అమితాబచ్చన్ గుజరాత్‌లో పుట్టలేదు. ఆయనది ఉత్తరప్రదేశ్. ఆయనను అసలు బొంబాయిలో ఉండడానికే వీలులేదని తరిమారు. అయినా నిలదొక్కుకున్నారు. ఆతరువాత శివసేనతో రాజీ పడ్డారు. తరువాత ఆయన నరేంద్ర మోడీకి నమ్మిన బంటుగా మారిపోయారు. ఆయనకు ఉన్న గ్లామర్ను మోడీ గుజరాత్ కోసం వాడుకున్నాడు. దీనికోసం ఎన్ని వందల కోట్లు వెచ్చించారో బయటకు చెప్పలేదు. కానీ ఆయనను నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకుని దాదాపు దశాబ్దానికి పైగా ప్రచారంలో వాడుకున్నాడు. కానీ భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్ష్మణ్ లక్ష్మణ్కు మాత్రం సానియామిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కావడం నచ్చలేదు. ఆమె మహారాష్ట్రలో పుట్టిందని, పాకిస్థాన్ కోడలు అని ఏవేవో మాట్లాడేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది వివాదంకావడం ఇష్టంలేని బీజేపీ జాతీయ కార్యవర్గం లక్ష్మణ్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఆమె అసలు సిసలు భారతీయురాలని తేల్చి చెప్పింది.
నిజంగానే సానియామీర్జా హైదరాబాద్ ఆణిముత్యం. హైదరాబాద్ పేరు ప్రతిష్టలను, దానితో పాటు భారత దేశకీర్తిని పెంచిన అత్యుత్తమ క్రీడాకారిణి. ఎవరికీ అంతవరకు ప్రవేశంలేని క్రీడలో ఎదిగివచ్చిన ఆడబిడ్డ. ఇదంతా లోకల్ బీజేపీకి అవసరం లేదు. ఆమె ముస్లిం కావడం వారికి నచ్చలేదు. ఆమెకు శిక్షణ కోసం కోటి రూపాయలు ఇవ్వడం కూడా లక్ష్మణ్కు నచ్చలేదు. వీటన్నిటికీ మించి ఆమె 1956కు ముందు తెలంగాణలో లేదని, తెలంగాణ కోసం పోరాడలేదని ఇట్లా అనేక సూత్రీకరణలు చేశాడు.
లక్ష్మణ్ సహజంగానే మితవాది. అంతోఇంతో ఆలోచించి మాట్లాడే అలవాటున్న వ్యక్తి. కానీ ఆయన తన మీద చంద్రబాబు నాయుడుల సీమాంధ్రవాదం ఆవహించినట్టుగా మాట్లాడారు. ఆయన మనసులో ఇప్పుడు ఇద్దరు నాయుడులను కలవరపెడుతున్న 1956 ఉంది. తెలంగాణ స్థానికతను నిర్ధారించే గీటురాయి 1956 కావడం సీమాంధ్ర పార్టీలకు పాలకులకు ఇష్టంలేదు. ఆ అయిష్టత ప్రభావంలోనే లక్ష్మణ్ అలా మాట్లాడి ఉంటారు. ఒక్క లక్ష్మణ్ మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వం స్థానికతకు 1956ను ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు అనధికారికంగా వార్తలు రావడంతో సీమాంధ్రశక్తులు అప్రమత్తమవుతున్నాయి. దీనికంతటికి చంద్రబాబు సూత్రదారి. లక్ష్మణ్ కేవలం పాత్రదారి మాత్రమే. చంద్రబాబు దీని వాళ్ళ రెండు రకాలుగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఒకటి ఇప్పుడున్న ఫీజు బకాయీలు ఎగ్గొట్టడం. రెండోది దీనిని అడ్డం పెట్టుకుని తెలంగాణా మీద- ముఖ్యంగా- హైదరాబాద్ మీద అధికారాలు పొందడం. కానీ ఇవి రెండూ సాధ్యం కావన్న సంగతి పాపం ఆయనకు తెలియదు.! పూర్ ఫెలో!
సోనియా
గాంధీ భారత దేశపు కోడలు
కాబట్టి- ఇటలీ ఆడబిడ్డ కాబట్టి-
ప్రధాని కావద్దని అన్నారు. సానియా పాకిస్తాన్ కోడలు- ఇండియా ఆడబిడ్డ- కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ కావొద్దని అంటున్నారు! కోడళ్ళూ కూతుళ్ళను కూడా కాదని ఎవరిని గౌరవిస్తారు?!
https://www.facebook.com/photo.php?fbid=916541848371941&set=a.277938155565650.86740.100000484041242&type=1&theater
రిప్లయితొలగించండి