శుక్రవారం, నవంబర్ 25, 2011

ఇద్దరూ దోచింది తెలంగాణనే!



నవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలిచింది కూడా నవంబర్ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఆఖరి అస్త్రమైన నిరాహారదీక్షను ఉపయోగించారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండు ఢిల్లీ వీధుల్లో నగుబాటుకు గురైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ కోసం అమీతుమీ తేల్చుకోక తప్పదని గుర్తించి ఆయన నవంబర్ 29 ఆమరణ దీక్షకు దిగారు. అప్పటికి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కంటున్నవాళ్ళు, తపిస్తున్నవాళ్ళు అనేకమందే ఉండివుండవ చ్చు. కానీ తెలంగాణను సకల జనుల స్వప్నంగా మలచింది మాత్రం నవంబర్ 2009.

ఇప్పుడు నవంబర్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనూహ్యంగా తెలంగాణ డిమాండుకు ఉత్తరాది పార్టీల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. మాయావతి విసిరిన చిన్న రాష్ట్రాల వలలో చిక్కుకుని ఇప్పుడు పార్లమెంటులోని పెద్ద పార్టీలన్నీ విలవిలలాడుతున్నాయి. సారి పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. రెండేళ్ళ క్రితం కేసీఆర్ దీక్ష ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాల దశ దిశ పూర్తి గా మార్చివేసింది. రాజకీయ పార్టీలు మొదలు చట్టసభల మీద విశ్వాసంలే ని పార్టీలు, ఉద్యమాలు కూడా కేసీఆర్ నిర్దేశించిన ఎజెండాను ఎత్తుకున్నా యి. తెలంగాణలో మూడు దశాబ్దాల విముక్తి ఉద్యమాలకు, సామాజిక సాంస్కృతిక పోరాటాలకు సారథులుగా ఉన్న గద్దర్, విమలక్కతో పాటు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్న మందకృష్ణ వంటి వారు కూడా ఏదో ఒక దశలో కేసీఆర్ను బలపరిచిన వారే. ఇప్పుడు వారు ఆయన మార్గంతో విభేదించవచ్చు.

కానీ అందరి గమ్యం ఒక్కటే అనడంలో సందేహాలు ఉండక్కర్లేదు. ఇవన్నీ కలిసే గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో తెలంగాణ తప్ప మరో వార్తలేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం పరిస్థితి అంత ఆశావహంగాలేదు. ఉద్యమాల్లో పాల్గొ న్న చాలా మంది ఇప్పటి పరిస్థితుల పట్ల కలవరపడుతున్నారు. రాజకీయ క్రీనీడలో మరోసారి తెలంగాణ తెరమరుగౌతుందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. తెలంగాణ వచ్చేదాకా తెగించి పోరాడుదాం అన్న రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామాలతో సహా తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలు చక చకా వాడేసి ఇప్పుడు చేతుపూత్తి నిలబడ్డారు. ఇదే అదునుగా చంద్రబాబు రెండేళ్ళ విరామం తరువాత తెలంగాణలో కాలుమోపి పునీతుడైపోయాడు.

రేపో మాపో జగన్ మానుకోట కాకపొతే మరోబాటగుండా తెలంగాణలో ప్రవేశించి ఓదార్పు పొందుతాడు. ఇంకోవైపు తెలంగాణ తెచ్చే దీ ఇచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కార్లలో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్గా కదులుతున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తామన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి రక్షణ కవచమై రచ్చబండలో రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు. సందట్లో సడేమియ్యలుగా కొందరు విశాలాంధ్ర   వాదులు తెలంగాణ సంఘాల సహకారంతో జిల్లాలు తిరిగి సమైక్య స్వస్థత కూటములు నిర్వహించే సన్నాహాల్లో ఉన్నా రు. చారివూతాత్మకమైన సకల జనుల సమ్మె ముగిసిన వెను చోటుచేసుకున్న పరిణామాలన్నీ చాలా మందినే కలవర పెడుతున్నాయి.

అంతకంటే కలవరపెట్టే వాస్తవాలను ఇప్పుడు సీబీఐ ఆవిష్కరిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల ఆస్తుల వివరాలు సేకరిస్తోన్న సీబీఐ ఇప్పుడు ఇద్దరు నేతలు ఎవంత దోచుకున్నది లెక్కగట్టబోతోంది. ఇది రెండు పిల్లుల కథను గుర్తుకు తెస్తోంది. రెండు పిల్లులు, ఒక ముసలమ్మ ఇంట్లో దూరి ముసలమ్మ చేసి పెట్టుకున్న రొట్టేముక్కను ఎత్తుకుపోతాయి. కథ, కథలోని నీతి అందరికీ తెలిసిందే.. కథ మొద ట్లో ఎవరు రాశారో ఎవరు చెప్పారో గానీ కొట్లాడుకోకుండా దోచుకున్న సొత్తును సమానంగా పంచుకోవాలన్నది కథలోని నీతి. నీతి సూత్రాన్ని అవినీతి పరులు చాలాకాలమే పాటిస్తూవచ్చారు. అదే న్యాయమని నమ్మించారు కూడా.   తరతరాలుగా కథ చెపుతూ వస్తోన్న వాళ్ళు, వింటూ కొడుతున్న వాళ్ళు పాపం పిల్లులు అనుకున్నారు కానీ రొట్టె చేసుకున్న ముస ల్ది ఏమయిపోయిందో ఆలోచించలేదు. ఇవాళ మన తెలుగు మీడియా కూడా అదే ధర్మమని భావిస్తున్నట్టుంది. కొద్దికాలంగా మన మీడియాలో ఆస్తుల గొడవ నడుస్తోంది.

ముఖ్యంగా జగన్ ఆస్తులమీద సీబీఐ విచారణ మొదలైనప్పటినుంచి మన ఛానళ్లు పత్రికలూ ఆయన ఆస్తుల చిట్టా సేకరించే పనిలో ఉన్నాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి లాగా మిత్రలాభం గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో కానీ ఆయన కొంచెం ఆధునికుడు, ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ఇప్పుడు చంద్రబాబును కూడా సీబీఐ ఉచ్చులోకి దించాడు. సీబీఐ విచారణ సంగతేమో గానీ మీడియాకు మాత్రం ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఇరవై నాలుగు గంట లూ తెలుగు ఛానళ్లు విడతల వారీగా జగన్మోహనడ్డి, చంద్రబాబు నాయుడుల ఆస్తుల గురించి చర్చలు, వాదోపవాదాల చేస్తోన్నాయి.


అసలు సొమ్మంతా ఎవరిది, ఇన్ని లక్షలు ఎక్కడినుంచి సృష్టించారు అన్న విషయాల మీదికి చర్చ వెళ్ళకుండా మీడియా ఇప్పుడు పిల్లుల గురిం చి, పిల్లులకు వాటాలిచ్చిన కోతుల గురించి కథలు కథలుగా కథనాలను ప్రసారం చేస్తున్నది. సీబీఐ, విచారణలు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా రెండు కేసుల్లో ఇప్పటికే నష్టం జరిగింది మాత్రం తెలంగాణకు. వీళ్ళు అమ్ముకున్నారనో, పంచిపెట్టారనో లేదా కేటాయించారనో చెపుతున్న భూములన్నీ తెలంగాణ ప్రాంతంలోనివి. అందునా ఎక్కువ హైదరాబాద్ చుట్టూ ఉన్నవి.

 రాజశేఖర్డ్డి చంద్రబాబు వేరు వేరు వ్యక్తులు కావొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండవచ్చు. వేరు వేరు జెండాలతో ఎన్నికల్లో పోటీ పడి ఉండవచ్చు. కానీ ఇద్దరి ఎజెండా ఒకటే అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే సీబీఐ వెలికితీస్తున్న వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇద్దరూ హైదరాబాద్ను, దాని చుట్టూ పక్కల ఉన్న భూములను ఆధారంగా చేసుకుని తమ తమ అభివృద్ధి ప్రణాలికలను అమలు చేశారు. రెండు పిల్లుల కథలో ఒక పిల్లి దోచుకొస్తే ఇంకొక పిల్లి కాప లా ఉంటుంది. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు వైఎస్ ప్రధాన కాపలాదారుగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు. తరువాత వైఎస్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు బాబు కాపలా దారు. యేవో క్షణికావేశంలో అప్పుడప్పుడు విమర్శించుకునే వారు తప్ప కోర్టులు కేసుల జోలికి వెళ్లలేదేప్పుడు. కేసులు వేసుకున్నా అవి విచారణ దాక వెళ్ళేలోపే రాద్ధాంతం లేకుం డా రాజీ పడిపోయారు. వైఎస్ హఠాన్మరణం తరువాత జగన్ అతని వారసునిగా అవతరించడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఊహించని అడ్డంకిగా మారింది.

దశలో తెలుగుదేశం ఔత్సాహికులు కొందరు వైఎస్ అక్రమాలు, జగన్ ఆస్తుల మీద కేసు వేసి ఇరుకున పెట్టాలని భావించి ఉంటారు. అదే కోణం చూపిస్తూ ఎర్రన్నాయుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆకేసును సీబీఐకి అప్పగించడంతో అప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడిలో గాయపడి ఉన్న జగన్కు పుండు మీద కారం చల్లినట్టయ్యిం ది. దీంతో అక్రమ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్ తల్లి విజయమ్మ చంద్రబాబు ఆస్తుల మీద విచారణకు కోర్టును ఆశ్రయించారు. ఆమె కేవలం పిటిషన్ మాత్రమే కాక దానితో పాటు వేలాది పేజీల ఆధారాల పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఇట్లా కాలం నడిచినంతకాలం ఒకరికొకరుగా ఉన్న రెండు కుటుంబాలు ఇవాళ సీబీఐ విచారణలో ఉన్నారు.

రాజశేఖర్డ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఐటీకి ఆదరణ ఉన్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే పనికి పూనుకున్నాడు. ప్రపంచబ్యాంకు మద్దతుతో అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసి హైదరాబాద్ అభివృద్ధే ఆంధ్రవూపదేశ్ అభివృద్ధి అని, హైదరాబాద్ను ఐటీ రాజధాని చేస్తానని వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను, పేద రైతుల భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. హైటెక్ సిటి నిర్మాణానికి దేశంలోని బడా కాంట్రాక్టర్లతో బేరసారాలు కుదిర్చారు. సత్యం రామలింగ రాజుతో స్నేహం చేశారు. స్నేహం తో అమెరికా అధినేతనే అతిథిగా పిలుచుకోగలిగారు.

ఒక్క హైటెక్ సిటితో ఆగకుండా ఫార్మా సిటీలు మొదలు ఫిలింసిటీల దాకా వేలాది ఎకరాల తెలంగాణ భూములను ధారాదత్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్ రంగాడ్డి జిల్లాల మధ్య కొత్తగా ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్య జిల్లా పేరుతో వేలాది ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టారు. దానికి ఆనుకునే ఎమ్మార్ ప్రాపర్టీస్కు పునాదివేసి కోనేరు ప్రసాద్కు ఒక కొత్త సామ్రాజ్యాన్ని అప్పగించారు. పెద్ద పెద్ద చెరువులు పూడ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చేసి మళ్ళీ వర్షపు నీటికోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. రోడ్లు వెడల్పు చేసి వాటిమీద పె్లై ఓవర్లు నిర్మించారు. అభివృద్ధిలో తన సామాజిక వర్గం వారిని భాగస్వాములను చేశారని వారిద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నది ఇవాళ కోర్టు ముందున్న వాదన. వారిలో కొందరు వెంటనే పార్లమెంటు సభ్యులైపోయారు.

ఇంకొందరు పార్టీలో ముఖ్యనేతలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు. మరికొందరు బాబుగారి బినామీలుగా ఆయన సంపదను కాపాడుతున్నారన్నది వాదన. కేసును వైఎస్ సతీమణి విజయమ్మ వేశారు. వై.ఎస్. ప్రజా ప్రస్థానం కూడా అదే బాటలో సాగింది. వై.ఎస్. కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములతోనే వివాదస్పదుడయ్యారు. జగన్కు పెట్టుబడులు పెట్టిన వారంతా ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో వై ఎస్ దగ్గర తెలంగాణ జిల్లాల్లో భూములు, జలయజ్ఞం కాంట్రాక్టులు,మరికొందరు హైదరాబాద్లో ముస్లింల వక్ఫ్ భూములు, హుసింగ్ బోర్డ్ భూములు అక్రమంగా పొంది విల్లాలు, టవర్లు కట్టారని అభియోగం.

ఇప్పటి పిల్లుల కథలో పిల్లులు, కోతులూ కలిసిపోయాయి. అభియోగాలను బట్టి ముసలమ్మ రొట్టెను కోతులకు కట్టబెట్టినట్టు తెలంగాణ భూములను తమ తమ బంధువులకు, వందిమాగధులకు, బినామీలకు, వాళ్ళు పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారు. పాలన ఎవరిదైనా ప్రసాదంలా పంచుకున్న ది మాత్రం సీమాంధ్ర పెట్టుబడిదారులే. వారిలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో వస్తోన్న పేర్లు, అఫిడవిట్లో ప్రస్తావించిన పేర్లను పరిశీలిస్తే పదేళ్ళలో పంచిపెట్టిన వాళ్ళు మారారు తప్ప పంచుకున్నది ఒక్కరే అని అర్థమౌతుంది. పది, పదిహేనేళ్ళ కాలంలోహైదరాబాద్, నగరం చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఉన్న భూములమీద లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కొందరు లక్షలకోట్లు సంపాదిస్తే, వందలాదిమంది కోటీశ్వరులైపోయారు.

అలాగే అనామకులు వన్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. అక్కడితో ఆగకుండా సంపదను కాపాడుకోవడం కోసం రాజకీయా పార్టీల్లో చేరో, పార్టీలు పెట్టో దేశసేవకు పునరంకితం కావాలని కలలుగంటున్నారు. సరిగ్గా ఇద్దరి పాలనలో పెట్టుబడిదారులుగా ఎదిగిన వాళ్ళే తెలంగాణను అడ్డుకున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్ పట్టుకున్నది, రెండుకళ్ల సిద్ధాంతాలు పుట్టుకొచ్చింది పెట్టుబడిదారులను, వాళ్ళ పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే. ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తుకోసం హైరానా పడుతున్నవాళ్లంతా వాళ్ల ఎంగిలి కూటికి అలవా టు పడ్డవాళ్లే. వీళ్ళకు రెండు కేసుల మధ్య తెలంగాణ కోల్పోయిన లక్షలాది ఎకరాల భూములు, వేలాదిమంది రైతు కుటుంబాల వ్యధలు, శిథిలమైపోయిన ప్రజల బతుకులు కనిపించవు.

అలాగే తెలంగాణ ఉద్యమం ద్వారా ఓట్లు, సీట్లు అని ఆరాటపడే వాళ్ళు, ఇదే పెట్టుబడి పార్టీలతో ఎన్నిక లు, ఎత్తులు పొత్తులు అనుకునే వాళ్ళు విషయాలను పట్టించుకోరు. కనీ సం తెలంగాణ ఉద్యమకారులైనా విషయాన్ని తెరమీదికి తెచ్చి ఎవరి భూములు వారికి ఇప్పించే పోరాటం చేయవచ్చు. అలాంటి పోరాటం తెలంగాణను దోచుకుని ముద్దాయిలుగా నిలబడ్డవాళ్లను నిలదీయడానికి, అడ్డుపడుతున్న వాళ్ళ మెడలు వంచడానికి పనికొస్తుంది. అన్నిటికీమించి సొంతభూముల్లో కూలిలై కునారిల్లుతున్న తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి