శుక్రవారం, ఆగస్టు 17, 2012

బడుగుల నెత్తిన పిడుగులు !


dharmana&mopi
ధర్మాన ప్రసాదరావు బీసీ అయినందువల్లే ఆయనమీద నేరాభియో గం మోపారా? ఇది బీసీలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమా? దీని వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా? ఉందనే అంటున్నారు మిత్రులు కృష్ణ మోహన్. ఆయన చాలాకాలంగా నాకు తెలుసు, విద్యార్థి దశనుంచి కూడా బడుగు బలహీన వర్గాల హక్కులకోసం, అభివృద్ధి కోసం పోరాడుతున్న వ్యక్తి. ఆయన పోరాటం వృథా కూడా కాలేదు. ఎందుకంటే ఆయనను వై.ఎస్. రాజశేఖర్‌డ్డి ఒక దఫా బీసీ కమిషన్ సభ్యునిగా నియమించా రు. హుజూరాబాద్ శాసనసభకు కాంగ్రెస్ టికెట్ కూడా ఇచ్చారు.


సరే ఆయన గెలవకపోయినా తరచూ బీసీల డిమాండ్లను గెలిపిస్తూనే ఉంటా రు. ఉన్నట్టుండి ఆయన బీసీలను అణచివేస్తున్నారని వాపోవడం ఆశ్చర్యం కలిగించిం ది. ధర్మాన ప్రసాదరావు బీసీ అయినందువల్లే ఆయనను వేధిస్తున్నారన్నది కృష్ణమోహన్ ఆరోపణ. దీన్ని మరికొందరు బీసీ శాసనసభ్యులు కూడాఅందుకున్నారు. జోగి రమేష్ అనే కృష్ణా జిల్లా శాసనసభ్యుడైతే ఒక టీవీ చర్చలో నామీద ఒంటికాలి మీద లేశారు. వెనుకబడిన కులం వాడు అయినందువల్లే ధర్మానను అవినీతి కేసులో ఇరికించారని ఆయన వాదన. ఇది చాలా ఆశ్చర్యకరమైన వాదన. ఎందుకంటే ఇప్పుడు నేరారోపణ ఎదుర్కొంటున్న మంత్రు లు బీసీలే కావొచ్చు కానీ బడుగులు, బలహీనులు మాత్రం కాదు. అధికారం పరంగా, ఆర్ధిక పరంగా అత్యంత బలమైన వర్గానికి చెందిన వాళ్ళు. అధికారంలో ఉండీ తప్పులు చేసిన వాళ్ళు. అవినీతి ఊబిలోనో, అక్రమార్జన కేసుల్లోనో అరెస్టు అవగానే కులాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ముందుకు వస్తున్నారు. గతంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలో కూడా ఇదే జరిగింది. పార్థసారథి ఏకంగా కులాన్ని అడ్డం పెట్టుకునే రాజీనామా చేయకుండా తప్పించుకోగాలిగారు. అలాగని న్యాయవ్యవస్థకు కులం ఉండదని, లేదని నేను వాదించలేను.

ఇప్పటికి చాలా కేసుల్లో బడుగులు ఓడిపోవడానికి ప్రధాన కారణం కుల మే! అందులో సందేహం లేదు. భారతదేశంలో కులం ఉన్నంతకాలం న్యాయవ్యవస్థ మీద కూడా దాని ప్రభావం ఉండి తీరుతుంది. అలా ఓడిపోయినా వాళ్ళంతా బాధితులు. దుర్బలురు. పీడితులు. కానీ ఇప్పుడు నేరారోపణ ఎదుర్కొంటున్న మంత్రు లు చాలామంది అలాం టి బలహీనులు కాదు. అత్యంత బలవంతుడైన రాజశేఖర్‌డ్డి అదుపాజ్ఞలకు లోబడి పనిచేసిన వాళ్ళు. తమకు రాజశేఖర్‌డ్డి కట్టబెట్టిన అధికారంతో వారు రెడ్డి గారి కుమారుడికి లబ్ధి చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు. ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్న మంత్రుల్లో బీసీలు, ఎస్సీలతో పాటు, అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారుడనే అభియోగం మీద ఆ సదరు పుత్రుడు ఇప్పటికే జైలు లో ఉన్నారు. ఆయనకు సహకరించిన అభియోగం మీద మిగిలిన వాళ్ళు ఏ కులం వాళ్ళయినా రేపో మాపో రాజీనామా చేయాల్సిన వాళ్ళే. వాళ్ళు కూడా కాస్త ఆలస్యంగానైనా అదే జైలుకు వెళ్లి తీరాల్సిందే.

నిజమే. ధర్మాన చాలా మంచివాడనే అనుకుందాం. ఈ కేసులో ఆయన వ్యవహరించిన తీరు అలాగే ఉంది. ఛార్జ్‌షీట్ విషయం తెలియగానే చాలా హుందాగా వ్యవహరించి రాజీనామాచేసి తప్పుకున్నారు. తన మీద అభియోగాలు వచ్చినందున తప్పుకుంటున్నానని చెప్పారు. పైగా అది తన ధర్మమని, ధర్మం తప్పని కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదని ఆయన చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని కూడా ఆయన అన్నారు. ధర్మాన ఎక్కడా తన కులం గురించి ప్రస్తావించలేదు. తనమీద నేరారోపణ అన్యాయమని కూడా అనలేదు. ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసుల్లో అరెస్ట్ అయిన నాయకుపూవరూ ఇంత హుందా గా కనిపించలేదు. అందుకు ఆయనను అభినందించాలి. అలాంటి వ్యక్తిని కులం కోణంలో చూపిస్తూ బీసీ నాయకులే అయోమయానికి కారణం అవుతున్నారు.

నిజంగానే ధర్మాన గానీ, మోపిదేవి గానీ బీసీలకు అండగా ఉండి అరెస్టయి ఉంటే కచ్చితంగా అందరూ సంఘీభావం తెలపాలి. కానీ సీబీఐ దృష్టిలో వాళ్ళిద్దరూ తమ అధికారాన్ని అండగా నిలిపింది వైఎస్ కుమారుడైన జగన్‌కు. వాన్‌పిక్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ఇద్దరు మంత్రుల అండ దండతోనే వేలాది ఎకరాల భూమిని అక్రమ మార్గాల గుండా సంపాదించారని, అందుకు ప్రతిగా ఆయన జగన్ మోహన్‌డ్డి కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలు చేరవేశారని అభియోగం. ఈ ఇద్ద రు మంత్రులను సీబీఐ కూడా అవినీతి పరులని అనలేదు. అవినీతిపరులకు అండగా నిలబడ్డారని మాత్రమే అభియోగం మోపింది. పైగా ఈ కేసులో మంత్రులతో, ప్రభుత్వం తో ప్రత్యక్షంగా లబ్ధి పొందిన నిమ్మగడ్డ, పరోక్షంగా లాభపడ్డ జగన్ రెడ్డి ఇప్పటికే జైలులో ఉన్నారు. ఆయన ఆర్థిక సలహాదారు విజయసాయిడ్డి ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. బ్రహ్మానందడ్డి అనే అధికారి కూడా అరెస్టయ్యారు. ఇట్లా ఇప్పటిదాకా ఇదే కేసులో అరెస్టయిన వాళ్ళలో ఒక్క మోపిదేవి మినహా అంతా ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా చెలామణీ అవుతున్నవాళ్లే. అలాంటప్పుడు ఇది అన్యాయమనో, అణచివేత అనో ఎలా అనగలం?

మోపిదేవి ఆంధ్రా సమాజంలో అత్యంత వెనుకబడిన కులమైన పల్లెకారు డు. కాదనలేము. సమువూదానికి ఎదురీది చేపలు పట్టుకునే నిరుపేద మత్స్యకారుల కులానికి చెందినవాడు. ఆయన నిమ్మగడ్డ కోసం చేసినా, నిమ్మగడ్డ జగన్ కోసం చేసినా మొత్తం ప్రాజెక్ట్‌లోఎక్కువగా నష్టపోయింది మాత్రం పల్లెకారులే! మోపిదేవి అరెస్ట్ అయినప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె అనే పట్టణంలో ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. కొన్ని బస్సులు కూడా కాల్చేశారు.

నిజంగానే బీసీలంతా ఏకమై తిరగాబడతారేమోనని అంతా భయపడ్డారు. హైదరాబాద్‌లో ఉండే బీసీ నాయకులు కూడా మోపిదేవికి బాసట గా నిలబడ్డారు. కానీ ప్రజపూవరూ కదలలేదు. పల్లెకారులు కూడా కదలలేదు. ఎందుకంటే వాళ్ళే ఉపాధి కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. వాన్‌పిక్ వచ్చాక అక్కడి సముద్ర తీరమంతా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాదా పు ముప్ఫై కిలోమీటర్ల తీరంతో పాటు సముద్ర తీరంలోనే వందకిలోమీటర్ల పరిధిలోని గ్రామాలన్నీ కంపెనీ కొనేసింది. అక్కడ మోపిదేవి దగ్గరుండి భూసేకరణ చేయించాడు. రైతులు కూలీలను అలా వదిలేయండి. సముద్రం మీద ఆధారపడి చేపలు పట్టుకునే పల్లెకారులు లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పటికే చాలామంది వలలు వదిలేసి హమాలీ పనికి కుదురుకున్నారు. కొందరు గ్రామాలు ఖాళీ చేసి కూలీ పని వెతుక్కుంటూ నగరాలకు వెళ్ళిపోయారు.

ఇంకొందరు అదే పొలాల్లో పనులకు కుదురుకున్నారు. దీనంతటికీ కారణం ఎవరో వాళ్లకు బాగా తెలుసు. అట్లా లక్షలాదిమంది బడు గు కులాల కుటుంబాలను బజారుకు ఈడ్చింది ధర్మాన విడుదల చేసిన జీవోలేనని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమౌతోంది. అదీ సీబీఐ వేసిన నేరాభియోగ పత్రాన్ని చదివాకే కొందరికైనా అర్థమయ్యింది. ఆ జీవోలు ప్రభుత్వ నిర్ణయమని ధర్మాన వాదిస్తున్నాడు. సాధారణంగా సామాన్యుడికి ముఖ్యంగా పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలకు దళిత, వెనకబడిన కులాలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మంత్రివర్గంలో ఉన్న ఆయా వర్గాలవాళ్ళు అడ్డుకోవాలి. ఇది అన్యాయం అని చెప్పగలగాలి. ఆ కులం వల్లే మేం ఇక్కడ ఉన్నాం, కాబట్టి మేము వాళ్లకు అన్యాయం చేసి అధర్మంగా ఉండబోమని చెప్పాలి. కానీ ధర్మాన అలా చేయలేదు. నాలుగు వేల ఎకరాల భూమికి మంత్రివర్గం ఆమోదం తెలిపితే దాన్ని పదింతలకు సాగదీసి నలభైవేల ఎకరాలకు సాగ దీశాడని, ఈ సాగదీతకు మంత్రివర్గ అనుమతి కూడాలేదని, ఆర్ధికశాఖ అడ్డు తగిలినా, న్యాయశాఖ అన్యాయమని అన్నా ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోయాడన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అభియోగం. ఆయన ఎవరికి లబ్ధి చేశాడన్నదానికంటే ఎవరి పొట్టలు కొట్టాడన్నది ఇప్పుడు బడుగు వర్గాలు గుర్తించాలి.

కేవలం మత్స్యకారుల రెక్కలు విరువడమే కాదు. వాన్‌పిక్ వల్ల దళితులకు చెందిన 15వేల ఎకరాలు వాన్ పిక్ చెర లో చేరిపోయాయి. ఇందిరాగాంధీ కాలంలో దళితులకు సాగుకోసం ఇచ్చిన ఈ భూముల స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాత్ముడు ప్రసాదరావు. దాదాపు మూడు తరాలుగా తమ కంచంలో కూడుగా ఉన్న ఎకరం, అర ఎకరం భూములను కూడా అసైన్డ్ భూముల పేరుతో కనీస పరిహారం లేకుం డా కాజేయడంతో అక్కడి దళితులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం అండతో కొందరు కోర్టునుంచి స్టే తెచ్చుకోగాలిగారు. ఇంకా అనేకమంది కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యం లో బడుగుల బతుకుల్లో పిడుగులైన ఆ మంత్రులు దళితులో, బలహీనులనో అనే అనుకుందామా కూడా ఆలోచించాలి.

రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో పేదరికంలో, వెనకబాటుతనంలో పోటీ పడే జిల్లా శ్రీకాకుళం. ఆ జిల్లాలో బడుగులు కూడా ఎక్కువే! అక్కడ చాలామంది తీరవూపాంతాన్ని నమ్ముకుని చేపలు పట్టుకునే మత్సకారులే. బీసీలలో మత్స్యకారులు ఎక్కడైనా కటిక పేదలనేది కాదనలేని సత్యం. అటువంటి శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మానకు మరో ఘనకీర్తికూడా దక్కింది. ఆయన పట్టుబట్టి సోంపేటలో నాగార్జున గ్రూప్‌కు చెందిన ఒక ప్రైవేటు థర్మల్ ప్రాజెక్టుకు భూములు కేటాయించారు.

అదీ రెండువేల ఎకరాలు. ఈ తడి భూములలో వ్యవసాయం చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ బతికే వేలాదిమంది బడుగు రైతులు తమ పొట్టలు కొట్టవద్దని, ఈ ప్రాంతాన్ని స్మశానం చేయవద్దని వేడుకున్నారు. కానీ మంత్రి గారు వినలేదు. పర్యావరణంతో సహా ఏ అనుమతీ లేకపోయినా ఆ ప్రైవేటు కంపెనీకి భూములు కేటాయిస్తూ సంత కం చేసేశారు. ఆయన సంతకం అక్కడి ప్రజల పాలిట మరణశాసనం అయ్యిం ది. రైతులు, మత్స్యకారులు తిరగబడ్డారు. పోలీసులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. ఇద్దరు మత్స్యకారులు ఆ తడిపొలాల్లోనే నెత్తురోడి మరణించారు. వందకుపైగా బడుగులు బుల్లెట్ గాయాలతో నరకం చవిచూశారు. కాల్పులు జరిపింది మంత్రి కాదు, గానీ బడుగు జీవులమీద కాల్పులకు నాయకత్వం వహించిన పోలీసులకు మాత్రం ఆయన ఉత్తమ సేవలకు గుర్తింపుగా పోలీసు పథకాలు ఇప్పించారు! ఇప్పటికీ సోంపేట బలహీన వర్గా లు ఏడాదికి పైగా అక్కడ నిరాహారదీక్షలు చేస్తూ పోరాటంలో ధర్మానకు ఎదురొడ్డి నిలబడే ఉన్నారు. ఇప్పుడు ధర్మాన బలహీన వర్గమంటే ఆ ధర్మదేవతకూడా తలదించుకుంటుంది.

ధర్మాన అదే శ్రీకాకుళం జిల్లా లక్షింపురంలో జరిగిన మారణహోమాన్ని ఆపి ఉంటే, అక్కడి భూమి సమస్యను పరిష్కరించి ఉంటే నిజంగానే ధర్మం ఉందని అనుకునే అవకాశం ఉండేది. నిజమే దళితులు, బీసీలు ఇంకా కుట్రలకు బలవుతున్నారు. అందులో సందేహం ఎవరికీ ఉండకూడదు. కానీ ఒక కుట్రలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు సహజంగానే ఆ కుట్ర బట్టబయలయినప్పుడు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. దళితులను దోచుకున్నప్పుడు దళితుడైనా, బీసీలను దోచిన బీసీ అయినా దోపిడీదారుడే తప్ప పీడితుడు కాదుకదా! గొంతులు కోసిన కత్తికి కులం ఉంటుందనుకుంటే ముందుగా ఆ కత్తికోసిన గొంతుకలకు కూడా కులం ఉంటుందని గుర్తించాలి. అలాగే ఆ కత్తి ఏకులం చేతిలో ఆయుధం అయిందో కూడా ఆలోచించాలి.
ఇదంతా చూస్తుంటే పాతకాలం తెలంగాణ పల్లెల్లో దొరలు చేసిన దోపిడీ గుర్తుకు వస్తోంది. ఊరి దొర పేదల భూములు కాజేయాలనుకున్నప్పుడు తనే వెళ్లి ఆక్రమించుకోలేదు.

ఊరి కరణాన్ని, పోలీసు పటేల్‌ను మచ్చిక చేసుకుని వారితోపాటు షావుకార్లను, పెద్దసార్లను కలుపుకుని కుట్ర చేసేవాడు. పనికి మాత్రం బీసీ, ఎస్సీ కులాలకు చెందిన పాలేర్లను పురమాయించేవాడు. అదీ అన్యాయమని తెలిసినా దొర వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు ఆ పనికి పూనుకునే వాళ్ళు. ఎదురు తిరిగిన పేదలను నిలువునా పాతేసే వాళ్ళు. ఇక్కడా బడుగులది పాలేరు పాత్రేనని గమనించాలి. ఆ పని చేసే పాలేరుకు తన కులం కంటే కండ బలం మీదే నమ్మకం ఎక్కువ. కాబట్టి పాపభీతి గురిం చి ఆలోచించడు. పాపంలో పాలుపంచుకున్న పాలేరుకు కూడా నేరాన్ని బట్టి, నేర తీవ్రతను బట్టి శిక్ష పడుతుంది. అది న్యాయం కూడా!

అవినీతి పేరుతో బ్రాహ్మణులనే బలిపశువులను చేస్తున్నారని ఆ మధ్య గాలి జనార్దనడ్డి కేసులో అరెస్టయిన ఒక బ్రాహ్మణ న్యాయాధికారి వాపోయినప్పుడు నవ్వుకున్నాం. నిజానికి ఇప్పుడు అవినీతి కేసుల్లో అరెస్టయిన వాళ్ళలో అగ్రవర్ణాల పెద్దలే అధికంగా ఉన్నారు. బీపీ ఆచార్య మొదలు జగన్ మోహన్‌డ్డి దాకా అనేకమంది బెయిలుకు కూడా నోచుకోకుండా జైళ్లలో మగ్గుతున్నారు. రేపోమాపో మరికొందరు రెడ్లు, కమ్మలు, కాపులు, ఇంకొంతమంది బీసీలు, ఒకరో ఇద్దరో ఎస్సీలు కూడా ఈ జాబితాలో చేరిపోవచ్చు. నిజానికి వాళ్లదందరిదీ ఒకే కులం. దాని స్వభావం దోపిడీ అయినప్పుడు వాళ్ళు దళితులో, బడుగులో అని అసలైన ఎస్సీ, బీసీలను అవమానించడమే అవుతుం ది. వీళ్ళంతా కలిసి, అన్ని కేసుల్లో కలిపి లక్షలకోట్లు లూటీ చేశారని లెక్కలు చెప్పేవాళ్ళు చెపుతున్నారు. ఆ లక్షల కోట్లు ఎవరివి.

ముమ్మాటికి బడుగులవే. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఖర్చుకావాల్సినవి. బడుగు విద్యార్థుల ఫీజులుగా మారాల్సినవి. హాస్టళ్లలో పురుగుల అన్నం తింటున్న నిరుపేద పిల్లలకు చెందాల్సినవి. దళితుల, బీసీల సంక్షేమానికి అందాల్సినవి. రోగాల బారినపడి మందులు అందక మరణిస్తున్న వేలాదిమంది గిరిజనులకు మందులై ప్రాణాలు నిలబెట్టాల్సిన సొమ్ము ఇది. ఇదిప్పుడు అగ్రవర్ణ నాయకత్వం ఎకౌంట్‌లో చేరిపోయిందని. లోటస్‌పాండ్ కోటలైనా, పత్రికలైనా, చానళ్లయి నా ఆ సొమ్ముతో సమకూరినవేనని సీబీఐ వాదిస్తోంది. ఆ వాదన కొనసాగి నిజమేదో తేలితే తప్ప బడుగుపూవరో, బలిపశువుపూవరో తెలుస్తుంది. దాన్నలా నడవనీయండి. లేకపోతే రేపో మాపో అగ్రవర్ణ ఖైదీలంతా కలిసి సీబీఐ లక్ష్మినారాయణ బీసీ కాబట్టే తమను అరెస్టు చేస్తున్నాడని, అక్రమకేసులతో వేధిస్తున్నాడని, దీని అగ్రవర్ణాలను అణచివేసే కుట్ర ఉందని అనే అవకాశం ఉంది. అది మొత్తం జాతికే ప్రమాదం జాగ్రత్త! 

2 కామెంట్‌లు: