శనివారం, సెప్టెంబర్ 28, 2013

CM శుద్ధ అబద్ధాలు..

http://www.10tv.in/news/CM-Comments-Provoking-People-over-Irrigation-Projects

ఘంటా చక్రపాణి : ''సీఎం మాట్లాడిన దానిలో విజ్ఞప్తి, రెచ్చగొట్టే ధోరణి, ధిక్కరించే ధోరణి కనబడింది. ఒకవైపు సమ్మె విరమించాలంటూనే రెచ్చిపొండని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు. నెహ్రూ, పటేల్ బంధం వేశారని చెప్పారు. కాని వాళ్లు వేయలేదు. బహుశ పటేల్ అప్పటికి చనిపోయారు. సమైక్య రాష్ట్రం 1956 ఏర్పడే నాటికి వీళ్లు ఎవరూ అధికారంలో లేరు. నెహ్రూ, పటేల్ పోయిన తరువాత పొట్టి శ్రీరాములు బంధం వేసి ఆంధ్రలో కలిపారు. పొట్టి శ్రీరాములు కూడా సమైక్యతకు బంధం వేయలేదు. సమైక్యతకు బంధం వేశారని అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య, ఇతరులు బంధం వేశారు. ముఖ్యమంత్రి పేర్కొనడం తప్పు. 1955లో నాగార్జున సాగర్ ను నెహ్రూ ఫౌండేషన్ వేశారని చెబుతున్నారు. దీని ప్లాన్ 1952-55 మధ్యలో జరిగింది. అప్రోవల్స్ అన్ని 1952-56 మధ్య జరిగాయి. 1952-56 మధ్య సమైక్య రాష్ట్రం లేదు. 1956లో సమైక్య రాష్ట్రం వచ్చింది. ఫౌండేషన్ వేసిన తరువాత జలాశయాల మధ్య ఒక స్పష్టత వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే జరిగాయి. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద నల్గొండకే నీళ్లు రావడం లేదు. బోర్డు విఫలమైందని చెబుతున్నారు. బోర్డు విఫలమైంది. విఫలం కాకుండా పటిష్టమైన బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చట్టబద్ధంగా లక్షా 60వేల మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగస్తులున్నారని సీఎం చెప్పారు. అక్రమంగా వచ్చారని గ్లిర్ గాని చెబుతుండడాన్ని నిర్దారిస్తున్నారు. మరి అలా రావడానికి చట్టం ఒప్పుకొంటుందా ? ఒక నిర్ణయం తీసుకున్న తరువాత రద్దు చేయడం లేదా. వాన్ పిక్ భూములు ఇచ్చి మళ్లా రద్దు చేయలేదా ? న్యాయం ఏమిటో ఆలోచించడం లేదు.
''ఇక సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే ఒక ప్రాంతం మీద విషం గక్కి ఇంకో ప్రాంతంలో హీరో కావాలని కనబడుతోంది. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి తలబిరుసు మాటలు మాట్లాడడం కరెక్టు కాదు. సోనియాగాంధీ భిక్ష వల్లే ఉన్నానని పేర్కొంటూ సోనియాను ధిక్కరించడం పార్టీ వాళ్లే తేల్చుకోవాలి.

ముఖ్యమంత్రి కార్యాలయంలో అలా మాట్లాడడం కరెక్టు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం బట్టి చూస్తే ఒక హెచ్చరికలాగా కనబడుతోంది. ఆడిస్తున్న నాటకంలో పాత్ర అదుపుతప్పిందని భావిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం ఒక పాత్రదారిగా ప్రవేశ పెట్టారు. రోశయ్య నిర్వహించిన ఘనకార్యాన్ని మీరు నిర్వహించండని ముందుకు పంపించారు. ఆయన మాటల్లో ఒక ఉద్యమకారుడిగా మారాల్సినవసరం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులు, రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు''.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి