగా,  త్రికరణ శుద్ధితో నిర్వహించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సభాపతిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి