కరోనా వైరస్ నియంత్రణ విషయంలో చైనా లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ అనుభవాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనా నగరం వుహాన్ లో ఇద్దరు స్థానిక చిత్రనిర్మాతలు Lin Wenhua,
Cai Kaihai జనవరిలో నగరం లాక్ డౌన్ అయినప్పటి నుండి
50 రోజులకు పైగా ప్రజల జీవితాన్ని రికార్డు చేశారు. ఈ ఫిలిం ను బీబీసీ Our World - Wuhan: Life Under Lockdown పేరుతో ప్రసారం చేసింది. ఇది హృదయం ద్రవింపజేసే కథ! ఈ చిత్రాన్ని రూపొందించిన వారిలో ఒకరు తన భార్య కొరోనావల్ల ఎంత కఠోరమైన జీవితాన్ని అనుభవించిందో చూపించారు. ఇంకొకరు ఒక వాలంటీరుగా ఆ నగరంలో ఇంటింటికీ తిరిగి మందులు అందిస్తూ ఆ రోగులు అనుభవించిన వేదనను రికార్డుచేశారు.ఈ డాక్యుమెంటరీ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కరోనా ఎంత భయంకరమైందో, దానిని ఎంత జాగ్రత్తగా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ముఖ్యంగా లాక్ డౌన్ లో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి దీనిని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. తప్పకచూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు . రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి ...
-
సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్ భ...
Ok Sir🙏 , ఈ విధంగానే ఇండియాలో కూడా అందరం జాగ్రత్తలు తీసుకోవాలి సార్ , తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమిస్తాము .
రిప్లయితొలగించండిThank you for sharing a valuable vedio sir,by this vedio we can understand the importance of the lockdown period and precautionary methods to be taken as serious
రిప్లయితొలగించండి