ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ్గర్‌ను అప్రమత్తతకు ప్రతీకగా భావిస్తారు.యుద్ధరంగంలో ఉన్న యోధుపూప్పుడూ ట్రిగ్గర్‌పై వేలు ఉంచి దాడికి, ప్రతిఘటనకు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కోదండరాం అదే ప్రతీకను వాడుతున్నాడు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ సాధనకు ట్రిగ్గర్‌గా వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన భూమికను పోషించిన టీజేఎఫ్ సభలో కీలక ఉపాన్యాసం చేసిన సందర్భంగా నేను రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన తెచ్చాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ముందుకు తేవాలన్నది నా సూచన. నిజానికి తెలంగాణవాదుపూవ్వరూ అధికార కూటమి తరఫున రాష్ట్రపతి ఎన్నికల రంగంలోఉన్న ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదన్నది నా అభివూపాయం.
శుక్రవారం, జూన్ 29, 2012
శుక్రవారం, జూన్ 22, 2012
జయశంకర్ సర్‌తో కరచాలనం!
ఆంధ్రుల దినపత్రికలను పెట్టుబడికీ కట్టుకథకు పుట్టిన విష పుత్రికలుగా శ్రీ శ్రీ అభివర్ణించారు. ఆంధ్రుల పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయని, కొండలు,
గోల్కొండలు దాచేస్తాయని చెప్పారాయన. ఇది దాదాపు అర్ధ
శతాబ్దం కిందిమాట. ఇప్పుడు గోల్కొండలు దాచే స్థాయి
నుంచి దోచే స్థాయి
దాకా తెలుగు పత్రికారంగం ఎదిగిపోయిందని ప్రముఖ తెలంగాణవాది సీనియర్ జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి అంటున్నారు. తెలుగు మీడియా తీరుతెన్నులను మాట్లాడిన ఒక సందర్భంలో ఇప్పటి పత్రికలు, ప్రసార
మాధ్యమాలు, వాటి యాజమాన్యాలు గోలుకొండ మొదలు, హనుమకొండ, గీసుకొండ, మణికొండలను మింగేసిన అనకొండలు అని దానికొక పేరడీ చెప్పారు.
బుధవారం, జూన్ 20, 2012
శనివారం, జూన్ 16, 2012
జయశంకర్ స్పూర్తిని మరిచిపోయామా!?
జయ శంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరి గౌరీ శంకర్ 'తెలంగాణా జాతిపిత సర్ జయశంకర్' పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడు వందల పేజీలకు పైగా ఉన్న ఆ పుస్తకంలో దాదాపుగా డెబ్బై మంది రాసిన వ్యాసాలున్నాయి. వివిధ విశ్వవిద్యాయాలలో జయశంకర్ గారి శిష్యులు, సహాధ్యాయులు, సహచరులు మొదలు తెలంగాణా కోసం క్షేత్ర స్థాయిలో తెలంగాణా సాధనే ఊపిరిగా పనిచేస్తోన్న సామాన్య కార్యకర్తల దాకా అందులో ఆచార్య జయశంకర్ గారి గురించి రాసిన వ్యాసాలూ, వ్యాఖ్యలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక మనిషి మరణం తరువాత అంతటి స్పందన ఇటీవలి చరిత్రలో ఇంకెవరికీ రాలేదు. తెలంగాణలో రాయగలిగే అలవాటు ఉన్న ప్రతిఒక్కరూ తమ వేదనను వ్యాసాల రూపంలో వివిధ పత్రికల్లో ఆవిష్కరించారు. వాటిల్లో జయశంకర్ గారి వ్యక్తిత్వం, జీవితం, పోరాటం, ఆరాటం ఇలా జయశంకర్ జీవితంలో ఎన్ని చాయలున్నాయో ఆ పుస్తకంలో అన్ని రంగులున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు . రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి ...
-
సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్ భ...