గురువారం, ఏప్రిల్ 10, 2014

దొరలెవరు? దొంగలెవరు?


పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్మాణం అంటే అర్థం తెలియక కాదు. వాదన వెనుక ఆయనకు తన సొంత అభివూపాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ధ్వంసమే కాలేదు అన్నది, రెండోది పునర్నిర్మాణం అవసరమే లేదన్నది. మామూలుగా అయి తే ఆయన అలాంటి వాదన చేయరు. కానీ కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం అని అన్నాడు కాబట్టి, తాను కేసీఆర్ వాదాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఆయ ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు. కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండేందుకే కేసీఆర్ ఎత్తుగడ వేశారన్నది ఆయన వాదన సారాంశం. ఒక్క ఆయన మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది  పునర్నిర్మాణం అనే పదానికి కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు. కొంద రు గడీల పునర్నిర్మాణం అంటే, మరి కొందరు భూస్వామ్య పునర్నిర్మాణం అని, ఇంకొంత మంది దొరతనం పునర్నిర్మాణమని ఎవరి భాష్యాలు వాళ్ళు చెబుతున్నారు. పాపం కేసీఆర్ రెండుసార్లు అదేపని గా మీట్ ది ప్రెస్ కార్యక్షికమాల్లో వివరించినా, తన చానల్లో నాలుగు గంటలపాటు విజేత విజన్ పేరు తో ప్రత్యక్ష ప్రసారంలో విడమరచి చెప్పినా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనంటే పొసగని వాళ్ళు పదేపదే ఇదంతాదొరతనంఅని దబాయిస్తూనే ఉన్నారు. నిజానికి దొర అనేది ఒక కులం కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక, భూమి మీద,ఉత్పత్తి మీద, మనుషుల మీద, మొత్తంగా సమాజంలోని అన్నిరకాల మానవ సం బంధాలమీద ఆదిపత్యం చెలాయించిన ఒకానొక దశ.

దొరలు ఒక్క వెలమ కులంలోనే లేరు. గడీలు కేవలం వాళ్ళవే కాదు. నల్లగొండలో ప్రారంభమైన  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రెడ్ల దొరత నం మీద తిరుగుబాటుగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్లుగా ఉన్న అన్ని అగ్రకులాలు ఉన్నాయి. కొన్నిచోట్ల వెలమ దొరలుంటే, చాలా చోట్ల రెడ్లు, మరికొన్ని చోట్ల కాపులు, కరణాలు  అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం జాగీర్దార్లు కూడా దొరతనం చెలాయించారుఇటువంటి అగ్రవర్ణ, కొన్నిచోట్ల ముస్లిం భూస్వాములంతా తమ ఆధిపత్యానికి ప్రతీకలుగా కోటలు, గడీలు నిర్మించుకున్నవాళ్ళే. ఇదంతా చరివూతలో నమోదైన వాస్తవం. అయినా తెలంగాణ సమాజం దొరతనానికి ఎన్న డూ భయపడలేదు, ఐలమ్మ, బందగీ లాంటి వాళ్ళ తరం నుంచి అయిలయ్య, రాజమల్లు తరం దాకా తెలంగాణ ప్రజలు పోరాటాల, ప్రజా  ఉద్యమాల ద్వారా దొరల మెడలు వంచిన వాళ్ళే. తన చెప్పుచేతల్లో బానిసల్లా పడిఉన్న సామాన్యులు తిరగబడి దొరలను పల్లెలు, పంట పొలాల నుంచి పరుగెత్తించిన సందర్భాలు ఇటీవలి తెలంగాణ చరివూతలో అనే కం. నిజానికి నడ్డి విరిగిపోయిన దొరతనాన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం, శిథిలమై గబ్బిలాల గూళ్ళుగా మారిపోయిన గడీలను మళ్ళీ నిర్మించడం కేసీఆర్ వల్ల కాదు గదా ఆయన తాతల తరం వల్ల కూడా సాధ్యమయ్యే పనికాదు. అయినా సరే కొందరు అదేపనిగా దొరతనాన్ని ఇంకా తెలంగాణలో ఒక ఆధిపత్యశక్తి గా చూపడం తెలంగాణ ప్రజల పోరాట పటిమను, విజయాల చరివూతను తక్కువ చేయడమే అవుతుంది.

ఇప్పుడు ఎన్నికల సమయంలో కొందరు దొర వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. కాంగ్రె స్, టీడీపీ నాయకులు టీఆర్ఎస్ను దొరల చిరునామాగా చూపి కేసీఆర్ను దొరతనానికి నిలు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావును, రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్న కేవీపీ రామచంద్రరావు కూడా వెలమ దొరలే అన్న సంగతి మరిచిపోతున్నారు. గడీల అధికారాన్ని ఎప్పుడో గల్లంతు చేసామని చెప్పే కొందరు ఉద్యమ కారులు కూడా ఈమధ్య దొరలవాదానికి  వంతపాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ చర్చలు వాదోపవాదాల్లో వినబడుతున్న దొరతరానికి నిర్వచనం ఏమి టో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వెలమ కులమే దొరల కులం అని కొందరు దళిత బహుజన మేధావులు భాష్యం చెప్పవచ్చు. దానిని వర్గ పోరాటాల్లో ఉన్నామని చెప్పేవాళ్ళు ఎలా సమర్థిస్తారు? దొరతనం కులంతో మాత్రమే రాలేదు, ఆధిపత్యం, అహంకారం కలిస్తేనే దొరతనం. అది కేసీఆర్లో ఉన్నట్టే దామోదర రాజనర్సింహలో దానంనాగేందర్లో కూడా ఉండవచ్చు కులంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినట్టే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా పుట్టారు. అంతేకాదు కులంతో సంబంధం లే ని సర్ ఆర్థర్ కాటన్ను కూడా ఆంధ్రాలో కాటన్ దొర అనే అంటారు, తెలుగు ప్రజలంతా బ్రిటిష్ పాలకుల ను తెల్లదొరలనే పిలిచారు.అలాగే ఆదివాసీ తెగల నాయకుల్లో కూడా దొరలున్నారు. అయినా పార్లమెంటరీ రాజకీయాల్లో దొరపూవరో, దొంగపూవరో తేలడం కష్టం. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ ఆస్తు లు, భూముల వివరాలు, అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్లో ఉండే అహంకారం చూసిన వాళ్లకు దొర తనానికి కులంతో పనిలేదని అర్థమౌతుంది. అదొక ఆధిపత్య వర్గం.ఉద్యమకాలంలో ఇటువంటి కుల వాదనే కొందరుమేధావులుప్రొఫెసర్. కోదండ రాం విషయంలోనూ తెచ్చారు. ఆయన కోదండరామ్రెడ్డి అని, అగ్రవర్ణ, ఫ్యూడల్ భావజాలానికి ఆయన ప్రతీక అని ప్రచారం చేశారు. పోటీగా కుల సంఘాలు, జేఏసీలు కూడా పెట్టి తెలంగాణవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయినా ఎన్నికలతో దొరతనం, కులతత్వం పోతుందని ఎవరైనా నమ్మితే అది భ్రమే.

ఎన్నికల్లో అగ్రకులాలు మరింత బలంతో ముందుకు వస్తున్నాయికులపరంగా రెడ్డి సామాజి వర్గం ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 42 ఓపెన్ స్థానాల్లో 35 ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. టీఆర్ఎస్ 12 చోట్ల వెలమలను 39చోట్ల రెడ్లను రంగంలోకి దింపింది. అలాగే  తెలంగాణను బీసీలకు ఇనాంగా ఇచ్చిన చంద్రబాబు సగం సీట్లను బీజేపీకి ఇచ్చేశారు. మిగిలిన వాటిలో రెడ్డి సామాజిక వర్గానికి 16 సీట్లు, వెలమలకు మూడు ఇచ్చి ఇక్కడ పెద్దగా జనాభా లేకపోయినా తన సొంత సామాజిక వర్గానికి  ఆరు సీట్లు కేటాయించా రు. 1 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించిన ఆయన బీసీని ముఖ్యమంవూతిని చేస్తానని బుకాయిస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. ఈసారి కూడా  కేసీఆర్ తన సహజ రీతిలో తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అనేకచోట్ల ఉద్యమకారులను, టీఆర్ఎస్ కోసం అహరహం పనిచేసిన వాళ్ళను ఆపార్టీ  పక్కనపెట్టింది. చెరుకు సుధాకర్, దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, ఏర్రోళ్ల శ్రీనివా స్, మందుల సామేలు ఇట్లా పార్టీని కంటికి రెప్పగా కాపాడిన వాళ్లకు అనేక మం దికి బలమైన కులం కాదనే కారణంతో టీఆర్ఎస్ మొండిచేయి చూపింది. అలాగే కుటుంబ ఆధిపత్యాన్ని మరింత విస్తరించే రీతిలో టికెట్లను కేటాయించుకుంది. అన్ని పార్టీల లాగే టీఆర్ఎస్ కూడా  అగ్ర కులాలకే పెద్దపీట వేసింది. రెడ్లకు 39, వెలమలకు 12 స్థానాలు పార్టీ కేటాయించింది. ఇట్లా శాసనసభలో కుర్చీలన్నీ అగ్రకులాలకే రిజర్వు చేసి సామాజిక తెలంగాణ నిర్మిస్తామని ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేస్తామని, సాధికారత సాధిస్తామని చెపితే అమాయకులు తప్ప ఎవరు మాత్రం నమ్ముతారు.

అలాంటి అమాయకుల కోసమే కొందరు పదేపదే దొరతనం మీదికి దృష్టి మళ్లిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం అందులో భాగంగా  సామాజిక సాధికారత సాధించాల్సిన ప్రణాళిక మీద చర్చ జరగాల్సి ఉంది. తెలంగాణ జేఏసీ కూడా అటువంటి ప్రజా మేనిఫెస్టో ఒక టి ప్రకటించింది. అనేక కులవృత్తి సంఘాలు తమ తమ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండాల ని భవిష్యత్ తెలంగాణలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇటువంటి మౌలిక విషయాల వైపు చర్చ వెళ్ళకుండా ఉండేందుకే కొన్నిశక్తులు ఇప్పుడు దొరతనం, ఉద్యమ ద్రోహం వంటి వాటిని ప్రస్తావిస్తున్నాయి. ఊకదంపుడు వాదనలో ఎవ రు ఉద్యమకారులో, ఎవరు ద్రోహులో తేలడం కూడా కష్టంగానే ఉంది. పన్నెండేళ్ళ టీఆర్ఎస్ పోరా చరిత్ర ఒక్క కొండా సురేఖ చేరికతో పాప పంకి లం అయిపోయిందని కొందరు తీర్పులు చెపుతున్నారు. అదే సమయంలో అరవైఏళ్లుగా తెలంగాణ ఆకాంక్షను అణచివేసి, వందలమంది ఉద్యమకారుల చావులకు, వేలాదిగా కేసులకు వేధింపులకు కారణమైన కాంగ్రెస్ను తెలంగాణ ఇవ్వడం ద్వారా పునీ తమైందని కూడా ప్రచారం చేస్తున్నారు. వీపుల మీది గాయాలు మానిపోకముందే, తలల మీద కేసులు తొలగిపోక ముందే కొందరు ఉద్యమకారులు కాంగ్రె స్ జెండాలు మోస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్కి శవయావూతాలు, పిండ ప్రదానాలు చేసిన వీళ్ళే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అది  పవి త్రం అయిపోయినట్టు చెపుతున్నారు. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అండతో కాంగ్రెస్, టీడీ పీ నాయకులను అలాగే జగన్ను తెలంగాణలో అడు గు పెట్టనివ్వోద్దని ప్రకటించిన జేఏసీ ఇప్పుడు కొన్ని పార్టీలకు మినహాయింపు ఇస్తోంది. జగన్ను తెలంగాణకు రప్పించిన సురేఖను ద్రోహిగా ప్రకటిస్తున్నా రు. మంచిదే కానీ అంతకంటే డాబుగా చంద్రబాబు ను తెలంగాణలో తిప్పిన ఎర్రబెల్లి మీద నోరు ఎందుకని నోరుమెదపడంలేదు అలాగే కొత్తపెళ్లి కొడుకును పల్లకీలో ఊరేగిన్చినట్టు కిరణ్కుమార్రెడ్డిని తెలంగాణ జిల్లాల్లో రచ్చబండలకు మోసుకు తిరిగిన  మం త్రులకు ఎలా మద్దతు ఇస్తున్నారు

 ఈమధ్య చాలామంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. ఇది  ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపే మాట. ఎవరో ఇస్తే కాదు తెలంగాణ ప్రజలు నిలబడి పోరాడి సాధించుకున్నది. అది ఉద్యమ ఫలితం. కాంగ్రెస్ మాత్రమే కాదు,అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలను గౌరవించి తలవచా ల్సిందే. కొందరు కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అంటున్నారు. నిజమే కావొచ్చు, కానీ తెలంగాణ ఇవ్వకుండా ఒక్కరైనా ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చేవారా అన్నది ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల ఆత్మగౌరవాన్ని పోరాట స్ఫూర్తిని కించపరిచే మాటలు. సంగతి కాంగ్రెస్ నేతలు, వారిని అభిమానిస్తోన్న తెలంగాణవాదులు కూడా గుర్తిస్తే మంచి దిఓటు వేసేముందు తెలంగాణ ఉద్యమంలో దొరపూవరో, దొంగపూవరో ప్రజలు గమనించాలి.

1 కామెంట్‌:

  1. Charitra chooste telisedemitante....peredayina, ooredayina, dongaliki lotu leni desham manadi...kaaka pote dochukune vaallu dongalayina doralayina vallu avatali valle ...mana vaallu maatram puli kadiginamutyalani bhramalo bratikestuntaam...nuvvu jai kottakunda, gangi reddula tala oopakunda unte, evadu ninnu dochukuntaadu...naalu vaagthaanaalu cheste, venakamundu choodakunda evadem chepite ade right ani follow ayipoye dourbhagyam manalo unnanta varaku....jarigedi punarnirmanalu kaadu...charitra punaravritaale

    రిప్లయితొలగించండి