సోమవారం, ఏప్రిల్ 13, 2020

కరోనా వాహనం!


దేశమొక్కటే కాదు, యావత్ ప్రపంచం లాక్-డౌన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెండింటి మూడు వంతుల మంది బిక్కుబిక్కుమంటూ ఎవరి ఇళ్లకువాళ్ళు పరిమితమై ఉన్నారు. భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తోంది. కోరలు చాస్తోంది. ప్రభుత్వాలు, ముఖ్యంగా పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు ప్రజల ప్రాణాల రక్షణకోసం కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. మరి మనమేం చేస్తున్నాం. ఇదిగో ఇలా కొందరు రోడ్ల మీద వీరవిహారం చేస్తున్నారు. ఎదో ఒక చిన్న కారణం చూపిస్తూ వీధుల్లోకి వచ్చి విధుల్లో ఉన్న వారిని వెక్కిరిస్తూ వెళ్తున్నారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని సేలం లో తీసిన ఫోటో! 
ఈ కింది ఫోటో హైద్రాబాద్ నగరంలో తీసింది! 
మీరు ఏవాహనంలో వెళ్తున్నారనేది కాదు ముఖ్యం, కరోనాకు మీరే వాహనం. అది ప్రయాణించేది, కాకి మీదో, కుక్కమీదో కాదు, మనిషి మీద అంటే మీ మీద, ఆలోచించండి! ఇంట్లోనే ఉండండి. మీ కొసం, మీ కుటుంబం కోసం మాత్రమే కాదు, సమాజం కోసం!!  

1 కామెంట్‌:

  1. ప్రభుత్వం ఎన్ని జాగర్తలు తీసుకున్న, కొంతమంది భేఖాతర్ చేయడం బాధాకరం, కుటుంబ సభ్యులే వారిని కట్టడి చేయాలి

    రిప్లయితొలగించండి