నేనివాళ ప్రతిరోజులాగే
మా మానేటి వాగులో మునుగుతూ తేలుతూ
తెప్పమీత తేలిపోయాను.
అర్దరాత్రి దాటిన తరువాతినుంచి కలలో కూడా మెలకువగా వింటోన్న
నా చెవుల్లోఎవరో అచ్చేస్తున్న ఒక పాట
సరిగ్గా కొమ్ము బూరలోంచి వచ్చిన జ్ఞాపకాల గానప్రవాహమై
నా ప్రవాసాన్ని మరోసారి తడిమింది
మావాగు ఊట, మా కన్నీటి పాట మా గుండెల మీద
సరిగ్గా కొమ్ము బూరలా వంపుతిరిగిన చోట
ఎవడో కట్టిన ఆనకట్ట మమ్మల్ని ముంచేసి కాందిశీకుల్ని చేసిన చోటినించి
ఒక చిన్నపాయ నా కళ్ళల్లోకి చేరి ప్రవహించింది..
సరిగ్గా కొమ్ముబూరలా వంపుతిరిగిన చోట
ఆ వాగులో వరదలా, నురగలా కొట్టుకుపోయిన మా బతుకు
సుప్తశిదిల స్వరమై మళ్ళీ అక్షరమై ఆవిష్కృతమైంది
సరిగ్గా కొమ్ముబూరలా మా వాగు వంపుతిరిగిన చోట
నేనింకా నిరుటి నా నిర్వాసిత జ్ఞాపకాలను తడుముకుంటూ
నిద్రలో మానేరును ఈదుకుంటూ మా ఊరిని కలవరిస్తో ..
తెప్పలమీద అలనై తెలిపోతోన్న వేళ
సరిగ్గా కొమ్ముబూరలా మా వాగు వంపుతిరిన చోట
దరిచేరే కొమ్మ దొరుకుతుందేమోనని
కలలోనే వెతుకుతోన్న వేళ
గుండెల్లో ఒక కాలింగ్ బెల్...
నిద్రకళ్లతో పేపర్ తెరిస్తే..
సరిగ్గా నేనుకలగన్న నది.. మా వూరి జీవనది..
మా మానేరు మున్నేరు దాటి
మూడు దశాభ్దాల తరువాత
సరిగ్గా కొమ్ముబూరలా వంపుతిరిగిన చోట
నేనుండే మూసీకి మోసుకోచ్చింది
సరిగ్గా కొమ్ముబూరాల వంపుతిరిగిన చోట
నా యింటి కిటికీలు తెరిచి చూసాను
సరిగ్గా కొమ్ముబూరలా మా మూసీ వంపు తిరిగిన చోట
కనుమరుగైన నా వూరు యాస్వాడ, అందులో మా వాడ ..
నేనిప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నా దోస్తులు ..
మా వూరి బడి, శివుని గుడి..
సరిగ్గా కొమ్ముబూరలా మావూరి దారి
మలుపు తిరిగే చోట..
మేమంతా చిర్రగోనే ఆడుకునే
చింత చెట్టు కింద
నా దోస్తుల నడుమ అలాగే నవ్వుతూ
నడుస్తూ అరుణ సాగర్! !
అలాగే మా వూరి జీవనదిలా..
ఘంటా చక్రపాణి