శనివారం, డిసెంబర్ 29, 2012

లగడపాటి తో వెంకటకృష్ణ కబాడీ...

http://youtu.be/p1pmtE_uUGA



సూటిగా సుత్తిలేకుండా అడగడం వెంకట కృష్ణ ప్రత్యేకత.  ఓపెన్ సీక్రెట్ లో ప్రశ్నల దాడికి ఉక్కిరిబిక్కిరి అయిన లగడపాటి రాజగోపాల్ అసత్యాలు, అర్ధసత్యాలతో పాటు అవాకులూ చవాకులూ పేలారు. మీరే చూడండి...

శుక్రవారం, డిసెంబర్ 28, 2012

మాట తప్పితే మడమ తిప్పాల్సిందే!



తెలంగాణా విషయంలో  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఆడుతోన్న నాటకం క్లామక్స్ కు చేరుకుంది. అది నాటకమే అని తెలిసినా రాజకీయ పార్టీలన్నీ అవసరాన్ని మించి రక్తికట్టిస్తూ ఉత్కంట ను పెంచేస్తున్నాయి. ఢిల్లీ లో జరుగుతున్న అఖిల పక్ష సమావేశానికి హాజరయిన పార్టీలు తమ అసలు వేషం ఏమిటో బహిర్గత పరచాల్సి ఉందినిజానికి ఇదంతా ఉత్తి దండగమారి వ్యవహారమే. రాష్ట్రాల ఏర్పాటుకు తతంగం అవసరమే లేదు. అయినా సరే సమావేశం ముగిస్తే తప్ప ఎవరు విలన్లో, ఎవరు హీరో లో ఎటూ కాకుండా మిగిలిపోయే విధూశకులు ఎవరో నేటితో తేలిపోతుంది. ఇప్పటికి నాటకం మొదలై మూడు సంవత్సరాలు దాటింది. మూడేళ్ళలో అన్ని పార్టీలు నవరసాలు పండించి తమ నటనా కౌశలాన్ని చాటుకుంటూ వస్తున్నాయి. నాటకం ముగిస్తే తమ బతుకు బట్టబయలు అయిపోతుంది కాబట్టి ఇంకా కొన్ని పార్టీలు నాటకం ఇలాగే కొనసాగితే బాగుండు నని అనుకుంటున్నాయి. బహుశా ఇక అది కుదరక పోవచ్చు.

ఎందుకంటే అఖిల పక్షం లో పాల్గొంటున్న పార్టీల్లో ఇప్పటికే తెలంగాణా వైపు మొగ్గు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి అఖిల పక్షానికి గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పక్షాలను పిలిచింది. ఒక్క రాఘవులు నాయకత్వంలోని  సీపీఎమ్ పార్టీ మినహా ఇప్పుడు సమఖ్యవాదం మోసుకెళ్ళిన పార్టీలేవీ కనిపించడం లేదు. తెలంగాణా రాష్ట్ర సమితి, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లు స్పష్టంగా తెలంగాణా ఇచ్చి తీరాలని తెగేసి చెపుతున్నాయి. చర్చొప  చర్చల అనంతరం తెలుగు దేశం పార్టీకూడా తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమనే సంకేతాలు ఇస్తోంది. అదే నిజమైతే, పార్టీని కూడా కలుపుకుంటే ఎనిమిది లో నాలుగు పార్టీలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఒక పార్టీ వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్ఖ. మజ్లిస్ పార్టీ ఇంకా గోడమీది పిల్లి వాటంగా నే కనిపిస్తోందిఒకవేళ రాష్ట్రాన్ని ఇస్తే రాయల తెలంగాణా ఏర్పాటు చేయాలని, అలా కాదంటే హైదరాబాద్ అంతర్భాగంగా ఉండే తెలంగాణా కావాలని పార్టీ అడుగుతోంది. ఇక వై ఎస్ ఆర్ సి పీ వైఖరి పార్టీ రాజకీయ సిద్ధాంతం లాగే అగమ్య గోచరంగా ఉంది.

బహుశ కాంగ్రెస్ వైఖరి ఏమిటో తెలిస్తే తప్ప పార్టీ నోరు విప్పే అవకాశం కనిపించడం లేదు. కానీ కాంగ్రస్ ఇంకా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకు పోయి కనిపిస్తోంది. మరో వైపు పార్టీ లో సీమంద్ర కు చెందినా ఒకరిద్దరు పార్లమెంటు సభ్యులు మళ్ళీ సమఖ్య వాద  కుంపటి రాజేస్తున్నారు. తెలంగాణా అంశం తేలినా తేలక పోయినా తన వైఖరి ఏమిటో చెప్పకపోతే అఖిల పక్షంలో అసలు ముద్దాయిగా ఇప్పుడు కాంగ్రెస్ తేలబోతోంది. అఖిల పక్షానికి ఎందరైనా రావచ్చునని, ఎన్నిమాటలయినా చెప్పవచ్చునని అనడమే ఒక అవకాశవాదం. 

సాధారనంగా అఖిల పక్ష సమావేహాలు సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు అవసరమైనప్పుడు, అభిప్రాయాల్లో తేడాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి అఖిల పక్ష సమావేశాలు దోహద పడతాయి. అఖిల పక్షం అంటేనే అన్ని పార్టీలు అని అర్థం. చట్టాలు చేయవలసిన సందర్భంగా చట్టసభల్లో ఉన్న పార్టీల మధ్య అభిప్రాయాల్లో తేడాలు ఉన్నప్పుడు, అవి చట్టం చేయడానికి అవరోధంగా మారినప్పుడు మాత్రమే అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ.ప్రభుత్వ ప్రతిపాదనను అఖిల పక్షం లో చర్చించి ఆమోదించవలసిన అవసరాన్ని వివరిస్తారు. అది కూడా ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోతుందని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తారు. కానీ  తెలంగాణా విషయంలో  అవసరం  రాలేదుఇలా రాజకీయ ప్రయోజనాలకోసం అఖిల పక్షాన్ని పిలిచి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. దానికి రాజకీయ పక్షాలు వంతపాడుతున్నాయి. పోనీ రకంగానైనా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయా అంటే అదీ లేదు. అఖిల పక్షంలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పవచ్చునంటూ సాగాదీస్తున్నాయి.

నిజానికి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి.  ఒకే పార్టీలో వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య బేధాభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆఖిలప్రక్ష సమావేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవు. అలా ఉండడానికి వీలుకూడా లేదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యానికి పార్టీలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం పార్తీలనే గుర్తిస్తుంది. చట్టసభలు కూడా పార్తీలనే గుర్తిస్తాయి. వ్యక్తులుగా ఎవరెవరు  నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించినా చట్టసభలో వారిని గుర్తించేది, స్థానాలు కేటాయించేది, మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేది చివరకు అత్యంత కీలక సమయాల్లో వాళ్ళ ఓట్లను గనించేది పార్టీ తఫునే తప్ప వ్యక్తిగతంగా కాదు. అసలు చట్టసభల్లో ఒక సభ్యుడి వ్యక్తిగత అభిప్రాయానికి విలువే లేదు. అయినా సరే ఎవరైనా పార్టీని దిక్ఖరించి పార్టీ అధికారిక శాసనం అయిన విప్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా, ఓటు వేసినా వ్యక్తి తన సభ్యత్వాన్ని కూడా కొల్పొవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే సభ్యులను పార్టీలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తోంది. 

 అఖిల పక్షంలో ఎవరైనా, ఏదైనా చెప్పవచ్చునని అనుకోవడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు. రాజ్యాంగ స్పూర్తికి కూడా వ్యతిరేకం. భారత రాజ్యాంగం పరిపాలనకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మూల సూత్రంగా భావించింది. ఇలాంటి ప్రజాస్వామ్యం మంచిదా కాదా , అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న చర్చ కాసేపు పక్కనపెడితే పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన సభ్యలు వ్యక్తిగతంగా కాకుండా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ప్రజలకు నేరుగా కాకుండా పార్టీల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు. వ్యవస్థలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం. రాజకీయపార్టీలు ప్రజల తరఫున నిలబడి ప్రజల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సిద్ధాంతాలు, విధానాలు  రూపొందించుకుని వాటిని తమ తమ పార్టీ ప్రణాలికల రూపంలో ప్రజల ముందుకు తీసుకు వెళతాయి. వాటిని ప్రజల్లో ప్రచారం చేస్తాయి. మన నేతలు పాద యాత్రలో, భారీ సభలో పెట్టి  ఊదర గొట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నది ప్రజామోదం కోసమే. ఎన్నికల్లో ప్రజలు ఆదరించిన పార్టీ తన ప్రణాలికను అమలు చేయాలి. ప్రజలు ఆదరించని పార్టీలు ప్రతిపక్షంలో ఉండి, అధికార పార్టీ  ప్రజలకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేసేలా చూడాలి. ప్రజల ఆకాంక్షలను బట్టి అధికార పార్టీ ఎజెండామార్చ గలగాలి.

కానీ ఇప్పుడు తెలంగాణా విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా లేకుండా తెలంగాణా వ్యతిరేకులంతా ఒక్కటై పోయారు. నిజానికి ఒక పార్టీకి, ఒక జెండా ఉన్నట్టు గానే ఎజెండా కూడా ఉండాలి. అది భారత రాజ్యాంగానికి లోబడి పార్టీ సిద్దాత విధానం తెలిపే రాజ్యాంగం ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం దాన్ని అలా ఉన్నప్పుడే దానినొక రాజకీయ పార్టీ గా గుర్తిస్తుంది. పార్టీ రాజ్యాంగానికి, నియమావళికి ప్రాతినిధ్యం వహించినంతవరకే సభ్యుడికి గౌరవం మర్యాద గుర్తింపు ఉంటాయిసభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ తావు ఉండదు. అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అధికారికంగానే రెండు మూడు అభిప్రాయాలు ఉన్నాయంటే  పార్టీలకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అన్నది ఆలోచించాలి.

ఇప్పుడు పార్టీ లేదు, సిద్ధాంతం లేదు. ఎజెండా లేదు. జెండాలేదు. ఉన్నదల్లా ఒక్కటే తెలంగాణా వ్యతిరేకవాదం. వాదమే తెలంగాణాను అడ్డుకోవడానికి కారణం అవుతోంది. దాన్ని బలపరచడానికే ఇప్పుడు ఒక్క పార్టీ ఎన్ని అభిప్రాయాలైనా చెప్పవచ్చునన్న తప్పుడు సూత్రీకరణ వస్తోంది. ఇప్పుడు ఎనిమిది పార్టీల్లో టీ ఆర్ ఎస్, బీజేపీ, మజ్లిస్ మినహా మిగితా ఐదు పార్టీలు సీమాంధ్ర నాయకత్వంలో పనిచేస్తున్నాయి. సీపీఐ సైద్ధాంతిక నిబద్ధతతో తెలంగాణా కోసం గట్టిగా పోరాడుతోంది. ఇకపోతే కాంగ్రెస్, తెలుగుదేశంవై ఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రం పూర్తిగా సీమాంధ్ర నాయకత్వంలో ఉన్నాయి. వాళ్ళు పార్టీ ఇప్పటిదాకా చెపుతూ వచ్చిన నీతులను నిలబెట్టుకుంటారా తెలంగాణాకు గోతులు తీస్తారా అన్నది నేటి తో తేటతెల్లం అవుతుంది.

నిజంగానే పార్టీలు  చట్టాలను, రాజకీయ సాంప్రదాయాలను గౌరవిస్తే రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా వ్యవహరించాలి. గతంలో 2009 డిసెంబర్ 7 జరిగిన అఖిలపక్షం చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పాలి. తక్షణమే తెలంగాణా బిల్లును పార్లమెంటు లో పెట్టాలని డిమాండ్ చేయాలి.   మేరకు తీర్మానం చేస్తే తప్ప అక్హ్లాపక్షం ముగిసినట్టు కాదని చెప్పాలి. ఎప్పుడైనా అఖిలపక్షాలు విస్త్రుత అభిప్రాయం కోసమే తప్ప, ఏకాభిప్రాయం కోసం కాదని ప్రభుత్వానికి గుర్తు చేయాలి. అఖిల పక్షంలో స్పష్టంగా వ్యక్తమైన అభిప్రాయాల్లో మెజారిటీ అభిప్రాయాన్నే అంతిమ నిర్ణయంగా ప్రకటించాలి. పార్లమెంటులో ఒక ఓటు ఉన్న మజ్లిస్ కోసమో, రెండే రెండు ఓట్లున్న  జగన్ కోసమో నిర్ణయాలు వాయిదా వేయకుండా  సమావేశం ఒక స్పష్టమైన తీర్మానం చేసి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగలగాలి. అప్పుడే పార్టీలకు రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా ఒకే మాట చెప్పకుండా సమస్యను ఇంకా నాన్చితే ఎం చేయాలి అన్నది కూడా రాజకీయ జె సి ఆలోచించాలి. తెలుగుదేశం, వై ఎస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇలా ఎవరైనా సరే మాట తప్పి మళ్ళీ నిర్ణయం వాయిదా వేస్తే తెలంగాణా ప్రాంతంలో వాళ్ళను కనిపించకుండా చేయాలి.  ఎందుకంటే ప్రజలను ఇలా పదే పదే   వంచించే పార్టీలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. అలాంటి వాళ్ళ నాలుకలు కోసిపారేస్తామని సి పీ  నారాయణ స్పష్టంగా చెప్పారు. బహుశ ఆయన తన పార్టీ గుర్తులోనే కొడవలి ఉందన్న ధీమాతో అలా హెచ్చరించి ఉండవచ్చు కానీ ఇప్పుడు కొడవలికి తెగే నాలికలు కావవి. అవి తాటి మట్టలకంటే మందం గా మారిపోయాయి. అలాంటి పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలంటే వాటిని, వాటి నాయకత్వాలను తెలంగాణా పొలిమేరలు దాటించడం ఒక్కటే మార్గం. ఇది కేవలం తక్షణ ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే సాద్యం. ఇప్పటికి పార్టీల రంగు బయట పడింది కాబట్టి వీళ్ళ సంగతి 2014లో చూసుకుంటాం అని టీ ఆర్ ఎస్ తో సహా రాజకీయ పార్టీలు అనే ప్రమాదం ఉంది. ఎలాగూ ఇవ్వరని తెలిసి తెలివిగా తెలంగాణా ఇవ్వాలని అఖిల పక్షం లో చెప్పి తమ పాదయాత్రలను ఎన్నికల ప్రచార యాత్రలుగా మార్చుకునే పార్టీలు మరో రెండేళ్ళు సమస్యను సాగదీయడం రాజాకీయంగా ఎంత మాత్రం వాంచనీయం కాదు.

అఖిల పక్షం పుణ్యమా అని అంతో ఇంతో వేడి పుట్టింది. అది తెలంగాణా వ్యతిరేకులకు దడ పుట్టించే స్థాయికి ఎదగాలి. మీనమేషాలు లెక్కించకుండా అఖిల పక్షంలో అనుకూలంగా ఒకే మాట చెప్పిన పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద,  కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే రీతిలో నిరవధిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. తెలంగాణా రాజకీయ జె సి తక్షణం కార్యాచరణను ప్రకటించాలి. అఖిలపక్షంలో తెలంగాణా పక్షంగా ఉన్న అన్ని పార్టీలను కలుపుకునే రాజకీయ పునరేకీకరణ జరగాలి నిర్ణయం వెంటనే జరిగి నెలరోజులు నిరవధిక ఉద్యమానికి జె సి, అన్ని రాజకీయ పార్టీలు పిలుపునివ్వాలి. మార్చ్ లోగా తెలంగాణా బిల్లు పార్లమెంటుకు చేరకపోతే తెలంగాణా విముక్తి చేసుకుని స్వయం పాలన ప్రకటించుకునే దిశగా రాజకీయ ఉద్యమం రూపుదిద్దుకోవాలి. మూడేళ్ళు గా ముచ్చెమటలు పట్టిస్తున్న తెలంగాణా ప్రజానీకం మూడు నెలలు నిలబడి పోరాడడానికి వెనుకాడరు. కానీ సారి మాత్రం రాజకీయ పార్టీలే ముందు నడవాలి.