శనివారం, జులై 10, 2021

పురాస్మృతులు



 ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి
రణగొణ ధ్వనులకు దూరంగా 
ప్రశాంతమైన ఆ ప్రాంతానికి 
గతించిన కాలంలో బతికి చెడ్డ
పురాస్మృతుల దుఖ్ఖ భూమికి  
ఒక్కసారి వెళ్ళిరండి 
 
శాంతిని కాంక్షించే మీకు 
అసలు యుద్ధమంటే ఏమిటో తెలుస్తుంది
బతుకుపోరులో ఓడిపోయిన విస్తాపితులు  
మట్టిలో నిక్షిప్తమై పోవడం కనిపిస్తుంది 
 
 అభివృద్ధిని చూడడానికో
ఆనకట్టను చూడడానికో కాదు
మనిషి ఆనవాళ్లు చూడడానికి
మునిగిపోయిన ఆ వూళ్ళలోకి 
ఒక్కసారి వెళ్ళిరండి 
 
వీలుచూసుకుని వారాంతపు విడిదికో 
విహారానికో వెళ్లి ఓ పూట గడిపిరండి 
 
 
 
 అభివృద్ధికి దారి చూపిన 
ఆ నేలమీద 
నాలుగడుగులు నడిచి రండి
అది ఎంతటి విధ్వంసమో
ఎలాంటి విషాదమో అర్థమౌతుంది
నీళ్లు పారిననేల స్వర్గసీమని 
చెప్పుకుంటున్న మీరు
ఆ నది నిలిచిన చోటికి 
ఒక్కసారి వెళ్లిరండి 
ఆ నిరాశ్రయ నరకాన్ని  చూసిరండి 

వేలాది లక్షలాది మంది ఉసురు తీసిన 
ఆ గాలిని ఒక్కసారి పీల్చిరండి
ప్రాణవాయువు అంటే ఏమిటో తెలుస్తుంది
ప్రాణం విలువేంటో బోధపడుతుంది
 

II 

అదిగో మునిగిపోయి ఉన్న
ముప్పైమూడు ఊర్ల చివరన   
చిందరవందరగా పడుకునిఉన్న గుట్టల నడుమ
పోచమ్మ పహడ్ కూడా ఉండేదక్కడ
 


 పోచమ్మ తల్లి చల్లని చూపు కోసం
పంబాల పూజలు, పోతరాజుల పాటల నడుమ
జమిడికెల కొలుపులు జాతరల నడుమ
హోరెత్తే గోదావరి ఒడ్డున 
ఊరూ వాడా, పిల్లాజెల్లా సల్లంగుండాలని 
ఎల్లనంపిన నేల కదా అది
 
ఎల్లమ్మకూ  ఏడుగురు చెల్లెళ్లకు 
ఎందరో అమ్మలు బోనం వదిలిన జాగ కదా అది 
ఇంకా అక్కడేదో కుతకుత ఉడుకుతున్న వాసన 
మీ ముక్కుపుటాలను తాకుతుంది 
ఆ జననైవేద్యాన్ని ఆస్వాదించడానికైనా 
అక్కడికి ఒక్కసారి వెళ్ళిరండి 
ఆశచావని ఊరి దేవతలకు ఆరగింపు ఇచ్చిరండి

 
 నర దిష్టి సోకకూడదని
నాయకపోడు ఆదివాసులు
మేకపోతులను, గొర్రెపిల్లల్ని
బలిచ్చిన భూమి కదా అది
ఒక్క సారి ఆ భూమిని తాకి రండి 
 ఆ చిత్తడిలో మనిషి నెత్తుటి తడి తగిలి 
మీ పాదాలు స్రవిస్తాయి
 పాషాణ హృదయాలైనా ద్రవిస్తాయి  

ఘనీభవించి, గిడచబారడంకంటే 
ద్రవించడమే గుండెకుమంచిది 
అందుకైనా ఆ ఛాయల్లో తిరిగిరండి 
ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి

నదిఒడ్డున నాగరికత పరిమళాలు విరాజిల్లిన పల్లెలు
ఉన్నట్టుండి మాయమై పోయాయి 
పచ్చని పొలాలు, పసిడిపంటలు
పాడి పశువులు, పసిపిల్లలు నడయాడిన ఆ నేల
అప్పుడెప్పుడో అర్ధ శతాబ్దికిందే అంతర్ధానమయ్యింది
నది చుట్టూ పాయలు పాయలుగా పరుచుకున్న పల్లెలు
ఉన్నట్టుండి ఉప్పొంగిన మహాశ్రీ సాగరంలో కలిసి పోయాయి 
 

మనిషి నిర్మించిన సాగరం 
పేరేదైనా కన్నీటి కాసారమే కదా 
పరాధీన లోకమేకదా 
పరాజితుల శోకమే కదా 
పాతాళానికంటే లోతైన 
ఆ లోకానికి వెళ్ళిరండి ఒక్క సారి
ఆ కన్నీటిని తుడిచి రండి 

మీ కళ్ళింకా ఇంకిపోలేదని
మీలోఇంకా జీవముందని
నిర్ధారించుకోవడానికైనా సరే 
మీరు ఆ వూరికి ఒక్కసారి వెళ్ళిరండి  
 
 
ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి  
ఆశల పొదరిల్లు వదిలి
కలల లోగిళ్ళు వదిలి
ఉనినికి ఊపిరి పోసిన 
ఆ ఊళ్ళు వదిలి
ప్రాణానికి ప్రాణమైన 
పల్లెలు వదిలి
ప్రణయాలనూ,  
ప్రాణ స్నేహితులను వదిలి
తరతరాలుగా పెనవేసుకు బతికిన
బంధువులను, అనుబంధాలను వదిలి
కాందిశీకులై కదిలిపోయిన 
ప్రాణాలు కదా వారివి
అక్కడి జీవితాలతో అల్లుకుపోయిన 
ఆత్మలు కదా వారివి 
 
ఆ ఆత్మ కథల్ని ఆలకించడానికైనా
ఒక్కసారి ఆ నదీలోయకు వెళ్ళిరండి
ఆ ఆర్తిని అర్థం చేసుకోవడానికైనా 
మీరు ఆ నిర్జనావాసాన్ని చూసిరండి
 

III

ఏళ్లకు ఏళ్ళు ఆ నేలమీద 
నడయాడిన పక్షులు, పశువులు
ఆ నేలే నెలవై బతికిన సమస్త జీవరాశులు 
ఎటుపోయి ఉంటాయో, ఏమై పోయాయో కదా 
కొంచెం మనసుపెట్టి చూడండి 
 
 
 
పూడుకున్న నూతిలోనో
పాడుబడిన గోతిలోనో
ఊటబావి నీటిలోనో
ఊరిచివరి ఏటిలోనో
నరమానవుడు కనిపెట్టలేని 
మునిగిపోయిన చోటులోనో
ముళ్లపొదల మాటులోనో 
తలదాచుకు ఉంటాయి 
 
ఏ పాడుబడిన బడి లోనో
దేవుడు లేని గుడిలోనో 
చిత్తడి తడి లోనో
గడ్డిపూల ఒడిలోనో 
పెనవేసుకు ఉంటాయి
ఒక్క సారి ఆరా తీసి రండి 
ఆచూకీ కోసమైనా ఆ ఏరు వరకు వెళ్ళిరండి 
 ఆకుపచ్చ ఎడారితీరాన్ని చూసి రండి

 
నీరింకి నోళ్లు తెరిచిన ఆ ఊర్ల పొలిమేరలు 
ఒక్క సారి తిరిగి రండి
ఆ మెత్తటి పచ్చిక బయళ్ళ మీద 
నాలుగడుగులు నడిచి రండి
ఆ డొంక దారుల్లో
మట్టిమనుషుల అడుగుజాడలు 
మీ మడిమెలను ముడివేసుకుంటాయి
చెదిరిపోని చెమట చుక్కలు 
మంచుబిందువులై 
మీ కాళ్ళను కడుగుతాయి 
గరికపోచల గడ్డిపూలు 
గాఢంగా అల్లుకుంటాయి 
గుండెలకు హత్తుకుంటాయి
పసిపాపలై ఆడుకుంటాయి 
 
ఆ అనుభూతికోసమైనా, ఆనందం కోసమైనా
మీరొక్కసారి ఆ మృత్తిక మైదానానికి 
వెళ్ళిరండి  
 
అక్కడ కాసేపు
కళ్ళు మూసుకుని  
ఆ ఆకాశంనించి 
అలల పైపొరలనుంచి వచ్చే 
తరంగాల రాగాలను వినండి
వాయులీనమైన వేనవేల ఊసులు 
మీ చెవిన పడతాయి
 
 గుండె పగిలిన గొంతుతో 
భూపేన్ హజారికా ఆలపించిన
నదీలోయల అస్తిత్వ స్వర తరంగాలు
మీ హృదయాలకు వినపడతాయి 
ప్రవహిస్తూ వెళ్లాల్సిన గంగమ్మ 
ప్రాణాలను దిగమింగి 
ఎందుకు ఆగిపోయిందో
నిండు జీవితాలను ఎందుకు 
నిండా ముంచేసిందో అర్థమౌతుంది
మా తుజే సలాం అని భూతల్లిముందు 
మోకాలు లోతు బురదలో 
మోకరిల్లిన ఏ ఆర్ రెహమాన్ నివాళి 
ఏ తల్లికోసమో, ఎందుకో మీకు తెలుస్తుంది 
 
ఎప్పుడో బతుకమ్మలు పాడుకున్న
కోలాటపు రాగాలు కలగలిసిన
జానపదుల జాజిరి పాటలు
మరణమృదంగ  బృందగానమై   
ఒక స్వర సింఫనీ మీ మనసును కదిలిస్తుంది
ఆ ఆ గానంతో క్షణమైనా గొంతు కలపండి 
ఆ పదాలకు మీ వంతుగా వంత పాడండి
ఒక్కసారి ఆ స్వర ఝరి లో తడిసిరండి 
ఒక్క సారి అక్కడికి వెళ్ళిరండి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 నింగిని విడిచి 
జారిపోతున్న 
నీలాకాశానికీ  
పచ్చగా పరుచుకున్న 
ఆ పసిరిక నేలకూ నడుమ
ఇంకిపోకుండా 
ఇంకా మిగిలిన జ్ఞాపకాల కన్నీటి పొర
కుత్తుకలు కోసిన చురకత్తిలా 
తళతళా మెరుస్తూ కనిపిస్తుంది 
వీలయితే ఆ అలలను ఒక్కసారి 
మీ పాదాలతోనైనా తాకిరండి
మీ పాపాలను అక్కడే కడిగేసుకోండి 

IV

మనిషి ఆనవాళ్ళు మాయమైపోయిన 
మరుభూమిలాంటి నేలమీద 
ఏముంటుంది అనుకోకండి 
అక్కడ మీకోసం అనేక పసి ప్రాణాలు 
ఎదురు చూస్తుంటాయి
వన్యప్రాణులై మీకు 
స్వాగతం పలుకుతాయి 
సాదరంగా ఆహ్వానిస్తాయి

 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 ఊరి వీధుల్లోనో
నది ఒడ్డుమీదనో  
చెట్లల్లోనో, చేమల్లోనో
పొలాల గట్లమీదనో
కొండల్లోనో, కోనల్లోనో
ఎండల్లోనో, వానల్లోనో
పారే వాగుల్లోనో, పొంగే వంకల్లోనో 
ఆడిపాడుకున్న ఆ ఊరి పిల్లలు
గుంపులు గుంపులుగా జింక పిల్లలై
 ఎగురుకుంటూ ఎదురొస్తారు 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

 
 గంతులేస్తూ కనిపిస్తారు 
ఆడుకుంటూ అలరిస్తారు
 తమ తాతల్ని తరిమేసిన బూచాడు 
మళ్ళీ వచ్చాడేమోనని 
గుబులు గుబులుగా మీవంక 
తిరిగి చూస్తూ పరుగెడతారు 
మీ గుండె చప్పుళ్ళు వింటారు 
చుట్టాలు వచ్చినంత సంతోషంగా 
సందడి చేస్తారు, సంబరపడిపోతారు 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 వెళ్లిపోతున్న మీకు 
విచారంగా వీడ్కోలు చెపుతారు 
మళ్ళీ రండని కన్నీళ్లు నింపుకుంటారు 
అదొక మృగయా వినోదంగా మారిపోకముందే
ఆ మూగజీవాలు పారిపోకముందే 
ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి 
ఆ పరివారాన్ని పలకరించి రండి
 
మీకు అక్కడక్కడా తాడూ బొక్కెనలేని
మంచినీటి చేదబావులు
వలలువేసి ప్రాణాలు తోడేసిన
మొండి మోటబావులూ కనిపిస్తాయి
ఇప్పుడు వాటిలో నీళ్ళున్నాయి కానీ జీవంలేదు 
అది నిశ్చల నది
అసలు అక్కడి నీటిలోనే జీవంలేదు

అయినా కొత్తపూత పూస్తోన్న
ఆ  పొలాలను గమనించండి
నాట్లేస్తూనో, కలుపుతీస్తూనో, కోతలు కోస్తూనో
అలిసి పోయిన అమ్మలక్కలు
పగిలిపోయిన గాజుముక్కలై మెరుస్తుంటారు 
 
 
పరుచుకున్న పసిరిక మీద 
ఎర్రని కందిరీగలై ఎగురుతుంటారు 
పల్లెపాటలు పాడుతుంటారు
మనచుట్టే తిరుగుతుంటారు 
ఆడపడచుల వాయినాలు అడగని 
వాళ్ళను ఒక్కసారి 
పలుకరించడానికైనా 
పరామర్శించడానికైనా
అక్కడిదాకా వెళ్ళిరండి

అలాగే పురా జ్ఞాపకాలను దిగమింగి 
సగంపూడుకుపోయి 
పాడుబడిన బావులూ,
కయ్యల్ని దాటుకుంటూ 
ఇంకొంచెం నడవండి

మీ వెంటే ఎప్పుడో నిరాశ్రయులై 
వెళ్ళిపోయిన వలసపక్షులు 
వరుసకడతాయి
పాత వరసలతో 
మిమ్మల్ని పలకరిస్తాయి
 
 
ఏ గల్ఫ్ దేశంనుంచో  వచ్చే 
వలసకూలీల్లాగే ఏడాదికోసారి
ఎండిపోయిన తీరాన్ని చేరి
ఆత్మీయులను కలుసుకుంటాయి
కష్టసుఖాలు కలబోసుకుని
కన్నీరు నింపుకుంటాయి
తాతల కాలంనాటి 
వైభవోపేత వీరగాధల్ని 
కథలు కథలుగా చెప్పుకుంటాయి
                                                    
                                                                            
 
ఇంకాస్త ముందుకు వెళ్ళండి 
నిలువునా శిధిలమైన చావిడి అరుగుల మీదో
నీళ్ళల్లో పూడుకుపోయిన బొడ్రాయి దగ్గరో
బురదలోపలికి కూరుకుపోయిన 
రావిచెట్టు మూలాల్లోనో 
వృధాప్యంతో వంగిపోయిన కొంగలు

గుంపులుగుంపులుగా కూర్చున్న
ఫ్లెమింగోలు కనిపిస్తాయి
జన్మజన్మల రుణమేదో 
ఆ ఊరితో ఉన్నట్టు 
ప్రాణాలకు  రెక్కలు కట్టుకుని
ఖండాతరాలు దాటి 
ఆ వూరికి  వీలుచిక్కినప్పుడల్లా 
వచ్చి పోతుంటాయి
అక్కడే అంతరించి పోయిన 
ఏడేడు తరాలను తలుచుకుని 
వలవలా విలపిస్తాయి

ఆ భూమి పొరల్ని ఆత్మీయంగా 
తడిమి చూసుకుంటాయి 
పూడుకుపోయిన ఆ పునాది రాళ్ళనడుమ 
అమ్మదో, నాన్నదో 
పూర్వీకులదేదైనా ఆచూకీ
దొరుకుతుందేమేమోనని 
ఆశగా తరచి చూస్తుంటాయి 
 
ఒక్క సారి వెళ్ళిరండి
ఆ వెతుకులాటలో సాయపడడానికి 
ఏ సాయంత్రమో అలా వెళ్ళిరండి 
భూస్థాపితమైన అస్తిత్వపు ఆనవాలేదో
మీకు ఖచ్చితంగా దొరికి తీరుతుంది
 

V

తప్పకుండా ఒక్కసారి 
ఒకేఒక్కసారి 
అక్కడికే కాదు, మరెక్కడికైనా 
నదిని  నిలిపేసిన చోటికి 
నాగరికతను నలిపేసిన చోటికి
నీటిలో మునిగిపోయిన 
ఏదోఒక వూరికి 
సీలేరుకో, సింగూరుకో 
మానేరుకో , మా ఊరికో  
ఎక్కడికో ఒక చోటికి వెళ్ళిరండి

 
మీకక్కడ బతుకంటే ఏమిటో తెలిసివస్తుంది 
ఉనికంటే ఏమిటో తెలిసివస్తుంది 
ఊరంటే ఏమిటో తెలిసివస్తుంది 
కులంమంటే, స్థలమంటే  
బలమంటే, బాధంటే, 
మనిషికీ మనిషికీ మధ్య అనుబంధమంటే 
మనిషికీ మట్టికీ పెనవేసుకుపోయిన 
పేగుబంధమంటే తెలిసివస్తుంది 
 
 విస్థాపన ఈ సమస్త సమిష్టి అస్తిత్వాలను 
భూస్థాపితం చేసిందని విశదమౌతుంది 
నిర్వాసితుల నిర్వేదం అర్థమౌతుంది
 

మీరక్కడికి వెళితే నది సంపదగా మారే 
అమానవీయ ప్రక్రియ అర్థమవుతుంది 
నది నీరూ, కన్నీరు ఘనీభవిస్తేనే 
ధాన్యం గింజ అవుతుందన్న 
తత్వం బోధపడుతుంది 
 
సర్వస్వం కోల్పోయిన 
నిర్వాసితుల  బతుకే
మన కంచంలో మెరిసే 
అన్నం మెతుకన్న పరమ సత్యం 
తెలిసివస్తుంది
 
  -ఘంటా చక్రపాణి






 
*2021 జున్ 3-4 తేదీల్లో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాంతంలో  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ పరిసరాల్లో పచ్చిక మైదానాలుగా మారిపోయిన ముంపు గ్రామాలను చూసినప్పుడు కలిగిన ఆలోచనలు. ప్రాజెక్టులోకి వచ్చేప్రవాహం తగ్గినప్పుడు ఆ నీటి అడుగునేలలన్నీ వివిధ రకాల పక్షులు, జంతువులు, ముఖ్యంగా వేలాదిగా వచ్చి చేరే కృష్ణ జింకలు, నీటికొంగలూ ,ఫ్లెమింగోల లాంటి అరుదైన వలసపక్షులతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రేమికుడూ, ఆ ప్రాణుల ప్రేమికుడూ అయిన క్యాతం సంతోష్ కుమార్ సౌజన్యంతో అక్కడ ఒక రోజంతా కలియదిరిగే అవకాశం వచ్చింది.

**వలసలు, నిర్వాసితులకు సంబంధించిన ఒకటి రెండు ఫైల్ ఫోటోలు మినహా మిగితావన్నీ అక్కడివే . సంతోష్ కుమార్, ఆర్హత్ బోధి, పుష్ప, మిలింద్ తీసినవి.

 

సోమవారం, జులై 05, 2021

Submerged Memories


The Tale of a Blacksmith

"I am Narayana,

Kammari Narayana.

I am a blacksmith by Caste, and 

I belong to Yaswada village, which was submerged

under Lower Manair Dam".

 "The Dam forced us to leave our village and 

to flee from our own homes and hometowns like birds 

without a destination".


 "We left our places where our forefathers and 

we lived with pride and dignity as skilled professionals. 

 Our family used to serve the agricultural needs and 

supply iron-made tools to the entire village". 

 "As a young professional I started my traditional career at the age of 8. 

 I won the hearts of more than hundred farmers for more than fifty years".

"Suddenly they announced the construction plan of Lower Manair Dam and

a little compensation was thrown on us like alms to beggars". "With that meager compensation, along with my wife and only son, I wandered here and there as a beggar and finally settled here".

“After a decade of the settlement in this village, I am a stranger; no one recognizes me and my skills. They still look at me with suspicion doubting my skills and credibility".

"No one comes forward to give me the carpentry work. My own caste people also do not allow me to take up the works from the local farmers because the village is their Vathan. "Traditionally the rights have been assigned to their families for generations".

In my village I was a king, Every morning dozens of farmers used to wait in queue before my house to sharpen their instruments".

"Now I am helpless just sitting outside my hut with my dried up furnace and waiting for a customer who visits once in a blue moon, that too, not to sharpen the iron bars or spades but to dig the graves."*

**Kammari Narayana cried loudly narrating his story when Dr. Chakrapani Ghanta, the researcher visited his place in 1996, as a part of his fieldwork for a documentary on ‘Displacement’ of Lower Manair Dam outskirts in Malkapur village near Karimnagar.

** This story was part of my presentation in an International Conference on Social Sciences, 13-16 June, 2005, Honolulu, Hawaii,US

Originally Published in June 2005 in my google site Yaswada

https://sites.google.com/site/yaswada/taleofablacksmith

గురువారం, జూన్ 03, 2021

ఆంధ్రా నడిగడ్డమీద తెలంగాణ అస్తిత్వ ప్రకటన!

మిత్రులకు మరోసారి తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

నేను ఈ (2021) తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా జైత్రయాత్ర శుభాకాంక్షలు అని రాశాను. దానికి ఒక సోదరుడు జైత్రయాత్ర అనవద్దని, ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని అభ్యంతరం వ్యక్తం చేసాడు. అయినా సరే ఇది జైత్రయాత్రే! జైత్రయాత్ర అంటేనే ఆధిపత్యాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని సమూలంగా ఎదిరిస్తూ, ధిక్కరిస్తూ ప్రాణత్యాగానికి వెరవకుండా విజయమే అంతిమ లక్ష్యంగా సాగే యాత్ర. నా దృష్టిలో తెలంగాణా అలాంటిదే. నేను తెలుగు టెలివిజన్ అందులో ముఖ్యంగా న్యూస్ చానెల్స్ పుట్టిన నాటినుంచి వార్తా విశ్లేషణలో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా మిత్రుడి సోదరుడిగా నాకు కూడా సోదర సమానుడు రవిప్రకాష్ మొదటిసారిగా 1995 లో మొదటి తెలుగు సెటిలైట్ ఛానెల్ జెమినీ టీవీ ప్రారంభించాడు. ఆ తరువాత టీవీ9 ద్వారా అతడే సంచలనాలకు కారణం అయ్యాడు. అతనే ఒక మాజీ (?) జర్నలిస్ట్ గా, ఒక ఆధ్యాపకుడిగా ఉన్ననన్ను 1995-96 నుంచే ఒక విశ్లేషకుడిగా మార్చేశాడు. బహుశా తెలుగులో నేనే మొదటి రాజకీయ/వార్తా విశ్లేషకుడినేమో. ఎవారైనా విభేదించినా అభ్యంతరం లేదు. 1995-2014 అంటే సరిగ్గా రెండు దశాబ్దాల్లో నేనువెళ్లని ఛానెల్ లేదు. కొన్ని వేల కార్యక్రమాలు, చర్చలు, సందర్భాల్లో నేను ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నేను లేని సందర్భం లేదు. అయినా సరే నాకు తెలంగాణా ఉద్యమం ఇచ్చినంత తృప్తి ఇంకేదీ ఇవ్వలేదు. అందులో HMTV ఆంధ్రప్రదేశ్ దశదిశా ఒక హైలెట్. ఆ కార్యక్ర్ఖ్మా రూపకల్పన, నిర్వహణలో కూడా నేను ఉన్నాను. ( ఈ సంగతి తరువాతి వ్యాసంలో చెపుతాను)

 రామచంద్రమూర్తిగారు జర్నలిజంలో నా గురువుల్లో ఒకరు. కె. శ్రీనివాస్ ద్వారా ఆంధ్రజ్యోతి నుంచి 1988 లో (బహుశా) ఉదయం దినపత్రిక కు వెళ్లిన సందర్భంలో నన్ను బాగా ప్రోత్సహించిన సంపాదకుడు. అంతేకాకుండా తెలుగు సంపాదకులలో మేధోవర్గానికి, తెగకు చెందిన వ్యక్తి. ఆయన నన్ను నెల్లూరు లో జరిగిన hmtv దశ-దిశా కార్యక్రమానికి  రమ్మని ఆహ్వానించారు.అది సమైఖ్య ఆంధ్ర పేరుతో ఒక నాటక సమాజం రక్తికట్టిస్తున్న కాలం. అందునా నెల్లూరు. అయినా వెళ్లాను. నాకు ఇప్పటికీ గుర్తు పద్మవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి నాది. నన్ను అక్కడ కాపాడింది మా పల్నాటి శ్రీరాములు ఆధ్వర్యంలోని దళిత సోదరులు, పౌరహక్కుల సంఘం మిత్రులు, డా. విజయ కుమార్ లాంటి ప్రజాస్వామిక వాదులు. మాదాల జానకీరామ్ లాంటి సోషలిస్టులు. అలాగే ఆ ఉద్రిక్తతలను తగ్గించి కాపాడింది రామచంద్రమూర్తి గారు. అప్పటికే ఈ రచ్చ అంతా లైవ్ చూస్తూ అనేకమంది సంఘీభావంగా సందేశాలు పంపారు. వరంగల్ జిల్లా ఘనపూర్, ఖమ్మం జిల్లాలనుంచి కొందరు నెల్లూరుకు బయలుదేరుతున్నట్టు ఎస్సెమ్మెస్ లు పెట్టారు.  సద్దుమణిగిందని చెప్పి వారిని వారించవలసి వచ్చింది. 

 

నా ప్రసంగం ఇలా సాగింది.

 పెద్దలు ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కె రామచంద్ర మూర్తిగారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిరథ, మహారథులు, రాజకీయ ఉద్ధండులు, సామాజిక కార్యకర్తలు, పౌర సమాజ పెద్దలు అందరికీ నమస్కారాలు. భారతదేశ చరిత్రలో ఆత్మ గౌరవ పోరాటాలకు ప్రతినిధిగా, ఆంధ్రుల ఆంతమా గౌరవ ప్రతినిధిగా, ఆంద్ర రాష్త్ర స్థాపనకు కేంద్రబింధువైన  పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఉన్న నెల్లూరు జిల్లాకు రావడం, ఇక్కడ తెలంగాణా ఆత్మ గౌరవ ప్రతినిథిగా నిలబడడం, మీ అందరి ముందు నా అస్తిత్వ ప్రకటన చేయడం ఒక మహదావకాశంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశమిచ్చిన HMTV కి, మా గురువు గారు రామచంద్ర మూర్తి గారికి కృతజ్ఞతలు.

మీ అందరికి తెలుసు మహనీయులు పొట్టి శ్రీరాములు గారు ఎందుకు ఆత్మా బలిదానాన్ని చేసుకున్నారో. కేవలం తమ ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ ఆత్మగౌరవం ఇతరుల కింద తాకట్టు పడకూడదనే తపనతో వారు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంద్ర ప్రజలను విముక్తి చేయడానికి ఆత్మబలిదానం చేసుకున్నారు. నిజంగానే ఆయన ఇవాళ యావత్ తెలంగాణా ప్రజలకు ఆదర్శ మూర్తిగా నేను భావిస్తున్నాను. తెలంగాణా ఉద్యమానికి పొట్టి శ్రీరాములు గారు సూర్తి ప్రదాత. ఆయన స్పూర్తితో మాత్రమే, ఆయన నినాదంతోనైతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నిర్మించారో, కారణాలవల్లనైతే మద్రాస్ రాష్ట్రం విడిపోవాలని అనుకున్నారో మిత్రులారా సరిగ్గా అవే కారణాలతో ఇవాళ తెలంగాణా ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. మీరంతా అనుకున్నట్టుగా, ఒక ప్రచారం జరుగుతున్నట్టుగా తెలంగాణా అనేది కేవలం కొంతమంది వ్యక్తులు, కొందరు రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది అవకాశవాదులు తీసుకువచ్చిన ఆకాక్ష కాదు. ఆకాంక్ష అనేది ఎవరో సృష్టిస్తే వచ్చేది కాదు. ఆకాంక్షలను ఆర్గనైజ్ చేయలేము. అవి మన హృదయాల్లోనుంచి, మన అనుభవాల్లోంచి, మన ఆవేదనలోంచి తన్నుకు వస్తాయి. అటువంటి యాభైనాలుగు సంవత్సరాల అనుభవం, అటువంటి యాభై నాలుగు సంవత్సరాల అసమానతలు,అన్యాయాలు,   అవమానాలు  అంతకుమించిన నిర్వేదం మధ్య జీవించిన తమ జీవితకాలం నేర్పిన పాఠాలవల్ల ఇవాళ తెలంగాణా ప్రాంత విద్యార్థులు ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు.. మహోద్యమం ఇవాళ తెలంగాణా పది జిల్లాల్లో గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నది. ఇప్పుడు గ్రామ గ్రామాన విస్తరించిన ఉద్యమానికి ఆజ్యం పోసింది మాత్రం ముమ్మాటికీ రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 

మిత్రులారా! మలిదశ ఉద్యమమని అంటున్న ఉద్యమం ఎలా మొదలయ్యింది, ఎలా విస్తరించిందో మీకు తెలియంది కాదు. తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా 2001 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్)  తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరుతో ఒక ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికే విద్యార్థులు, విద్యావంతులు, మేధావుల్లో తెలంగాణాకు సంబంధించిన బలమైన  ఆకాంక్ష ఉన్నది. ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాసంఘాలు, సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక రకంగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ఆఖ్ప్పటికే ఒక సిద్ధాంత భూమిక ఉన్నది. దీనిని సాకారం చేసుకునేందుకు ఒక రాజాకీయ పార్టీ అవసరమని కేసీఆర్ భావించారు. అవసరం రీత్యా తెరాస ను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీ వేదికగా ప్రజలను సమీకరించడం, తద్వారా తెలంగాణా భావజాలాన్ని విస్తృత జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడం, ఉద్యమాన్ని నిర్మించడం, పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతుల్లో వివిధ కార్యక్రమాలు, పద్ధతుల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం  రాజకీయ పక్షాల మీద ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం ఆయన తన కార్యాచరణగా పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు పార్లమెంటు ఆమోదం ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే భారత దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ముఖ్యంగా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణా డిమాండును అంగీకరించాలి. అందుకే ఆయన వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించే పని పెట్టుకున్నారు. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు బతికి ఉన్న స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్వామ్య ఆకాంక్షను గుర్తించి, తెలంగాణా ప్రజలను గౌరవించి, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెరాస తో ఎన్నికల ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టంగా రాసుకుంది. కేవలం మానిఫెస్టోలో రాసుకోవడమే కాదు పార్టీ అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తన ఎన్నికల ప్రచారంలో కనీసం ఐదు బహిరంగ సభల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఆమె పదేపదే 'మాకు తెలంగాణా ప్రజల గుండెచప్పుడు తెలుసు, వాళ్ళ ఆకాంక్ష తెలుసు ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవిస్తాం'  అని చెప్పి ఓట్లు అడిగారు. మాటమీది నమ్మకం, హామీ పట్ల విశ్వాసం ఉండబట్టే తెలంగాణా ప్రజలు అప్పటివరకు ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి రాజశేఖర్ రెడ్డిగారికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా మీకు కూడా తెలుసు.

 

తెలంగాణా సాధనలో రాజకీయ వ్యవస్థమీద మరింత ఒత్తిడి పెంచడం కోసం 29 నవంబర్ 2009 కెసిఆర్ నిరాహారదీక్ష చేపట్టారు. కేవలం నిరాహారదీక్ష తో తెలంగాణా వస్తుందని ఎవరూ అనుకోలేదు. సమస్య అంత తీవ్రమైంది కాదని, కేసీఆర్ నిరాహార దీక్ష విరమిస్తారని ఇక్కడి ఎంపీలు సోనియా గాంధీకి కూడా చెప్పినట్టు గౌరవ పార్లమెంటు సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు. అది నిజం కూడా! వాళ్ళు అలాగే చెప్పి నమ్మించ చూసారు. అలాగే కేసీఆర్ నిరాహారదీక్ష విరమించినట్టు కూడా మీడియా లో కథనాలు వచ్చాయి. మూడు రోజుల్లోనే నిమ్మరసం తాగాడని, దీక్ష ముగిందని వార్తలు రాశారు. కానీ ఏమయ్యింది. అప్పటివరకు కేసీఆర్ చేతిలో ఉన్న ఉద్యమం కాస్తా ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. మూడు రోజుల లోపే ఉద్యమం ఉధృతమయ్యింది. ప్రజలందరూ పెద్దఎత్తున స్పందించి, విద్యార్థులు పెద్దఎత్తున తిరుగుబాటు చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.  ఉద్యమాన్నివిద్యార్థులు తమచేతుల్లోకి తీసుకుని ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే కేసీఆర్ తన దీక్షను ఆసుపత్రిలోనే కొనసాగించారు. దశలో డిసెంబర్ 9 తేదీన అసీంబ్లీ ముట్టడికి పిలుపులునిచ్చారు. పెరుగుతున్న ఉద్యమ ఉధృతి  ఒకవైపు,రోజురోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి మరోవైపు  ఒత్తిడిని పెంచాయి.అలాగే అప్పటికి రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య రాత్రికి రాత్రి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 మిత్రులారామీరు నిదానంగా ఆలోచించండినిజాయితీతో చెప్పండి. అఖిలపక్ష  సమావేశానికి వెళ్ళినవాళ్ళు ఏం చేశారు అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. నాకు తెలిసినంతవరకూ గత ఆరు సంవత్సరాల్లో అఖిలపక్ష సమావేశాల్లో  వ్యక్తమయింది ఎక్కడ అంటే కేవలం తెలంగాణా ఏర్పాటు విషయంలో మాత్రమే. గత ఆరేళ్లలో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎన్నడూ, సందర్భంలోనూ వ్యక్తంకాని ఏకాభిప్రాయం, అందని సహకారం ప్రభుత్వానికి ప్రతిపక్షాలనుంచి అందింది. అఖిల పక్ష సమావేశంలో ఏమన్నారు? తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదని, తమ మేనిఫెస్టోల్లోనే తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమని స్పష్టంగా చెప్పమని, దానికి కట్టుబడి ఉన్నామని అన్నారుఅందుకు అనుగుణంగా తెలంగాణా  ముందు బిల్లుపెట్టండి, మేం మద్దతు  ఇస్తాం అనికూడా స్పష్టంగా చెప్పారు. అఖిలపక్ష నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని డిసెంబర్ 9 తేదీ నాడు కేంద్ర హోమ్ శాఖా మంత్రి పి. చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసేనాటి వరకు కూడా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగానీ, రాష్ట్రంలో దహనాలు, ధ్వంసాలు గాని, రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు గానీ జరుగలేదు.

 నిజానికి ఉద్యమాలు ప్రజాస్వామిక ఆకాంక్ష. ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాలను ఎవరూ వ్యతిరేకించడానికి లేదు. ఉద్యమాలు లేకపోతే దేశం స్థాయిలో ఉండకపోయేదిఉద్యమాల వల్లనే మనం కొంతోగొప్పో పురోగతిని సాధించాము. కాబట్టి ఉద్యమాలు తప్పని అనడం తప్పు. నిజానికి అలా అనడం వల్ల, అణచివేయడంవల్ల, అటువంటి ప్రజా ఆకాక్షకు భిన్నంగా  కృతిమంగా సమైక్య ఆంద్ర ఉద్యమాన్ని సృష్టించడం వల్ల ఇవాళ తెలంగాణా ఉద్యమం మరింత బలపడుతోంది, ఒక రకంగా చెప్పాలంటే సమైఖ్యఆంధ్ర ఉదయం వచ్చిన తరువాత తెలంగాణలో సమైక్యత మొదలయ్యింది. అప్పటివరకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక, కొందరు ప్రజలు సమైఖ్యగా ఉండాలని అనుకుని ఉండవచ్చుగాక, కానీ ఇప్పుడు నూటికి నూరుమంది తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఒక రకంగా సమైఖ్యఆంధ్ర ఉద్యమం తెలంగాణా ప్రజల్లో ఒక ఐకమత్యాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు తెలంగాణా ప్రజలు ముక్తకంఠం తో ఇవాళ నూటికి నూరుమంది  కోరుకుంటున్నారు.

 

 ప్రజలు  నూటికి నూరు మంది ఎందుకు తెలంగాణా  కోరుకుంటున్నారన్నది విజ్ఞులు ఆలోచించాలి.  రాష్ట్రంలో తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలతో ఎందుకు ఉండలేమని అంటున్నారు అనేవిషయం ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణలో ఒక అపనమ్మకం, అభద్రత, భయం ఆవరించివున్నాయి. భయం, అపనమ్మకం వల్లనే తెలంగాణలో యువకులు విద్యార్థులు ఆత్మహత్యలకు దిగుతున్నారు. ఉద్యమం మొదలయిన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 250 మంది పిట్టల్లా రాలిపోయారు, ఆత్మ హత్యలకు పాల్పడ్డారు.తెలంగాణా ఉద్యమానికి అంబంధించి మొదటి నుంచీ ఇటువంటి రక్తతర్పణ కోరుకుంటూనే ఉంది. చరిత్ర పొడుగునా ఉద్యమం మా ప్రజల నెత్తుటితో తడిసిపోయింది. ఉద్యమం తలెత్తినప్పుడల్లా అణచివేత తప్పడంలేదు. గతంలో ప్రభుత్వాలు తెలంగాణా అడిగినందుకు కాల్చిచంపారు. ఇప్పుడు ప్రజలు తమంతట తాము కాల్చుకుని ఆత్మాహుతులకు పాల్పడుతున్నారు. హింస ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా మొదలయ్యింది కాదు.ప్రజలు హింసను, పీడనను, అణచివేతను గడిచిన యాభై సంవత్సరాలుగా భరిస్తూనే వస్తున్నారు. తెలంగాణా ఉద్యమం తలెత్తినప్పుడల్లా అయితే ప్రభుత్వకాల్పుల్లో చనిపోవడంతో, లేకపోతే ఆత్మహత్యల పాలుకావడమో మాకు తప్పడంలేదు. హింస ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా ఉద్యమంతోనే మొదలయ్యింది కాదు మిత్రులారా అది మా జీవితాల్లో అంతర్భాగం అయిపొయింది. దాదాపుగా గడిచిన యాభై ఏళ్లుగా పరిస్థితిని, హింస, పీడన, దోపిడీని భయాందోళనలనుతెలంగాణా ప్రజలు భరిస్తూనే వస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా ఇవన్నీ తెలంగాణా జీవోతాల్లో అంతర్భాగం అయిపోయాయి. యాభై సంవత్సరాల్లో ఉద్యమం వివిధ దశల్లో వచ్చింది.  తెలంగాణా ఉద్యమం నిజానికి సజీవంగా ఉన్నది. ప్రజల అంతరంగాల్లో అంతర్లీనంగా ఉన్నది. వివిధ సందర్భాల్లో బహిరంగంగా, బలంగా వ్యక్తమవుతున్నది. ఇట్లా రూపంలో వ్యక్తమైనా దాన్ని ఇంతకాలం హింసతోనే, అణచివేస్తూ వస్తున్నారు. తెలంగాణా ఆకాంక్ష వివిధ రూపాల్లో వ్యక్తమైనప్పుడు రూపాలను నిషేదించారు  ఉద్యమాలలో ఉన్నవాళ్ళను ఎన్ కాంటర్లు చేసి చంపడం, గుర్తుతెలియని వ్యక్తుల చేత దాడులు చూపించడం, హత్యలకు పాల్పడడం చేశారు. ఆకాంక్షను వ్యక్తం చేసిన వాళ్ళను నిర్బంధించడం, కేసులు పెట్టడం కూడా చూసాం. ఇప్పుడూ అదే చేస్తున్నారు. మొత్తం తెలంగాణాను ఇవాళ ముళ్లకంచెల మధ్య నిర్బంధించి ఉంచారు. ఒకవైపు ప్రజలు ప్రజాస్వామికంగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వమే హింసను ప్రయోగిస్తున్నది. అది మనందరం చూస్తున్నాం.  ఇవాళ పెల్లుబికిన ఉద్యమం చరిత్ర నేర్పిన పాఠం, చరిత్రలో జరిగిన అసమానతలు, దోపిడీ, అణచివేతల పర్యవసానం. ఇదొక ప్రజా ఉద్యమం. విద్యార్థుల నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో పల్లెపల్లె కదులుతున్నది. యువకులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, సింగరేణి  కార్మికులు ఇప్పుడు సైరన్ మోగించారు. మీరు ఎన్ని అరుపులు అరిచి గొంతులెంత చించుకున్నా లాభం లేదు. సారి తెలంగాణా గెలిచి తీరుతుంది.

 నిజానికి సమైక్యత అనేది ఒక గొప్ప భావన, కానీ అది  కేవలం ప్రాంతాల మధ్యనేకాదు సోదరులారా! కొంచెం సామాజిక సమైక్యత గురించి కూడా ఆలోచించండి. మీ సమాజంలో సమైక్యత ఉందేమో ఆలోచించండి. మీ గ్రామాల్లో ఉన్న ప్రజలందరి మధ్య సమైక్యత ఉందా ఆలోచించండి. మీ కుటుంబాల మధ్య సమైక్యత ఉందేమో ఆలోచించండి. సమైక్యత అంటే కేవలం ప్రాంతాల మధ్యే ఉండాలని ఎక్కడా పాఠ్య  గ్రంధంలో సిద్ధాంతం చెప్పలేదు, మీరు మీ వూరిలో ఉన్న దళితులతో సమైక్యంగా ఉంటున్నారా, మీ ప్రాంతంలో కమ్మలు, కాపులు, రెడ్ల మధ్య సమైక్యత ఉందా మిత్రులారా! అంతెందుకు నెల్లూరు పట్టణంలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులమధ్య సమైక్యత ఉందా అని నేను అడుగుతున్నాను.

 సమైక్య ఉద్యమం చాలా అవసరం. అది మన పల్లెల పునాదినుంచి రావాలి. మనుషులను సమానంగా చూసినప్పుడు, గౌరవించినప్పుడు సమైఖ్యత ఉంటుంది. అది కుటుంబమైనా, కులమైనా గ్రామమైనా  చివరకు రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలంటే ముందుగా పరస్పర విశ్వాసం, గౌరవం ఉండాలి. అది లేనందుకే కదా ఇవాళ ఉద్యమాలు, విడిపోవాలనే ఆకాంక్షలు. (అరుపులు, గోలలు సభలో అల్లరి) చూసారా, ఎదుటివారి మాటకూడా వినడానికి ఇష్టపడని మీరు సమైక్యంగా ఉంటామంటే ఎవరు నమ్ముతారు. సమైక్య జీవనంలో ఎవరి స్వేచ్ఛ, ఎవరి స్వాతంత్య్రం, ఎవరి భావ వ్యక్తీకరణ, ఎవరి అవకాశాలు వారికి కల్పించడమే ప్రధానమనితెలుసుకోండి. సంగతిని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిటీ ఆనాడే గుర్తించింది. అభివృద్ధి చెందిన ఆంధ్రా ప్రాంతంతో వెనుకబడిన తెలంగాణాను విలీనం చేసి ఉమ్మడి తెలుగురాష్ట్రం ఏర్పాటుచేయడంవల్ల అసమానతలు అంతరాలు పెరుగుతాయని చెప్పింది. అడిఫై ఆమోద యోగ్యమైన ప్రతిపాదన కాదని భావించింది.

 మనవి వేరు వేరు సామాజిక, సాంస్కృతిక నేపధ్యాలు. బ్రిటిష్ పాలనలో చదువుకుని ఆధునికతను చవిచూసిన మీకు, నిజాం నవాబుల పాలనలో, అభివృద్ధిలేక కునారిల్లిన మాకు పొత్తు కుదరదు. ఇది గమనించక, కమిటీ సూచనలను కూడా పెడచెవినపెట్టి ఆంద్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేముందు ఏం చెప్పారు. అయ్యా మనం కలిసి ఒకే రాష్ట్రంలో ఉందాం, అలా ఉన్నంత మాత్రాన ఆంధ్రా వాళ్ళు మీ అవకాశాలు దోచుకోరు, మీ వనరుల మీద మీకే అవకాశం ఉంటుంది. మీ ప్రాంత ఉద్యోగాలు మీకే చెందుతాయి, ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణాలో  వ్యవసాయ భూములు కొనుక్కోకుండా చూస్తాం అన్నారు. అలా ఒప్పందాలు కూడా చేసుకున్నారుఒప్పించారు. కానీ అందులో ఒక్కటైనా  అమలు చేశారా అని అడుగుతున్నాను. ఇవాళ హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు. తెలంగాణా ప్రాతంలో ప్రాజెక్టు కట్టినా దాని పరీవాహక ప్రాంతంలో ప్రాంతం వాళ్ళు ఉన్నారో ఆలోచించండి. భూములు ఎవరి చేతులో ఉన్నాయో ఆలోచిందండి . ఎవరి ఫ్యాక్టరీలు, వాటిలో ఎవరు కార్మికుల్లో కూడా చూడండి. సింగరేణితో సహా, తెలంగాణలో ఉన్న గనుల్లో ఉన్నతాధికారులుగా ఎవరున్నారో గమనించమని కోరుతున్నా. అప్పటికి తెలంగాణలో విద్యావకాశాలు లేవని, తెలంగాణా యువతకు కావాల్సిన విద్యార్హతలు లేవని, లేదా మీ నెలూరులో, కావలిలో ఉన్నట్టు మాకు మైనింగ్ కాలేజీలు లేవని కదా మీరంతా వచ్చి సింగరేణిలో చేరింది. గతంలో తెలంగాణా ప్రాతః ఉద్యోగాలలో ఆంధ్రా వాళ్ళను తెచ్చినందుకే కదా ఉద్యమాలు వచ్చింది. పాతలెక్కలు మళ్ళీ చుడండి,ఇప్పుడు మొత్తం వ్యవసాయం, వ్యాపారం ఎవరిచేతుల్లో ఉన్నాయో చుడండి. ముల్కి నిబంధనలు ఏమయ్యాయో పరిశీలించండి. లెక్కలు తీయండి. గిర్ గిలానీ కమిటీ నివేదిక చూడండి ఏం జరిగిందో అర్థమౌతుంది. ముందు భయపడినట్టుగానే తెలంగాణా తన అస్థిత్వాన్ని కోల్పోయింది. ఆత్మను కోల్పోతోంది. అందుకే ఇది ఆత్మగౌరవ, అస్తిత్వ పోరాటమని అంటున్నాం. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ విఫల ప్రయోగం అని అర్థమవుతూనే ఉంది. ఇంకా పంతాలు వద్దు

 మేం మావద్దకు వచ్చి స్థిరపడిన వాళ్ళను వెళ్లిపొమ్మనడం లేదు. పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళను మా సోదరుల్లాగే భావిస్తూ అక్కున చేర్చుకున్నాం. ఇప్పటికి కూడా అలాగే భావిస్తున్నాం. ఇప్పటివరకు ఒక్క ఆంధ్రా సోదరుడిని కూడా మెం వెళ్లిపొమ్మని అనలేదు. వాళ్ళ ఆస్తులు లాక్కోలేదు, 1969 మాదిరిగా మేం ఆంధ్రా గోబ్యాక్ అనడం లేదు. కేవలం మాకు ఆంధ్రా ఆధిపత్యం నుంచి, పాలననుంచి విముక్తి ఎంకల్పించాలని మాత్రమే కోరుకుంటున్నాం. మిత్రులారా మీకు తెలుసు ఇప్పుడు తెలంగాణా తెలివైనది.అన్నే తెలిసిన నాయకత్వం చేతుల్లో ఇప్పుడు తెలంగాణా ఉద్యమం ఉన్నది. మునుపటిలా హింస లేదు, శాంతి ఉన్నది.  1969 లో హింస చెలరేగింది. ఆంధ్రా గోబ్యాక్ అన్నారు. దాడులు చేశారు. కానీ ఇవేవీ ఇప్పుడు లేవు, ఎందుకంటే  తెలంగాణా నుంచి చదువుకున్నవాళ్ళు వచ్చారు, విద్యాధికులు వచ్చారు, వాదనతో మెప్పించి, ఒప్పించే సత్తువ ఉన్నవాళ్లు   , ఆలోచనా పరులు ఉద్యమంలోకి వచ్చారు. ఉద్యమం శాంతియుతంగా నడుస్తున్నది. మాకు హింస మీద విశ్వాసం లేదు. అయినప్పటికీ మమ్మల్ని తీవ్రవాదులని, వేర్పాటువాదులని, తాలిబాన్ లని   అంటున్నారుఇది సమైక్యత లక్షణమే కాదు.

 

మిత్రులారా దయచేసి ఒక్కటి గమనించండి. మానవ సంబంధాల్లో బలవంతం పనికిరాదు. బలవంతంగా మనం సమైక్యంగా ఉండలేం. అవసరం కూడా లేదు.  తెలంగాణా విడిపోయినంత మాత్రాన అది తెలుగురాష్ట్రం కాకుండాపోదు. మనకు కూడా రెండు రాష్ట్రాలు ఉంటె మంచిదే కదా ఆలోచించండి. హిందీ మాట్లాడే ప్రజలు దేశంలో కనీసం ఐదారు  రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే  తమిళ భాష మాట్లాడేవాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు.  కాబట్టి  భాషాసమైఖ్యతకు భంగం వాటిల్లదని నేను భావిస్తున్నాను.  తెలుగువారి మధ్య బలవంతపు సమైక్యత కంటే, భావ సమైక్యత మంచిదని నేను భావిస్తాను. మేం ఒకటే చెపుతున్నాం అన్నదమ్ముల్లా అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం!

జై తెలంగాణా !!

 II

మొదట దాదాపు అరగంటపాటు మాట్లాడే అవకాశం వచ్చింది. నేను చెప్పాలనుకున్నది చెప్పినతర్వాత మరో నాలుగు గంటలపాటు చర్చ జరిగింది. చర్చలో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి, ఆనం వివేకానంద రెడ్డి, తెలుగు దేశం నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకిరామ్నె,పలువురు శాసన సభ్యలు, నాయకులు మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు మాట్లాడారు. సమైఖ్యఆంధ్ర సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కొందరు ఆవేశ పడ్డాడు, మరికొందరు ఉద్రేకపూరితంగా ఊగిపోయారు. ఒకరిద్దరు మినహా రాజకీయ నాయకులెవరూ తెలంగాణా ఏర్పాటును అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. అయినా విభజనకు పూనుకుంటే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారుమరోవైపు నెల్లూరు కార్యక్రమానికి ప్రజాసంఘాలు, మానవాక్కులు పౌరహక్కుల సంఘాలు, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రతినిధులు  పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారు తెలంగాణా అనేది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష అని, రాజ్యాంగబద్ధమైన హక్కు అని వాదించారు.

నిజానికి నా ప్ప్రసంగం నిరాటంకంగా సాగడానికి వాళ్ళే కారణం సమైఖ్యఆంధ్ర పేరుతో కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ మొదట మాట్లాడింది కాకుండా చర్చలో వ్యక్తమైన అభ్యంతరాలు, అభిప్రాయాలకు సమాధానం చెప్పే అవకాశం మళ్ళీ చివరలో ఇచ్చారు.

మిత్రులారా! చాలా సేపు, చాలా అంశాలమీద చర్చ జరిగింది. చాలామంది పెద్దలు మాట్లాడారు.  మీ అందరి ప్రసంగాలు విన్న తరువాత  కార్యక్రమంలో వ్యక్తమైన అభిప్రాయలు, వ్యక్తుల ప్రసంగాలు విన్నతరువాత రాష్ట్ర విభజనకు సంబంధించి వాతావరణం పూర్తిగా అర్థమయ్యింది. విభజన విషయంలో ఆంధ్రా ప్రాంతంలో ప్రజలకు, రాజకీయనాయకులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు, ప్రజాసంఘాలు తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకుంటుంటే, రాజకీయనాయకులు మాత్రం అపోహలు సృష్టిస్తున్నట్టు స్పష్టంగా అర్థమౌతోంది.  రాజకీయ నాయకులు తమ స్వార్థప్రయోజనాలకోసం మాత్రమే తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనేది నా అభిప్రాయం. నిజానికి కొందరు నాయకులు, మంత్రులుగా, శాసన సభ్యులుగా పనిచేసినవాళ్లు, చేస్తున్నవాళ్లు పదిమందిని వెంబడేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడిన విధానం, ప్రవర్తించిన తీరు బాధ కలిగించింది.  ( రాజకీయ నాయకుల అనుచరులు అల్లరి చేయడం మొదలుపెట్టారు. లోగా నిర్వాహకులు కె  రామచంద్ర మూర్తిగారు కలుగజేసుకుని రాజకీయ నాయకుల ప్రస్తావన లేకుండా మాట్లాడవలసిందిగా కోరారు.)

 

రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రస్తావన లేకుండా ప్రసంగించడం సాధ్యం కాదు. ఎందుకంటే అడ్డు తగులుతుంది, అభ్యంతర పెడుతున్నది, అపోహలు సృష్టిస్తున్నది రాజకీయ నాయకులే తప్ప ప్రజలుకాదు. ఇక్కడ వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రస్తావించిన విషయాలు విన్న తరువాత నేను కొన్ని విషయాలపాలట వివరణ ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళు మాట్లాడిన విషయాల్లో అనేకమైన అసత్యాలు, అర్థసత్యాలు ఉన్నాయి. వాటిని వివరించి చెప్పే అవకాశం నాకు కావాలి. సమస్య రాజకీయమైనది కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయంగానే మాట్లాడుతాను. తెలంగాణా రాజకీయాలపై నేనొక స్పష్టమైన రాజకీయ ప్రకటనకూడా చేయదలచుకున్నాను.

 

నేను నెల్లూరు దాకా వచ్చిందే మాట్లాడడానికి. మా మనోగతం చెప్పడానికి. ఎవరో అభ్యంతరపెడితే ఆగే రకం కాదు నేను.బెదిరిస్తే భయపడే రకంకూడా కాదు. మాట్లాడడానికే  నేను ఇక్కడిదాకా వచ్చాను.  కాబట్టి మాట్లాడవలసిన బాధ్యత నామీద ఉంది. రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధించాయి. దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. వివరణ ఇవ్వనివ్వండి. నిజమేదో చెప్పనివ్వండి.

 

ఒకటి తెలంగాణా రాష్ట్ర సాధనకోసం విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలపై వెకిలిగా మాట్లాడారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా వెకిలిగా మాట్లాడారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ మాయకుడు, శాసన సభకు సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి  (ఆనం వివేకానందరెడ్డి) అలా దిగజారి మాట్లాడడం బాధ కలిగించింది. ఇది దుర్మార్గం. చావును కూడా హేళన చేయడం ఏమిటి? ఇటువంటి పరిస్థితి ఎవరి ఆత్మహత్యలకైనా రాకూడదు. చివరకు రాజశేఖర్ రెడ్డి కోసం చనిపోయినారని చెపుతున్నవారి ఆత్మహత్యలనైనా సరే రాకూడదు . తెలంగాణలో యువకులు, విద్యార్థులు ఆత్మాహుతులకు పాల్పడుతున్నారు.  జైతెలంగాణా అని రాసి మరీ చనిపోతున్నారు. పరుగెత్తుకుంటే వచ్చే రైళ్లకు ఎదురెళ్లి జైతెలంగాణా అని నినదిస్తూ ప్రాణాలువదులుతున్నారు. కొండలు, గుట్టల మేడిన్ నుంచి దూకేసి మరీ తమ నిరసనను ప్రకటిస్తున్నారు. పరిస్థితి ఎందుకువచ్చింది. ఇదిగో ఇటువంటి బాధ్యాత రాహిత్యంతో, నిలకడలేని తనంతో, జవాబుదారీ తానంలేని రాజకీయ నాయకత్వం, పరిపాలనావ్యవస్థవల్ల వచ్చింది. ఒక భయంలోంచి, ఒక ఆత్రుతలోంచి ఒక హామీ ఇవ్వలేని సమాజంలోంచి పరిస్థితి వచ్చింది. దీనికి ఖచ్చితంగా మనందరం బాధ్యత వహించాలి. వీటిని ఆపవలసి బాధ్యత ఖచ్చితంగా మనందరిమీద ఉంది. కానీ మన నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో, కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది మంచిది కాదని మనవి చేస్తున్నాను.

 

మిత్రులారా మాట్లాడిన వాళ్లలో కొందరు తెలిసో , తెలియకో లేక కావాలనో కొన్ని పొరపాట్లు మాట్లాడారు. తప్పుడు సమాచారం ఇచ్చారు  ఒకాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణా వాళ్ళే ఇరవై ఐదేళ్లు పరిపాలించారని చెప్పారు. ఆయన రాజకీయాలు తెలియని మామూలు మనిషైతే పట్టించుకోవసరం లేదు. కానీ దాదాపు ఇరవై ఐదేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. నిజమేమిటంటే అరవై ఏళ్ళ ఆంద్ర ప్రదేశ్ చరిత్రలో తెలంగాణా నాయకులు ముఖ్యమంత్రులుగా కనీసం ఆరేళ్లుకూడా అధికారంలో లేరు. అయిదున్నర సంవత్సరాలు మించి పరిపాలించలేదు. దయచేసి సవరించుకోవలసిందిగా కోరుతున్నాను. ఇది మనం చెప్పినంత మాత్రాన జరిగిపోయే విషయం కాదు, ఇది చరిత్ర, దాన్ని వక్రీకరించడం తగదు.

ఇకపోతే రెండో చారిత్రక వక్రీకరణ పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి. అయ్యా పొట్టి శ్రీరాములుగారు అమరుడయ్యింది ఆంద్ర రాష్ట్రం గురించి. ఆయన ఆత్మార్పణం వాళ్ళ ఏర్పాటయింది కర్నూల్ రాజధానిగా ఆంద్ర రాష్ట్రం తప్ప హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కాదు. కానీ సమైక్యవాదం పేరుతో ఇక్కడ మాట్లాడిన వాళ్ళు తెలంగాణా రాష్ట్రం పొట్టిశ్రీరాములుకు గారి త్యాగానికి విరుద్ధం అంటున్నావారు. అది తప్పు. పొట్టి శ్రీరాములుగారంటే తెలంగాణా ప్రజలకు కూడా అభిమానం, గౌరవం ఉన్నాయి. మా ప్రాతంలో ఊరూరా ఆయన విగ్రహాలున్నాయి. ఆయనకు మెం వ్యతిరేకం కానీ కాదు. నిజానికి మా ఆకాంక్ష కూడా ఆయన ఆశయాలకు అనుగుణమనదేనని మీకు చెప్పదలిచాను. మెం ఆయన నుంచి స్ఫూర్తిపొందామని మరోసారి చెపుతున్నాను.

 

ఇక భాష గురించి కూడా చాలామంది మాట్లాడారు. కేసీఆర్ గారి భాష బాగాలేదని అంటున్నారు. అయినా ఇది కొత్తకాదు. తెలంగాణాను భాష పేరుతో వెక్కిరించడం కొత్తకాదు. నిజంగానే కెసిఆర్ భాష, మాట్లాడిన పద్ధతి బాగాలేకపోతే ఆయనతో చెప్పండి. మీరిద్దరూ (సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి ) ఆయనతో చాలాకాలం కలిసి పనిచేసినవాళ్ళేకదా. సమస్య అదికాదు. కెసిఆర్ మాట్లాడిన భాషను ఎత్తిచూపి సమైక్యవాదాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఇది పద్ధతికాదు. నిజంగానే కెసిఆర్ మిమ్మల్నో మీ భాషణో అవమానిస్తే నేనుకూడా వారిని సమర్ధించాను. ఎవరైనా సరే ఇతరులను కించపరచకూడదు.  అవమానించడానికే వీలులేదు. మీరు ఒక విషయం గమనించండి. మీరు సాఫ్ట్ గా ఉండే భాషలోనే మాట్లాడినప్పటికీ మీ భావాలు ఎంత హార్స్ గా ఉన్నాయో కూడా చూడండి. నిజానికి భాషకంటే భావమే ప్రమాదకరం  మీరే గమనించండి. కేసీఆర్ గారి భాషగురించి అభ్యంతరం వ్యక్తం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగారు ఇందాకే సభ నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ వారు ఏం మాట్లాడారు. రాష్ట్ర విభజన ఆలోచన మానుకోకపోతీ రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఏం భాష అది? ఎవరు అగ్నిగుండం సృష్టిస్తారు? ఎందుకు అగ్నిగుండం చేస్తారు>?  ఇదే నెల్లూరులో ఉంది అడుగుతున్నాను, ఎవరు అగ్నిగుండం చేస్తారు, అందులో ఎవరిని సమిధలు చేయదలుచుకున్నారు?  అయన వెళ్లేముందు నాతో మాట్లాడారు, తాను ఇక్కడినుంచి చెన్నై వెళ్లి విమానంలో హద్రాబాద్ వెళ్తున్నట్టు చెప్పారు. నిజంగానే అగ్నిగుండం చేసేవాడే అయితే హైద్రాబాద్లో అడుగుపెట్టగలడా అని నేను అడుగుతున్నాను. ( సభలో అల్లరి, అరుపులు కేకలు, ఒకతను కుర్చీ లేపి నా పైకి విసిరే ప్రయత్నం చేశారు, పక్కనే ఉన్న కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాటారించారు) మళ్ళీ చెపుతున్నాను, మీరు నన్ను ఆపేస్తే ఆగే ప్రసక్తి లేదు.  నన్నేమీ చేయలేరు, నేను ఒక్కడినే ఉండవచ్చు, కానీ హైద్రాబాద్లో, తెలంగాణలో మీవాళ్లు మీ సోమిరెడ్డి తో సహా చాలామందే ఉన్నారు. భాష సంస్కారం గురించి మాట్లాడిన వాళ్ళు, ఎత్తిచూపినవాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలి. ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ మాట్లాడింది తప్పయినప్పుడు, ఆయన మాటలను తప్పుపడుతున్న సోమిరెడ్డి మాట్లాడింది తప్పున్నర అవుతుంది. ఎవరుమాట్లాడిందయినా తప్పే అనుకున్నప్పుడు దయచేసి మాటలను మీరుకూడా ఖండించాలి.

 

ఇకపోతే మరో విషయం తెలంగాణా ఒక ప్రజాఉద్యమం దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. అది దొరల ఉద్యమమని, రాజకీయ నిరుద్యోగులైన దొరలూ రాజేసిన తాత్కాలిక ఉద్యమమని, తెలంగాణా గురించి మాట్లాడుతున్నవాళ్లంతా దొరలకు ఊడిగం చేసే బానిసలని అంటున్నారు. రాష్ట్రం విడిపోతే దొరల తెలంగాణా అవుతుందని బెదిరిస్తున్నాన్రు. మరో వైపు మీరే తెలంగాణా ఉద్యమం నక్సలైట్ల చేతుల్లో అంటున్నారు. మమ్మల్ని నక్సలైట్లని, తీవ్రవాదులమని అంటున్నారు. మేము ఏదో ఒకటే కావాలి, అయితే దొరల తొత్తులమైనా కావాలి, లేకపోతే నక్సలైట్లమైనా కావాలి. రెండూ కాలేము. ఏకకాలంలో భూసమయములుగా, నక్సలైట్లుగా ఉండలేము. అయినా మిత్రులారా మీకు తెలియంది కాదు. తెలంగాణా దొరల చేతుల్లో లేదు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దొరలను ఎదిరించి నిలబడిన చరిత్ర తెలంగాణాది. ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో దొరలమీద మొదలయిన యుద్ధం  కొనసాగుతూనే ఉంది.  ఇప్పటివర్కకు దొరలమీది పోరాటం రూపాలు మారిందేమో కానీ చరిత్రలో ప్రాతినిధ్యం గడించిన కాలమంతా సంఘర్షణలోనే సాగిపోయించి. కాబట్టి దొరలతెలంగాణా అయ్యే ప్రసక్తే లేదు. మెం దొరలకు తొత్తులమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక నక్సలైటలంటారా, అసలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్లే లేరని స్వయంగా మీ నాయకుడురాజా శేఖర్ రెడ్డి గారు ఏనాడో ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి  హోదాలో,ఢిల్లీలో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి. రాష్టంలో నక్సలైట్లను సమగ్రమైన వ్యూహంతో  సమూలంగా అణచివేశామని చెప్పడమే కాకుండా నివేదిక కూడా ఇచ్చారు. కాబట్టి తెలంగాణా ఇస్తే లేని నక్సలైట్లు ఎలా రెచ్చిపోతారా నాకతే అర్థం కావడం లేదు. నిజానికి నక్సలైట్లు ఉన్నారు. వారు మీ ప్రాతంలోని నల్లమలలో ఉన్నారు. మీ ప్రకాశం జిల్లాలో వారి కార్యకలాపాలు ఉన్నాయి. మీ ఆంధ్రా ఒరిస్సా బోర్డుర్ లో ఉన్నారు. వారి కార్యకలాపాలన్నీ మీ అడవుల్లో,ఆదివాసీ ప్రాంతాల్లో, విశాఖ ఏజెన్సీ లో  ఉన్నాయి. అయినా నక్సలిజం పుట్టింది తెలంగాణలో కాదు, మీ ఆంధ్రా ప్రాంతంలో, మీ సికాకుళంలో. దోపిడీ ఉన్నచోట నక్సలిజం ఉంటుంది. నక్సలైట్ల హింసా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద ఇదే నెల్లూరు లో నక్సలైట్ల దాడులు జరిగాయి. అంటే నక్సలైట్లు ఎక్కడ ఉన్నట్టు.

 

మరోవిషయం తెలంగాణలో నక్సలైట్ల కార్యకలాపాలు ఆగిపోయాయని క్రైమ్ రికార్డ్స్ చెపుతున్నాయి. గత ముప్పై సంవత్సరాల నేర చరిత్రలో 2008-2009 రెండు సంవత్సరాలు అత్యంత తక్కువ హింసాత్మక సంఘటనలు జరిగినట్టు ప్రభుత్వమే చెపుతోంది. ముప్పైఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువ హింసాత్మక సంఘటలు జరిగిన తెలంగాణను ఎందుకు మీరు నక్సలైట్ల ప్రభావిత ప్రాతం అంటున్నారు. ఎందుకు మీరు తెలంగాణా నక్సలైట్ల రాష్ట్రం అవుతుంది అంటున్నారు. మీరు ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా నక్సలైటలంటే మీకు భయమేమో, మాకు కాదు. అయినా నక్సలైట్లు ఉండకూడదని కాదు కోరుకోవాల్సింది, నక్సలైట్లు అవసరం లేని, వారి అవసరం రాణి సమాజంఉండాలని. ఎక్కడైతే సామాజిక అసమానతలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా నక్సలైట్లు ఉన్నట్టు. మనం చేయాల్సింది, నక్సలైట్లను నిర్మూలించడం కాదు, సమస్యని, అసమానతలను నిర్మూలించడం అని నేను భావిస్తున్నా.   అవగాహన లేకపోవడంవల్ల కదా,నక్సలలిజాన్ని ఓకే సమస్య అనుకుంటున్నాం.

 

ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడుతూ మా పోలీసులు మీ తెలంగాణా నక్సలైట్ల చేతిలో, మందుపాతరాల్లో చనిపోయారని అన్నారు.   ఇది చాలా దారుణమైన  విషయం, అలా మాట్లాడడం అన్యాయం  అలా అనుకుంటే తెలంగాణా పోలీసులు కూడా ఇక్కడ నల్లమలలో చనిపోయి ఉంటారు. పోలీసులేకాదు, నక్సలైట్లు, ఉద్యమకారులు  అక్కడివాళ్లు,ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ చనిపోయారు. నల్లమలలో గడిచిన పదేళ్లలో చనిపోయినావాళ్ళను ఎవరో లెక్క చూడండి.. ఉద్యమాల చరిత్రలో ఇది సర్వసాధారణం. సుదరయ్య గారు నెల్లూరునుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణా ఉద్యమం నిర్మించారు. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి ఎక్కడినుంచి వచ్చారు. వారి నాయకత్వంలో సాగిన పోరాటాల్లో ఎంతో మంది అమరులయ్యారు. అయినాఉద్యమాల గురించి, అమరత్వాల గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు.

 

మిత్రులారా ఇక హైదరాబాద్ విషయంలో కూడా వక్తలు  అనేక వక్రీకరణలు చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులుఅనేక అపోహలు కలిగిస్తున్నారు.హైదేరాబద్ ప్రస్తుత  జనాభా 80 లక్షలు  అందులో 40 లక్షలమంది ఆంధ్రా వాళ్ళు ఉన్నారని మీరే అంటున్నారు. నిజానికి 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు శాసన సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 20, 30 వేలమంది మా ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు.  అంటే కేవలం నలభై ఏళ్ళల్లో నలభై లక్షలమంది వచ్చి చేరారంటే పరిస్థితి అర్థం కావడం లేదా అని అడుగుతున్నాను. నలభై లక్షలమంది ఎందుకు వచ్చారు? ఎవరి ఉపాధిని, ఎవరి ఉద్యోగాలను కొల్లగొట్టారు? ఎవరి అవకాశాలను అడ్డుకున్నారు, ఎవరి వనరులను ఆధారం చేసుకుని వేలాది ఎకరాల్లో  వ్యవసాయం, వ్యాపారాలు, పరిశ్రమల పేరుతో ఎదిగారని అడుగుతున్నా. ఇదే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాతిపదిక అనేవిషయం అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నా.

 

ఇక మీ శాసన సభ్యులు శ్రీధర్ గారు అభివృద్ధి గురించి చెపుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక తమ చెమట రక్ట్సమో ఉందంటున్నారు. ఇలాంటి వి చాలానే విన్నాం, చాలా మందిని చూసాం. అసలు హైద్రాబాద్ను సృష్టించింది నేను అనే వాళ్ళు మొదలు అభివృద్ధి ని ఆంధ్రానుంచి సంచుల్లో తెచ్చి అక్కడ కుమ్మరించినట్టు మాట్లాడే అనేక మందిని చూసాం. ఆయన రింగురోడ్డు గురించి మాట్లాడారు, రింగు రోడ్డు ఒక్కటే అభివృద్ధి అన్నట్ట్టు మాట్లాడుతున్నారు. హైద్రాబాద్ చుట్టుపక్కల 200 కిలోమీటర్లు అభివృద్ధి జరుగని ప్రాంతం లేదని అన్నారు. కొత్తగా శాసన సభకు ఎన్నికయ్యారు, ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారో తెలియదు. ఎన్నిసార్లు శాసన సభకు వెళ్లారో తెలియదు, వారు వస్తే నేను స్వయంగా తీసుకెళ్లి  హైదేరాబద్ చుట్టూ అలుముకుని ఉన్న చీకటిని నేను చూపిస్తా వారికి. రింగురోడ్డును ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో  చేవెళ్ల, వికారాబాద్, తాండూరు ఎంత వెనుకబడి ఉన్నాయో, చూపిస్తా. .  శ్రీదర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి అంటే తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నారు. తలసరి ఆదాయం తెలంగాణా జిల్లాల్లో ఎక్కువ అన్నారు. నిజమే సర్, తలసరి ఆదాయం తెలంగాణాలోనే ఎక్కువ. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు మీరన్నట్టు అగ్రభాగాన ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది తలసరి ఆదాయం కాదు, తలసరి  వ్యయం ఇంతకాలం తెలంగాణా వాదులు చెపుతున్నది కూడా అదే, తెలంగాణా ఆదాయం ఎక్కువ, కానీ వ్యాయామంతా ఆంధ్రాలోనే పెడుతున్నారని. అందుకు మీరు చెప్పిన ఔటర్ రింగురోడ్డును ఆనుకుని, 200 కిలోమీటర్లు అవసరం లేదు హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లానే తీసుకుందాం, నిజమే మెదక్ తలసరి ఆదాయంలో 23 జిల్ల్లాల్లో మూడో స్థానంలో ఉంది. కానీ మానవాభివృద్ధి సూచీలో మాత్రం 18 వస్తానంలో ఉంది. విద్యలో, ఆరోగ్యంలో, అక్షరాస్యతలో ఎక్కడో అట్టడుగున ఉంది.  మీ అభివృద్ధిని మెం నమ్మదలుచుకోలేదు, అది అభివృద్ధికాదు, అసలు అలాంటి అభివృద్ధి అవసరం లేదనికూడా అనుకుంటున్నారు తెలంగాణా ప్రజలు. ఆదాయంలో మొదటి మూడు జిల్లాలు తెలంణగానవే అలాగే వేణూకబాటులో, అవిద్యలో, నిరక్షరాస్యతలోఅట్టడుగున ఉన్న ఆరు జిల్లాలు కూడా తెలంగాణవే కావడం దురదృష్టకరం 

 

మరొక ముఖ్య విషయం మిత్రులారా ! కొందరు తెలంగాణా ఉద్యమ ఆకాక్షలో భాగంగా వ్యక్తమవుతోన్న భావాలను కూడా కించపరుస్తున్నారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కొందరు సామాజిక తెలంగాణా అంటే ఏమిటో అని ఎద్దేవా చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఎస్, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం సరికొత్త సామాజిక చరిత్రకు నాందిగా నేను భావిస్తున్నాను. చిన్న రాష్ట్రాలుగా ఉన్నప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. నిజానికి తెలంగాణా చిన్న రాష్ట్రం కాదు, తెలంగాణా ఏర్పడితే దేశంలో 18 పెద్ద రాష్ట్రం అవుతుంది, తెలంగాణా కంటే 17చిన్న రాష్ట్రాలు తెలంగాణలో ఉన్నాయి. నాలుగు కోట్ల మంది జనాభాతో ఏర్పడే రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదు. మరి సామాజిక తెలంగాణా ఎలా వుంటుంది అంటే రేపు ఏర్పాటయ్యే తెలంగాణా రాష్ట్రం జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆధిపత్యంలో ఉండే రాష్ట్రం కాబోతుంది. .ఇప్పుడు 16 శాతం ఉన్న దళితుల జనాభా తెలంగాణా రాష్ట్రంలో  22 శాతం కాబోతుంది.  అలాగే ఇప్పుడు ఆరుశాతం ఎనిమిది శాతం అంటోన్న ఆదివాసులు, ఎస్టీల జనాభా 11 శాతం ఉండబోతుంది. అలాగే కనీసం యాభై ఐదు శాతానికి తక్కువ కాకుండా వెనుకబడిన వర్గాలు, ముస్లింలు ఉండబోతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అగ్రవర్ణాలు అనేవాళ్ళు పదిశాతం దరిదాపుల్లోనే ఉండబోతున్నారు. ఇంతకుమించిన సామాజిక తెలంగాణా ఏముంటుంది. ఇంతకంటే సామాజిక సమతుల్యత ఉండే రాష్టం దేశంలో ఇంకొకటి ఉండబోదు.  ఇక అధికారం అటామా వర్గాల ఐక్యత, బలాన్ని బట్టి ఉంటుంది  మిత్రులారా మన రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్  అంబెడ్కర్ గారు  కోరుకున్నది కూడా అదే.  సామాజికంగా ఆదిపత్యకులాలు ఎప్పుడైనా సరే రాష్ట్రాలు పెద్దవిగా ఉండాలని కోరుకుంటాయని, చిన్నరాష్టాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పుడున్న మన పరిస్థితినే తీసుకుందాం రాయల సీమలో ఉన్న ఒక సామజిక వర్గం, తెలంగాణలో ఉన్న అదే వర్గంతో సన్నిహితంగా, సమైఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గమే అనుకుందాం, అది రాయలసీమయినా, తెలంగాణా అయినా రెడ్లంతా అధికారంకోసం ఒక్క=టవుతారు. అలాగే కమ్మ సామాజిక వర్గంకూడా, అధికారంలోకి రావడానికి మరో సామాజిక వర్గంతో చేతలు కలుపుతుంది. చరిత్రపొడవునా ఇట్లాటి ఆధిపత్య శక్తుల ఆటలు ఎన్నో చూసారం, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఆంద్ర్ ప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేక పోయాడు, ఒక ఎస్సీ కనీసం ఐదేళ్లు ఎందుకని అధికారంలో ఉండలేక పోయాడు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో చుడండి. దళిత, బహుజనులు ఏనాడో ముఖ్యమంత్రులు అయ్యారు. ముస్లింలు, ఆదివాసులు కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడున్న పది జిల్లాలతో భౌగోళిక తెలంగాణా ఏర్పడితే, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇదే ఉద్యమ స్పూర్తితో భవిష్యత్తులో సామాజిక తెలంగాణా రూపొందించుకోవడం పెద్ద కష్టం కాదని నా భావన. ఆత్మ విశ్వాసం ఉన్నచోట ఏదయినా సాధ్యమేననేది నా అభిప్రాయం.

 మిత్రులారా ! ఒక్కటి మాతం నిజం, తెలంగాణా ఉద్యమానికి ప్రజాబలం ఉంది. ఒక్క తెలంగాణలోనే కాదు, ఇక్కడ నెల్లూరులో, ఆంధ్రాలో కూడా తెలంగాణా కు ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఇది తాత్కాలికంగా ఎవరో సృషించిన ఉద్రేకంగా కాదు. ఇవాళ పల్లెపల్లెన ఉద్యమం కొనసాగుతోంది. ఇందాక తమకు ఎప్పుడో నెహ్రు మాట ఇచ్చాడని చెప్పాడు. ఇందిరా గాంధీ ఆనాడే తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించింది అని చెప్పాడు. నేను చెపుతున్నా నమ్మండి. మాకు సోనియా గాంధీ గారు చెప్పారు. గతించిపోయిన వాళ్ళ గురించి, గడిచిన కాలం గురించి వదిలేయండి. మాకు ఇప్పుడు బతికి వుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉంది, రేపు కమిటీ వేయబోయే ఆవిడ చెప్పింది. అనేక సభల్లో చెప్పింది, లిఖిత పూర్వకంగా మేనిఫెస్టో లో స్పషంగా చెప్పింది. మెం ఖచ్చితంగా కమిటీని తెలంగాణా ప్రజలు ఆహ్వానిస్తారు, మనం ఎప్పుడో  మానసికంగా విడిపోయాం ఇక విడిపోవాల్సింది కేవలం భౌగోళికంగా మాత్రమే.ఎవరెన్ని మాట్లాడినా, రాష్ట్ర విభజన జరిగి తీరుతుంది, ప్రత్యేక తెలంగాణా  ఏర్పడి తీరుతుందని నేను మీకు సవినయంగా మనవిచేస్తూ సెలవు తీసుకుంటున్నాను.