మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

రజాకార్లు వస్తున్నరు..జర భద్రం..!



మనలో చాలా మందిమి రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలంతా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి భూస్వామ్యానికి సమాధి కడుతున్న రోజుల్లో నిజాం రాజు రంగంలోకి దింపిన కిరాయి మూకలే రజాకార్లు. రజాకార్లు స్థానిక దొరలూ, భూస్వాముల అండతో గ్రామాల మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను హేయమైన పద్ధతిలో హింసించారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేశారు. రజాకార్ల ఆకృత్యాలు మనల్ని అరవయ్యేళ్ళుగా భయం కర పీడకలగా బాధిస్తూనే ఉన్నాయి. కొందరు రజాకార్లకు మతం రంగు పులిమారు గానీ రజాకార్లు అప్పుడు చేసింది మతపరమైన దాడులు కాదు. ప్రజ పోరాటాన్ని అణచి వేయడానికి రాజ్యం చేసిన కుట్రలో రజాకార్లు పావులుగా ఉపయోగపడ్డారు.

అంతగా సైనిక బలం లేని నిజాం రాజు బ్రిటీష్ పాలకులతో, భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో, అప్పటి హైదరాబాద్ ప్రధాని లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్కు ఇటు హైదరాబాద్ పాలకులకు కంటిలో నలుసులా తయారవుతున్న కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని అంతంచేసి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని స్వయంసేవకులను సృష్టించాడు. దానికి అప్పుడు మజ్లిస్ పార్టీ (ఎం ఐఎం) నాయకుడుగా ఉన్న ఖాసిం రజ్వీనీ ఎంచుకున్నాడు. ఖాసిం రజ్వీ అప్పటికే పేరున్న వక్త, న్యాయవాది. ఉత్తరవూపదేశ్ నుంచి అప్పటి నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న లాతూర్కు వలస వచ్చి ముస్లిం ఛాందసుల్లో ఆయనొకడు. ఖాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్ను రక్షించడానికి మొదలైన రజాకార్ల ఉద్యమం తరువాత ఒక రాక్షస మూకగా మారింది. ముఖ్యంగా అప్పటికే ప్రజా ఉద్యమానికి వణికి పోతున్న దొరలూ, దేశ్ ముఖ్లు తమ అనుచరులు, తమకు నమ్మిన బంట్లను కూడా రజాకార్ల పేరుతో రంగంలోకి దింపి ప్రజలను తమకు విధేయులుగా మార్చుకోవడానికి గ్రామాలలో భయోత్పాతం సృష్టించారు. అందులో కేవలం ముస్లింలే కాదు హిందూ మతానికి చెందిన వాళ్ళు చాలా మంది కిరాయి సైనికుల్లా పనిచేశారు

చరివూతంతా కథలు కథలుగా మనం చదువుతూనే ఉన్నాం. ఇప్పుడైతే సమైక్యవాదులు రజాకార్లను ఉటంకిస్తూ మొత్తం తెలంగాణ చరివూతనే మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ళ పాటు కొనసాగిన దాష్టీకం పోలీసు చర్యతో ముగిసింది అనుకున్నాం. కానీ అది ఉట్టి భ్రమేనన్నది తెలంగాణలోని ఉద్యమ కారులకు అనుభవంలోకి వస్తున్నది. సైనిక చర్య వల్ల మనం భారత దేశంలో భాగం అయ్యాం తప్ప మన పరిపాలన మనకు రాలేదన్న విషయం మనకు పదే పదే రుజువవుతూ వస్తున్నది. ఖాసిం రజ్వీ చరిత్ర ముగిసిపోయి ఉండవచ్చు. కానీ అరవయ్యేళ్ళ చరివూతలో అనేకమంది రజ్వీలు పుట్టుకొచ్చారు. రకరకాల వేషాల్లో రజాకార్లు ఇప్పటికీ ప్రజల్ని, ఉద్యమకారుల్ని తరుముతూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ పాలకులు నిజాం రాజుకంటే బూజు పట్టిన ఆలోచనలు ఉన్నవాళ్ళని అర్థమౌతోంది. అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పుకోసం పనిచేసే పోలీసులు రజాకార్ల కంటే దుర్మార్గంగా ప్రవర్తించగలరని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ఇప్పుడు సకల జనుల సమ్మెను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తోన్న పద్ధతులతో అది మరోసారి నిరూపితం అవుతోంది.

సకల జనుల సమ్మె భేరి ఇవాళ పాలకవర్గాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. వారం రోజులుగా సమ్మెకు నాయకత్వం వహిస్తోన్న ఉద్యోగులు ప్రభుత్వ పాలనను పూర్తిగా స్తంభింపజేసి ప్రజలను సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం చేశారు. దీనికి సింగరేణి బొగ్గు గనికార్మికులు నిప్పును రాజేసి హైదరాబాద్లోని పాలకులకు సెగ తగిలేలా చేశారు. ఒక్క వారం రోజుల్లోనే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించే శక్తిలేని పాలకులు ఇప్పుడు బలవూపయోగం చేయాలని చూస్తున్నారు. సమ్మె విరమించినట్టు కరపవూతాలు పంచడం, కార్మికులను బెదిరించి పనిచేయించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడంతో పాటు వాళ్ళ ఇళ్ళల్లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, పెళ్ళిళ్ళు కాకుండా చేస్తామనడం, జేఏసీ నాయకుల మీద జేఏసీల పేర్లతో ఉన్న కిరాయి మనుషులతో దాడులు చేయించడం ఇవన్నీ రజాకార్లు చేసిన పనులను పోలి ఉన్న వే. సమ్మె ఉధృతి పెరిగిన కొద్దీ పాలక వర్గం ఇలాంటి రజాకార్లను ఇంటింటికీ పంపే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది.

రెండేళ్లుగా పోరాడుతున్న ప్రజానీకానికి తమ సమ్మె ఉత్తేజాన్నివ్వాలని, చలనం లేని రాజకీయ వ్యవస్థను ఒక కుదుపు కుదపడానికి ఇది తోడ్పడుతుందనీ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న తాము సమ్మె చేసి సకల జనుల తరఫున పాలక వర్గాన్ని నిలదీయడం అవసరమని ఉద్యోగులు భావించారు. సమ్మె నిర్ణయం వెనుక సామాజిక స్పృహతో కూడిన సమరశీల చైతన్యం ఉంది. స్పృహ సాధారణ ఉద్యోగులకు, కార్మికులకు ఉండడం వాళ్ళ వివేకానికి తార్కాణం. రెండేళ్లుగా గొంతు దాటని మౌన వేదనకు ఇప్పుడు సమ్మె ఒక మార్గాన్వేషణ చేస్తున్నది. వర్గాల్లో సింగరేణి కార్మికులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సింగరేణి ఒక ఫ్యూడల్ సంస్థానంలా ఉంటుంది. సింగరేణి కార్మికులంటే మొత్తం కార్మిక రంగంలోనే అత్యంత అణగారిన వర్గం. నూటికి తొంభై మంది తమ జీవితాల్లో దోపిడీని వారసత్వంగా అనుభవించి, అవకాశాలు లేక చదువుకు దూరమైన వాళ్ళు, అందులో అత్యధికంగా దళిత, బహుజన పీడిత కుటుంబాల వాళ్ళే అక్కడ కార్మికులుగా ఉంటారు. అక్కడ పనిచేసే అధికారులలో అత్యధికులు ఆంధ్ర ప్రాంత చదువరులు. వాళ్ళు సింగరేణిలో దొరలుగా చలామణి అవుతుంటారు. వాళ్ళను నిన్న, మొన్నటి దాకా కార్మికులంతా దొరా అనే పిలిచే వాళ్ళు. దొరల్లాగే వాళ్ళూ కార్మికులతో నానా చాకి రీ చేయించుకుంటారు. ఇది 1980 దశకం దాకా కొనసాగింది. అప్పటి దాకా రాజ్యమేలిన విశాలాంధ్ర కార్మిక సంఘాలు కార్మికుల హక్కులకంటే యాజమాన్యాలు, అధికారుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యంఇచ్చేవి.

ఇలాంటి దశలో వేలాదిగా సింగరేణిలో చేరిన తెలంగాణ యువత కొత్త కొత్త కార్మిక సంఘాలతో మమేకమై ఒక దశాబ్ద కాలంలోనే అక్కడి పని పరిస్థితులను, సంస్కృతిని సమూలంగా మార్చివేసింది. ఆకాలంలో కార్మికులకు సమ్మె ఒక తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడింది. ముఖ్యంగా 1986-90 మధ్య కాలంలో సగటున ఏడాదికి వందకు పైగా సమ్మెలు జరిగాయి. ఒక్క 1989 - 1990 లోనే వరుసగా నెలల తరబడి సమ్మెలతో దొరతనాన్ని అణచివేసి సింగరేణిలో కొత్తతరహా పారిక్షిశామిక సంస్కృతిని నెలకొల్పిన ఘనత అక్కడి కార్మికులది. ఇప్పుడు సింగరేణి కార్మికులు అదే సమ్మెటతో ప్రభుత్వం దిమ్మదిరిగేలా చేస్తున్నారు

ఒక్క వారంలోనే వేల కోట్ల రూపాయలు నష్ట పరచడ మే కాక మొత్తం దక్షిణ భారతాన్నే చిమ్మ చీకటి చవిచూసే విధంగా చేశారు. ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి దొడ్డి దారిన వేరే రాష్ట్రాల నుంచి బొగ్గు తెప్పించుకుంటోంది. ప్రభుత్వం ఇప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలేవీ వెతుకుతున్నట్టు లేదు. బెట్టుగా వ్యవహరించడమే కాక ఇప్పుడు సింగరేణిలో కార్మికుల మీదికి సరికొత్త రజాకార్లను పంపుతోంది. ఇళ్లల్లోంచి కార్మికులను లాక్కెళ్ళి బొగ్గు తవ్వమని బావుల్లోకి తోస్తున్నారు. ఇంటికి కూడా వెళ్ళకుండా కార్మికులను గనుల దగ్గరే నివాసముండి పోలీసుల ఎస్కార్టుతో పని చేయాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి నిర్బంధకాండ సింగరేణి కార్మికులకు కొత్త కాదు. చరిత్ర పొడుగునా వాళ్ళు ఇటువంటి నిర్బంధాలను చాలానే చూశారు.

నరక కూపాల్లాంటి బొగ్గు బావుల్లో తాము పనిచేయలేమని కార్మికులు పారిపోయినప్పుడు ప్రతి గని దగ్గర ఒక సారా దుకాణం తెరిచిఫుల్లుగా తాగించి పనిలోకి దించిన ఘనత సింగరేణి యాజమాన్యానిది. అసలు తాగడమే తమ దరివూదానికి కారణమని, తాము మద్యం ముట్టమని చెప్పి తమ ప్రాంతంలో మధ్య నిషేధం అమలు చేసుకున్నప్పుడు పోలీసు ఠాణాలనే సారా కొట్లుగా మార్చి తుపాకీతో బెదిరించి మరీ తాగించిన అనుభవం కూడా ఉన్నది వాళ్ల కు. ఒకానొక కాలంలో తీవ్రమైన అణచివేతనూ, నిర్బంధాన్ని, ఎన్కౌంట ర్లనూ ఎదుర్కొని ఒక నూతన ప్రజాస్వామిక సమాజం కోసం కలలుగన్న నాయకత్వం బొగ్గు గనుల నుంచే పుట్టింది. ఇవ్వాళ సింగరేణిలో పోరాడుతున్నది ఒక్క కార్మిక సంఘమో కాదు. తెలంగాణ కోసం సంఘటితమైన యావత్ కార్మిక శక్తి. రాజకీయంగా వాళ్ళల్లో సీపీఎంతో సహా అన్ని పార్టీలు ఉండొచ్చు. పార్టీల నిర్ణయాల ప్రమేయం లేకుండా ఇవాళ వాళ్ళం తా ప్రజల పక్షాన నిలబడడం వాళ్ళ పరిణతికి నిదర్శనం. ఇప్పుడు రవాణా ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. పన్నుల వసూళ్లు ఆగిపోయాయి. ఇలా డబ్బు వసూలు దారులన్నీ మూసివేస్తే ప్రభుత్వం నిలబడడమే కష్టం. ఇవాళ సకల జనుల సమ్మె ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు.

నిరంతర ప్రజాఉద్యమం ప్రాంతం లో రెండేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రజల్లో భాగంగా ఉద్యోగులూ గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతూనే వచ్చారు. ధర్నాలు, హర్తాళ్లు చివరకు సహాయ నిరాకరణ కూడా చేసి హెచ్చరించి చూశా రు. అయినా ప్రభుత్వం స్పందించకపోగా కాలయాపనకు పూనుకుంటోంది. అసలీ రాష్ర్టంలో సమస్యా లేనట్టుగా వ్యవహరిస్తోంది.

ఇలాంటి స్థితిలో బుద్ధి జీవులకు సమ్మె మినహా మరో మార్గం ఏముంటుంది? ఉద్యోగులు దీన్నొక చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించారు. రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమం తన అమ్ముల పొదిలోని అన్ని ఆయుధాలను వాడేసింది. అనేక సృజనాత్మక పోరాటాలనుకూడా సృష్టించగలిగింది. ఆట, పాటలతో మొదలుపెట్టి అనేక వైవిధ్యమైన రూపాలలో ప్రజలు తమ ఆకాంక్షను తెలుపుతూనే వస్తున్నారు. ప్రజల ఆకాంక్ష న్యాయమైనదని, అది నెరవేరుస్తున్నామని ఒక్క రూ రెండేళ్లుగా ప్రజలవైపు తిరిగి చూడ సరికదా! ప్రజల ఆర్తనాదాల ను వినలేకపోతున్నారు. పైగా అణచివేతకు అన్ని పద్ధతులనూ వాడుతున్నా రు. ఇలాంటి పాలకులకు జ్ఞానోదయం కలిగించాలంటే ప్రజలకు తెలిసినవి రెండే రెండు మార్గాలు. ఒకటి ప్రజాస్వామికంగా పోరాడి గెలవడం, రెండోది తిరగబడి అట్లాంటి ప్రభుత్వాలను కుప్ప కూల్చడం.

పాలకులు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాన్ని వదలకపోవడం గమనార్హం. ప్రభుత్వం దాన్ని తెలంగాణ ఉద్యమబలంగా కాకుండా, చేతగాని తనమని అనుకుంటున్నట్టుంది. అందుకే ప్రజలను భయపెట్టి, వినకపొతే హింసలకు గురిచేసైనా సరే ఉద్యమాన్ని నీరుగార్చే పథకాలను సిద్ధం చేసుకున్నట్టు అర్థమౌతోంది. సమ్మెలు ఎవరు చేసినా వాళ్ళతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చడం ప్రభు త్వ బాధ్యత. ముఖ్యమంవూతికి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి చేయాలి తప్ప పని చేస్తున్న ఉద్యోగులనో, కార్మికులనో బెదిరించడం కాదు.

నిజాం కాలంలో ఇప్పుడున్నన్ని హక్కులు లేవు. ఇలాంటి రాజ్యాంగమేదీ లేదు. రాచరికపు వారసత్వంతో సాగిన సాంప్రదాయ పాలన అది. ఇవాళ పరిస్థితి అదికాదు. సమస్య అంతా మన కాంగ్రెస్ నాయకులకు స్పృహ లేకపోవడమే. తెలంగాణ ఇస్తామని చెప్పినందు వల్లనే ప్రజలు ఓట్లు వేశార ని, తాము ప్రజల బలంతోనే గెలిచామని వాళ్ళు మరిచిపోవడం వల్లే పరిస్థితి తలెత్తింది. వాళ్ళు నిజంగానే ఆత్మ గలవారైతే ప్రజలను మోసం చేస్తో న్న ప్రభుత్వాన్ని కూల్చేవారు. కానీ వాళ్ళు తాయిలాలకు,తాకట్టుకు అలవాటు పడ్డారు

అప్పుడు దొరలూ, దేశ్ముఖ్లు నిజాంనవాబ్కు జీ హుజూర్ అన్నట్టే, మన మంత్రులు ముఖ్యమంవూతికి జై కొడుతూ ఉద్యమకారులని పోలీసులకు పట్టిస్తున్నారు. అడ్డు చెప్పిన వాళ్ళను ఆడ పిల్లలని కూడా చూడకుండా రౌడీలతో కొట్టిస్తున్నారు. అప్పుడు రజాకార్లను దొరలు వాడుకున్న ఇప్పుడు పోలీసులను వాడుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా అధికారం లో ఉన్నవాళ్ళు అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న వాళ్ళు ఎలాగూ మాట్లాడరు. వాళ్ళను కదిలించాలంటే ముందుగా ప్రజలు కదలాలి. సమ్మె చేస్తున్నవాళ్లకు సమాంతరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇవాళ సమ్మెకు మద్దతుగా ఉన్న పార్టీలు హైదరాబాద్ వదిలిపెట్టి సమ్మె ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళాలి. అది సమ్మెలో ఉన్నవారికి ఆత్మస్థెర్యాన్ని నింపుతుంది. ఇప్పు డు కుడి ఎడమల తేడా లేదు. బీజేపీ కూడా నక్సలైట్ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పింది.

గత రెండేళ్లుగా జేఏసీలో అంద రూ భాగస్వాములుగా ఉన్నారు. సీపీఐ పూర్తిస్థాయిలో జేఏసీలో లేకున్నా ఉద్యమాన్ని ముందుకు తీసుకు ది. కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కేసీఆర్ ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. వీళ్ళంతా సమ్మె జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కార్మికులతోకలిసి సమ్మెలో పాల్గొనాలి. ఇవాళ ఇంకా జాతీయ స్థాయిలో చలనం రాకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి-ఉద్యమం స్థానికంగా పరిమతమైపోవడం, రెండోది-జాతీయస్థాయిలో ఎవ రూ దీనిపై మాట్లాడకపోవడం. పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం వేరు. తెలంగాణ ప్రజలపట,్ల ఉద్యమం పట్ల తపనతో తాము కూడా అందులో భాగమని చెప్పడం వేరు. గడిచిన వారం రోజుల్లో బీజేపీతో సహా ఒక్క పార్టీ ఢిల్లీలో దీన్నొక అంశం చేయక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మిగతా పార్టీలకు ఢిల్లీ జేఏసీ కి కూడా వర్తిస్తుంది.

జాతీయ పార్టీలకు నిజమైన ప్రేమే ఉంటే అన్ని రాష్ట్రాల్లో కనీసం ఒక్క రోజైనా నిరసన తెలిపేవారు. కనీసం ఢిల్లీలోనైనా మీడియాతో మాట్లాడే వాళ్ళు. సద్భావన సభలో, సంఘీభావ ర్యాలీలో చేసేవాళ్ళు. ఇది బీజేపీ అలాగే సీపీఐ లాంటి పార్టీలు పూనుకుంటే తప్ప సాధ్యమయ్యే పనికాదు. ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగం. ఇలా విననప్పుడు ప్రజలు మిగిలి వున్న మరో మార్గంవైపు పోయే ప్రమాదం ఉంది. హింసాయుత తిరుగు బాటు ఒక్క మిగిలి ఉన్న మార్గం. అది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం ఎంతమాత్రం కాదు. విచివూతమేమిటంటే ఇవాళ పెద్దపెద్ద మాటలు చెప్పే వాళ్ళు న్యాయమూర్తులైనా, మీడియా అయినా, పాలకవర్గాల్లో ఎవరైనా అల్లరికి అలజడికి స్పందించినంతగా శాంతి సహనాలకు స్పందించడం లేదు.

అస్సాంలోనో, కాశ్మీర్లోనో ఒక దుకాణం తగలబడిందని, రాజస్థాన్లో గుజ్జర్లు ఒక రోడ్ను, రైలు మార్గా న్ని ఆపారన్న వార్తలను దేశమంతా ప్రచారం చేసి ఒత్తిడి పెంచే జాతీయ మీడియా తెలంగాణలో రెండు సంవత్సరాలుగా నిరీక్షించిన ప్రజలు ప్రభు త్వం పై తిరుగుబాటు చేశారని, ఇక్కడ సకల జనులు సమ్మెకు దిగారని ఒక్క ముక్కయినా చెప్పలేకపోతున్నాయి. ఇలా మెలకువలో ఉండి నిద్ర నటించే వాళ్ళు, మొద్దు నిద్రలో ఉండి మెలకువతో ఉన్నట్టు మోసం చేస్తున్న వాళ్ళు ఉలిక్కి పడి లేచే విధంగా ప్రజలే సమ్మెను ఒక కొత్త మలుపు తిప్పాల్సిన అవసరం ఉంది. అది వెంటనే జరగక పొతే సీమాంధ్ర రజాకార్లు రెచ్చిపోయే ప్రమాదమూ పొంచి ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి