శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

యుద్ధం అనివార్యం.. !




 ప్పుడు యుద్ధం ముగిసింది, ఇక భాగస్వామ్యంతో కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది అని కాంగ్రెస్ అది నాయకురాలు సోనియా గాంధీ అంటున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పాలన ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదని  ఆమె కరీంనగర్ ఎన్నికల బహిరంగ సభలో అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గానీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా చదివినవాళ్ళు గానీ యుద్ధం అప్పుడే ముగిసిందని అనుకోవడం లేదు. నిజానికి అసలు పోరాటం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మాత్రమే మొదలు కానుందని బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ తామే తెచ్చామనీ, తామే ఇచ్చామని చెపుతున్నవాళ్ళు, అరవై ఏళ్ళ కలను అరచేతిలో పెట్టామని అంటున్నవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి పార్లమెంటు ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చదివితే అందులో యుద్ధాలకు కావాల్సిన అన్ని ఆయుధాలూ కనిపిస్తాయి. నిజానికి ఇది భారత పార్లమెంటు ఆమోదించాల్సిన బిల్లుకాదు. బిల్లులో అనేక అంశాలు భారత రాజ్యాంగ నియమాలకు భిన్నంగా ఉన్నాయి. అవి యథాతథంగా కొనసాగాలంటే చట్ట సవరణలో, కుదరకపోతే రాజ్యాంగ సవరణలో చేయక తప్పదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా చెపుతున్నవి కాదు. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం (సీడబ్ల్యుసీ) చేసిన తీర్మానం చూసిన వెంటనే తెలంగాణ పౌరసమాజం బిల్లులోని లోపాలను గుర్తించింది. మామిడి పండులో గుజ్జు ఆంధ్రా వాళ్లకు టెంక తెలంగాణకు ఇచ్చే కుట్ర చేస్తున్నారని జేఏసీ సారథి కోదండరామ్ పదేపదే హెచ్చరిస్తూనే వచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలమీద జేఏసీ ఒక నివేదిక కూడా మంత్రుల బృందానికి, అన్ని రాజకీయపార్టీలకు ఇచ్చింది. 

కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిమీద స్పందించలేదు. బిల్లు రూపొందే దశలోగానీ, పార్లమెంటులో చర్చకు వచ్చిన సందర్భంలో గానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీపడుతున్న ఎవరూ నోరు విప్పలేదు  ఒక్క అసదుద్దీన్ ఒవైసీ మినహా. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూడకుండా కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి చర్చించిన సంగతుల రికార్డులను  యథాతథంగా పార్లమెంటు సిబ్బంది ద్వారా సంపాదించిన ఒక జర్నలిస్టు ప్రముఖుడు నాకు మెయిల్ చేశాడు. ఇచ్చిన వారి తరఫున మాట్లాడిన వాళ్ళు అంతా అమ్మ దయ అంటూ అదే మహాప్రసాదమని కళ్ళకు అద్దుకుంటే, తెచ్చామని చెపుతున్న వాళ్ళు అదే భాగ్యం అన్నట్టుగా మౌనంగా భక్తిశ్రద్ధలతో విన్నారు తప్ప మాట మాత్రంగానైనా అభ్యంతర పెట్టలేదు. ఒక్క అసదుద్దీన్ మాత్రం అడుగడుగునా తెలంగాణ హక్కుల కోసం  పోరాడాడు. పలుసార్లు సవరణలు ప్రతిపాదించారు. కానీ ఆయనకు సాటి తెలంగాణ సభ్యుల నుంచి కూడా కనీస మద్దతు రాలేదు. ఆ అన్యాయాలను యథాతథంగా ఉంచుతూ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు అవే తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారి భవిష్యత్తులో ప్రజాపోరాటాలకు భూమిక కాబోతున్నాయి.

అందులో మొదటిది పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్. ఉమ్మడి రాజధాని  మానవీయకోణంలో ఆలోచిస్తే మంచిగానే కనిపించవచ్చు. కానీ దాని వెనుక అనేక సమస్యలకు అదే మూలం కాబోతోంది. దీనివల్ల ఆంధ్రాకు పాలనా పరమైన సౌకర్యం ఎంతమాత్రం లేకపోగా తెలంగాణ పరిపాలనకు ఇదే పెద్ద ప్రతిబంధకం కాబోతున్నది. ఉమ్మడి రాజధానికి మౌలిక వసతులు తెలంగాణ ప్రభుత్వమే కల్పించాలి. ఉన్న భవనాలనే వాడుకోవాలి. ఉద్యోగులంతా ఇక్కడే ఉంటారు. వారి పౌర సరఫరాలు, సదుపాయాలూ అన్నీ తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలి. అలాగే కొందరు అక్రమంగా సంపాదించిన భూములు, ఆస్తులకు కాపలాఉండి రక్షణ బాధ్యత కల్పించాలి. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేయలేదు కాబట్టి గవర్నర్‌కు దాని బాధ్యతలు అప్పగించారు. అంటే అరవై ఏళ్ళు ఆంధ్రా పాలనలో తెలంగాణ ప్రజలకులేని, అనుమానాలు, అభ్యంతరాలు ఇప్పుడు వారికి కలిగాయి.

తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇక్కడి ప్రజలమీద వాళ్లకు నమ్మకం లేదు. అయినా సరే అంతా సరే అని బల్లలు చరిచారు. ఈ ప్రతిపాదనవల్ల హైదరాబాద్ అస్తిత్వం శాశ్వతంగా సమాధి అయిపోతుందని అంటూ తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు ఎలా మౌనంగా ఉంటున్నారు. మీ ఆత్మాభిమానం ఏమైందనిఅసదుద్దీన్ నిండు సభలో నిలదీశారు. కానీ మనవాళ్ళు మాత్రం మౌనంగా కూర్చుండి పోయారు. తెలంగాణకు వేరే గవర్నర్ ఉండాలన్న వాదనను కూడా వినిపించుకోలేదు. నిజానికి దేశంలో ఇలా ఏ రాష్ట్రం విషయంలోనూ జరగలేదు. ఇలాంటి డిమాండు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని భావన లేదని, ప్రజాప్రభుత్వం ఉండగా గవర్నర్ కు శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలు ఇవ్వడానికి కుదరదని న్యాయకోవిదులు మొత్తుకున్నా వినలేదు. ఉమ్మడి రాజధాని వాంఛనీయం కాదని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మద్రాస్-ఆంధ్రా విభజన సందర్భంగా  జస్టిస్ వాంచూ కమిటీ స్పష్టం చేశారు. ఇది భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలం కాబోతున్నది.

రెండోది ఉద్యోగుల పంపిణీ. వారి జీతాలు, పెన్షన్లు. వీటికి జనాభాను ప్రాతిపదిక చేశారు.  కానీ స్థానికత మాత్రమే చూడాలన్నది తెలంగాణవాదుల ప్రాతిపదిక. నిజానికి ఎప్పుడైనా జరిగేది అదే. కానీ తెలంగాణ విషయంలో మాత్రం అలా జరగలేదు సరికదా ఉద్యోగుల పంపిణీ విషయం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే పెట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు కూడా సంబంధం లేకుండా జరుగుతున్నది. దీన్ని ముందే గ్రహించిన అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు పాటించి బిల్లులోని 7 క్లాజును స్థానికత, పుట్టిన ప్రాంతం, సీనియారిటీపరిగణనలోకి తీసుకుని వారి వారి ప్రాంతాలకు పంపించాలని కోరారు. గుడ్డి ఆప్షన్ ఉండకూడదని వాదించారు.ఉద్యోగాల మీది ఆశతో తెలంగాణలో ఎంతమంది బలిదానాలు చేసుకున్నారో మీకు తెలియదు. వారి ఆశల్ని వమ్ము చేయకండి ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. తెలంగాణ నిరుద్యోగుల సమస్య కూడా. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాలులేక నిరుద్యోగులు వేసారి ఉన్నారు. వారే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి నిలబెట్టారు. నిజంగానే న్యాయంగా పంపిణీ జరిగితే ఒక్కరోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వవొచ్చని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్ చెపుతున్నారు. మరి మన నాయకులు ఆ మాట ఎందుకు చెప్పడం లేదు. మరోవైపు ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని జైరాం రమేష్  ఆంధ్రా ఉద్యోగులకు అభయం ఇస్తున్నాడు. ఈ ఎన్నికలు ముగిసి, అక్కడ ప్రచారం ఊపందుకునే లోగా అటువంటి ఆదేశాలు అందినా ఆశ్చర్యం లేదు. ఉద్యోగాలే ఇవ్వనప్పుడు తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకనుకున్నారో ఏమో ఉన్న కమిషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణకు కమిషన్ కూడా లేదు. ఈ విషయంలో అసద్ ప్రశ్నల పరంపరకు  సమాధానం రాలేదు. ఇలాంటి విషయాల్లో కోర్టుకు వెళ్ళే వెసులుబాటు కూడా లేదు. అసలు తెలంగాణకు హైకోర్ట్ కూడా ఇవ్వలేదు. అది ఉమ్మడిగానే ఉంటుంది. అక్కడి ఆంధ్రా న్యాయమూర్తులు అలాగే ఉంటారు. తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా దావాలు వేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది.

ఇక అత్యంత ప్రధానమైనది పోలవరం  ముంపు గ్రామాలు. అసలు పోలవరం ప్రాజెక్టే వద్దని ప్రజలు, పర్యావరణవేత్తలు మొత్తుకుంటుంటే పార్లమెంటు మాత్రం దానికి జాతీయ హోదా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా 207 ముంపు గ్రామాలను కూడా అవశేష ఆంధ్రకు రాసిచ్చింది. ఇందులో తనకు తాను పదేపదే చెప్పుకుంటున్నట్టు వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర పోషించాడు. తమకు భద్రాచలం రాముడు వద్దని రాజ్యం మాత్రం రాసివ్వాలని పట్టుబట్టాడు. వెంకయ్య ఒత్తిడికి కాంగ్రెస్ తలొగ్గింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ రూపొందించింది. అది ఆమోదం పొందితే కనీసం మూడు లక్షల ఆదివాసులు చెల్లాచెదురై పోనున్నారు, సీలేరు విద్యుత్ కేంద్రం ఆంధ్రా భూభాగంలో కలిసిపోతుంది. బహుశా ఎన్నికలలోపే కేంద్ర మంత్రివర్గం సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఇంత జరిగినా తెలంగాణ నాయకులు పార్లమెంటులో మాట్లాడలేదు. అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మునిగే వాళ్ళు ఆదివాసులే కదా అన్నట్టు వ్యవహరించారు. కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఇవన్నీ చర్చకు వస్తాయని, కొంతవరకైనా హామీలు లభిస్తాయని తెలంగాణ సమాజం ఆశించింది. కానీ కూడా బలుక్కున్నట్టు ఒక్కరూ ఈ విషయాలను చర్చకు తేకుండా ప్రచారం మొత్తం తిట్లకు, శాపనార్థాలకు పరిమితం చేసేశారు. 

ఇవే కాదు ఇంకా జల వివాదాలు, ఆస్తుల పంపకాలు, హైదరాబాద్ నగరం మీద ఆధిపత్యశక్తుల ఆగడాలు భవిష్యత్తులో తెలంగాణ ప్రజల హక్కులకు అనేకచిక్కులు తేనున్నాయి. ఇవాళ ఎన్నికల ప్రచారంలోనే హైదరాబాద్ అందరిదని ఎవరైనా పోటీ చేసి, ఎవరైనా పరిపాలన చేయవచ్చని కొత్త బిచ్చగాళ్ళు కొందరు కూనిరాగాలు తీస్తున్నారు. వారికి మరికొందరు భరోసా ఇస్తున్నారు. ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు,సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి.  తెలంగాణా అస్తిత్వాన్ని కాపాడి, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే వారినే ఎన్నుకోవాలి. ఎందుకంటే రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా యుద్ధం తప్పదు. అయితే ఈ యుద్ధం ప్రజలు చేయాల్సింది కాదు. రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ  పార్లమెంటు సభ్యులు చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎవరి పక్షంలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీలతో పనిలేదు. ప్రజలు విజ్ఞతను ప్రదర్శించి  తమతో కలిసి యుద్ధం చేసిన వాళ్ళను, యుద్ధ సమయంలో తమతో ఉన్నవాళ్ళను, రేపుకూడా యుద్ధానికి సిద్ధంగా ఉండేవాళ్ళను మాత్రమే ఎన్నుకోవాలి.

శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

వాళ్లకు రాజనీతి బోధించండి!


‘మార్గం సుదీర్ఘం’,‘భూమి గుం డ్రం’ అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్ర మహాసభతో మొదలయిన తెలంగాణ అస్తిత్వం దొరలూ, జమీన్‌దార్లు, జాగీర్‌దార్లను పల్లెల నుంచి తరిమేసిన క్రమాన్ని కళ్ళకు కడుతుంది. అలా పారిపోయిన దొరలు రెండుమూడేళ్ల అజ్ఞాతం తరువాత మళ్ళీ ఎలా గ్రామాలకు చేరుకొని ‘పునర్నిర్మాణానికి’ పునాదులు వేసుకుంటారో దాశరథి  తరువాతి కాలంలో రాసిన ‘జనపథం’ నవలలో వివరిస్తారు. కథ, చెప్పిన పద్ధతి, అందులోని రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఇది జరిగిన సంగతి. 1942-52 మధ్య చరివూతను పరిశీలిస్తే నిజంగానే చరిత్ర తనంతట తాను పునరావృతం అవుతుందనే అనిపిస్తుంది. అందుకే దాశరథి ‘భూమి గుండ్రం’ అన్నా డు. 

నిజాం రాజుల పాలనలోని లోపభూయిష్ట భూ పంపిణీ, యాజమాన్య విధానాల వల్ల భూస్వాము లే పాలకులుగా చెలామణి అయ్యారు.  నిజాం రాజులకు  తాబేదార్లుగా మారి ప్రజలను దోచుకుని దొరలయ్యారు. ఆ దొరల దోపిడీ, దాష్టీకాలకు హద్దూ అదుపు లేకుండా పోయింది. తెలంగాణ బతుకు ఛిద్రమైపోయింది. ఆ దశలోనే ప్రపంచం గర్వించే స్థాయిలో సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో ప్రారంభమయ్యింది. నాగలి పట్టాల్సి న రైతులు, రైతు కూలీలు తుపాకులు పట్టారు, సాయుధ దళాలు ఏర్పాటు చేసుకుని ‘భూస్వాముల’ మీద దండయావూతకు దిగారు. దొరలూ ప్రతిఘటించారు.రజాకార్లను ఉసిగొలిపి దొరికిన వాళ్ళ ను దొరికినట్టు  ఉద్యమకారులను ఊచకోత కోశా రు. వేలాదిమందిని జైళ్లలో తోశారు. కేసులు బనాయించారు. కోర్టులకు ఈడ్చారు. అయినా దొరలను నిజాం ప్రభువు కాపాడలేకపోయాడు, రజాకార్లు, కిరాయి మూకలు కాపాడలేకపోయా యి. కంటిచూపుతో మొత్తం సమాజా న్ని శాసించిన దొరలు తమ గ్రామాలు వదిలి, గడీ లు వదిలి పారిపోయారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అనేక నగరాలకు పారిపోయారు. ఉద్య మం ఉధృతంగా సాగినంత కాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అజ్ఞాతంలో గడిపారు. 

ఇదే అదనుగా నెహ్రూ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు చర్య పేరుతో భారత సైన్యాన్ని రంగంలోకి దింపి హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో కలిపేసుకుంది. అంతే! అప్పటిదాకా ఎక్కడెక్కడో దాక్కున్న దొరలంతా కొత్త అవతారాల్లో మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి చేరారు. అప్పటిదాకా వాడిన షేర్వానీలు వదిలేశారు. ఖద్దరు తొడిగారు. తలమీద గాంధీ టోపీలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో కలిసిపోయారు. సైన్యం, పోలీసు సెక్యూరిటీ వెంట బెట్టుకుని మళ్ళీ గ్రామాల్లో చేరిపోయారు. అప్పటి దాకా  నిజాం రాజు తొత్తులుగా వుండి, మొత్తం పల్లెల్ని దోచి, ఈ దోపిడీ నుంచి, వెట్టి నుంచి, గులాంగిరీ నుంచి, భూస్వామ్య బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని పోరాడిన ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు, ఇక్కడి జన జీవనాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు హటాత్తుగా జాతీయ వాదులై పోయారు. దేశ భక్తులయ్యా రు. కాంగ్రెస్ నేతలై కండువాలు కప్పుకున్నా రు. భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా నవసమాజా న్ని నిర్మిస్తామని ప్రతినబూనారు. తరువాత ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళే మళ్ళీ మంత్రులైపోయారు. 

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే పాలనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోకి తెచ్చేందుకు 1953లో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా మద్రా స్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలుగు తెలిసిన ఉద్యోగులను ఇక్కడికి ఆహ్వానించింది. పనిలో పనిగా  సాగు తెలిసిన కోస్తా రైతులను కూడా ఉచితంగా ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చి పిలిపించుకుంది. ఉద్యోగులను నియమించినప్పుడు పెద్ద ఎత్తున స్థానిక యువకులు, నిరుద్యోగులు నిరసన తెలిపా రు. ఆందోళనకు దిగారు. ‘నాన్-ముల్కి గో బ్యాక్’ పేరుతో ఉద్యమించిన పిల్లల మీద కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచివేసింది. అప్పటి నుంచి స్థానికుల నోళ్ళు మూయించి వేలాదిమందిని ఉద్యోగా ల్లో నియమించింది. ఇది వలసాధిపత్యానికి తొలి మెట్టు అయింది. అప్పటి దాకా కొనసాగిన నిజాం ముతక పాలనా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంది. ఇది జరిగి రెండేళ్ళు కూడా గడవక ముందే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మం తనాలు మొదలుపెట్టారు. ఆంధ్రా పెద్దలు కలిసి వుంటే కలదు సుఖం అన్నారు. తెలంగాణ పెద్దమనుషులు ఎవరికి  సుఖం అని ఆలోచించలేకపో యారు. హైదరాబాద్ ముఖ్యమంవూతిగా ఉన్న బూర్గు ల రామకృష్ణారావు అలాంటి ఆలోచన చేసినా కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ పిలిపించి ఒప్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో బాగుపడతారని చెప్పింది. ఆయనా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో  ఆంధ్రవూపదేశ్ పునర్నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు. మళ్ళీ మంత్రులయ్యారు. కానీ పదేళ్ళు గడిచినా పరిస్థితి మారకపోగా మరింత శిథిలం అయ్యింది. ఇక చాలనుకున్న యువతరం తెలంగా ణ కోసం 1969 లో ఉప్పెనై లేచింది. ఆంధ్రా ఆధిపత్యశక్తులను, పాలకులను వాళ్లకు వంతలు పాడే తెలంగాణ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వ సహకారంతో ఆ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసింది. వందలాది మందిని హైదరాబాద్ వీధుల్లో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి వేసింది. అప్పటి పాలకుల్లో ఇప్ప టి నాయకుల తండ్రులున్నారు. కొందరు నేతల తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళే పెద్దమనుషులుగా ఉండి ఒప్పందాలు చేసుకుని, షరతులు పెట్టుకుని దాదాపు 1982 దాకా అదే తంతు కొనసాగించారు. 

ఈ పాలనే తెలంగాణ బతుకుల్ని రోడ్డు మీదికి తెచ్చింది.  దానికి తెలుగుదేశం పాలన కూడా తోడయ్యింది. ఇదే నాయకత్వం ఆ పార్టీ హయాంలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. జానాడ్డి లాంటి వాళ్ళయితే అక్కడా ఇక్కడా రెం డు చోట్లా ఉన్నారు. మళ్ళీ మొదలయిన తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు, అణచి వేసిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు, ఉద్యమకారుల మీద కేసులు బనాయించి జైళ్లలో తోసిన వాళ్ళు, చివరకు వేలాదిమందిని నిరాశలో ముంచి ఆత్మహత్యలకు పురికొల్పిన వాళ్ళు కూడా గడిచిన పదేళ్లుగా పాలించిన వాళ్ళే. వాళ్ళే ఈ విధ్వంసానికి మూలం అని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఇదంతా ఒక చరిత్ర.  

ఆ చరిత్ర క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక అధ్యయనాలు చేసి తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్యమానికి సన్నద్ధులను చేసింది. ఈ విధ్వంసంలో భాగంగా వచ్చిన నిబంధనలు ఉద్యోగులను ఊపిరాడకుండా చేస్తున్నాయన్న  ఆందోళనలో నుం చే కే.చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష, జేఏసీ ఏర్పా టు జరిగిపోయాయి. ఈ విధ్వంసమే అప్పటిదాకా అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా మాత్రమే ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పౌర సమాజానికి తిరుగులేని నాయకుడై నిలబడ్డాడు. రాజకీయవాదులు, పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా వెరవకుండా తుదిదాకా నిలబడి ఇప్పుడు పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించాడు.కానీ తెలంగాణ కాంగ్రెస్ అధినేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం అసలు విధ్వం సం జరగనే లేదని, అలాంటప్పుడు పునర్నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్  ఇంకా తటస్థంగా ఉంటే కుదిరేలా లేదు. వాళ్లకు రాజనీతిశాస్త్రం బోధించాల్సిన అవసరం ఉంది. వీలయితే చరిత్ర కూడా చెప్పాల్సి ఉంది. 

ఎవరయినా తెలియని వాళ్లకు చెప్పవచ్చు. కానీ తెలిసీ తెలియనట్ట్టు నటించే వాళ్లకు ఏది చెప్పినా ప్రయోజనం ఉండదు అని అనిపిస్తే మీకు మీరే ఒక చారివూతాత్మక నిర్ణయం తీసుకోండి. ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాధనకు ఊపిరై నిలబడ్డ రాజకీయ జేఏసీ పౌరసమాజానికి దిశా నిర్దేశం చేయక తప్పదు. మీతో భుజం భుజం కలిపి పోరాడినవాళ్ళను ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. విధ్వంసం జరిగిందని ఒప్పుకున్న పార్టీలను, పునర్నిర్మాణం అవసరాన్ని గుర్తించిన వాళ్ళను, నవ తెలంగాణ నిర్మించాలనే వాళ్ళనే బలపరచండి. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఆకాంక్షకు అర్థమే లేకుండాపోతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది.

గురువారం, ఏప్రిల్ 10, 2014

దొరలెవరు? దొంగలెవరు?


పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్మాణం అంటే అర్థం తెలియక కాదు. వాదన వెనుక ఆయనకు తన సొంత అభివూపాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ధ్వంసమే కాలేదు అన్నది, రెండోది పునర్నిర్మాణం అవసరమే లేదన్నది. మామూలుగా అయి తే ఆయన అలాంటి వాదన చేయరు. కానీ కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం అని అన్నాడు కాబట్టి, తాను కేసీఆర్ వాదాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఆయ ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు. కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండేందుకే కేసీఆర్ ఎత్తుగడ వేశారన్నది ఆయన వాదన సారాంశం. ఒక్క ఆయన మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది  పునర్నిర్మాణం అనే పదానికి కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు. కొంద రు గడీల పునర్నిర్మాణం అంటే, మరి కొందరు భూస్వామ్య పునర్నిర్మాణం అని, ఇంకొంత మంది దొరతనం పునర్నిర్మాణమని ఎవరి భాష్యాలు వాళ్ళు చెబుతున్నారు. పాపం కేసీఆర్ రెండుసార్లు అదేపని గా మీట్ ది ప్రెస్ కార్యక్షికమాల్లో వివరించినా, తన చానల్లో నాలుగు గంటలపాటు విజేత విజన్ పేరు తో ప్రత్యక్ష ప్రసారంలో విడమరచి చెప్పినా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనంటే పొసగని వాళ్ళు పదేపదే ఇదంతాదొరతనంఅని దబాయిస్తూనే ఉన్నారు. నిజానికి దొర అనేది ఒక కులం కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక, భూమి మీద,ఉత్పత్తి మీద, మనుషుల మీద, మొత్తంగా సమాజంలోని అన్నిరకాల మానవ సం బంధాలమీద ఆదిపత్యం చెలాయించిన ఒకానొక దశ.

దొరలు ఒక్క వెలమ కులంలోనే లేరు. గడీలు కేవలం వాళ్ళవే కాదు. నల్లగొండలో ప్రారంభమైన  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రెడ్ల దొరత నం మీద తిరుగుబాటుగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్లుగా ఉన్న అన్ని అగ్రకులాలు ఉన్నాయి. కొన్నిచోట్ల వెలమ దొరలుంటే, చాలా చోట్ల రెడ్లు, మరికొన్ని చోట్ల కాపులు, కరణాలు  అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం జాగీర్దార్లు కూడా దొరతనం చెలాయించారుఇటువంటి అగ్రవర్ణ, కొన్నిచోట్ల ముస్లిం భూస్వాములంతా తమ ఆధిపత్యానికి ప్రతీకలుగా కోటలు, గడీలు నిర్మించుకున్నవాళ్ళే. ఇదంతా చరివూతలో నమోదైన వాస్తవం. అయినా తెలంగాణ సమాజం దొరతనానికి ఎన్న డూ భయపడలేదు, ఐలమ్మ, బందగీ లాంటి వాళ్ళ తరం నుంచి అయిలయ్య, రాజమల్లు తరం దాకా తెలంగాణ ప్రజలు పోరాటాల, ప్రజా  ఉద్యమాల ద్వారా దొరల మెడలు వంచిన వాళ్ళే. తన చెప్పుచేతల్లో బానిసల్లా పడిఉన్న సామాన్యులు తిరగబడి దొరలను పల్లెలు, పంట పొలాల నుంచి పరుగెత్తించిన సందర్భాలు ఇటీవలి తెలంగాణ చరివూతలో అనే కం. నిజానికి నడ్డి విరిగిపోయిన దొరతనాన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం, శిథిలమై గబ్బిలాల గూళ్ళుగా మారిపోయిన గడీలను మళ్ళీ నిర్మించడం కేసీఆర్ వల్ల కాదు గదా ఆయన తాతల తరం వల్ల కూడా సాధ్యమయ్యే పనికాదు. అయినా సరే కొందరు అదేపనిగా దొరతనాన్ని ఇంకా తెలంగాణలో ఒక ఆధిపత్యశక్తి గా చూపడం తెలంగాణ ప్రజల పోరాట పటిమను, విజయాల చరివూతను తక్కువ చేయడమే అవుతుంది.

ఇప్పుడు ఎన్నికల సమయంలో కొందరు దొర వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. కాంగ్రె స్, టీడీపీ నాయకులు టీఆర్ఎస్ను దొరల చిరునామాగా చూపి కేసీఆర్ను దొరతనానికి నిలు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావును, రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్న కేవీపీ రామచంద్రరావు కూడా వెలమ దొరలే అన్న సంగతి మరిచిపోతున్నారు. గడీల అధికారాన్ని ఎప్పుడో గల్లంతు చేసామని చెప్పే కొందరు ఉద్యమ కారులు కూడా ఈమధ్య దొరలవాదానికి  వంతపాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ చర్చలు వాదోపవాదాల్లో వినబడుతున్న దొరతరానికి నిర్వచనం ఏమి టో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వెలమ కులమే దొరల కులం అని కొందరు దళిత బహుజన మేధావులు భాష్యం చెప్పవచ్చు. దానిని వర్గ పోరాటాల్లో ఉన్నామని చెప్పేవాళ్ళు ఎలా సమర్థిస్తారు? దొరతనం కులంతో మాత్రమే రాలేదు, ఆధిపత్యం, అహంకారం కలిస్తేనే దొరతనం. అది కేసీఆర్లో ఉన్నట్టే దామోదర రాజనర్సింహలో దానంనాగేందర్లో కూడా ఉండవచ్చు కులంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినట్టే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా పుట్టారు. అంతేకాదు కులంతో సంబంధం లే ని సర్ ఆర్థర్ కాటన్ను కూడా ఆంధ్రాలో కాటన్ దొర అనే అంటారు, తెలుగు ప్రజలంతా బ్రిటిష్ పాలకుల ను తెల్లదొరలనే పిలిచారు.అలాగే ఆదివాసీ తెగల నాయకుల్లో కూడా దొరలున్నారు. అయినా పార్లమెంటరీ రాజకీయాల్లో దొరపూవరో, దొంగపూవరో తేలడం కష్టం. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ ఆస్తు లు, భూముల వివరాలు, అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్లో ఉండే అహంకారం చూసిన వాళ్లకు దొర తనానికి కులంతో పనిలేదని అర్థమౌతుంది. అదొక ఆధిపత్య వర్గం.ఉద్యమకాలంలో ఇటువంటి కుల వాదనే కొందరుమేధావులుప్రొఫెసర్. కోదండ రాం విషయంలోనూ తెచ్చారు. ఆయన కోదండరామ్రెడ్డి అని, అగ్రవర్ణ, ఫ్యూడల్ భావజాలానికి ఆయన ప్రతీక అని ప్రచారం చేశారు. పోటీగా కుల సంఘాలు, జేఏసీలు కూడా పెట్టి తెలంగాణవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయినా ఎన్నికలతో దొరతనం, కులతత్వం పోతుందని ఎవరైనా నమ్మితే అది భ్రమే.

ఎన్నికల్లో అగ్రకులాలు మరింత బలంతో ముందుకు వస్తున్నాయికులపరంగా రెడ్డి సామాజి వర్గం ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 42 ఓపెన్ స్థానాల్లో 35 ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. టీఆర్ఎస్ 12 చోట్ల వెలమలను 39చోట్ల రెడ్లను రంగంలోకి దింపింది. అలాగే  తెలంగాణను బీసీలకు ఇనాంగా ఇచ్చిన చంద్రబాబు సగం సీట్లను బీజేపీకి ఇచ్చేశారు. మిగిలిన వాటిలో రెడ్డి సామాజిక వర్గానికి 16 సీట్లు, వెలమలకు మూడు ఇచ్చి ఇక్కడ పెద్దగా జనాభా లేకపోయినా తన సొంత సామాజిక వర్గానికి  ఆరు సీట్లు కేటాయించా రు. 1 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించిన ఆయన బీసీని ముఖ్యమంవూతిని చేస్తానని బుకాయిస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. ఈసారి కూడా  కేసీఆర్ తన సహజ రీతిలో తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అనేకచోట్ల ఉద్యమకారులను, టీఆర్ఎస్ కోసం అహరహం పనిచేసిన వాళ్ళను ఆపార్టీ  పక్కనపెట్టింది. చెరుకు సుధాకర్, దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, ఏర్రోళ్ల శ్రీనివా స్, మందుల సామేలు ఇట్లా పార్టీని కంటికి రెప్పగా కాపాడిన వాళ్లకు అనేక మం దికి బలమైన కులం కాదనే కారణంతో టీఆర్ఎస్ మొండిచేయి చూపింది. అలాగే కుటుంబ ఆధిపత్యాన్ని మరింత విస్తరించే రీతిలో టికెట్లను కేటాయించుకుంది. అన్ని పార్టీల లాగే టీఆర్ఎస్ కూడా  అగ్ర కులాలకే పెద్దపీట వేసింది. రెడ్లకు 39, వెలమలకు 12 స్థానాలు పార్టీ కేటాయించింది. ఇట్లా శాసనసభలో కుర్చీలన్నీ అగ్రకులాలకే రిజర్వు చేసి సామాజిక తెలంగాణ నిర్మిస్తామని ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేస్తామని, సాధికారత సాధిస్తామని చెపితే అమాయకులు తప్ప ఎవరు మాత్రం నమ్ముతారు.

అలాంటి అమాయకుల కోసమే కొందరు పదేపదే దొరతనం మీదికి దృష్టి మళ్లిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం అందులో భాగంగా  సామాజిక సాధికారత సాధించాల్సిన ప్రణాళిక మీద చర్చ జరగాల్సి ఉంది. తెలంగాణ జేఏసీ కూడా అటువంటి ప్రజా మేనిఫెస్టో ఒక టి ప్రకటించింది. అనేక కులవృత్తి సంఘాలు తమ తమ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండాల ని భవిష్యత్ తెలంగాణలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇటువంటి మౌలిక విషయాల వైపు చర్చ వెళ్ళకుండా ఉండేందుకే కొన్నిశక్తులు ఇప్పుడు దొరతనం, ఉద్యమ ద్రోహం వంటి వాటిని ప్రస్తావిస్తున్నాయి. ఊకదంపుడు వాదనలో ఎవ రు ఉద్యమకారులో, ఎవరు ద్రోహులో తేలడం కూడా కష్టంగానే ఉంది. పన్నెండేళ్ళ టీఆర్ఎస్ పోరా చరిత్ర ఒక్క కొండా సురేఖ చేరికతో పాప పంకి లం అయిపోయిందని కొందరు తీర్పులు చెపుతున్నారు. అదే సమయంలో అరవైఏళ్లుగా తెలంగాణ ఆకాంక్షను అణచివేసి, వందలమంది ఉద్యమకారుల చావులకు, వేలాదిగా కేసులకు వేధింపులకు కారణమైన కాంగ్రెస్ను తెలంగాణ ఇవ్వడం ద్వారా పునీ తమైందని కూడా ప్రచారం చేస్తున్నారు. వీపుల మీది గాయాలు మానిపోకముందే, తలల మీద కేసులు తొలగిపోక ముందే కొందరు ఉద్యమకారులు కాంగ్రె స్ జెండాలు మోస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్కి శవయావూతాలు, పిండ ప్రదానాలు చేసిన వీళ్ళే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అది  పవి త్రం అయిపోయినట్టు చెపుతున్నారు. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అండతో కాంగ్రెస్, టీడీ పీ నాయకులను అలాగే జగన్ను తెలంగాణలో అడు గు పెట్టనివ్వోద్దని ప్రకటించిన జేఏసీ ఇప్పుడు కొన్ని పార్టీలకు మినహాయింపు ఇస్తోంది. జగన్ను తెలంగాణకు రప్పించిన సురేఖను ద్రోహిగా ప్రకటిస్తున్నా రు. మంచిదే కానీ అంతకంటే డాబుగా చంద్రబాబు ను తెలంగాణలో తిప్పిన ఎర్రబెల్లి మీద నోరు ఎందుకని నోరుమెదపడంలేదు అలాగే కొత్తపెళ్లి కొడుకును పల్లకీలో ఊరేగిన్చినట్టు కిరణ్కుమార్రెడ్డిని తెలంగాణ జిల్లాల్లో రచ్చబండలకు మోసుకు తిరిగిన  మం త్రులకు ఎలా మద్దతు ఇస్తున్నారు

 ఈమధ్య చాలామంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. ఇది  ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపే మాట. ఎవరో ఇస్తే కాదు తెలంగాణ ప్రజలు నిలబడి పోరాడి సాధించుకున్నది. అది ఉద్యమ ఫలితం. కాంగ్రెస్ మాత్రమే కాదు,అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలను గౌరవించి తలవచా ల్సిందే. కొందరు కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అంటున్నారు. నిజమే కావొచ్చు, కానీ తెలంగాణ ఇవ్వకుండా ఒక్కరైనా ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చేవారా అన్నది ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల ఆత్మగౌరవాన్ని పోరాట స్ఫూర్తిని కించపరిచే మాటలు. సంగతి కాంగ్రెస్ నేతలు, వారిని అభిమానిస్తోన్న తెలంగాణవాదులు కూడా గుర్తిస్తే మంచి దిఓటు వేసేముందు తెలంగాణ ఉద్యమంలో దొరపూవరో, దొంగపూవరో ప్రజలు గమనించాలి.