ఈసారి
నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి
ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు
కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగా ప్రకటించింది. అది నిజమేనన్నట్టు ఆకాశం
నిండా మేఘాలు కమ్ముకుని మురిపించింది. వేడి తగ్గింది. మబ్బు
లు కమ్ముకున్నాయి. ఆ మబ్బులు చూసి
ఈసారైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని తెలంగాణ
రైతులు ఆశ పడ్డారు. కానీ
ఆయి టి పూని నెల
దాటుతున్నా ఒక్క చినుకు లేదు.
మబ్బులు అలాగే ఉన్నాయి. ప్రతిరోజూ
నేడో రేపో అన్నట్టు కమ్ముకు
వస్తున్నాయి. మనలో ఆశలు ఎన్ను
న్నా ఇలా నెలలు గడుస్తున్నా
అవి ఇప్పుడిప్పుడే కురిసే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు.
సరిగ్గా తెలంగాణ రాష్ట్రం సంగతి కూడా ఋతుపవనాల ను తలపిస్తోంది. ఎండాకాలపు వేడి, ఎన్నికల హడావుడి తగ్గాయో లేదో ఢిల్లీలో కొత్త కోలాహలం మొదలయ్యింది. వానలు రాక, విత్తనాలు లేక నాగళ్ళు వదిలి రైతులు రోడ్లెక్కారు. వాళ్ళనలా గాలికి వదిలేసి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ విమానాపూక్కారు. వాళ్ళు విమానాపూక్కింది మేఘమథనం కోసం కాదు! మేధోమథనం కోసమని ఉపఎన్నికల్లో ఊపిరాడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించాలో చర్చించడానికని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం వాళ్ళు ఢిల్లీ వెళ్ళింది కేవలం రాష్ట్రపతి ఎన్నికల వ్యూహ రచన కోసమని, ఊహించని పరిణామం ఏదైనా జరిగి రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న అధికారపార్టీ అభ్యర్థి ప్రణబ్కుమార్ ముఖర్జీ ఓడిపోతే పరువుపోతుందని ముందు జాగ్రత్తగానే పిలిపించుకున్నారని అంటున్నారు. అవి రెండూ వాస్తవమే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అతి పెద్ద ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రం ఆంధ్రవూపదేశే. పొరపాటున ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల మాటవిని ఓటు వేయకుండా ఉంటారేమోననే భ్రమ వాళ్ళ ది. అలా జరగకపోయినా కాంగ్రెస్లోనే కొనసాగుతున్న జగన్ విధేయులు జెండా ఎత్తేస్తారేమోననే భయం కూడా వాళ్ళను వెంటాడుతోంది.
అసలు సంగతి ఇదైతే హఠాత్తుగా తెలంగాణ ఇవ్వబోతున్నారని గాలి వార్త ఒకటి ఢిల్లీలో పుట్టించారు. వాతావరణశాఖ ఎండాకాలంలో వాన కురుస్తుందంటే నమ్మవచ్చేమో కానీ ఇన్ని దశాబ్దాల అనుభవం తరువాత కూడా కాంగ్రెస్ ఉన్నఫలంగా తెలంగాణ ఇచ్చేస్తుందంటే మాత్రం నమ్మలేం. పైగా ఇప్పుడు ఉద్యమం విరామంలో ఉన్నది. అయినప్పటికీ ఆ వార్త కరడుగట్టిన సమైక్యవాదుల నోటినుంచి చెప్పించారు. కోస్తాంధ్ర నేతల్లో ఒకరు నేడో రేపో తెలంగాణ ప్రకటన రానున్నదని అంటే, రానున్నది రాయల తెలంగాణ అని రాయలసీమ నేత ఒకరు ఊదరగొట్టారు. అదేదో లేకపోయినా కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాయల తెలంగాణ తమకు ఆమోదయోగ్యమేనని కాంగ్రెస్పార్టీలోని చోటామోటా లీడర్లు అప్పటికప్పు డు ఆగమేఘాల మీద ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రకటించేశారు.
వాన పడుతుందో లేదో తెలియని అయోమయంలో ఎందుకైనా మంచిదని గొడుగును సరిచేసుకున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ రాయల తెలంగాణ వద్దంటూ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలుచేసి, కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇచ్చేసింది. అది ఆంధ్రా మీడియా చిలువలు పలువలు చేసి తెరమీదే సరిహద్దులు గీసేసి మరింత ఆందోళనకు గురి చేసింది. మీకిది ఆమోదయోగ్యమేనా అని ఎస్ఎంఎస్ ప్రశ్నలు, చర్చలు మొదలయ్యాయి. హఠాత్తుగా హైదరాబాద్ ఎవరిది? అంటూ కథనాలు మొదలయ్యాయి.. హైదరాబాద్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలంతా రాయలసీమ వాళ్ళేనని ఒకరంటే, ఆ కూలీలకు జీతాలిచ్చింది కోస్తా వాళ్ళే అన్న కట్టు కథలూ ప్రసారమయ్యాయి. ఐదారు నెలలుగా అజ్ఞాత వాసంలో ఉన్న ఆంధ్రా మేధావులు శాలువాలు సరిచేసుకుని మళ్ళీ బుల్లితెరమీద ప్రత్యక్షమైపోయారు. నిజానికి ఆకాశం మబ్బు పట్టినంత మాత్రాన వాన రాదని వాళ్ళకూ తెలుసు. అయి నా ఏదో ఒక తుపాను సృష్టించాలి. ఇప్పుడు ఆ తుపాను ఇంకా ఢిల్లీ తీరం దాటలేదు. బహుశా ప్రణబ్ ఎన్నిక సజావుగా జరిగే దాకా ఈ ఈదురు గాలు లు, ఉరుములతో కూడిన జల్లులు పడుతూనే ఉంటాయి.
కాంగ్రెస్పార్టీ ఇప్పుడు మరోసారి తెలంగాణ అనే బహుళార్థ సాధక ప్రాజెక్టును ముందుకు తేవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒక టి రాయల తెలంగాణ అనే కొత్త ప్రతిపాదనతో సమస్యను మరింత జటిలం చేయడం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ లో కలిపి, కడప చిత్తూరు జిల్లాలు ఆంధ్రాకు వదిలేయాలన్నది ఆ ప్రతిపాద న సారాంశం. ఇది కేవలం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి వచ్చిన ఆలోచన కాదు. కొందరు మత పెద్దలు శ్రీ కృష్ణ కమిటీ బుర్రలో వేసిన బీజం. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ పదే పదే చెపుతూ వస్తున్నది ఇదే. దీనివల్ల ముస్లిం ప్రాబల్య స్థానాలు పెరుగుతాయని ఆయన అంచనా. ఈ బీజాన్ని ఇటు తెలంగాణ అటు రాయలసీమలో రాజ్య పరిపాలనాకాంక్ష ఉన్న కొంద రు రెడ్డి సామాజిక వర్గ నేతలు పెంచి పెద్ద చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణ వస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుందేమో అన్న బెంగ వారి మనస్సుల్లో చాలాకాలంగా ఉందని, ఒకవేళ ఉన్న ఫలంగా తెలంగాణ వస్తే నాయకత్వం తమ చేతుల్లోనే ఉండేట్టు చూసుకోవాలని రెడ్డి కుల పెద్దలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో అన్ని పార్టీలు కలిపితే 41 స్థానాలు వారి ప్రాతినిధ్యంలో ఉన్నప్పటికీ అందులో కాంగ్రెస్ గెలిచింది ఇరవైలోపే. ప్రత్యేక రాష్ట్రంలో చక్రం తిప్పాలంటే ఏ పార్టీకైనా కనీసం అరవై మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండాలి. ఈ అరవై మందిలో తమ సామాజిక వర్గం వాళ్ళే మెజారిటీ అయితే తిరుగు ఉండదని ఒక ఆలోచన. అది ఒక్క తెలంగాణ అయితే కష్టం. కాబట్టి కర్నూ లు, అనంతపూర్ జిల్లాలను కలుపుకోవాలని రెండు ప్రాంతాల నేతలు ప్రయత్నిస్తున్నారు. జేసీ దివాకర్డ్డి కలిసిపోతామంటే, గండ్ర వెంకట రమణాడ్డి కలుపుకుంటాం అనడం వెనుక కారణం ఇదేనని అంచనా!
రాయలసీమలోని ఈ రెండు జిల్లాలు కలిస్తే శాసనసభ బలం 147కు పెరుగుతుం ది. ఈ రెండు జిల్లాలలో సాంప్రదాయకంగా రెడ్లు గెలిచే స్థానాలు 13 నుంచి 18దాకా ఉంటాయి. అంటే ఆ కులం బలం 55-60 అప్పుడు దాదాపు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లు, ముస్లిం ప్రాబల్యం ఉండే పాతబసీ ్తతదితర స్థానా లు పోతే కాస్త అటుఇటుగా వంద స్థానాలు ఉంటాయి. వాటిలో యాభై నుంచి అరవై స్థానాలు ఒకే కులం చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన, ఏ పార్టీలో చూసినా రెడ్డి సామాజిక వర్గం ఒక ప్రాబల్య రాజకీయ వర్గంగా అవతరించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. అందరికీ ఈ లెక్కలే ఉండకపోవచ్చు. అందులో కొందరైనా అసలు సిసలు తెలంగాణవాదులు ఉండవచ్చు కాబట్టి వాటిని పూర్తిగా నిజమని అనలేం. కానీ ఈ లెక్కలన్నీ తెలిసినవాళ్ళు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. వాళ్ళే అధిష్ఠాన వర్గం దగ్గర రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే కనీసం ఇరవై మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీ పంపిస్తామని అంటున్నారని వినికిడి. అదే జరిగితే అటు సామాజిక తెలంగాణవాదం, ఇటు ప్రజాస్వామ్య తెలంగాణ ప్రయ త్నం రెండూ వీగిపోతాయన్నది మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గణాంకాలే తప్ప సామాజిక సమీకరణాలతో పనిలేదు. కాబట్టి ఈ ప్రతిపాదనను ఆమోదించినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ ఆ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్రంలో కొత్త రామాయణం మొదలవుతుంది. రాయల తెలంగాణ రాయలసీమ ప్రజల నుంచి వచ్చిన డిమాం డ్ కాదు. కేవలం రాజకీయ వ్యాపారులు తెచ్చిన ప్రతిపాదన. సీమాంవూధలో జగన్ సృష్టిస్తోన్న తుపానులో కాంగ్రెస్పార్టీ కొట్టుకుపోకుండా రాయలసీమను రెండేసి జిల్లాలుగా విడదీసి అందులో ఒక భాగాన్ని తెలంగాణలో కలిపేయాలన్నది వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన. ఒక రకంగా జగన్ బూచీచూపిస్తూ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నది కాంగ్రెస్ను కాదు. హైదరాబాద్లో ఉన్న వ్యాపారాలను, రింగ్ రోడ్ చుట్టు పక్కల ఆక్రమించుకున్న భూముల ను. వాటితోపాటు హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిని. జేసీ దివాకర్డ్డి లాంటి వారికైతే అదే జీవనాడి. ఆయన వందల సంఖ్యలో తన బస్సుల్ని నడిపించుకునేది, కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్నది. ఈ రోడ్డు మీదే. అలాగే టీజీ వెంక వ్యాపారాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా తెలంగాణవాదులు విడిపోతామంటే వేర్పాటువాదమని వాదించిన వీళ్ళు రాయలసీమను రెండుముక్కలు చేసేస్తామ ని అంటున్నారు. ఇంతకు మించిన అవకాశవాదం ఇంకొకటి ఉండదు. రాయలసీమ ఒక ప్రాంతం మాత్రమే కాదు. తెలంగాణలాగే ఒక అస్తిత్వం. ఒక సంస్కృతి. ఒక ప్రత్యేక సాంఘిక రాజకీయ ఆర్థిక ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అయినా అలా విడదీసే అధికారంగానీ, తాహతు గానీ జేసీకో, టీజీకో లేవు. అది అక్కడి ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఆ రెండు జిల్లాల ప్రజలు, లేక మొత్తం రాయలసీమ ప్రజలు ప్రజాస్వామికంగా అలా నిర్ణయించుకుంటే విడిపోవ చ్చు. కానీ తెలంగాణ ప్రజల అంగీకారం లేకుండా తెలంగాణలో కలవలేరు. ఎవరైనా ఇష్టం లేకుంటే విడిపోవచ్చేమో కానీ ఇష్టం లేకున్నా కలవడం సాధ్యం కాదు. ఈ ఇద్దరు నేతలకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్నింగ్ ఇచ్చింది. తమను దెబ్బతీయడం కోసం సీమను చీలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక జారీ చేసింది. ఇది కచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరికగా వాళ్ళు భావిస్తే మంచిది. ఇది కేవలం ఇద్దరు నాయకులకే కాదు. మొత్తం రాష్ట్రానికే నష్టదాయకమయ్యే పరిణామం. ప్రాంతాల మధ్య కొత్త ఉద్రిక్తత లు పెంచే ప్రయత్నం. బహుశా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం కూడా ఇలాంటి కొత్త ఉద్రిక్తతనే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమలో ఇటువంటి అలజడిని ఒకదానిని సృష్టించి రాష్ట్ర విభజనను శాశ్వతంగా అటక ఎక్కించే ఆలోచన ఆ పార్టీకి ఉందనిపిస్తోంది.
ఒకవేళ ఏ ఆందోళనా లేకుండా విడిపోతే రాయల తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమికి తిరుగుండదని వారు భావిస్తుండవచ్చు. కేసీఆర్ గతంలో చేసిన ప్రకటన మేరకు టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసి-లేదా కాంగ్రెస్ను టీఆర్ఎస్లో కలిపి- కేసీఆర్కే ఇక్కడి ప్రభుత్వ పగ్గాలు అప్పగిం చవచ్చు. ఎలాగూ జగన్ను ఓడించే అవకాశం లేదు. కాబ ట్టి రాయలసీమను రెండుగా చీల్చడం వల్ల జగన్ కచ్చితంగా గెలిచే స్థానాలలో కనీసం 25 స్థానాలు తగ్గిపోతాయి. ఆంధ్రా లో కాపు, కమ్మ, రెడ్డి, మాల సామాజిక వర్గాల బలం దాదాపు సమానమైపోతుంది. అక్కడ ఏ కొత్త కాపుకో నాయకత్వం అప్పగించి రెండేళ్ళు కాలం గడపవచ్చు. ఈ లోగా జగన్ను దారిలోకి తెచ్చుకోవడానికి సీబీఐ విచారణ ఎలాగూ ఉంది. నిజంగానే జగన్ భయపడిపోతే కాంగ్రెస్ గూటికే చేరతాడు. అలా కాకపోతే ఆయనే గతంలో చెప్పినట్టు బయటి నుంచి కాంగ్రెస్కు మద్దతు ఇస్తాడు. అప్పుడు 2014లో అక్కడ జగన్ కాంగ్రెస్, ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్. రూపమేదైనా కనీసం 30 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటాయి.
ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది ఇటువంటి నాటకానికి ఒక రిహార్సల్ మాత్రమే. దానికి రాష్ట్రపతి ఎన్నిక ఉపయోగపడుతోంది. ఈ ఎన్నికలో ఆంధ్రవూపదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ప్రణబ్ను సమర్థించే వాళ్ళు కాంగ్రెస్ కూటమిగా, వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ కూటమి గా మారనున్నారు. అందుకేనేమో పాపం చంద్రబాబు ఇక్కడకూడా తటస్థ పాత్రతో గుమ్మం బయటే నిలబడాల్సి వస్తోంది. తెలంగాణ జేఏసీ ఎన్ని చెప్పినా కేసీఆర్ ప్రధానికి మాట ఇచ్చివుంటే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం అనివార్యం. టీఆర్ఎస్ మద్దతు జనరంజకంగా ఉండాలంటే ఢిల్లీ నుంచి ఏదో ఒక హామీ రావాలి. బహుశా ఈ తెలంగాణ అనుకూల పవనాలు అందుకు ఉపయోగపడవచ్చు. నిన్నటిదాకా బద్ధ శత్రువులన్న భ్రమ కల్పించిన కాంగ్రెస్-వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఒక రాజకీయ అవగాహనకు రానున్నాయి. కాంగ్రెస్పార్టీ చాణక్యుడు స్వయంగా రాష్ట్రపతి అభ్యర్థి అయిన ప్రణబ్ విజయమ్మకు ఫోన్చేసి మద్దతు కోరారు. ఆ మరుసటిరోజే ఆమె ఢిల్లీ వెళ్లి సీబీఐ వేధింపుల నుంచి తన కొడుకును కాపాడవలసినదిగా స్వయంగా ప్రధానినే కోరారు. ‘మతతత్వ బీజేపీ’కి తాము వ్యతిరేకమని చెప్పి రేపో మాపో జగన్ ప్రణబ్కు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు! ఇది రాజకీయం, ఏదైనా జరగవచ్చు! అంతా క్విడ్ ప్రో కో!

సర్
రిప్లయితొలగించండి'తెలంగాణ' ఏర్పాటు తర్వాతా, రెడ్డి నాయకుల ప్రాముక్యత తగ్గి వెనకబడిన తరగతుల నాయకత్వం పెరిగితేనే, అదే నిజమైన తెలంగాణ భవిష్యతు కు పునాది లేదా పులి నోట్లోంచి తీసి సింహం నోట్లో పడినట్లే....
మీ ఈ వ్యాసానికి ధన్యవాదాలు....