శుక్రవారం, ఫిబ్రవరి 01, 2013

ముమ్మాటికీ మూడు తరాల మోసం
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. నమ్మించి మోసం చేయడం ఆ పార్టీ నైజం. నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని యూపీఏ ప్రభుత్వం సాధికారంగా చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి మరోసారి తను మారలేదని నిరూపించుకున్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను గమనించిన వారెవరికైనా ఇదేమంత ఆశ్చర్యపోదగిన విషయం కాదు. కానీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రం ఇది ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అధికారిక నిర్ణయాలయి నా ముందు ప్రజల్లో, పార్టీల్లో చర్చకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం కోసం చట్టసభల ముందుకు, మంత్రివర్గం ముందుకు వస్తాయి. వాటిని ఆమోదించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏ రకమైన పాలనా వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ఎవరికీ లొంగి పనిచేయవు. సర్వ స్వతంవూతంగా వ్యవహరిస్తాయి. అలా ఉన్నప్పుడే దాన్ని సార్వభౌమాధికార వ్యవస్థ అం టాం.

కానీ తెలంగాణ విషయంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అలా కనిపించడం లేదు.అసలు దేశంలో ప్రజాస్వామ్యమే ఉన్నట్టు అనిపించడం లేదు. నిజంగానే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్న రాజ్యాంగం మీద నమ్మకం,విశ్వాసం ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉండేది. ఆగిపోయిన ప్రక్రియను కొనసాగించేది. అఖిలపక్ష భేటీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉండేది. కేం ద్ర హోంశాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండే ముందుగా ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 28న ప్రకటన చేసి ఉండేవాడు. కానీ ఇప్పు డు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సచివాలయంలో లేదు. అది అమ్మగారి అంతఃపు రంలో ఉన్నది.

ఆ అమ్మగారు ఆమె అత్తగారిలాగే గుత్తపెత్తందారై వ్యవహరిస్తున్నది. ఇందిరాగాంధీ సంజయ్‌గాంధీ కోసం తప్పులు చేసినట్టే ఇప్పుడు సోనియాగాంధీ తన కొడుకు కోసం కోటి తిప్పలు పడుతున్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ చర్చలని అంటూ తెలంగాణ విషయాన్ని మొదటికి తెచ్చిం ది. దానికి కారణం రాహుల్‌గాంధీ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆయనను ప్రధానిగా చూడాలన్న తల్లిగారి తాపవూతయం. ఆతల్లిగారికి తెలంగాణ కోసం పిట్టల్లా రాలిపోతున్న పిల్లలు గుర్తుకు రాలేదు. ఆ పిల్లలకు కూడా తనలాగే తల్లులున్నారని, వాళ్ళు కూడా తనలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని ఉంటారని ఆమె ఆలోచించలేదు.

ఆమెకిప్పుడు యువరాజు పట్టాభిషేకం తప్ప ఇంకేమీ కనిపించ అందుకే ఆమె సీమాంధ్ర నాయకత్వానికి తలొగ్గి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలంగాణ నిర్ణయం ప్రకట వెలువడడానికి ముందు సీమాంధ్ర మంత్రులు, ఎమెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి చెప్పింది ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆంధ్రవూపదేశ్ పెద్ద రాష్ట్రంగా ఉంటే ఎక్కువమంది ఎంపీలను మళ్ళీ గెలిపించుకుని రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తామని వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. ఆ తరువాత రాజమంవూడిలో బహిరంగసభ పెట్టి కూడా అదే సంకేతం పంపారు.

ఢిల్లీలో పరిణామాలు గమనించిన వారికి వారంరోజుల గందరగోళం అంతా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సృష్టించినదేనన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ప్రభుత్వం తరఫున హోం మంత్రి చేసిన ప్రకటనను కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేసిన పద్ధతి కాంగ్రెస్ రాజకీయ కుత్సితత్వానికి అద్దం పడుతున్నది.

నెల అంటే ముప్ఫై రోజులు కాదని, వారానికి ఏడు రోజులు కాదని ఒక జాతీయ నాయకుడు మాట్లాడడం అమాయకత్వమో, అతి తెలివో కాదు. అహంకారం. మేమే సర్వస్వం అన్న నిరంకుశత్వం. కాంగ్రెస్‌కు అటువంటి నిరంకుశ పూరిత విపరీత ధోరణి ఉందని చెప్పడానికి చరివూతలో అనేక సాక్ష్యాలున్నాయి. ఆ ధోరణి వల్లే ఇప్పుడు తెలంగాణ నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి అణచివేసే దిశగా ఆలోచిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని చెప్పడానికి కేసీఆర్, కోదండరామ్ అవసరం లేదు. చరిత్ర చదివి న ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ విషయంలో మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన రాజకీయ విధానం పరిశీలించిన ఎవరికైనా అది సులభంగానే అర్థం అవుతుంది. కాలం మారిపోయింది. ఎంతగా మారిందంటే దొంగలను దొంగలనడం నేరమైపోయిందిదోహులను ద్రోహులంటే తప్పయిపోతున్నది. చరివూతలో ఏం జరిగిందో చెపితే అదొక పెద్ద అపచారమైపోయింది.

నిజానికి చట్టం-న్యాయం ఈ దేశంలో రాజ్యాం గ ఉల్లంఘన కింద, విశ్వాస ఘాతుకం కింద, నమ్మించి ద్రోహం చేసిన నేరం కింద కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం మీద కేసులు నమోదు కావాలి. తెలంగాణ ఆకాంక్షను ఆరు దశాబ్దాల పాటు అణచివేసి, ఇక్కడి ప్రజానీకా న్ని నిజంగానే రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్‌పార్టీని నేరాభియోగం మోపి విచారించాలి. ఒక్క హత్యకే ఉరిశిక్ష వేసే చట్టమున్న దేశంలో వేయిమంది అమాయకులను నమ్మించి మోసంచేసి వారి చావుకు కారణమయిన వారికి ఏ శిక్షా ఉండకపోవడం, 1969లో వందలాదిమంది తెలంగాణ బిడ్డల్ని నడిరోడ్డుమీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన వాళ్ళ మీద కనీస విచారణ కూడా లేకపోవడం విషాదం.

నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవ, త్యాగాల పట్ల ఎవరూ అనుమానాలు వ్యక్తంచేయలేదు. ఎవరూ ఆ కుటుంబపు దేశభక్తిని శంకించడం లేదు. అందుకు ఆ కుటుంబం తరతరాలుగా అధికారాన్ని అనుభవించింది. ఆ ఒక్క కుటుంబం నుంచి ఇప్పటికి ముగ్గురు ప్రధానులై పాలించారు. ఇప్పు డు నాలుగోవ్యక్తి పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరకంగా మహాత్మాగాంధీ ఎప్పుడో మూసేయాలన్న కాంగ్రెస్ దుకాణం ఇంకా కొనసాగుతున్నదంటే అందుకు ఆ కుటుంబమే కారణం. కాబట్టి ఆ పార్టీ నేతలు, కార్యకర్త లు ఆ పార్టీ పట్ల భక్తిభావం కలిగి ఉండొచ్చు.

కానీ అందరూ అలాగే భక్తులై భజన చేయాలనుకుంటే కుదరదు. ప్రతి మనిషికీ, ప్రతి జాతికీ ఒక అంచ నా, అవగాహనా ఉంటాయి. అలా ఉండడం మనుషుల సామాజిక లక్ష ణం. అంతేకాదు రాజ్యాంగబద్ధమైన రాజకీయ హక్కు కూడా. తమ జీవితాల్లో ఆయా వ్యక్తులు, వ్యవస్థలవల్ల కలిగిన లాభనష్టాలను బట్టి, అనుభవాలను బట్టి అంచనాలు ఉంటాయి. నెహ్రూతో తెలంగాణ ప్రజల అనుభ వం అత్యంత మోసపూరితమైన అవకాశవాదంతో మిళితమైనది.

ఈ ప్రాంత ప్రజలను నెహ్రూ ఒకటికి రెండుసార్లు వంచించాడని చారివూతక సంఘటనలే చెపుతున్నాయి. ఒకటి హైదరాబాద్‌ను ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా సైనికచర్య ద్వారా భారత్‌లో కలిపేసుకోవడం. ఒకవైపు హైదరాబాద్‌తో యథాతథ ఒప్పందం అమలులో ఉండగా మరోవైపు ఐక్యరాజ్యసమితిలో కేసు విచారణలో ఉన్న సందర్భంలో భారత సైన్యం ఏకపక్షంగా దాడి చేసింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. హైదరాబాద్ ప్రజలు కచ్చితంగా భారతదేశంలోభాగం కావాలనే కోరుకుని ఉండేవారు. కానీ అది రాజకీయ ఒప్పందంతో జరిగితే ఈ ప్రాంత స్వయం ప్రతిపత్తికి ఉపయోగకరమైన రీతిలో ఉండేది.

ఈ ప్రాంతానికి కొన్ని హక్కులు, అధికారాలు దక్కేవి. కానీ నెహ్రూ అలాంటి రాజనీతిని ప్రదర్శించలేదని, పూర్తిగా కుట్రపూరితంగా, మోసపూరితంగా చేశారని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలే వచ్చాయి. ఇక రెండోది ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా కుట్రపూరితంగా జరిగిందన్నది వాస్తవం. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రా విడిపోయిన సందర్భంగా అక్కడి ముఖ్యమంత్రి రాజాజీకి 1953 జూలై రెండున రాసిన లేఖలో కొందరు హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర ప్రాంతంతో కలపాలని కమ్యూనిస్టులు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ..‘అది అవాంచనీయం, దురదృష్టకరం, అంతేకాదు అది హైదరాబాద్‌కు హానికరం’ అని భావిస్తున్నాను అన్నారు.

ఎంతో శ్రమపడి హైదరాబాద్‌ను దేశంలో కలిపాం ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితిని గాడిలో పెట్టాం. ఇప్పుడు హైదరాబాద్ తెలుగు ప్రాంతాలను విడదీసి విశాలాంధ్ర ఏర్పాటుచేస్తే ఆ చర్య హైదరాబాద్ ప్రగతిని దెబ్బతీస్తుంది, అంతేకాదు మొత్తం దక్షిణ భారతదేశ్ సమతుల్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తులో అన్నిరకాల సమస్యలకు కారణం అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను అన్నారు. ఆ తరువాత రెండేళ్లకు ఆయన హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ, మరాఠీ ప్రాంతాలను విడదీసి భాషావూపయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న ఎస్సార్సీ నిర్ణయానికి తలొగ్గారు. 1955 డిసెంబర్ 21న పార్లమెంటులో మాట్లాడుతూ తెలంగాణను ఐదేళ్లపాటు స్వతంవూతంగా ఉంచి ఆ తరువాత ప్రజాభివూపాయం తీసుకోవాలన్న నిర్ణయానికి నెహ్రు తన అసమ్మతిని తెలియజేశారు.

మళ్ళీ వాదోపవాదాలకు తావులేకుండా చూడాలని కూడా ఆయన కోరారు. అంతటితో ఆగకుండా నిజామాబాద్ వచ్చి ‘విశాలాంధ్ర ఏర్పాటు వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని’ కమ్యూనిస్టులను ఉద్దేశించి స్వయంగా నెహ్రూ గారే చెప్పారు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయన ఇలాంటి గంభీరమైన ఉపాన్యాసాలను చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించారు. ప్రజలు పాపం చాచా నెహ్రు చాలా మంచోడనే విశ్వసించారు. కానీ ఆ తరువాత ఏడాదికే ఆయన ఆంధ్రా లాబీకి దాసోహమై ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. నెహ్రూ గారిని నమ్మిన పాపానికి ఇలా చేయడం ముమ్మాటికీ మోసమని, విద్రోహమని తెలంగాణ ప్రజలు భావిస్తే ఆ తప్పు ఎవరిదో విజ్ఞులైన వాళ్ళు ఆలోచించాలి.

నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ప్రధాని అయిన రెండేళ్లకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ నాయకత్వమే భావించింది. కాంగ్రెస్ నాయకులే రెండుగా చీలి ఉద్యమాన్ని దావానలంగా మార్చేశారు. మర్రి చెన్నాడ్డి ఉద్రేకపూరిత ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. చాలామంది ఆయనను నమ్మి అమాయకంగా అనుసరించారు. ఇందిరాగాంధీ తెలంగాణ పట్ల తనదైన ‘జూద వ్యూహాన్ని’ అమలు చేసింది. ఒకవైపు తెలంగాణ ఇస్తామని నమ్మబలుకుతూనే మరోవైపు ఎనిమి ది సూత్రాల పథకం, ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం పేరుతో అనేక పావులు కదిపింది. చివరకు న్యాయ సమ్మతమని సుప్రీంకోర్టు ధ్రువీకరించిన ముల్కీ నిబంధనలు కూడా తొలగించి తెలంగాణ ప్రజలకు ఆమె తీరని అన్యాయం చేసింది. మరోవైపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డిని పురమాయించింది.

అత్యంత నిరంకుశంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 370 మంది తెలంగాణ యువకుల ప్రాణాలు పోయాయి. బ్రహ్మానంద రెడ్డి కర్కశత్వానికి కలత చెందిన తెలంగాణ పులిబిడ్డ ఈశ్వరీబాయి హూంకరించి ఇంకా ఎంతమంది మా బిడ్డలా ప్రాణాలు తీస్తావు, ఎందరిని పొట్టన పెట్టుకుంటావు అని శాసనసభలో నిలదీసింది. అప్పటి నరమేధానికి శాసనసభ చర్చల్లోనే అనేక సాక్ష్యాలు దొరుకుతాయి. ప్రత్యక్షసాక్షులు ఇంకా బతికే ఉన్నారు. కానీ ఆ రక్తపాతానికి కారకులైన వాళ్ళు మాత్రం లేరు. తెలంగాణ యువకులు నెత్తురోడిన నేలమీద ఇప్పుడు వాళ్ళ రాతి విగ్రహాలున్నాయి. ఎవరిమీద కేసు పెట్టగలం?

సోనియాగాంధీ మాటలకు సాక్ష్యాలతో పనిలేనే లేదు. ఆమె పార్టీకి చెంది న పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ మొన్ననే ఒక వీడియో చూపించారు. 2004 ఎన్నికల నాటి నుంచి ఇదిగో అదిగో అంటూ ఆమె మాటలమీద మాటలు మారుస్తూనే ఉన్నది. ఆమె మనసు మారినప్పుడల్లా, మాట తప్పినప్పుడల్లా గుండెలవిసిన అమాయక ప్రజలు ఆత్మహత్యల బారిన పడుతూనే ఉన్నారు. ఆమె వైఖరి వల్లే యువకులు ఆత్మహత్యల పాలవుతున్నారని కోర్టు కేసులు దాఖలైన సంగతి అందరికీ తెలుసు. ఆమె పేరుపెట్టి మరీ మరణ వాంగ్మూలాలు రాసిన సంగతి పత్రికలే ప్రచురించాయి.

అది నిజంగానే భరించలేని రంపపుకోత. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుం ది. ఇప్పటికే వేలాదిమంది తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెండ్లు తమ కుటుంబసభ్యులను కోల్పోయి ఉన్నారు. సోనియాగాంధీ మాట్లాడితే ఒక విశ్వాసం, నమ్మకం కుదిరేదేమో కానీ ఆమె మౌనం రాచి రంపాన పెట్టడం కాదా! మనసున్న వాళ్ళు ఆలోచించాలి. 

అరవై ఏళ్ళు, మూడు తరాలు మోసానికి గురిచేసి ఉండకపోతే నిజంగానే తెలంగాణ ఎప్పుడో వచ్చేది. దీనంతటికి నెహ్రు కుటుంబం మాత్రమే కారణం అంటే మన నాయకులు ఒప్పుకోలేరేమో. ఎందుకంటే నెహ్రూ మొదలు, ఇందిరా, సోనియా వరకు వాళ్లకు వాళ్ళే తెలంగాణ ప్రజలను వంచించలేదు. అందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఉన్నది. నిన్న కిరణ్‌కుమార్‌డ్డి చుట్టూ ఉన్నట్టే, ఒకప్పుడు నెహ్రు చుట్టూ, ఇందిరాగాంధీ చుట్టూ, సోనియా చుట్టూ తెలం గాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర భజనపరులు ఉన్నా రు. వాళ్ళే ఇప్పుడు రాహుల్ కోటరీలో కూడా చేరిపోతున్నారు. ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్ చెప్పినట్టు తెలంగాణలో ‘కుమ్ముక్కు నాయక త్వం’ ఉన్నది. దాన్ని ఓడించకపోతే తెలంగాణ గెలవడం కష్టం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి