సంక్రాంతిని
రైతుల పండుగ అంటారు. కొత
్తపంటలతో రైతుల లోగి ళ్ళు
కళకళలాడినప్పుడు చేసుకునే పండుగ అది. సంక్రాంతి
సందర్భంగా సీమాంధ్రలో జరిగిన సరదాలను గత వారం రోజులుగా
చూశాం. తెలుగు టెలివిజన్ చానెళ్ళు అక్కడి సంబరాలను ప్రజలందరికీ రంగు రంగుల్లో కనువిందు
చేశాయి. ముఖ్యంగా ఈ సారి భీమవ
రం పరిసరాల్లో జరిగిన కోడిపందాలు చరివూతలో చిరస్థాయిగా నిలిచిపోతా యి. ఎందుకంటే ఆ
ప్రాంతంలో పందాలలో కనీసం నూటా యాభై
నుంచి రెండువందల కోట్ల వ్యాపారం జరిగింది.
ఒక్క కోడిపందాలే కాదు పేకాట, ఇతర
జూదాల్లోనే మూడు రోజుల్లో దాదాపు
ముప్ఫై కోట్ల దాకా చేతులు
మారినట్టు అక్కడి నుంచి రిపోర్ట్ చేసిన
ఒక ప్రముఖ టెలీవిజన్ ఛానల్ రిపోర్టర్ చెపుతున్నారు.
దాదాపు 35 కోట్ల రూపాయల మద్యం
ఆ మూడురోజు ల్లో అమ్ముడు పోయిందన్నది
ఆయన అంచనా!
భీమవరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న రైతులుండే ప్రాంతం. ఒక్కోపంటకు ఎకరానికి ముప్ఫై నుంచి నలభై క్వింటాళ్ళ పంటనిచ్చే వరి పొలాలను వదిలి అక్కడి రైతులు రొయ్యలు, చేపల పెంపకంలో లక్షలు గడిస్తున్నారు. భీమవరం, నర్సాపురం పరిసరాల్లో దాదాపు డ్బై ఐదువేల ఎకరాల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. ఒక్కో ఎకరానికి ఏడాదికి ఎంతలేదన్నా లక్షన్నర నుంచి రెండు లక్షల ఆదాయం వస్తుందని అంచనా. అలా సంపాదించిన సొమ్మును వాళ్ళ సరదాల కోసం ఖర్చు చేసుకోవడం తప్పు కాదు. నిజానికి ఏడాది పొడుగునా రెక్కలు విరుచుకుని కష్టపడే సామాన్య జనం కాస్తంత సేద తీరేది ఇలాంటి పండుగల కాలంలోనే!
కానీ ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి రైతులే ఈ ఏడాది ఏ పండుగకూ నోచుకోలేదు. పోయిన దసరా పండుగ నుంచి ఇప్పటి సంక్రాంతి దాకా వాళ్ళను నిండా దుఃఖం ఆవరించింది. అందు లో పత్తి రెతు పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఒక్క రెండు నెలల కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు డ్బై మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది తెలిసి న కొందరం ఆదిలాబాద్ వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడాం. ఇప్పుడు అక్కడి రైతులు నిండా అప్పుల ఊబిలో కూరుకుపో యారు. వేలకువేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తిచేలన్నీ ఎండిపోవడం, అక్కడక్కడ పంట చేతికందినా ధర లేకపోవడం, మార్కెట్ యార్డుల్లో దళారుల నిలువు దోపిడీ వాళ్ళను కుంగదీశాయి.
ఆదిలాబాద్కు పత్తి పంటలో ప్రపంచ ఖ్యాతి ఉంది. ఆసియాలోనే అత్యధిక పత్తి ఉత్పత్తి చేసే ప్రాంతంగా ఆదిలాబాద్కు పేరుంది. రాష్ట్రంలో పత్తి సాగయ్యే భూమిలో 16 శాతం, తెలంగాణ పది జిల్లాల్లోని పత్తి చేలల్లో 27 శాతం ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఏటా దాదాపు ఆరు లక్షల హెక్టార్లలో అక్కడి రైతులు పత్తి పండిస్తున్నారు. ఇక్కడ ఏటా దాదాపుగా అరవై లక్షల క్వింటాళ్ళ పత్తి ఉత్పత్తి జరుగుతోంది. ఈ పంటను ఆధారంగా చేసుకుని ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 125 పత్తి జిన్నింగ్ మిల్లులు, నలభై పత్తిగింజల నుంచి నూనె తీసే మిల్లులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఏటా పత్తి మీదే దాదాపు 1500 నుంచి రెండువేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అలాంటిది రెండు మూడేళ్ళ సంక్షోభంతో అక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది పంట నష్టంతో పాటు, మద్దతు ధర న్యాయబద్ధంగా లేకపోవడం వాళ్ళను పూర్తిగా నిస్పక్షుహలోకి నెట్టివేసింది.
ఫలితంగా జిల్లాలో ఎన్నడూలేని విధంగా రైతుల ఆత్మహత్యలు గత్తరలా వ్యాపించాయి. జిల్లాలోని జన్నారం, ముథోల్, బోథ్, ఖానాపూర్, భైంసా, ఉట్నూర్, నిర్మల్ మండలాల్లో పత్తి రైతులు రోజుకొకరన్నట్టుగా రాలిపోతున్నారు. బతికి బయటపడ్డ రైతులు ప్రజావూపతినిధులను, మంత్రులను కలిసినా స్పందన లేకపోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనిపించిన వారికల్లా వారి కన్నీటి గాథను ఏకరువు పెడుతున్నారు.
ప్రభుత్వం విచ్ఛలవిడిగా బీటీ పత్తిని అనుమతించడం, పత్తి సీడ్ను సమయానికి అందించకుండా ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు వదిలేయడం తో దోపిడీ మొదలయింది. బీటీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న నకిలీలను, వ్యవసాయ శాఖ చూసీ చూడనట్టుగా వదిలి వేయడంతో పాటు, ఆ కంపెనీలకు స్థానిక అధికారులు సహకరించడంతో రైతులు మోసపోయారు. పత్తి విత్తనాల రేట్లు కూడా ఈసారి ఒక్కొక్క సంచికి 200 రూపాయలకు పైగా పెరిగిపోయాయి. గత ఏడాది 750 రూపాయలు ఉన్న సీడ్ ఈసారి 950 కి కొనాల్సి వచ్చింది. బీటీ విత్తనాలకు రకరకాల తెగుళ్ళు సోకడంతో అసలు విషయం అర్థమయ్యింది. కానీ అప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి వున్న అమాయక రైతులు ఆ తెగుల్లకు రకరకాల క్రిమి సంహారక మందులకోసం మరింత అప్పులు చేయాల్సి వచ్చింది. జిల్లాలో పత్తి చేల మీద విస్తరించిన ఆకు మచ్చ, పిండి నల్లి పంటనంతా నమిలేశాయని రైతులు వాపోతున్నారు.
స్థానిక వ్యవసాయ అధికారులను ఎన్నిసార్లు కలిసినా కనీసం సలహాలు కూడా ఇవ్వలేకపోయారని, దీనితో విపరీతంగా మందులు వాడా ల్సి వచ్చిందని అంటున్నారు. పోయిన ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎరువులు, క్రిమి సంహారకాల ధరలు కూడా భారీగా పెరిగిపోవడం రైతుకు తలకు మించిన భారం అయ్యింది. యూరియా, పోటాష్, డీఏపీ వంటి ఎరువులు మందుల రేట్లు ఒక్క ఏడాదిలో ఏడుసార్లు పెరిగాయి. దీంతో ఎకరానికి దాదాపు 15 నుంచి 18 వేల రూపాయల దాకా రైతులు ఖర్చు చేయా ల్సి వచ్చింది. తీరా చూస్తే ఎకరాకు గతంలో ఎనిమిది నుంచి పదిహేను క్వింటాళ్లు ఉండే దిగుబడి ఈసారి రెండు మూడు క్వింటాళ్లకు మించి రాలేదు. ఒక్క ముథోల్ ప్రాంతంలోనే దాదాపు లక్షా ఎనభై వేల ఎకరాల్లో రైతులు నష్టాన్ని చవిచూశారు. పండిన పంటను మిల్లుకు తరలిస్తే అక్కడ ప్రభుత్వం ప్రకటించిన ధరలు శరాఘాతాలయ్యాయి. గత ఏడాది క్వింటా ల్కు ఆరు నుంచి ఏడు వేల రూపాయలు పలికిన పత్తి ధర ఈ సంవత్సరం మూడువేల ఏడువందల దగ్గర ఆగిపోయింది.
ప్రకృతే కాకుండా ప్రభుత్వమే ఈసారి పత్తి రైతును చిన్న చూపు చూసింది. పోయిన ఏడాది కనీస మద్దతు ధరను 3,000 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఈసారి కేవలం రెండు వందలు పెంచి 32 వందలు చేసింది. ఖర్చు రెండింతలు పెరిగి, దిగుబడి పదోవంతుకు తగ్గినా రైతుకు మద్దతు ధరలో కేవలం 200 రూపాయలే పెరుగడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ఇదొక్క ఆదిలాబాద్ జిల్లా పరిస్థితే కాదు. మొత్తం తెలంగాణ పరిస్థితి. ఎందుకంటే ఈ ఏడాది ఖరీఫ్లో అధికారుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 19 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయితే ఒక్క తెలంగాణ జిల్లాల్లోనే పదిన్నర లక్షల హెక్టార్లలో పత్తి సాగయిం ది. అలాగే వర్షాభావం, నకిలీ విత్తనాలు, అనుకూలించని వాతావరణం, అనూహ్యమైన రోగాలు, నకిలీ పురుగు మందులు వెరసి తెలంగాణ లో ఐదున్నర నుంచి ఆరు లక్షల హెక్టార్లలో పత్తి పంట దెబ్బతిందని ప్రభు త్వం చెపుతోంది. ఆదిలాబాద్ రైతులు మాత్రం ఈ సారి జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో పత్తివేస్తే లక్ష ఎకరాల రాబడి కూడా రాలేదని వాపోతున్నారు.
ఆదిలాబాద్ రైతులు ఈ సందర్భంగా రెండు మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తారు. అందులో ఒకటి ప్రభుత్వ పక్షపాత ధోరణినికి సంబంధించినదైతే ఇంకొకటి తెలంగాణ ఉద్యమ ఉదాసీనతకు సంబంధించినది. కోస్తా రైతులు అసలు సాగు చేయకుండానే విరామం ప్రకటించి ఇంట్లో కూర్చుంటే ఆగ మేఘాల మీద స్పందించిన ప్రభుత్వం తెలంగాణ ప్రాంత రైతుల పట్ల ఎందుకని వివక్ష ప్రదర్శిస్తున్నారన్నది వారి మొదటి ప్రశ్న. ఖరీఫ్ సీజన్లో మొదట్లో పంట విరామం మీద నానా హడావిడి నడిచింది. కొందరు రైతు లు, రాజకీయ నాయకులు క్రాప్ హాలీడే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఈ నినాదం ప్రభావం ఎలాఉన్నా ప్రచారం మాత్రం భారీగా జరిగింది. జాతీయ స్థాయిలో ఇదొక చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వం ఒక ఉన్న త స్థాయి కమిటీని వేసి రైతులకు మద్దతుగా వివిధ చర్యలు చేపట్టింది. భీమవరం, నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా దాదాపు పదివేల ఎకరాల్లో పంట విరామం ప్రకటించినట్టు రాశారు.
అక్కడి స్థానిక అధికారులు, ఉద్యోగులు, ప్రజావూపతినిధులు ముక్తకంఠంతో రైతులకు రాయితీలు ఇవ్వాలని సిఫారసు చేశారు. ప్రభుత్వం వారికి దాదాపు పన్నెండు రకాల రాయితీలను ప్రకటించింది. పంటవేయకుండా ఇంట్లో కూర్చున్న రైతుకే పన్నెండు రకాల వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం తమ కుటుంబాల రెక్కల కష్టంతో పాటు, పెట్టిన పెట్టుబడులను కూడా పరిగణనలోకి తీసుకుని ఒక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. కేవలం ప్రభుత్వాన్నే కాదు, రైతుల పేరుతో అక్కడికి వెళ్ళిన చంద్రబాబును, జగన్ను వారిని తీసుకెళ్ళిన ఆయా పార్టీల నేతలను కూడా అదే అడిగారు. విజ్ఞప్తులు చేశారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ మొత్తంలో అత్యధిక స్థానాలిచ్చాం. చంద్రబాబు వస్తానంటే మాకోసమేనని నమ్మాం. కానీ ఆయన ఇక్కడ సుదీర్ఘ రాజకీయ ఉపాన్యాసం ఇవ్వడం మినహా మా కోసం ఎందుకని ప్రభుత్వంతో పోరాడడం లేదని అడుగుతున్నారు.
ఇప్పటివరకైతే ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు, జగన్ కూడా ప్రభుత్వం దృష్టి కి ఆ సమస్యను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ప్రభుత్వమే కాదు ఆయా పార్టీలు కూడా తెలంగాణ రైతులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు స్పందించాలి. తాము తెలంగాణ ప్రజలనుకుంటున్నట్టుగా సీమాంధ్రకు మాత్రమే ప్రతినిధులం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిమీద ఉన్నది. అలాగే కాంగెస్, టీఆర్ఎస్తో సహా కోస్తాలో కదిలినట్టే అన్నిపార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కలిసి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
అంతకంటే కీలకమైన బాధ్యత తెలంగాణ పార్టీలు, నాయకులు, ఉద్య మ కారులు ఉద్యోగుల మీద కూడా వాళ్ళు ఉంచుతున్నారు. ఇక్కడి ఉద్యోగులు జేఏసీలో ఉండి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. తెలంగాణ పట్ల వాళ్ళ చిత్తశుద్ధి గొప్పదే. కానీ మా పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారో అర్థం కావ వాపోతున్నారు. నకిలీ విత్తనాల నుంచి మొదలు, మిల్లర్లు ఇస్తున్న రేట్ల దాకా ఉద్యోగులు ప్రభుత్వానికి, కంపెనీలకు, మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారన్నది వాళ్ళ అభియోగం.

అంతే
కాదు పంటల భీమా విషయంలో,
కరెంటు కోత విషయంలో, మార్కెట్లో
తూకం, తరుగు విషయా ల్లో
ఉద్యోగులంతా రైతులను పరాయిగానే చూస్తున్నారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ
ఉద్యమం ఉధృతంగా నడిచిన రోజుల్లో తమ తమ వ్యక్తిగత
రాజకీయ అభివూపాయాలను, సొంత పార్టీలను వదిలి,
రైతులుగా తమకు జరుగుతున్న నష్టాన్ని
పంటికింద బిగబట్టుకుని మేము కూడా జేఏసీతో
కదిలాం కదా!, మరి అదే
జేఏసీ మా సమస్యలను ఎందుకని
తమ ఎజెండాలోకి తీసుకెళ్ళలేదన్నది ఆ ప్రశ్న సారాంశం.
జేఏసీ ఒక రాజకీయు లక్ష్యంతో
ఏర్పాటైన సంస్థ కదా అయితే
ఆ సంస్థకు మానవీయ దృష్టి ఉండకూడదా అని ఒక రైతు
నిలదీశాడు.
ఇది నిజంగానే కీలకమైన అంశం. ఏ ఉద్యమమమైనా సమాజాన్ని మానవీకరించకపొతే ఆ ఉద్యమం సంపూర్ణంగా విజయం సాధించినట్టు కాదు. ఉద్యమాలు ఎప్పుడూ సామాజిక మూలాలను స్పృశించకుండా గాలిలో పుట్టి గాలి లో కలిసిపోకూడదు. ప్రతి ఉద్యమానికి కారణాలు సామాజిక మూలాల్లో ఉన్నట్టే పర్యవసానాలు, ఫలితాలు కూడా సామాజిక విలువల్లో మార్పులు తీసుకువస్తాయి. తేవాలి కూడా! ఉద్యమాలన్నీ అనుకున్న సమయంలోనే, అనుకున్న పద్ధతిలోనే లక్ష్యం సాధించకపోవచ్చు. కానీ ఆ క్రమంలో అనేక ఇతర మార్పులకు ఉపకరిస్తాయి. కోడిపందాల మాదిరిగా గెలుపా, ఓటమా అనే రీతిలో కాకుండా ఉద్యమ క్రమంలో అది సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకునే జయాపజయాలను అంచనా వేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కూడా అటువంటి అనేక మార్పులను తీసుకు వచ్చిం ది.
ఉద్యమం చేపట్టిన వినూత్న కార్యక్షికమాలు తెలంగాణ ఆకాంక్షను బలం గా తెలియజేయడంతో పాటు తెలంగాణ సమాజం సంఘటిత పడటానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించడంలో బతుకమ్మ ఆటలు, వంటా వార్పులు, ధూమ్ ధామ్ వంటి కార్యక్షికమాలు మొదలు సకల జనుల సమ్మె వంటి అసాధారణ నిరసన ప్రక్రియల దాకా అనేక సాంస్కృతిక అంశాలను జోడించడం ఒక అద్భుతమైన ప్రయోగం. ఇది తెలంగాణ సమాజంలో సరికొత్త సామాజిక సమీకరణకు కొంతవరకైనా ఉపయోగపడింది. అంతేకాదు జేఏసీలు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల ఉమ్మడి కార్యక్షికమాలు తెలంగాణలో ఒక బలమైన పౌర సమాజానికి పునాదులు వేశాయి. అందులోంచి ఇప్పుడు కొత్త చైతన్యవంతమైన యువ నాయకత్వం ఎదిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లే కాక సమాజంలోని అన్నిరంగాల్లో నుంచి వచ్చిన ఈ యువ నాయకత్వంలో ఇప్పుడు కొంత ప్రగతిశీల లౌకిక ధోరణి, సహనశీలత, సామాజిక సమ భావన కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో చాలా వరకు ఉపయోగపడే అంశం.
ఉద్యమంలో ఎదుగుతున్న పౌర సమాజం కొన్ని విషయాలను విస్మరిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర సాధనకు కలిసి పనిచేసినట్టే తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా కలిసి నడవాలన్న స్పృహ కలిగించకపోవడం అందు లో ప్రధానమైంది. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆ భావన కలిగించే పని చేయాలి.

తెలంగాణ సాధన ఒక రాజకీయ
ప్రక్రియ కాబట్టి సంఘటితంగా పోరాడాలన్న భావనకు ఇచ్చినంత ప్రాధాన్యం తెలంగాణ సమా జం ఎదుర్కొంటున్న
సంక్షోభాలను కూడా ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న
విషయాన్ని జేఏసీ తమ శ్రేణులకు
అర్థం చేయిస్తే ఉద్యమానికి ఒక సార్థకత ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ తెచ్చి తీరుతాం అంటున్న వాళ్ళు, వచ్చి తీరుతుందని చెపుతున్నవాళ్ళు
ఈ దిశగా ఆలోచిస్తే ఒక్క
రైతులే కాదు ఈ ప్రాంత
ప్రజలందరికీ తెలంగాణ వచ్చే దాకా బతికే
ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి