బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్నాడు. కానీ బుద్ధుని బోధనలకు నిలయం గా చెప్పుకునే శ్రీలంక ఇప్పుడొక రాక్షస రాజ్యంగా కనిపిస్తున్నది. దయ నిండి ఉండవలసిన అక్కడి మనుషుల హృదయాలు ఇప్పుడు క్రూరత్వంతో నిండిపోయి ఉన్నాయి. గడిచిన మూడు నాలుగేళ్ళుగా వస్తున్న వార్తలు వింటుంటే అదొక బౌద్ధ క్షేత్రంగా కాక యుద్ధోన్మాద క్షేత్రంగా మాత్రమే కనిపిస్తున్నది. నిజానికి దాన్ని యుద్ధమని కూడా అనలేం. నా దృష్టిలో అదొక జాత్యాహంకార హంతక క్రీడ. కాకపోతే పసి పిల్లలను పనిగట్టుకుని వేటాడడం ఏమిటి?
బ్రిటన్‌కు చెందిన చానెల్ 4 అనే టెలివిజన్ నెట్‌వర్క్ శ్రీలంకలో సాగుతున్న నరమేధాన్ని నాలుగు భాగాలుగా ఇప్పటికే ప్రసారం చేసిం ది. తాజాగా ఈలం పోరాట రూపశిల్పి వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడు పన్నెండేళ్ళ బాలచంవూదన్ ప్రభాకరన్‌ను చంపిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దృశ్యాలు మనసున్న ప్రతివారినీ కలచివేశాయి. ఇంతకాలం శ్రీలంక పాలకుల క్రూరత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వముసుగును ఈ వాస్తవాలు తొలగించనున్నాయి.
బాల చంద్రన్ యుద్ధరంగంలో ఉన్న సైనికుడు కాదు. ఎవరికీ హాని తలపెట్టినవాడు కాదు. కేవలం ప్రభాకరన్ కొడుకు కావడమే ఆ బాలుడు చేసుకున్న నేరం. ఆ లంక గడ్డ మీద ఒక తమిళుడుగా పుట్టడమే ఆ పసివా డు చేసుకున్న పాపం. ఆ పాపానికి పసివాడని కూడా చూడకుండా శ్రీలంక సైన్యం అతని ప్రాణాలు తీసింది. మామూలుగా కాదు పర మ కిరాతకంగా కాల్చి చంపింది. కాల్పులు జరపడానికి వీలులేని, యుద్ధరహిత ప్రాంతం ‘నో-వార్ జోన్’లో ఉన్న బాలచంవూదన్‌కు తినడానికి బిస్కట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని మరీ చంపి పారేసింది. ఇది అమానుషం. శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నదని చెప్తూ వస్తున్న అక్కడి ప్రభుత్వం కనీసం యుద్ధనీతిని కూడా పాటించలేదు. అసలు చంపడానికి వీలుకూడాలేని సందర్భం ఇది. ఇది మానవత్వం గురించి, హక్కుల గురించి మరీ ముఖ్యంగా ఒక ప్రాంతపు ప్రజ లు తమ అధికారాల గురించి పోరాడడం న్యాయం అని నమ్మే ఎవరూ హర్షించని, సమర్థించలేని సందర్భం. ఇప్పుడు ఈ హత్యా వెలు గు చూసి న తరువాత శ్రీలంక ప్రభుత్వాన్ని క్షమించడానికి కూడా వీలులేదు.
శ్రీలంక చేసిన హత్యల్లో ఇది మొదటిది కాదు చివరిది అంతకంటే కాదు.12 రోజుల పసిపాపలు మొదలు పండు ముదుసలి తమిళజాతిలో ఒక్క ప్రాణి కూడా మిగల కూడదన్నది శ్రీలంక తీసుకున్న శపథం. అందు కే 2008-09 మధ్య తమిళులు నివసించే జాఫ్నా పరిసరాలను శ్రీలంక ముట్టడించి యావత్ జాతిని మట్టుపెట్టే పనికి పూనుకుంది. లంక నరమేథంలో ఇప్పటికే లక్షలాదిమంది చనిపోయారని, మరికొన్ని లక్షలమంది అక్కడి సైనికుల చేతుల్లో బందీలుగా ఉన్నారని మానవహక్కుల సంఘాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు పేర్కొంటున్నాయి. ఇంత జరుగుతుంటే భారతదేశం మాత్రం మౌనంగా చూస్తున్నది.పన్నెండేళ్ళుగా భారత్ మౌనముద్ర తమిళజాతి హననానికి ఆమోద ముద్ర వేసింది.
శ్రీలంక అతివూపాచీన బౌద్ధ సమాజాల్లో ఒకటి. క్రీస్తు పూర్వమే అశోక చక్రవర్తి కుమారుడు అరహత్ మహేంద్ర, కూతురు సంఘమిత్ర అక్కడ బౌద్ధానికి బీజం వేశారు. బుద్ధ గయ నుంచి తీసుకెళ్ళిన బోధి వృక్షాన్ని అక్కడ నాటి వచ్చారు. శ్రీలంక శాంతి కపోతమై విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. అప్పటి నుంచి శ్రీలంక అధికారికంగా ఒక బౌద్ధ దేశంగా ఉన్నది. కానీ బుద్ధుడి సందేశాన్ని మరిచింది. అశోకుడు త్యజించిన యు ద్ధాన్ని ఇప్పుడు లంక తలకెత్తుకున్నది. శ్రీలంక నరమేధాన్ని యుద్ధమని అనడానికి కూడా వీలులేదు. అది ఒక జాతిని నిర్మూలించే కుట్ర. లంక గడ్డమీద తమిళుల ఆనవాళ్ళు లేకుండా చేసే హత్యాకాండ. ఇది బౌద్ధానికి విరుద్ధం.ఈ సంఘటనల తరువాత అహింస బోధించిన బుద్ధుని అనుయాయులు సిగ్గుతో తలవంచుకోవాలి.శ్రీలంకను తమ మతం నుంచి వెలివేయాలి.
కేవలం మతం నుంచే కాదు. హంతకుణ్ణి సభ్యసమాజం నుం చి వేలివేయాలని బౌద్ధం చెపుతోంది. బుద్ధుడు అహింసా సిద్ధాంతకర్త. ఆయన ప్రతిపాదించిన ప్రతిమోక్షాలలో హత్యలు ఒకటి. బుద్ధుడిగా మారాలనుకునేవాడు, బౌద్ధాన్ని ఆచరించేవాడు హత్యలకు దూరంగా ఉండాలి. చావడం చంపడం బౌద్ధం దృష్టిలో క్షమార్హం కాని నేరాలు. ‘బౌద్ధం ఆచరిస్తున్న వ్యక్తి ఎవరినైనా హత్యా చేసినా, హత్యకు ప్రేరేపించినా, సహకరించినా, సాయుధ సంపత్తి సమకూర్చినా, హత్యలను కీర్తించినా, హత్యలను చూసినా, మిన్నకుండినా, హత్యలను ఆమోదించినా, ఇతరుల చావుకు కారణం, సందర్భం, వాహకమైనా... అతడిని బౌద్ధం నుంచి వేలివేయాలని’ బుద్ధుడు పేర్కొన్నాడు. శ్రీలంకలో సాగుతున్న ఊచకోత అక్కడి రాజ్యం చేస్తున్న అరాచకం. కాబట్టి శ్రీలంకకు బుద్ధుడి పెరేత్తే అర్హతలేదు. దీనిపై బౌద్ధ పండితులు ముఖ్యంగా చైనా నియంతృత్వం మీద దండె త్తే దలైలామా నోరు విప్పాలి.
ఇక రెండోది, భారత ప్రభుత్వం శ్రీలంక మీద చర్యలకు పూనుకోవాలి. కనీసం ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని విరమించుకుని ఆంక్షలు విధించాలి. సాధారణంగా జాతి నిర్మూలనకు పాల్పడే దేశాలు, హింసను ప్రేరేపించే దేశాలను వెలివేయడం, ఆంక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం దౌత్యనీతి. అది ఏ దేశమైనా ఇంకొక దేశం మీద చేయవచ్చు. కానీ భారత ప్రభుత్వం మాత్రం శ్రీలంక విషయంలో ఆ సాహసం చేయడం లేదు. అక్క డ సైన్యం చంపుతున్నది భారతీయ సంతతిని. తమిళులను. అయినా ప్రభు త్వం స్పందించక పోగా సహకరిస్తున్నది.
అక్కడి పాలకులు తమిళులను ఏ ఒక్కరోజు కూడా మనుషులుగా గుర్తించలేదు. శ్రీలంక లో తమిళులు ఒక నాడు పాలకులు. ఆ దేశాన్ని తమిళ రాజులు ఏలారు. అక్కడి తమిళ మూలాలు పాండ్య, చోళసామ్రాజ్యాలలో ఉన్నాయి. క్రమంగా బ్రిటీష్ వలసపాలన నాటికి వారు అక్కడి తేయాకు తోటల్లో కూలీలు అయిపొయారు. తమిళ నాడు నుంచి దాదాపు పదిలక్షల మందికి పైగా ఆ తోటల్లో పనిచేసేందుకు వలస వెళ్ళారు. బ్రిటీష్ పాలకులు భారత దేశం లో లాగే అక్కడ కూడా విభజించి పాలించడం మొదలు పెట్టారు. కమ్యూనల్ అవార్డ్జా అని, ప్రత్యేక ప్రాధాన్యత అని తమిళ జాతిని మభ్య పెట్టారు. 1948 లో స్వాతంత్రం తమిలులను పూర్తిగా పరాయి వాళ్ళను చేసింది. సింహళ జాతి ఆధిపత్యం అధికారం రెండింటినీ కైవసం చేసుకుంది. అప్పటినుంచి తమిళుల కష్టాలు మొదలయ్యాయి. మొదట సిలోన్ పౌరసత్వ చట్టం ఆ తరువాత సింహళ ఓన్లీ యాక్ట్ పేరుతో తమిళులకు పౌరసత్వం, పౌరహక్కులు లేకుండా చేసారు. తమిళుల అస్తిత్వం కోసం పోరాడుతున్న నాయకులను జైళ్లలో తోసి రాజకీయ పార్టీలను రద్దు చెసారు. అనధికారికంగా నివసిస్తున్నారంటూ తమిళ ప్రజలమీద, గ్రామాల మీద దాడులు చేసి శ్రీలంక నుంచి తరిమికొట్టారు. ఇదంతా 1970 లోపు జరిగిన కథ.
చరిత్ర పొడుగునా అనేక సందర్భాల్లో శ్రీలంక తమిళులకు అన్యాయం చేసిన భారత్ ఇప్పుడు తన మౌనంతో మరో చారివూతక తప్పిదానికి ఒడిగడుతోంది. దశాబ్దాల పాటు శ్రీలంక తమిళులు తమ అస్తిత్వం, అధికారాల కోసం అన్నిరకాల ప్రజాస్వామ్య పద్ధతు ల్లో పోరాడారు. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో సమ సమస్యలను నివేదించారు. శ్రీలంక ప్రభుత్వం తమను రెండో శ్రేణి పౌరులుగా చూస్తూ, కనీస సౌకర్యాలు కల్పించక వేధిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేశారు. కొన్ని సాధించుకున్నారు. కొన్నిచోట్ల విఫలం అయ్యారు. అనేకమంది ఆత్మాహుతులకు పాల్పడ్డారు. చివరకు ఆత్మాహుతి దళాలుగా మారారు. మానవ బాంబులై పేలి పొయారు.
అనేక శాంతియుత ప్రజాస్వామిక పోరాట దశలు దాటి శ్రీలంక తమిళుల ఉద్యమం 1970 వ దశకంలో సాయుధ పోరాట మార్గం తీసుకున్నది. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న ప్రత్యేక హక్కులను, మైనారిటీలకు ఉండే రాజ్యాంగ రక్షణలను తొలగించి 1973 లో శ్రీలంక సింహలులకు అనుకూలమైన కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంది. దీంతో అక్కడి తమిళులకు ఏమాత్రం రక్షన. భద్రత లేకుండా పొయాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో తమిళులకు ప్రవేశం కూడా కరువయ్యింది.
ఈ తరుణంలో తమిళ ప్రాంత స్వయం పరిపాలనకు విముక్తి మినహా మార్గం లేదని, దానికి సాయుధ పోరాటం ఒక్కటే పరిష్కారమని తమిళులు భావించారు. తమిళ యువత అనేక సాయుధ పోరాట దళాలు ఏర్పాటుచేసుకున్నారు. అందులో ఒకటి లిబరేషన్ టైగర్స్ అఫ్ తమిళ్ ఈలం లేదా ఎల్‌టీటీఈ . ఒకరకంగా ఎల్ టీ టీ ఈ పుట్టుక (1976) తోనే లంకలో అసలు యుద్ధం మొదలయ్యింది. 1980 నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళ ప్రజలకు అండగా టైగర్లు నిలబడ్డారు. ఇది సింహళ జాతి సహించలేక పోయింది. అంతర్యుద్ధం స్రుష్టించింది. తమిళ పౌరులు, ఇళ్ళు , ఊళ్ళు, వాడల మీద దాడులు చేసింది. హిందూ దేవాలయాలు, తమిళ జాతి చిహ్నాలన్నే ధ్వంసం చేసింది. చివరకు సింహళ ప్రజల క్ర్రూరత్వం 1981 లో జాఫ్నా లోని చారిత్రక గ్రంధాలయాన్ని దహనం చేసే దాకా చేరుకుంది. ఈ దహన కాండ లో అప్పటికే ఆసియా ఖండంలో అతి ప్రాచీన చారిత్రక భాండాగారంగా పేరుగాంచిన మహా గ్రంధాలయం కాలి బూడిదయింది. ఆ తరువాత రెండు మూడేళ్ళ పాటు సింహలులు జరిపిన మారణకాండ లో వేలాది మంది మరణించారు. లక్షలాది మంది శ్రీలంక వదిలి వెల్లిపొయారు. ఇది తమిళ జాతి మొదటి ఊచకోత గా చెప్పుకొవచ్చు.
ప్రభాకరన్ నాయకత్వంలో ఎల్‌టీటీఈ దీర్ఘకాలం పోరాడి 1980 దశాబ్ద ఆరంభం నాటికి తమిళ కొన్ని ప్రాంతాలను విముక్తి చేసింది. అప్పుడు ప్రభాకరన్ భారత ప్రభుత్వానికి వీరపువూతుడిగా కనబడ్డాడు. ఇందిరాగాంధీ హయాంలో టైగర్లకు అన్నిరకాలుగా భారత్ సహకరించింది. శ్రీలంక సైన్యాలతో పోరాడుతున్న తమిళ మిలిటెంట్లకు ఆహారం, మందు లు, ఆయుధాలు భారత్ నుంచే అందేవి. ప్రభాకరన్ తో పాటు అనేక మంది తమిళ టైగర్లకు భారత్ శిక్షణనిచ్చిందని అంటారు. ఇందిరా గాంధీ ఆసియా రాజకీయాల్లో ఆదిపత్యం కోసం ఇలాంటి పనులు అనేకం చేసింది.పాకిస్తాన్ ని రెండు ముక్కలుగా చేసి బలహీన పరచడం కోసం బంగ్లాదేశ్ మిలిటెంట్లకు శిక్షణ నిచ్చినట్టే శ్రీలంకను కూడా చేయాలని చూసింది. అది కుదరక పోగా రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశంతో రాజకీయాలు మారాయి. ఆయన సార్క్ పేరుతో దక్షిణాసియా ను తన దారికి తెచ్చుకునే ఎత్తులు వేసాడు. తల్లి పెంచి పోషించిన తమిళ టైగర్లను తరిమివేసేందుకు ఆయన రంగంలోకి దిగాడు. హటాత్తుగా శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. 1987లో భారత ‘శాంతిసేన’ పేరుతో శ్రీలంకకు సైన్యాన్ని పంపించి తమిళులను అణచివేసి అక్కడ శాంతి స్థాపించాలనుకున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి చివరకు ఆయనే 1991లో తమిళ టైగర్ల చేతిలో హత్యకు గురయ్యారు.
బహుశా ఇప్పుడు భారత్ మౌనంగా ఉండడానికి తమిళుల మీది ప్రతీకారమే కారణమా! ‘పరిణామాలు అలాగే కనిపిస్థున్నాయి. శ్రీలంక తమిళులు రాజీవ్ గాంధీని చంపారు కాబట్టి మేం జోక్యం చేసుకొం’ అన్న ధోరణిలో భారత ప్రభుత్వంఉన్నట్టు అనిపిస్తోంది. కానీ ప్రభుత్వాలకు రాగద్వేషాలు ప్రతీకారేచ్చ ఉండకూడదు. అలా లేదనే అనుకుందాం. అలా అనుకోకపోతే మనకు రాజ్యం పట్ల, దాని జిత్తులమారి తనం పట్ల ఏహ్యభావం కలుగుతుంది.
కానీ ఇప్పుడు భారత్ మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చింది. త్వరలోనే శ్రీలంకలో సాగుతున్న మారణకాండ, మానవహక్కుల హననం ఐక్యరాజ్య సమితిలో చర్చకు రానున్నాయి. ఇంతకాలం భారత్ మౌనాన్ని ఆసరాగా చేసుకుని శ్రీలంక తమిళజాతి నిర్మూలనకు పూనుకున్నది. ఒకవైపు చర్చలు సంప్రదింపులు చేస్తూనే శ్రీలంక్ ప్రభుత్వం తమిళ ప్రాంతాల్లో తన బలగాల విస్తరణకు పూనుకున్నది. ఎల్‌టీటీఈ చేసిన, చేస్తున్న హింసను సాకుగా చూపి దానినొక టెర్రరిస్ట్ సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. అప్పటి దాకా హింసను ప్రేరేపించిన దేశాలన్నీ హటాత్తుగా శాంతిమార్గం పట్టాయి. ఇట్లా ఎల్‌టీటీఈని ఒంటరిని చేసి శ్రీలంక సైన్యం 2008-09లో చేసిన చివరి ముట్టడిలో మొత్తం తమిళ ప్రాంతాన్ని ఆక్రమించి, టైగర్లను మట్టుపెట్టింది. లంక సైన్యం దాడుల్లో ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతో పాటు లక్షలమంది హతమయ్యారు. దాడుల్లో కొందరిని చంపితే వేలాదిమందిని నిర్బంధంలోకి తీసుకుని ‘నో వార్ జోన్’కు తరలించి చంపేశారని, శవాలను కూడా అత్యాచారాలు చేసి కసి తీర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పసిపిల్లలకు పాలు అందకుండాచేసి చంపేశారని, శరణార్థ శిబిరాల్లో క్షతగావూతులై ఉన్న ముసలివాళ్ళను, మహిళలను వైద్యం అందకుండాచేసి చంపేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అనేక ఆధారాలను చానల్ 4 సమకూర్చింది. వాటి మీద ఇప్పటికే అంతర్జాతీయ విచారణ సంస్థలు నిజనిర్ధారణ జరిపి శ్రీలంక ఆకృత్యాలను నిరూపించాయి. ఐక్యరాజ్య సమితి కూడా వాటిని నిర్ధారించిం ది. ఈ అంశాలన్నీ సాక్షాధారాలతో సహా ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అందాయి. ఆ అఘాయిత్యాలు చేసిన సైనికులు తీసిన ఫోటోలు, వీడియోలే ఇప్పుడు సమితి చేతికి అందాయి. అవి నిజమని నిర్ధారణ కూడా అయ్యింది. అందులో బాల చంద్రుడు కూడా ఉన్నాడు. అవును చానల్ 4 బాలచంద్రన్ హత్యోదంతం వీడియోను అక్కడ ప్రదర్శించనుంది. లంక సైనిక మూకల క్రౌర్యానికి బలైపోయిన ఆ వీర పుత్రుడు జెనీవాలో జరిగే సదస్సులో తన జాతి హననానికి మూగ సాక్షిగా నిలువబోతున్నాడు. అమెరికా కూడా ఈ విషయం మీద సీరియస్ గా నే ఉన్నది. బాలచంద్రన్ తో పాటు అలాంటి అనేక 'మరణ వాగ్మూలాల' మీద విచారణ జరుగాలంటే ఇప్పుడు ఆ సాక్షాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత భారత ప్రభు త్వం మీద ఉన్నది. భారత్ గట్టిగా నిలబడితే శ్రీలంక మీద చర్య తీసుకోవాలన్న డిమాండ్‌కు బలం చేకూరుతుంది.
ఇప్పటికే లంకలో తోటి భారత సంతతి మీద సాగుతున్న నరమేధం మీద చర్చ జరుగుతున్నది. తమిళజాతి గుండె పగిలి రోదిస్తున్నది. అంతటి విషాదంలోనూ తమిళ సమాజం తెలంగాణ ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించింది. శ్రీలంక తమిళుల ఊచకోతను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న ‘సేవ్ తమిళ్స్’ అనే వేదిక గత జనవరి 26 రిపబ్లిక్ డే నాడు చెన్నైలో ‘తెలంగాణ ఒక చారివూతక అవసరం’ పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం తరఫున కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీతారామరావు ఆ సభలో పాల్గొన్నారు. లిబరేషన్ పాంథర్స్ పార్టీ పార్లమెంటు సభ్యుడు తిరుమావలవన్ కూడా సభలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. తక్షణమే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సదస్సు తీర్మానిస్తూ తెలంగాణ ఉద్యమానికి తమిళ సమాజం తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించింది.
వారికి కృతజ్ఞతగా మాత్రమే కాదు, జాతుల పోరాటాలకు మద్దతుగా, క్రూర, నియంతృత్వ అణచివేత ధోరణులకు, జాత్యహంకార ధోరణులు, జాతుల హననానికి వ్యతిరేకంగా మనుషులుగా నిలబడ వలసిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ దిశగా నడిపించవలసిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉన్నది.