క ళ్ళకు గంతలతో ఉండే న్యాయదేవత ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా దేనికీ ప్రభావితం కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా తీర్పు చెపుతుందని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాల నుంచి ప్రపంచమంతా పాకింది. కానీ మనదేశంలో మాత్రం న్యాయవ్యవస్థ చూడదని, ఏం చేసినా చెల్లిపోతుందని ఈ కాలపు పాలకులు నమ్ముతున్నారు. పాలకుల ప్రాపకానికి, ప్రలోభాలకు లోబడి తీర్పులు చెప్పే న్యాయమూర్తులు కొందరివల్ల ఇప్పుడు న్యాయస్థానాల మీదున్న గౌరవం తగ్గిపోతున్నది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, పాలకులకు, సంపన్నులకు మాత్రమే న్యాయస్థానాలు అందుబాటులో ఉంటున్నాయని, కోర్టు తీర్పులు వారికి అనుకూలంగా మాత్రమే ఉంటాయన్న భావన పెరిగిపోతోంది.
అందులో నిజం లేకపోలేదు. కొందరు న్యాయమూర్తులు ఈ మధ్య అడ్డదిడ్డమైన తీర్పు తో నిలువునా దొరికిపోతున్నారు. ప్రభుత్వం కోర్టులను, కోర్టు తీర్పులను తనకు ఇష్టం వచ్చినట్టువాడుకుంటోంది. తనకు అచ్చిన వాళ్ళను కాపాడడానికి, నచ్చని వాళ్ళ నోరునొక్కడానికి ఇప్పుడు కోర్టులు ఉపయోగపడుతున్నాయని స్వయంగా రాజకీయ పార్టీల అతిరథ మహానేతలే ఆరోపిస్తున్నారు.

ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అందులో నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పుడు ప్రభుత్వం చట్టం పేరుతో, కోర్టు తీర్పుల పేరుతో తెలంగాణవాదు ల మీద ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నది. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడమే ఒక నేరమన్నట్టుగా ప్రవర్తిస్తోంది. ఉద్య మ కార్యకర్తల మీద కరుకు చట్టాలను ప్రయోగిస్తూ వస్తోం ది. ఉద్యమకారులమీద కేసులు పెట్టడంతోపాటు, పాత కేసులు తవ్వితీసి జైళ్ళలో బంధిస్తున్నది. విద్యార్థులు, కవులు, గాయకులతో మొదలైన ఈ వేధింపులు ఇప్పుడు తెలంగాణ న్యాయవాదులకు తప్పడంలేదు.
తెలంగాణవాదు ల్లో కొందరిని అతివాదులుగా ముద్రవేసి వేధించడం మామూలైపోయింది. ముప్ఫై ఏళ్ళుగా తన గళాన్ని ప్రజా ఉద్యమాలకు తిరుగులేని బలంగా మలిచిన విమలక్క ఇప్పుడు జైలులో మగ్గుతున్నది. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవనం మారాలని, ఆ మార్పు కోసం ప్రజలు పూనుకోవాలని సుదీర్ఘకాలం తన పాటల ద్వారా సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసిన విమలక్క పది పదిహేనేళ్ళుగా తన గళాన్ని తెలంగాణకు అంకితం చేసింది. తెలంగాణ కేవలం రాజకీయ క్రీడలతో రాదనీ, ఆ క్రీడలో ఆంధ్రా పెత్తందారులు ఆరితేరి, తెలంగాణను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని వాళ్ళ ఆటలు సాగకుండా చేయాలం ఆర్ధిక పోరాటం అవసరమని ఆమె నమ్మింది. పెట్టుబడిదారుడు దేన్నైనా తట్టుకుంటాడు కానీ తన దోపిడీని నిలదీస్తే సహించలేడు.

అంతా ఒక్కటై ఆమెను జైల్లో తోసేశారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలిగా ఉన్న ఆమె మీద తీవ్రవాదిగా ముద్రవేసి లేనిపోని కేసులు బనాయించారు. అలాగే గతంలో తెలంగాణ ప్రజావూఫంట్ నేతలు ఆకుల భూమయ్య, అధ్యాపకులు కాసీం మీద ఇటువంటి కేసులే బనాయించి వేధించారు. ఇంకా వారి తలల మీద కత్తి అలాగే వేలాడుతోంది. అయి నా తెలంగాణ సమాజం న్యాయం నిలబడుతుందని అమాయకంగా నమ్ముతున్నారు.
ఇప్పుడు నడుస్తున్న రాజ్యంలో న్యాయం లేదు. ధర్మం లేదు, చట్టం, చట్టబద్ధమైన పాలన అసలే లేదు. అదిప్పుడు అధికారం వెలగబెడుతున్న వాళ్ల ఇళ్ళ ముందు కాపలాకాస్తోంది. న్యాయం అడిగిన వాళ్ళను, న్యాయంకోసం పోరాడుతున్నవాళ్లను, న్యాయాన్ని వాదిస్తోన్న వాళ్ళను వేధిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 21 మంది న్యాయవాదుల మీద క్రిమినల్ కేసులు మోపి వెంటనే విచారణ చేప రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ఆ కోవలోకే వస్తుంది.
నిజానికి న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉండాలి. చట్టం ఎటువంటి పరిస్థితిలోనైనా సరే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. అంతే తప్ప ఇతరులను కట్టడి చేయడానికి మాత్రమే ఉపయోగపడకూడదు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని, న్యాయస్థానాలను వాళ్ళసొంత అవసరాలకు వాడుకుంటున్నారని, న్యాయమూర్తులు కూడా అనేక సందర్భాల్లో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇవి నిజమేనని నిరూపించే సంఘటనలు అనేకం మనం ఇప్పుడు చూస్తు న్నాం. ముఖ్యంగా తెలంగాణవాదుల విషయంలో అది పదేపదే రుజువవుతోంది.

భారతీయ న్యాయవ్యవస్థ స్వతంవూతంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాత లు ఆశించారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ వల్ల దేశంలో అందరికీ సమాన న్యాయం అందుతుందని రాజ్యాంగం చెపుతోంది. ఒకవేళ అన్యాయం ఏదై నా జరిగితే న్యాయస్థానాలను సంప్రదించవచ్చని, చివరకు ప్రభుత్వం అన్యా యం చేసినా, అన్యాయమైన శాసనాలు చేసినా వాటిని సమీక్షించి ప్రజలకు న్యాయంచేసే అధికారాన్ని భారత రాజ్యాంగం న్యాయస్థానాలకు ఇచ్చింది. కానీ తెలంగాణ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ఆంధ్రవూపాంతంతో కలిపి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం అన్యాయం చేసింది. అది అన్యాయమని గుర్తించి రాజ్యాంగ పరిధిలో తమకొక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అరవై ఏళ్లుగా ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు.
ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ ప్రభు త్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. చివరకు 2009 ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడు భారత ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా కేంద్ర హోం శాఖా మంత్రే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించారు. కానీ సభలో చెప్పిన దానికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజ్యాంగ ధర్మానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరు తూ కొందరు న్యాయస్థానాల్లో పిటీషన్లు వేశారు. అన్యాయం ఏ రూపంలో ఉన్నా, అది ప్రభుత్వమే చేసినా జోక్యం చేసుకోవడం ధర్మం. అది కోర్టుల విధి కూడా.
కానీ న్యాయమూర్తులు మాత్రం తమ విచక్షణను ఉపయోగించి అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. వారి అభివూపాయాలను తప్పుపట్టలేం ఎందుకంటే అలా చెప్పే అధికారం వారికి ఉంది. కానీ ఇప్పుడు కోర్టులో నిరసన తెలిపారని, కోర్టు హాలులోకి చొరబడ్డారని, న్యాయమూర్తుల మీద పేపర్లు విసిరి వేశారని, ప్రాంతీయవాదం పేరుతో విద్వేషాలు రగిలించారని ఇలాంటి అనేక అభియోగాలతో తెలంగాణ న్యాయవాదుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం విచారణకు ఆదేశించి వారందరి మీద కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. వెంటనే ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం కనీస ఆలోచన లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళిన తరువాత నెల్లూరుకు చెందిన న్యాయవాది ఒక రు సుప్రీంకోర్టులో ఇటువంటి పిటీషన్నే వేశారు. రాజశేఖర్డ్డి ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమ సంపాదనకు పాల్పడ్డాడన్న సీబీఐ అభియోగాలను ప్రస్తావిస్తూ ఒకవేళ అదే నిజమైతే ఆ అక్రమాలకు అనుకూలంగా జీవోలు జారీచేసి ఆయన దోపిడీకి సహకరించిన మంత్రులను ప్రాసిక్యూట్ చేసి, వారిని కూడా విచారణ పరిధిలోకి తేవాలని వాదించారు.

అలా రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు శాఖలకు చెందిన మంత్రులు జగన్కు, ఆయనకు లబ్ధి చేకూర్చిన కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు గీతాడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రాడ్డి కూడా ఉన్నారు. వీరంతా జగన్కు సహకరించినట్టు అభియోగం. సుప్రీంకోర్టు సరిగా ఇప్పుడు తెలంగాణ న్యాయవాదుల కేసు మాదిరిగానే మంత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించలేదు సరికదా మంత్రులు విధినిర్వహణలో భాగంగా మాత్రమే వ్యవహరించారని వాదించింది. అదే వాదన కోర్టులో వినిపించేందుకు స్వయంగా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ అవినీతి కేసులు వాదించేందుకు ప్రైవేటు న్యాయవాదులను ఏర్పాటు చేసింది. ఆ న్యాయవాదులు సీబీఐ అభియోగాలకు, ఆధారాలకు వ్యతిరేకంగా, ఆ సాక్ష్యాల ప్రకారం అవినీతి జరిగిందని నిరూపించే ప్రభుత్వ న్యాయవాదులకు వ్యతిరేకంగా వాదించే పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది.
ఒక కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తన వాదనను వినిపిస్తున్న ప్రభుత్వం ఇంకొక కేసులో విచారణకు అనుకూలంగా వెంటనే ఆదేశాలు ఇచ్చింది. ఇది ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేక ధోరణి. తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడుతున్న న్యాయవాదులకు కళ్ళెం వేయాలన్న వెర్రి ఆలోచన.
ఇందులో విడ్డూరం ఏమిటంటే 2010లో జరిగిన న్యాయవాదుల ఆందోళన న్యాయమేనని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. న్యాయస్థానాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కోర్టుల్లోని వివిధ పదవుల్లో తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కాలని, అరవై ఏళ్ళలో తెలంగాణ ప్రాంతపు న్యాయవాదులు ఒక్కరుకూడా అడ్వకేట్ జనరల్ వంటి అత్యున్నత పదవి పొందలేకపోయారని, పీపీలుగా, ప్రభుత్వ న్యాయవాదులుగా తెలంగాణ ప్రాతానికి చెందిన న్యాయవాదులను నియమించకుండా ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని, దీన్ని సరిదిద్దాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఉద్యమం చేపట్టారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయపరమైన వాటా 42 శాతం రావాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు చేసి సాధించుకోవడం ప్రజల హక్కు. ఆ హక్కును ఉపయోగించుకునే న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఎవరైనాసరే అన్యా యం ఎక్కడ జరిగితే అక్కడే ఆందోళన చేస్తారు. న్యాయవాదులు కూడా అదేపని చేశారు.
రోజువారీ విధి నిర్వహణలో వేసుకునే నల్లకోటుతోనే వాళ్ళు నిరాహారదీక్షలు, ఆందోళనలు చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా న్యాయవాదులు చేస్తున్న ఆందోళనను అన్ని పదవులూ అనుభవి స్తూ, తెలంగాణ కోర్టులను ఆక్రమించిన ఆంధ్రా అడ్వకేట్లు సహించలేకపోయారు. అవహేళన చేశారు, అడ్డుకున్నారు, మహి ళా న్యాయవాదుల పట్ల అసభ్యంగా మాట్లాడారు. కార్మికులు సమ్మెచేస్తే యాజమాన్యా లు స్పందించాలని, చర్చలు జరపాలని అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పిన న్యాయస్థానం న్యాయవాదులు సమ్మె చేస్తుంటే స్పందించలేదు. కానీ పోలీసు సెక్యూరిటీతో పనిచేయడం మొదలుపెట్టింది. కేసుల విచారణ చేపట్టింది. కొందరు సీమాంధ్ర న్యాయమూర్తులు కావాలనే కవ్వింపు ధోరణితో ఈ పని చేశారు.
తెలంగాణ న్యాయవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టు హాలులోకి వెళ్లి నినాదాలు చేశారు. కొందరు పేపర్లు చింపి హాలులోకి విసిరేశారు. దీన్ని సాకుగా చూపి సీమాంవూధకు చెందిన న్యాయమూర్తి తన మనసు గాయపడిందని కలత చెందినట్టు చెప్పి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే రాజీనామాను రాష్ట్రపతికి పంపి వివాదం చేయాలని చూశారు. నిజానికి ఆయన మనసు గాయపడింది చిత్తుకాగితం దెబ్బకు కాదు. జై తెలంగాణ నినాదాలు కోర్టు హాలులో వినిపించినందుకు. పోనీ ఆ గాయం నిజంగానే పెద్దమనిషిని బాధించిందేమో అనుకుంటే అది మూడు రోజుల్లో మానింది. ఆయన మనసు మార్చుకుని మళ్ళీ కొలువులో చేరిపోయారు. దీనిమీద కూడా పిటీషన్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు న్యాయవాదుల మీద క్రిమినల్ చర్యలను చేపట్టాలని ఇచ్చిన జీవో నిజానికి ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆ ఆందోళన న్యాయ సమ్మతమని నమ్మింది. ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి చర్చలుజరిపింది

న్యాయవాదుల డిమాండ్లలో కొన్నింటిని ఆమోదించింది. తెలంగాణ వ్యక్తినే అడ్వకేట్ జనరల్గా నియమించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ న్యాయవాదులుగా కొందరిని నియమించింది. ఒక రకంగా కొంత వరకైనా న్యాయం జరిగిందని అనుకుని సమ్మె న్యాయవాదులు విరమించా రు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆందోళన ఫలితంగా ఎవవరైతే న్యాయంగా పదవులు, పదోన్నతులు పొందారో ఇప్పుడు వారినే ప్రథమ ముద్దాయిలుగా ప్రభుత్వం పేర్కొంటున్నది. ఆందోళన సందర్భంగా న్యాయవాదుల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తామని గీతాడ్డి నాయకత్వంలో మంత్రుల బృందం అంగీకరించి ఆందోళన విరమింప చేసింది. ఇచ్చిన మాట ప్రకారం ఎత్తివేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదికాదు. కానీ వీలైనప్పుడు వాతలు పెట్టాలనే ప్రభుత్వం న్యాయవాదుల ముకుతాడు తమ చేతుల్లో ఉంచుకుంది. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా బాధితులకు కవచమై నిలబడ్డారు.
నేరమే అధికారమై రాజ్యమేలుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అసలు నేరస్తులను రక్షిస్తూ వారిని రాజ్యాంగ పదవుల్లో కొనసాగిస్తూ పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నది. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళే చట్ట వ్యతిరేక చర్యలలో పట్టుబడుతున్నారు. న్యాయం చెప్పాల్సి న వాళ్ళు అన్యాయంగా ఉంటున్నారు. వీళ్ళంతా కలిసి తెలంగాణ సమాజాన్ని నేరస్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేరస్తులను మాత్రం నిర్దోషులుగావదిలేస్తున్నారు
సమైక్యాంధ్ర పేరుతో కడప జిల్లాలో 2009లో భారీ గా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం దాడులు, దహనాలు జరిగాయి. అవన్నీ జగన్ చేయించాడని అక్కడి పోలీసులు ఆయన మీద మరికొందరి మీద నేరాభియో గం మోపారు. కానీ ప్రభుత్వానికి ఆ ఆస్తుల నష్టం, విధ్వంసం కనిపించలేదు. ఆ నేరాలన్నిటినీ మాఫీ చేస్తూ మరో జీవో కూడా విడుదల చేసింది. ఎటువం టి విధ్వంసం, ఆస్తి నష్టం లేకుండా, కేవలం చిత్తుకాగితాలు విసిరేశారనే అభియోగంలో 21 మంది న్యాయవాదుల మీదనే విచారణకు పూనుకున్న ప్రభు త్వం విధ్వంసకారుల మీద మాత్రం ఆరోపణలన్నీ మాఫీ చేస్తోం ది. ఇంత జరుగుతున్నా ఈ నేరాలన్నింటిని నోరు మెదపకుండా చూసేవాళ్ళూ నేరస్తులే అవుతారు. ఇలాంటప్పుడైనా ఇదెక్కడి అన్యాయమని అందరూ నిలదీయాలి. తెలంగాణవాదులని చెప్పుకుంటున్న వాళ్ళంతా ముందు న్యాయవాదులను, న్యాయాన్ని కాపాడుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి