ఆదివారం, జులై 27, 2014

1956: ఒక వివాదాస్పద సందర్భం!

అర్ధ దశాబ్దానికి పైగా తెలంగాణ నెత్తిమీద పెత్తనం చేసిన 1956 ఇప్పుడు చాలామందినే అటువంటి అసహనంలోకి నెట్టేస్తున్నది. అది ఇప్పుడిప్పుడే వదిలేటట్టు కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం స్థానికతకు 1956ను ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు అనధికారికంగా వార్తలు రావడంతో సీమాంధ్రశక్తులు అప్రమత్తమవుతున్నాయి.

స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏమనుకుంటోంది? హైదరాబాద్‌లోగానీ, తెలంగా ణ ప్రాంతంలో గానీ ఎవరు స్థానికులు అవుతారు అనేది ఎవరు నిర్ణయించాలి? అనేవి ఇప్పుడు ప్రధా న ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని సీమాంధ్ర అఖిలపక్ష కూటమి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తమ రాష్ట్రంలో ఎవరు స్థానికులో నిర్ణయించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండకూడదని వాదించి వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలోనూ తమను స్థానికులుగానే పరిగణించాలని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాయి. దీనికి తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ, టీడీపీ లు వంత పాడుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సమర్థించిన కొందరు ఆద ర్శ మేధావులు కూడా స్థానికతకు ఏది ప్రామాణికం కావాలో చెప్పకుండా 1956 ఎలా ప్రామాణికమని అమాయకంగా అడుగుతున్నారు. ఇది మునుముం దు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే.

పార్లమెంటు ద్వా రా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారం గానీ, అజమాయిషీ కానీ రాష్ర్టాల ఏర్పాటుతో, సరిహద్దుల నిర్ధారణతో ముగుస్తుంది. భారతదేశ అస్తిత్వానికి, సమైక్యతకు భంగం కలగనంత వరకు రాష్ట్ర అంతర్గత పరిపాలన, ప్రాదేశిక ప్రాధాన్యాల్లో తలదూర్చే అధికారం కేంద్రానికి ఉండదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అంతర్గత వ్యవహారాలూ తమ చేతుల్లోనే ఉండాలని నాయుడు కూటమి కోరుకుంటోం ది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు ఉటంకిస్తూ హైదరాబాద్ పాలన మొత్తాన్ని గవర్నర్‌కు అప్పగించాలని చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ఆధీనంలోకి శాంతి భద్రతలు మాత్రమే కాకుండా రెవెన్యూ కూడా తీసుకురావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు తాజాగా అఖిలపక్షం ద్వారా స్థానికత ప్రమేయం లేకుండా విద్య, ఉద్యోగాలు కేంద్రం చేతుల్లో ఉండే విధంగా ఒత్తిడి తెస్తున్నారు.

చాలామంది ఈ వివాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నిజంగానే చంద్రబాబు విద్యార్థులకు నష్టం కలుగుతోందని అంటున్నాడని నమ్మిన వాళ్ళు కూడా అలా నమ్మించడానికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. కానీ ఆయన ఆ లేఖలో తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు ఫీజులు తామే చెల్లిస్తామని చెప్పలేకపోయారు. అలా చెప్పివుంటే ఈ పాటికి అడ్మిషన్లు మొదలయ్యే వి. ఆ మాట చెప్పకుండానే ఆయన ఒక బృందాన్ని గవర్నర్ దగ్గరకు మరో బృందాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపించి స్థానికత పేరుమీద ఇప్పుడొక కొత్త నాటకానికి తెరతీశారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టి హైదరాబాద్‌ను తమ అడ్డాగా మార్చుకోవాలని సీమాంధ్ర పాలకులు చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వాళ్ళలో అధికారులు చెపుతున్న వివరాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు కనీ సం రెండు లక్షలమంది ఉంటారు.

వీళ్ళంతా సీమాంధ్రకు చెందిన వారిగా స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టి చేరినవాళ్ళు. అక్కడి ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలతో అడ్మిషన్ పొందినవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే స్థిర నివాసం ఉన్నవాళ్ళు. చంద్రబాబును తమ నాయకుడుగా, పాలకుడుగా ఎన్నుకున్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఏటా ఒక్క ఇంజనీరింగ్ కోర్సులలోనే నలభై వేలమంది దాకా చేరుతున్నారు. మిగిలిన కోర్సుల్లో కనీ సం మరో పదివేలమంది దాకా ఉంటారని అంచనా. ఇట్లా నాలుగేళ్ల కోర్సు కనీస కాలపరిమితి లెక్కేస్తే ఇక్కడ చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా వేలకోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తోం ది. ఇప్పుడు ఆ సొమ్మును తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. నేరుగా ఫీజుల సంగతి ప్రస్తావించకుండా, హైదరాబాద్‌ను హస్తగ తం చేసుకోవాలని చూడడంలో భాగంగా స్థానికతను, 1956ను తెరమీదికి తెచ్చి ప్రజలనే కాకుండా గవర్నర్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాలన్న ప్రయత్నం సాగుతున్నది.

తెలంగాణవాదానికి 1956 మాత్రమే ప్రాతిపదిక. ఈ సంగతి తెలంగాణవాదులు అందరికీ తెలుసు. ఇప్పుడు 1956 ప్రస్తావనను ప్రశ్నిస్తున్న వారు చాలామంది విలీనం నుంచే తెలంగాణలో పరాధీన త అధికారికంగా అమలైందని చెప్పిన వాళ్ళే. 1956 విలీనం వివక్షకు దారి తీసిందని, విద్య ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా పోయాయని, ఆంధ్రా వలస వాదంవల్ల తెలంగాణ నీళ్ళు, నిధులు పరాధీనం అయిపోయాయని వాదించిన వాళ్ళే. అది వాస్తవం కూడా. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికే కాదు. తెలంగాణ పరాధీనతకు పునాది వేసిన సంవత్సరం కూడా. ఎవరు స్థానికులు అన్న సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా 1956ను మించిన ప్రామాణికత కనిపించదు. తెలంగాణ ఉద్యమకాలంలో చాలమంది మెర్జర్- డీ మెర్జర్ (విలీనం-విడిపోవడం) గురించి మాట్లాడారు. ఇప్పుడు డీ మెర్జర్ జరిగింది. ఈ సంగతి పక్కనపెట్టి ఇక్కడ పుట్టిన అందరు ఇక్కడి వాళ్ళే అని కొత్త సూత్రీకరణలు చేస్తున్నవాళ్లు బయలుదేరారు.

భారత దేశానికి సంబంధించినంత వరకు ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ స్థానికులు కారు. అలా కావడం లేదు. ఇక్కడ స్థానికత తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలులో ఉన్న చట్టం. తమిళనాడులో ఇప్పుడు ఒక విద్యార్థి స్థానికుడు కావాలంటే వాళ్ళ తల్లిదంద్రులు తమిళనాడులో పుట్టి ఉండాలి. అలాగే మహారాష్ట్రలో కూడా తల్లిదండ్రులు మహారాష్ట్రులు అయితేనే స్థానిక కోటాలో సీటు దొరుకుతుంది. స్థానికేతరులకు ఫీజులు కట్టి చదివించే పద్ధతి మోడీ రాజ్యం గుజరాత్‌తో సహా ఎక్కడా లేదు. కానీ భారతీయ జనతాపార్టీ మాత్రం అలాగే ఉండాలని ఏటా తెలంగాణ ప్రజల సొమ్ములో నుంచి, పన్నులలో నుంచి వేలాదికోట్ల రూపాయలు ఆంధ్రా విద్యార్థుల కు ఫీజులు కట్టాలని అంటున్నది. తెలంగాణ ప్రభు త్వం 1956 ప్రాతిపదిక నిజమే అయితే అంతకుముందు నుంచి తెలంగాణ పౌరులుగా ఉన్నవాళ్లకే స్థానిక రాయితీలు, ప్రయోజనాలు ఉండాలి తప్ప అందరికీ చెందాలనుకోవడం అన్యాయమవుతుంది. అలాగే ఉండాలని బీజేపీ గానీ ఇంకెవరైనా గానీ భావిస్తే బొంబాయిలో ఉన్న లక్షలాదిమంది తెలంగాణ వలస కార్మికులను కూడా అక్కడ స్థానికులుగా ప్రకటించాలి.

ఆ మేరకు శివసేనను ఒప్పించాలి. విభజనకు ముందులాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఆర్టికల్ 371 డీ ఉంటుందని కొందరు దబాయిస్తున్నారు. ఆ ఆర్టికల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిపి ఉంచడానికి తప్ప విడిపోయిన తరువాత కూడా పెత్తనం చేయడానికి కాదు. అయితే ఇక్కడ 1956 తరువాత వచ్చి స్థిరపడిన వాళ్ళ సంగ తి ఏమిటన్నది ప్రశ్న. దీన్ని ప్రభుత్వం స్పష్ట పరచా లి. వాళ్లను స్థానికులుగా పరిగణించి సీట్లు ఇవ్వాలని అడగవచ్చు కానీ వాళ్ళ ఫీజులు కూడా కట్టాలనడం. ఈ వివాదంలో మూడో అంశం ముల్కీ. ఈ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ఉంటే స్థానికులు అవుతారని కొందరు అంటున్నారు. మొత్తం తొమ్మిది ముల్కీ నిబంధనల్లో అది ఒకటి మాత్రమే. అలా 15 ఏళ్లు తల్లిదండ్రులు ఇక్కడే నివాసం ఉండడంతో పాటు, మళ్ళీ తమ ప్రాంతానికి వెళ్ళాలన్న ఆలోచన కూడాపూర్తిగా వదిలేసుకున్న వాళ్ళు మాత్రమే ముల్కీ చట్టం ప్రకారం స్థానికులు అవుతారు.

2 కామెంట్‌లు:

  1. మొన్న జరిగిన ఎన్నికలలో హైదరాబాద్ నుండి ఆంధ్రాకు, ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళను చూస్తేనే తెలుస్తుంది, హైదరాబాద్ లో ఉంటూ ఆంద్ర తో అనుబంధం ఉన్న వాళ్ళు ఎంతమందో

    రిప్లయితొలగించండి
  2. Fee reimbursement and Nativity are both different issues. Seemandhra people can stay here and take admissions in the colleges. But its up to the Telangana government to set up parameters and guidelines to meet the criteria for the beneficiaries of the scheme. Personally I'm not eligible to this scheme. It doesn't mean that I'm not a native of Telangana.

    రిప్లయితొలగించండి