గురువారం, నవంబర్ 21, 2013

వాళ్ళు భద్రాచలం అడిగితే అమాయకులంతా దేవుడికోసం అనుకున్నారు



వాళ్ళు భద్రాచలం అడిగితే
అమాయకులంతా దేవుడికోసం
 అది సీమాంధ్రుల తాపత్రయం అనే అనుకున్నారు ....
 కానీ వాళ్ళ కళ్ళన్నీ నీళ్ళ మీదే ఉన్నాయి
వాళ్లకు కావాల్సింది దేవుడు కాదు
పోలవరం ప్రాజెక్టు

*****

వాళ్ళు  మునగాల మాదే అంటే
అదే అమాయకులు ప్రజలకోసమని
బ్రమపడి  పాపం ఎంత ప్రేమ అనుకున్నారు
 కానీ వాళ్ళ చూపులు ప్రజలమీదో
చరిత్ర మీదో కాదు... నీళ్ళ మీద
రేపటి వాళ్ళ భవిష్యత్ మీద ....

మునగాలనుంచి తెలంగాణాకు వచ్చే
 నాగార్జున సాగర్ ఎడమ కాలువమీద
ఎడమ కాలువను దానికి పిల్లకాలువగా ఉన్న మునగాల కాలువను కబ్జా చేసి నీళ్ళను ఆ కాలువద్వార కృష్ణా సరిహద్దులు దాటించడం 





*****

పాలమూరు జిల్లాలో విస్తరించిన 
శ్రీశైలం రిజర్వు ఫారెస్టు తమదేనని 
ఈనాడు వాదిస్తే అది అడవి మీద
అందులోని జంతువుల మీదా
ఆనాడే వాళ్ళు పెంచుకున్న
మమకారమని అనుకోకండి
అందులో ఎడమ గట్టును కూడా
బుట్టలో వేసుకునే కుట్ర ఉంది
ఎదమగాట్టులో 900MW విద్యుత్ కేండం ఉంది
నీళ్ళూ వాడుకోవచ్చు..

ఈనాడు అటవీ శాఖ ఆదీనంలో ఉన్న
భూములు కూడా సీమంధ్రలోనే కలపాలని వాదిస్తోంది
గ్రామ్ల్లు, జిల్లాలే తప్ప అడవులకు అలాంటి పరిధి ఉండదు..

కర్ణాటక, తమిళనాడు, కర్నాటక- కేరళ మధ్య అలాగే ఈశాన్యరాష్ట్రాల మధ్య ఇలా అడవులు అల్లుకుని ఉన్నాయి . ఇది కేవలం తెలంగాణా జలవనరులు కబళించే కుట్ర మాత్రమే .. ఇట్లా మొత్తంగా కృష్ణ గోదావరి
నీళ్లన్నీ గుత్తగా కొట్టేయాలని సీమాంధ్ర చూస్తోంది.. భూములు, అడవులు, చెరువులు ఆక్రమించిన మీడియా వారికి కొత్త కొత్త సలహాలు ఇస్తోంది! !






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి