జీవితకాలం
లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాపూక్కి
ప్లాట్ ఫారం మీద సిద్ధంగా
ఉంది. ఇక జెండాలు ఊపడమే
తరువాయి అనుకున్నారంతా.ఇంతకాలం తామే గార్డులమని చెప్పినవాళ్ళు,
రైలు రాగానే పచ్చజెండా ఊపి పంపిస్తామని చెప్పినవాళ్ళు
ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. జెండాలు పక్కనపడేసి ఒకరిమీద ఒకరు అభాండాలు వేసుకుంటున్నారు.
సంద ట్లో సడేమియాలు కొందరు
తెలంగాణ రైలుకు అడ్డుపడుతున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ
సమాజం లో ఉత్కం రేపుతున్నది.
ఎన్నో ఏళ్ళుగా తెలంగాణ రాక కోసం కళ్ళల్లో
వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉద్వేగాలకు లోనవుతున్నారు. ఢిల్లీ పరిణామాలతో దిగులు పడిపోతున్నా రు. కిరణ్ కుమార్
రెడ్డి, చంద్రబాబు నాయుడు, వై ఎస్ జగన్లు మాత్రమే సైంధవులు
అనుకున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వెంకయ్యనాయుడు రూపంలో బీజేపీ కూడా తోడవడం ఈ
దిగులుకు మరింత ఆజ్యం పోస్తోంది.
ఈ
పరిస్థితి ఊహించనిదేమీ కాదు. గడిచిన ఐదేళ్లుగా
తెలంగాణ విషయంలో సీమాంధ్ర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అందరూ గమనిస్తూనే
ఉన్నారు. పూటకో మాట మారుస్తూ
తెలంగాణ ప్రజలను ఏమార్చిన ఘనత చంద్రబాబు నుంచి
మొదలు జగన్బాబు వరకు
అందరిలోనూ గమనించాం. రెండు నెలలుగా కిరణ్
పెడుతున్న కిరికిరి వల్ల సమస్య మరింత
జఠిలమైపోయింది. కిరణ్ కుమార్డ్డి
శాసనసభకు బిల్లు వచ్చిన నాటి నుంచి అటు
తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్ఆర్
సీపీని బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో వేస్తున్న ఎత్తులు ఇవ్వాల ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.
ఆంధ్రవూపదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును
శాసనసభలో చర్చకు పెట్టిన పద్ధతి, ఆ చర్చ లో
ఆయన మాట్లాడిన తీరు చివరకు నిబంధనలకు
విరుద్ధంగా తీర్మానాన్ని ఆమోదించిన విధానం అన్నీ రాజ్యాంగ నియమాలకు
వ్యతిరేకమే అయినా కిరణ్కుమార్డ్డిని సీమాంధ్ర కథానాయకుడిగా జాతీ య మీడియాతో
సహా అందరూ చిత్రీకరిస్తున్నారు. అధిష్ఠానం మీద
ఇక సమరమే అంటూ ఆయన
సవాలు విసురుతున్నారు. రాష్ట్రాల ఏర్పాటు విషయంలో నిజానికి రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన వైఖరి
ఉండాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం లో
నిక్షిప్తమై ఉన్న అంశం. కానీ
ఆంధ్రవూపదేశ్లోని రాజకీయ పార్టీలు,
వాటికి నాయకత్వం వహిస్తున్న నేతలు వారికి ఇష్టమొచ్చినట్లుగా
వ్యవహరిస్తూ రాజ్యాంగ విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ కుప్పిగంతులు ఎలా ఉన్నా పార్లమెంటులో
ఉన్న రాజకీయ పక్షాలకు మరీ ముఖ్యంగా జాతీయ
పార్టీలకు ఈ విషయంపై ఒక
స్పష్టమైన వైఖరి ఉండి తీరాలి.
సీడబ్ల్యూసీలో తీర్మా నం చేసి, ఆ
తర్వాత కేంద్ర కేబినెట్లో ఆమోదించి, బిల్లును
రూపొందించేంత వరకు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన విశ్వాసాన్ని కలిగించింది. కేవలం ప్రజల్లోనే కాదు,
రాజకీయ పార్టీల వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న పరిశీలకులకు కూడా అటువంటి అభివూపాయాన్నే
కలిగించిం ది. కానీ బిల్లు
శాసనసభకు చేరిన తర్వాత ఆ
పార్టీ అంటీముట్టనట్టు ఉంటున్న వైఖరి ఇవ్వాల ఈ
సం క్షోభానికి కారణమైంది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం బిల్లు శాసనసభకు
పంపించే కంటె ముందే ముఖ్యమంవూతికి,
పీసీసీ అధ్యక్షుడికి పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించవలసింది గా చేయాల్సి ఉండే.
కానీ బిల్లుపై అభివూపాయాలు వ్యక్తం చేసే పేరుతో అటు
ముఖ్యమంవూతికి, ఇటు సీమాంధ్ర శాసనసభ్యులకు
ఎక్కడా లేని స్వేచ్ఛను కట్టబెట్టింది.
పార్టీ ఇచ్చిన వెసులుబాటును బలహీనతగా భావించిన కిరణ్కుమార్డ్డి
తాను వ్యక్తిగతంగా బలోపేతం కావడానికి ఉపయోగించుకున్నా డు. బిల్లుపై చర్చించేందుకు
రాష్ట్రపతి దాదాపు యాభై రోజుల గడువు
ఇస్తే, దాదాపు యాభై రెండు గంటలు
మాత్రమే చర్చ జరిగేలా కిరణ్
తనదైన వ్యూహాన్ని అమలు చేశాడు. దీనికి
సీమాంధ్ర స్పీకర్ కూడా తోడై ముఖ్యమంవూతికి
సభానాయకుడు అన్న పేరుతో అత్యధిక
సమయాన్ని కేటాయించాడు. అంతటితో ఆగకుండా పనికిరాని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి
కేవలం 4 సెకన్లలోనే దాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించడం ఈ కుమ్ముక్కు రాజకీయాలకు
నిదర్శనం.
గతంలో
చట్టసభల చరివూతలో ఏ తీర్మానం కూడా
ఇంత స్వల్ప వ్యవధిలో సభలో ప్రవేశపెట్టడం ఆమో
దం పొందడం జరగలేదు. ఈ మొత్తం తతంగంలో
కిరణ్కుమార్డ్డి ఒకరకంగా తన
లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. సభలో ఉన్న 175 మంది
సీమాంధ్ర సభ్యుల మద్దతు పార్టీలకు అతీతంగా తనకే ఉంద ని,
తానే సీమాంధ్ర చాంపియన్ అని చాటుకునే ప్రయత్నం
చేశాడు. ఈ మొత్తం తతంగంలో
అత్యం త విలక్షణ వ్యూహకర్తనని
తనకు తాను పదే పదే
చెప్పుకునే చంద్రబాబు నిండు సభలో మౌన
ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ప్రధాన ప్రతిపక్షానికి చెం దిన సభ్యులంతా
కిరణ్కు జై కొట్టడంతో
చేసేది ఏమీ లేక ఇప్పుడు
ఢిల్లీ బాట పట్టాడు. ఆయన
కేవ లం ఢిల్లీతోనే ఆగలేదు.
ఢిల్లీ నుంచి ముంబైకి, ముం
బై నుంచి మద్రాస్కు
ఇట్లా ప్రతిపక్షాలు ఉన్న ప్రతిచోటకు వెళ్లి,
వాళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు
చేస్తున్నా డు. తెలంగాణను అడ్డుకోవాల్సిందిగా
ప్రాధేయపడుతున్నాడు. అట్లా ఆయన భారతీయ
జనతా పార్టీ ని, శివసేనను, సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకేతో
సహా చిల్లరమల్లర పార్టీలను కూడా కలిసి ఒక
కొత్త కుట్రకు తెరతీశాడు. ఈ రకంగా విభజన
ఆగిపోతే తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని, తనకు తాను సీమాంవూధలో
హీరోను అని చాటుకోవాలని ఆరాటపడుతున్నాడు.
అదే దశలో కాంగ్రెస్ పార్టీ
తెలంగాణపై తన హామీని నెరవేర్చుకోవడంలో
విఫలమైందని చెప్పదల్చుకున్నాడు. తెలంగాణ టీడీపీ తమ్ముళ్లకు బాబు గారడీ ఇంకా
అర్థమైనట్టుగా అనిపించ డం లేదు. బాబు
వైఖరిపై బాధ పడుతున్నామని సన్నాయి
నొక్కులు నొక్కుతున్నారే తప్ప ఆయనను నిలదీయలేకపోతున్నారు.
ఇదే అదునుగా భావించి న చంద్రబాబు కమ్యూనిస్టుల
నుంచి కమలనాథుల దాకా అందరిని ప్రభావితం
చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కమ్యూనిస్టుల సంగతి తెలియదు కానీ,
కమలనాథులు మాత్రం బాబు మాటలకు లొంగిపోతున్నట్టుగా
కనిపిస్తున్నది. నిన్నటి దాకా తెలంగా ణ
బిల్లు వస్తే పార్లమెంటులో బేషరతుగా
మద్దతు ఇస్తామన్న భారతీయ జనతాపార్టీ ఇప్పుడు కుప్పిగంతులు మొదలుపెట్టింది. సగం సగం మాటలతో
వంకర మాటలు మాట్లాడుతున్నది. చంద్రబాబు
మాటలకు సదరన్ స్పైస్ జోడించి
వెంకయ్యనాయుడు చేస్తున్న అనువాదాలకు నిజంగానే బీజేపీ లొంగిపోతున్నట్టు కనిపిస్తున్నది.
గత
వారం రోజుల్లో బీజేపీకి సంబంధించిన ఐదుగురు అగ్రనాయకులు ఆరు రకాలుగా మాట్లాడడం
చూస్తుంటే ఆ పార్టీ తెలంగాణకు
దోకా చేస్తుందేమోనన్న భయం ఇవ్వాల ప్రజల్లో
కలుగుతున్నది. ఎందరు చంద్రబాబులు ఎన్ని
రంగులు మార్చినా, ఎందరు కిరణ్కుమార్డ్డిలు ఎన్ని బంతులు విసిరినా,
ఎందరు జగన్లు ఎన్ని
కుప్పిగంతులు వేసినా తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిన్నటి దాకా
చేతిలో ఆకుపచ్చ జెండా పట్టుకుని ఇది
తెలంగాణ గ్రీన్ సిగ్నల్ అని చెప్పిన బీజేపీ
ఇవ్వాళ పసుపు పచ్చ జెండాతో
ప్రత్యక్షం కావడం ఈ అయోమయానికి
కారణమవుతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ
స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాల సంగతి ఎలా ఉన్నా
ఇవ్వాల్టి పార్లమెంటు ప్రక్రియలో బీజేపీ వైఖరే కీలకం కాబోతున్నది.
ఒకవేళ తెలంగాణ రాని పరిస్థితి ఎదురైతే
అందుకు ప్రధాన దోషి భారతీయ జనతా
పార్టీనే అని అందరూ గమనించాలి.
ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కొత్తగా విధిస్తున్న షరతులు బతుకమ్మగా ఇంతకాలం ఊరేగిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మార్చుకుంటున్న రంగులు, నరేంవూదమోడీ విషపు మాటలు, అరుణ్
జైట్లీ బ్లాగోతాలు తెప్ప తగలేసినట్టుగానే అనిపిస్తున్నది.
అదే గనుక జరిగితే భారతీయ
జనతా పార్టీతో సహా తెలంగాణను అడ్డుకున్న
అన్ని పార్టీలను పాతరేసి ఆ సమాధుల మీద
ఎర్రజెండాలు ఎగరేయడానికి ప్రజలు సిద్ధ పడాలి.
తెలంగాణ
బిల్లు భవిష్యత్తు తేలడానికి కేవలం రెండుమూడు రోజులే
మిగిలి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వ్యూహకర్తలు, జేఏసీలతో సహా ఉద్యమకారులు, ఉద్యమ,
ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తిరుగుబాటు సంకేతాలు పంపడమే కాదు, మరో సమరానికి
సమాయత్తం కాకపోతే చరిత్ర క్షమించదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి