మంగళవారం, జులై 19, 2011

తెగేదాకా లాగడమే మేలు..!


  సమైక్యాంధ్ర నాటకంలో ఇప్పుడు కొత్త అంకానికి తెరలేచింది. అదే కథ, అవే పాత్రలు. అయితే రంగం మాత్రం ఢిల్లీకి మారింది. ఢిల్లీ చేరుకు న్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల కారుకూతలు విన్న వాళ్లకు ఎవరికైనా ఇక ఈ రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజలు కలిసిఉండే అవకాశం ఎంతమాత్రం లేదని, అది శ్రేయస్కరం కూడా కాదని అర్థమైపోతుంది. ఢిల్లీలో ఉన్నవాళ్లకు కూడా ఈ సంగతి అర్థమయినా సీమాంధ్ర నాయకులను ఢిల్లీకి పిలుచుకొని మళ్లీ చర్చల పేరుతో కొత్త ఆటకు తెరలేపారు. తెలంగా ణ విషయంలో చాలా మంది తెలంగాణ మేధావులు కూడా ఇప్పుడు చర్చ లు జరగాలంటున్నారు. నిజమే! భిన్నాభివూపాయాలున్న ప్రతి సందర్భంలో చర్చలు వినా సమస్య పరిష్కారానికి మరో మార్గం లేదు. 


కానీ ఆ చర్చలు ఎవరితో జరగాలి? ఎవరి మధ్య జరగాలి? ఏ ప్రాతిపదికన జరగాలి? అనే విషయాల పట్ల స్పష్టత లేకుండా చర్చలనడంలో అర్థం లేదు. విడిపోవడానికి సూత్రపాయంగా అంగీకరిస్తే చర్చలు షరతులు ఉంటాయి గానీ అందుకే ససేమిరా అంటున్న వాళ్లతో ఏమని చర్చలు జరపాలి? పైగా చర్చలకు పిలుస్తోన్న వ్యక్తులే ఏకపక్షంగా వాదిస్తోంటే చర్చించి మాత్రం సాధించేది ఏముంటుంది? తెలంగాణ విషయంలో ఇప్పటి దాకా జరిగినంత చర్చ బహుశా ఈ దేశంలో మరే సమస్య మీద కూడా జరగలేదు. యాభై ఏళ్లుగా చర్చలు, షరతులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండేళ్ల నుంచి రాష్ట్ర విభజన కు సంబంధించి చర్చ జరగని రోజు లేదనే చెప్పుకోవాలి. స్వయాన కేంద్ర ప్రభుత్వమే కొన్ని కోట్లు ఖర్చు చేసి శ్రీకృష్ణ కమిటీ పేరుతో ప్రజలతో చర్చించింది. అభివూపాయాలు సేకరించింది. 



ఆ నివేదిక పట్ల న్యాయమైన రీతిలో తీర్పు చెప్పాల్సిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు చర్చలని సాగదీయడం ఒక మోసపూరిత ఆలోచన. తీర్పు చెప్పాల్సిన సమయంలో మళ్లీ వాదనలు వింటామని పిలవడం వెనుక మోసం చేయాలన్న ఆలోచనే ఉండవచ్చు. నిర్ణయం తీసుకున్నాక ఎన్ని రోజులైనా చర్చించుకోవచ్చు. సర్దుబాట్లు చేసుకోవచ్చు. బహుశా అందుకేనేమో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చలకు రామని చెప్పారు.

అలా చర్చల ముచ్చటే లేదని తేల్చి చెప్పినందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలను అభినందించాలనిపించవచ్చు. కానీ వాళ్లు ఆ మాట మీద నిలబడతారో లేక తెల్లారే సరికల్లా రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలిపోతారో తెలియదు. కాబట్టి మనం ఆ పని చేయనవసరం లేదు. ఎందుకంటే రాజీనామాలు నామమావూతంగా ప్రకటించి పదవులు వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తోన్న మంత్రులు, రాజీనామాలు చేయకుండానే దబాయిస్తోన్న వాళ్లు, వాళ్లే అసలైన మగాళ్లని కీర్తిస్తోన్న ఆడవాళ్లు అదే పార్టీలో, తెలంగాణలోనే ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లో కొందరు నేతలు రాజీనామాలు చేసింది ప్రజల భయంతోనే తప్ప తెలంగాణ మీద భక్తితో కాదని తేలిపోయింది. 



ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రెండాకులు ఎక్కువే చదివింది. కాంగ్రెస్ వాళ్లకంటే గంటో, అరగంటో ముందుగానో తమ రాజీనామాలు ప్రకటించి ఆ పార్టీ నేతలంతా తెలంగాణ బస్సు యాత్ర చేపట్టారు. పోయిన ప్రతిచోటా తాము ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను గడ్డిపోచల్లా వదిలేశామని చెప్పుకున్నారు. నిజమే కావచ్చు. కానీ వాళ్లను రాజీనామాలు చేయమన్నది రెండో కన్ను తెరిచి తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు చిత్రపటాన్ని తెలంగాణ ప్రాంతంలో ఊరేగించడానికి కాదన్న సంగతి తెలుగుదేశం నేతలకు ఎందుకు అర్థం కాలేదు? రాజీనామాలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, లేదా కనీసం ఆయా పార్టీల్లో రాజకీయ సంక్షోభాన్నయినా సృష్టించవచ్చని అనుకున్నం. తెలుగుదేశం పార్టీ సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ అధినేతకు కనువిప్పు కలిగించాలని తద్వారా ఆయన ఏదో ఒక అభివూపాయాన్ని చెబుతాడని అశించాం. 



కానీ అందుకు భిన్నంగా ఆ పార్టీ ఇప్పు డు జెండా పండుగకు సిద్ధపడడం చూస్తోంటే వాళ్ల రాజీనామాలు ఎందుకు కోరామా అనిపించకమానదు. ప్రజల కోరిక మేరకే రాజీనామా చేశామని చెప్పుకుంటున్న ఈ నేతలు రాజీనామాలతో తమ మొక్కు చెల్లించుకున్నాం కాబట్టి ఇక ఏ పాపం చేసినా ఫరవాలేదన్నంత ధీమాగా ఉన్నారు. ప్రజలు రాజీనామా చేయమని అడిగింది ఈ నాయకులు తమతో ఉండాలనే తప్ప తమ సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేయడానికి కాదు కదా? నిజానికి తెలంగాణ ప్రజావూపతినిధులంతా రాజీనామాలు చేసి ప్రజలతో కలసి ఉద్యమాన్ని బలోపేతం చెయ్యాలని ప్రజలు కోరుకున్నారు. రాజీనామాల వల్ల ఆయా పార్టీలు దిగివస్తాయని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని, ఆ నిర్ణయం తెలంగాణ ప్రకటించడానికి కేంద్రం చూపిస్తోన్న అడ్డంకులను తొలగిస్తుందని ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం న్యాయబద్ధమైంది. ప్రజాస్వామ్యంలో జరిగేది అదే. 



కానీ మన రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను, విశ్వాసాలను తమ మనుగడకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. తెలంగాణ చరివూతలో ఇది ఎన్నోసార్లు జరిగింది. చెన్నాడ్డి నాయకత్వంలో చర్చలు జరపడానికి ఏం చేశారో మనకు తెలుసు. అదే పరిస్థితి ఇప్పుడు జానాడ్డి వాళ్లకు రాదనీ చెప్పలేం. ఇటు తెలంగాణలో అటు సీమాంవూధలో రెండు పార్టీలు తమ ఆధిపత్య రాజకీయాల కోసం ప్రజలతో జూదం ఆడుతున్నాయి. కాంగ్రెస్ రెండు ప్రాంతాల నేతలతో మంతనాలు సాగిస్తోంటే తెలుగుదేశం నాయకులు ఇక్కడ బస్సుయావూతలు, అక్కడ పాదయావూతలు చేస్తున్నారు. రెండు చోట్లా సోనియాగాంధీ, చంద్రబాబు వేరు వేరు భంగిమల్లో పోస్టర్లపైన, ఫ్లెక్సీలపైన దర్శనమిస్తున్నారు. ఇద్దరూ అనుకూలమో కాదో చెప్పకుండా మాకు రెండు ప్రాంతాలు సమానమే అని పాడిన పాటే పదే పదే పాడుతున్నారు. సంగీతానికి చింతకాయలు రాలవన్నది వాస్తవం. ఈ విషయాన్ని మనకంటే ముందుగా గుర్తించింది సీమాంధ్ర నాయకులే. నిజానికి మనవాళ్లకంటే సీమాంధ్ర నేతలే నయం. పార్టీలు వేరైనా పాట మాత్రం ఒకటే పాడుతున్నారు. టీజీ వెంక జేసీ లాంటి రాయలసీమ నేతలు, వర్ల రామయ్య, కోడెల వంటి టీడీపీ నేతలు తమ అధిష్ఠానాల ఆటపూలా ఉన్నా అడ్డుకుంటామని చెబుతున్నారు. అంతేకాదు కొత్తగా తెలంగాణ అంటే తలలు తీస్తామని, సైనిక దళంతో ఊచకోత కోస్తామని రెచ్చగొడుతున్నారు. 



తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని చెప్తూ వచ్చిన వాళ్ల అధిష్ఠాన వర్గాలను ధిక్కరించి తెలంగాణ ఉద్యమాన్ని ఎదిరిస్తున్నందుకు వారిని అభినందించాలి. వాళ్లు గట్టిగా లాగితే తప్ప ఇది తెగేలా లేదు. పైగా రెండు వైపులా లాగితే తప్ప ఇదొక కొలిక్కొచ్చే విషయం కాదు. అందుకే ఇప్పటికైతే మనం వెంక పంపే సైనికులను స్వాగతిద్దాం. వాళ్లు వస్తే వీళ్లని సాగనంపడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పనుండదు. అయినా సైనిక దళాలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు సమైక్య దళాలొక లెక్క కాదు. వ్యూహం ఏదైనా ఉచ్చు ఎవరిదైనా అన్ని పార్టీలు ఇప్పుడు రాజీనామాల చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాయి. ఆటను ఇంకా సాగదీయలేమని అర్థమైపోయింది. అందుకే కొందరు తత్తరపడుతోంటే, ఇంకొందరు త్వరత్వరగా పావులు కదుపుతూ పోతున్నారు. తెలంగాణరాకుండా రాజీనామాలను వెనక్కి తీసుకునే ధైర్యం లేదు. అలాగని ఎన్నికలకు వెళ్లే సాహసం చేయరు. ప్రజలిప్పుడు తెలంగాణ తప్ప మరొకటి కోరుకోవడం లేదు. తెలంగాణ కోసమే రాజీనామాలు చేసి ఉంటే వాళ్లంతా ఒక చోటికి చేరేవారు. 



ప్రజలతో కలిసి పోరాడేవారు. అయినా వాళ్ల ప్రమేయం లేకుండానే ప్రజలు ఒక్కటిగా ఉన్నసంగతి గత వారం జరిగిన బంద్‌లు, రైల్‌రోకోలతో తెలిసిపోయింది. ఈ విషయాన్ని రాజీనామా చేసినవాళ్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్‌లు జేఏసీతో చేతులు కలపాలి. రాజీనామా చేసిన 141 మంది తెలంగాణ గొడుకు కిందికి చేరాలి. అంతే తప్ప ఎవరికి వారే అయితే ఎవరికీ కాకుండా పోతారని గుర్తించాలి. సకల జను లు సమ్మెకు సమాయత్తమవుతున్న ఈ తరుణంలో రాజకీయ లబ్ధి చూసుకుని ఎత్తులు వేయడం కంటే మీ మీ పార్టీలపై సమ్మె చేయండి. అలా చేయకపోతే వచ్చేవి ఎన్నికలే. బహుశా అవి మీకు చివరి ఎన్నికలు కూడా కావొ చ్చు. ఉద్యమం చివరి దశకు చేరిన ఈ తరుణంలో ఏదైనా జరుగవచ్చు. ఇంతకాలం విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు, న్యాయవాదులు ఇతర ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. నిజానికి వాళ్లు ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఇప్పటి దాకా ప్రజలను నడిపించారు. ఆ ప్రయత్నం వల్లే ఇవాళ ఈ దశకు చేరుకున్నాం. 



ఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ముందు వరుసలో నిలబెట్టి వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉద్యమం ముందుకు సాగాలి. లేకపోతే ప్రజల బూచి చూపి ఆయా పార్టీలో వీళ్లు బేరసారాలు చేసుకోగలరు. రాజీ పడిపోగలరు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించగలరు. అందుకే మనం గద్దర్ చెప్పినట్టు వీళ్లకు కాపలా కాయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి