శుక్రవారం, ఆగస్టు 31, 2012

‘సర్వే’జనా సుఖినోభవంతు..!


telanganaనూటికి ఎనభై ఆరు మంది తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఎన్డీ టీవీ సర్వే తేల్చింది. ఈ వార్త విని చాలామంది సంతోషించారు. కానీ నాకైతే అందులో పెద్ద విశేషం ఏదీ కనిపించలేదు. ఎన్డీ టీవీ చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణలో కనీసం యాభై లక్షలమంది తెలంగాణ వద్దనుకుంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఎవరికైనా నూటికి 14 మంది తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం వద్దని అనుకుంటున్నారని అంటే అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. అదే కోటికి, ముక్కోటికి, నాలుగుకోట్లకు లెక్కేస్తే అది చాలా పెద్ద సంఖ్యే అవుతుంది. అయినా సరే ఏ ఉద్వేగమూలేని, ఏ ఉత్సాహమూ కనిపించని విరామస్థితి లో కూడా ఇంకా ఎనభై ఆరు శాతం ప్రజలు తెలంగాణనే కలవరిస్తున్నారని సర్వే తేల్చింది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు ఎన్డీటీవీ, జగన్‌డ్డితో కుమ్మక్కయ్యిందనో, కుట్రపూరితంగా తప్పుడు ఫలితాలు ప్రకటించిందనో అనలేము.

జగన్‌కు, ఎన్డీటీవీకి వ్యాపార లావాదేవీలున్న మాట వాస్తవమే. తెలుగు చానెళ్లకు పోటీగా అడపాదడపా కొన్ని జాతీయ చానళ్లు ‘జై జగన్’ అంటున్న మాటలూ వింటున్నాం. చానళ్లు అన్నాక లక్ష దందాలు చేస్తుంటాయి. అంతమావూతానా అన్నీ దందాలే అని మీడియాను అగౌరవపరచలేము. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ నిజమేననీ అనుకోలేం. ఎన్డీ టీవీ సర్వే నిజమేననుకుంటే అందులో మనం అర్థం చేసుకోవాల్సిన అంశా లు కొన్ని ఉన్నాయి. అందులో తెలంగాణ అనేది ఒక రాష్ట్ర ఆకాంక్ష స్థాయి నుంచి అస్తిత్వం దాకా ఎదగడం మొదటిది. ఎన్డీటీవీ మధ్యంతరం అనే పేరుతో ఇవాళ్టి రాజకీయ పరిస్థితులను, మధ్యంతరం వస్తే ఎటువంటి పరిణామా లు ఉంటాయనే విషయాన్ని జాతీయస్థాయిలో అంచనా వేయడం కోసం సర్వే చేపట్టింది. దేశంలోని 125 పార్లమెంటు స్థానా ల్లో ముప్ఫై వేలమందిని ఇంటర్వ్యూలు చేసింది. ఎన్డీ టీవీ 18 రాష్ట్రాల్లో సర్వే చేపడితే ఫలితాలు 19 రకాలుగా వచ్చాయి.

ఒరిస్సా, గుజరాత్, ఉత్తరవూపదేశ్, బెంగాల్ ఇట్లా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా అక్కడి ప్రజలు పార్టీలకు, నేతలకు నీరాజనాలు పట్టారు. మోడీ లాంటి నేతలకైతే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో అభిమానులున్నారని అర్థమయ్యింది కానీ ఒక్క ఆంధ్రవూపదేశ్‌లో రెండు రాష్ట్రాలున్నాయన్న సంగతి సర్వే అనంతరంగానీ అర్థం కాలేదు. అంతేకాదు ఆంధ్రవూపదేశ్‌లో ప్రజలకు తమ కులం, మతం, రాజకీయ సిద్ధాంతంతో ఎంత మాత్రం సంబంధం లేకుండా ప్రాంతమొక్కటే ప్రాతిపదిక అయ్యిందని కూడా సర్వే తేల్చి చెప్పింది. ఇది అన్నిటికన్నా పెద్ద విజయం. దేశంలో మనుషులు, కులాన్ని, మతాన్ని మరిచిపోవడం సాధ్యమయ్యే పనికాదు. భారత రాజకీయాలు నడుస్తున్నవే వాటిమీద. ఆ స్థితి నుంచి బయటపడడం ఒక్క తెలంగాణ ప్రజలకే సాధ్యపడింది. ఇదంతా తెలంగాణపై చిదంబరం ప్రకటన తర్వాత జరుగుతున్న ఈ మూడేళ్ళ ఉద్యమ మహత్యం. తెలంగాణ సమాజాన్ని ఉద్యమం ఉన్నతీకరించింది.

కేసీఆర్ నిరాహారదీక్ష ద్వారా ఈ చారివూతక పరిణామానికి పునాది వేస్తే వందలాదిమంది యువకుల ఆత్మార్పణలు, వ్యూహాత్మకంగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, మొత్తంగా ఇక్కడి ప్రజలు, పౌర సమాజం జేఏసీ నేతృత్వంలో నిర్వహించిన ఆందోళనలు ఆ ఆకాంక్షను ఇవాళ ఒక ఆదర్శంగా మార్చివేశాయి. తెలంగాణ ఒక వాదంగా, సిద్ధాంతంగా రూపొందించి సజీవంగా, సగర్వంగా నిలబెట్టాయి. అదే ఇవా ళ దేశం యావత్తూ ఆంధ్రవూపదేశ్ ఇప్పుడు రెండు వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నదని గుర్తించే విధంగా చేసింది. దీనికి యావత్ ప్రజానీకాన్ని అభినందించాలి.

రెండోది ఈ సర్వే తెలంగాణ ప్రజల పరిణతికి నిలువుటద్దమయ్యింది. సర్వేలో భాగంగా జగన్ గురించి ఎన్డీటీవీ ఒక ప్రశ్న అడిగింది. జగన్ మీద పెట్టిన కేసులు సరైనవేనా లేక రాజకీయ కక్ష సాధింపు అని భావిస్తున్నారా అని అడిగినప్పుడు ముమ్మాటికి సరైనవేనని తెలంగాణలో డ్బ్భై నాలుగు శాతం మంది చెప్పేశారు. సీమాంవూధలో పరిస్థితి ఇది కాదు. అక్కడ ఇంకా యాభై ఆరు శాతం మంది ఇదంతా రాజకీయం అనుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమం ప్రజలను కావలసిన మేరకు చైతన్యవంతులను చేసిందని, ఇక్కడి ప్రజలు కేవలం గుడ్డిగా తెలంగాణ కావాలని మంకుపట్టు పట్టడం లేదని, ప్రజలకు మంచేదో చెడేదో కూడా అర్థమవుతున్నదని దీన్ని బట్టి తెలిసిపోయింది. మూడేళ్ళుగా సాగుతున్న ఉద్యమం ప్రజలకు ఈ పరిణతిని ఇచ్చింది. రాష్ట్ర భవితవ్యాన్ని చాటి చెప్పే రాజకీయ వైఖరుల విషయంలో కూడా తెలుగు ప్రజలు రెండుగా చీలిపోయారు. అందుకే తెలంగాణ మీద వైఖరి చెప్పకపోతే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడం సాధ్యమయ్యే పనికాదని ప్రణయ్‌రాయ్ అంటున్నారు.

ఇప్పుడు తెలంగాణలో పార్టీల అభిమానాలు, వ్యక్తుల పట్ల ఆదరణ, రాజకీయ సిద్ధాంతాలు, వాదాలన్నీ తెలంగాణవాదంలో లీనమైపోయాయి. అంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా ఉండేవి. రాజశేఖర్‌డ్డికి ఉన్నట్టే చంద్రబాబునాయుడుకు కూడా ప్రత్యేకమైన అనుయాయులు, అభిమానులు ఉండేవారు. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీలు గణనీయమైనస్థాయిలో ఓట్లు, సీట్లు సంపాదించుకున్నవే! కేవలం టీఆర్‌ఎస్ పొత్తుతో మాత్రమే కాకుండా, పొత్తుకు విరుద్ధంగా పోటీ చేసి కూడా టీడీపీ కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది.

అలాగే తనదైనశైలిలో ఒంటరిగా పోటీకి దిగిన రాజశేఖర్‌డ్డి కూడా పోటీ చేసిన వాటిలో దాదాపు సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగాలిగారు. ఇప్పుడు ప్రజలు ఆ విభజన రేఖల్ని చెరిపేసుకున్నారు. అంతేకాదు ఆయా పార్టీల మీద తమకున్న అభిమానాన్ని కూడా వదిలేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణవాదం మినహా ఇంకో వాదానికిక్కడ తావు లేకుండా పోయింది.

ఈవిషయాన్ని ఎన్డీటీవీ సర్వే మరోసారి ఆవిష్కరించింది. గత రెండేళ్లలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసందర్భంలోనూ ఇది రుజువయ్యింది. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఉద్వేగాలు రెచ్చగొట్టి తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ గెలుస్తున్నదని ఇప్పటిదాకా సీమాంధ్ర నేతలు చేస్తున్న వాదనల్లో నిజం లేదని తెలంగాణ ప్రజలు భావోద్వేగాలకు అతీతంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని సర్వే తేల్చింది. సకల జనుల సమ్మె తరువాత పరకాల ఉప ఎన్ని క తప్ప తెలంగాణ ప్రజల్లో ఉద్వేగాలను పెంచే సందర్భం ఏదీ రాలేదు. పరకాల ఉపఎన్నిక కూడా తెలంగాణ వాదం రాజకీయంగా చీలిపోయిన నేపథ్యంలోనే జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీచేసిన వారంతా తెలంగాణ సాధన కోసమే పోటీలో ఉన్నామన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా తెలంగాణ వద్దని అనలేదు. ఇట్లా అన్ని ఉద్రిక్తతలు సద్దుమణిగి తెలంగాణ ఇప్పుడు ఒక రకంగా ప్రశాంతంగా ఉన్నది. అయితే ఆ ప్రశాంతత వెనుక అణచిపెట్టుకున్న అశాంతి ఉన్నదని సర్వే చెపుతున్నది.

ఆ అశాంతి రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయనున్నదని కూడా సర్వే హెచ్చరించింది. ఈ హెచ్చరికలు వినబడని స్థితిలో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతోంది. ఇంకోవైపు పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబునాయుడు నానా రకాల కుస్తీలు పడుతున్నారు. జగన్‌ను తెలంగాణ ప్రజలు ఎంతమావూతమూ నమ్మడం లేదు. ఈ మూడు పార్టీలు ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా తమ వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుంది. సర్వే ఒకరకంగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచింది. అందుకే తెలంగాణ టీడీపీ నేతలు ఎన్డీటీవీపై విరుచుకుపడుతున్నారు. నిజానికి టీవీలను విమర్శించి ప్రయోజనం లేదు. టీడీపీ విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. అదీ గతంలోనే అనేక సందర్భాల్లో రుజువయ్యింది.

టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు టీవీ చానెల్ డబ్బులు తీసుకుని సర్వే చేసి ఉంటే తెలంగాణలో కూడా జగన్‌కే హవా ఉన్నట్టు చెప్పేది. కానీ మూడొంతుల మంది తెలంగాణ ప్రజలు జగన్ మీది ఆరోపణలు నిజమైనవేనని నమ్ముతున్నారు. జగన్‌ను నేరస్తుడనే అనుకుంటున్నారనే చెప్పింది. ఆంధ్రాలో ఉన్న ఆదరణ ఆయనకు తెలంగాణలో లేకపోగా వ్యతిరేకత కూడా వ్యక్తమౌతోంది. తెలంగాణవాదం జగన్ పార్టీకి ఆ సంతోషాన్ని మిగలనీయలేదు. తెలంగాణలో జగన్‌ను కనీసం ఇరవై శాతం మంది కూడా సమర్థించలేదు. కాబట్టి ఇది జగన్‌మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి కూడా పరీక్షా సమయమే. జగన్ తెలంగాణకు అనుకూలమని ఆ పార్టీలో చేరిన వాళ్ళు, చేరుతున్నవాళ్ళు, లోపాయికారిగా ఆయన కోసం పనిచేస్తూ భవిష్యత్తులో ఆ పార్టీలో చేరాలనుకునే వాళ్ళు ఆలోచించక తప్పని స్థితి ఇది.

సర్వే పట్ల మొత్తం రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. తెలంగాణవాదం ఏ మాత్రం నీరుగారకపోవడం ఒక ఎత్తయితే తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా తేలడం ఆ పార్టీకి సంతోషం కలిగించే విషయం. తెలంగాణ ప్రజలు తెలంగాణవాదానికి కట్టుబడి ఉన్నారన్నది పదే పదే రుజువవుతున్న సత్యం. అది తాజాగా పరకాల ఉప ఎన్నికలలో కూడా చూశాం. నిజానికి దీనికి సర్వే అవసరం లేదు. తెలంగాణ టీఆర్‌ఎస్ ఒకటికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. అందులో సందేహం లేదు. కానీ తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళలో సగం మంది మాత్రమే కేసీఆర్‌ను ముఖ్యమంవూతిగా కోరుకుంటున్నారన్నది ముమ్మాటికీ ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ కావాలని 86 శాతం మంది చెపితే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేవలం 43 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని సర్వే పేర్కొంది. ఇది ఆ పార్టీ సంస్థాగత బలహీనతలకు అద్దం పడుతుందేతప్ప పార్టీ పట్లనో, కేసీఆర్ పట్లనో వ్యతిరేకతవల్ల కాదు. ఆ మాటకొస్తే కేసీఆర్ కూడా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. ఆయన ఇప్పటికే పలుమార్లు ఆ సంగతి చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షకు కేంద్రబిందువుగా ఉన్నారు. ముఖ్యమంవూతిగా ఊహించడం ఆయనకున్న ఇమేజీని తగ్గించడమే అవుతుంది కూడా. కేసీఆర్ ఇమేజీ ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో ఆయనకు అభిమానులున్నారన్నది కూడా ఈ సర్వే ద్వారా వెల్లడయ్యింది. కేసీఆర్ ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రవూపాంతం వాళ్ళు కూడా కోరుకోవడమే అందుకు నిదర్శనం.

ఇకపోతే సర్వేలో మనం అర్థం చేసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని సీమాంధ్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఈ సర్వే తొలిసారిగా చాటింది. ఇప్పటివరకు చాలా సర్వేలు సీమాంవూధలో వ్యతిరేకత ఉందని మాత్రమే చెప్పాయి, తప్ప ఏ ఒక్కరుకూడా అక్కడి అనుకూలతను అర్థం చేసుకోలేదు. ఇప్పటికిప్పుడు 25 శాతం మంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు. అదీ రాజకీయపార్టీలు ‘కలిసి ఉంటే కలదు సుఖమని’ భ్రమ పెడుతున్న నేపథ్యంలో. ఒత్తిడులు, భావోద్వేగాల వల్ల కలిగిన అభివూపాయమిది. ఇప్పటివరకు సీమాంధ్ర తెలంగాణ నుంచి విడిపోతే కలిగే ప్రయోజనాలను అక్కడి ప్రజలకు వివరించే ప్రయత్నమేదీ జరగలేదు. ఇప్పుడు సర్వేలను చూసి కుళ్ళుకోవడం కాదు. సర్వేజనా సుఖినోభవంతు’ అన్న రీతిలో ఒక కొత్త ఉద్యమాన్ని సీమాంవూధలో తేవాలి. రాష్ట్ర విభజన ఇరువురికీ మేలని చెప్పాలి.

అదే జరిగితే అక్కడ కూడా నూటికి ఎనభై శాతం మంది విడిపోవాలనే అంటారు. ఆ బాధ్యతను అక్కడి రాజకీయ పక్షాలు గుర్తించాలి. ఆ పని జగన్ చేసినా, చంద్రబాబు చేసినా లేక బొత్సా సత్యనారాయణ చేసినా వాళ్ళ వాళ్ళ పార్టీలు కచ్చితంగా లబ్ధి పొందుతాయి. ఇప్పుడు తెలంగాణకు మేం అనుకూలం అని చెప్తున్న వాళ్ళు ‘జై ఆంధ్రా’ ఉద్యమం గురించి కూడా ఆలోచించాలి.

భారతీయ జనతాపార్టీ, సీపీఐ లాంటి తెలంగాణ అనుకూల పక్షా లు ఆ దిశగా కూడా ఆలోచించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇద్దరికీ ఉపయోగం అన్న భావజాల వ్యాప్తి జరగాలి. ఆంధ్రా విడిపోతే సొంత రాజధా ని, సొంత ప్రభుత్వం, తక్షణ ఉద్యోగాలు ఉంటాయి. కొత్త రాష్ట్రంలో కనీసం పదిలక్షల మందికి రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన పని దొరుకుతుందని అంచనా. స్థానిక అవసరాలను బట్టి ప్రభుత్వాలు ప్రణాళికలు వేసుకునే వీలుంటుంది కూడా! ఈ సంగతులన్నీ రాజకీయ పక్షాలే అక్కడి ప్రజలకు చెప్పాలి. అధికారం మీద ఆశతో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి పార్టీలు ఆ పని చేస్తే మంచిది. ఇంకా తెలంగాణ మీద లేఖలిస్తాం, అనుకూలంగా ఓటేస్తాం వంటి ఊకదంపుడు మాటలు మాట్లాడకుండా ఆ పార్టీలు ప్రత్యేక సీమాంధ్ర కోసం ప్రయత్నించాలి. వారికి అక్కడ జై కొట్టడానికి కనీసం 25 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. లేకపోతే అక్కడ కూడా అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది!

6 కామెంట్‌లు:

  1. ఎప్పటిలాగే చక్కని విశ్లేషణ. ఇక తెలంగాణలో ఉండి కూడా దాదాపు 14 శాతం మంది రాష్ట్ర ఏర్పాటు పట్ల సానుకూలంగా లేని వాళ్లు ఉన్నారని సర్వేలో రావడానికి కారణం నా అంచనా ప్రకారం మూడు : 1) సీమాంధ్ర నుండి వచ్చిన సెటిలర్లు 2) ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సెటిలర్లు 3) తెలంగాణ వస్తే లాభం ఏమిటో తెలియని ప్రజలు లేదా రాష్ట్రం వస్తే నష్టపోతామని అనుకునే కొన్ని నియో రిచ్ సెక్షన్లు.

    నిజానికి తెలంగాణ లాంటి అంశాల పట్ల నూటికి నూరు శాతం మద్ధతు ఉండటం సాధ్యం కాదు కూడా.

    రిప్లయితొలగించండి
  2. The real statesman should advocate for two states theory in view of speedy development.But present day`s politicians are not public leaders but t5hey are simple power and money brokers.In the backdrop of consumerism, even a intellectual falls at the foot steps of a lay and common man.Any how it like you peoples responsibility to remind the common man, about their responsibility, like this reviews.Hope for good of the anti Telanganites and they too realize at an early stage that they have themselves cross legged at their own development.

    రిప్లయితొలగించండి
  3. Dear sir, very good analysis. In your analysis, the call of OU students call towards assembly on 9.12.2009 is missing. I feel it is the reason for getting that announcement. Jai socialist Telangana. కేసీఆర్ నిరాహారదీక్ష ద్వారా ఈ చారివూతక పరిణామానికి పునాది వేస్తే .... In this sentence OU students call was missed. Jai socialist Telangana.

    రిప్లయితొలగించండి