బుధవారం, మార్చి 13, 2013

పెద్దబాలశిక్ష

నరసింహాడ్డి గారిని బాగా తెలిసిన ఆయన సమకాలికులు ఎఎన్ అంటారు, పెద్దగా తెలియని వాళ్లు ఎపిటిఎఫ్ నరసింహాడ్డి అంటుంటారు. మా లాంటి వాళ్ళంతా ఆయనను నరసింహాడ్డి సార్ అని మాత్రమే అంటాం. ఏ రకంగా పిలిచినా ఆయన పేరు ఉపాధ్యాయ వృత్తితో, ఉద్యమంతో ముడిపడి ఉన్నది. రాష్ట్రంలో దేశంలో చాలామంది ఉపాధ్యాయులే ఉన్నారు. గడిచిన అరవై ఏళ్లలో రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయ సంఘాలు వచ్చాయి. కానీ నరసింహాడ్డి సార్‌కు మాత్రమే ఆ గుర్తింపు, గౌరవం ఉన్నాయి. 1969లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగ సమస్యల మీద ఆయన వందలాది వ్యాసాలు రాసి, వేల సభల్లో మాట్లాడి ఉంటారు. అందులో మచ్చుకు కొన్నే ఇప్పుడు ఈ పుస్తకంలో వచ్చాయి. ఆయన ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆయన ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణమే తన పూర్తికాల వ్యాపకం చేసుకున్నా రు. ఆయన ప్రసంగాలు, వ్యాసాలు, సంపాదకీయాలు విద్యారంగానికే దిక్చూచిగా ఉంటాయి.ఈ పుస్తకంలో మొత్తం 29 వ్యాసాలున్నాయి. ఇవన్నీ ఇటీవలి కాలంలో రాసినవే. దాదాపుగా అన్నీ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఆర్థిక సంస్కరణలు అమలయిన తర్వాత వచ్చినవే. కానీ 1990-91 తర్వాత ఉపాధ్యాయ ఉద్యమ లక్ష్యం, కార్యాచరణలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒక రకంగా అవి రావలసిన మార్పులు ఎందుకంటే అప్పుడే ఆర్థిక సంస్కరణలు మొదలయినాయి. ప్రపంచబ్యాంకు, డంకెల్ ప్రతిపాదనలు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్కరణల మీద చర్చ జరుగుతున్న దశ అది. 

ఏ వ్యక్తికయినా జీవితమే పాఠాలు నేర్పుతుందని నా నమ్మకం. అలాగే ఒక మనిషి నేపథ్యం,ఆది ప్రాంతం, కులం దానికి సంబంధించిన సామాజిక ఆర్థిక, సామాజిక ఆవరణ వ్యవస్థకు సంబంధించిన పునాదులే ఆ వ్యక్తి రాజకీయ అభివూపాయాలను రూపొందిస్తాయని నేను బలంగా విశ్వసిస్తాను. నరసింహాడ్డి గారు పుట్టి పెరిగి న కడి మట్టి మహత్యం కూడా ఆయనను మార్చేసి ఉంటుం ది. కడి జనగామకు అన్యాయాన్ని ఎదిరించే స్వభావం ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నూతన వ్యవసాయక విప్లవందాకా సాగిన పోరాటాల్లో ఆ వూరికి విలక్షణ స్థానం ఉన్నది. అందులో ఆయనపుట్టి పెరిగిన కుటుంబానికి అటువంటి త్యాగనిరతి ఉంది. స్వయంగా ఆయన సహోదరుడు సంతోష్‌డ్డి పీడిత ప్రజల విముక్తికోసం ప్రాణాలు పణంగా పెట్టిన విప్లవ యోధుడు.

బహుశా ఈ అన్ని పరిణామాలూ నరసింహాడ్డి ఆలోచనలను, అవగాహనను పదునెక్కించి ఉంటాయి. ఆయనను యథాలాప ధోరణి నుంచి మార్పును కోరుకునే ఆలోచనవైపు నడిపించి ఉంటాయి. కేవలం పదో తరగతి వరకే చదువుకున్న నరసింహాడ్డి ఆ తర్వాత ఒక అధ్యాపకుడికి కావాల్సిన అన్ని డిగ్రీలను పొంది ఒక మహోపాధ్యాయుడిగా మారడం వెనుక ఏదో సామాజిక ప్రేరణ ఆయనను వేధించే ఉంటుంది. అదే ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసంలో మనకు కనిపిస్తుంది. అలాగని ఇవి కేవలం రాజకీయ సిద్ధాంత వ్యాఖ్యానాలు కాదు. గాంధీ, ఠాగూరు మొదలు మార్క్స్, అంబేద్కర్‌ల దాకా ఆయన చదువు మీద సాగించిన పరిశీలనకు అద్దంపట్టే విశ్లేషణలు, ఎంఎస్ గోరె, కొఠారీ, కామత్, కృష్ణకుమార్, రాధాకృష్ణన్ ఇట్లా భారతీయ విద్యావ్యవస్థను మెరు గు పరచడానికి తమ ఆలోచనలను ధారపోసిన అందరినీ అర్థం చేసుకున్న మూలంగా ఆయన చదువు విషయంలో సామాన్యుని పక్షాన నిలబడి మాట్లాడాడు. ఒకవైపు ఉపాధ్యాయులు ఎదుర్కొ నే దైనందిన సమస్యలు పరిష్కరిస్తూ, మరోవైపు మారుతున్న విధానాలను అధ్యయనం చేసి వాటిని సమాజానికి అన్వయింపజేయడం వెనుక ఆయన కృషి నిబద్ధత ఉన్నాయి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబం, వృత్తి ధర్మం, సామాజిక బాధ్యతలు అన్నీ నెరవేరుస్తూ సామాజికంగా, క్రియాశీలంగా ఎదగడం వెనుక ఎంతోఘర్షణ ఉంటుంది. ఎంతో త్యాగం ఉంటుంది. అవన్నీ అనుభవించి ఉండడంవల్లే అన్ని విలువైన వ్యాసాలు రాయగలిగాడు.

మొట్టమొదటగా ఈ నేలమీద అసలైన జ్ఞానబీజాలు నాటింది బుద్ధుడు. జ్ఞానం వేదాల్లోనో, మత గ్రంథాల్లోనో లేదని, అసలైన జ్ఞానం మనిషిలోనే ఉందని చెప్పాడాయన. జ్ఞానం అంటే ఉన్నదానిని నేర్చుకోవడమే కాదు, సత్యాన్ని అన్వేషించడమని అన్నా డు. ఎవరో చెప్పింది ఆచరించడం కాక ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే అసలైన జ్ఞానమని బుద్ధుడు బోధించా డు. విద్యకున్న నిర్వచనం కూడా అదే. విద్య అంటే బోధన, శిక్షణతోపాటు నేర్చుకోవడం కూడా. కొత్త విషయాలు తెలుసుకునే జ్ఞానంతోపాటు, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడం. ఆ బుద్ధి కుశల తో మనిషిని మార్చడం, సంఘాన్ని మార్చడం. ఆ పని బుద్ధుడు చేశాడు. జ్ఞానం మనిషి హృదయంలో, సమాజంలో ఉన్నదని దానిని మనిషికి తెలిసేలా చేయడమే బౌద్ధం చెపుతుంది. నిజాని కి బుద్ధుడే బహుశా మొట్టమొదటి సార్వజనీన జ్ఞాన బోధకుడు. ఆయన తాను తెలుసుకున్న జ్ఞానాన్ని కేవలం ముఖతా బోధించకుండా ప్రతి ఒక్కరు వారికి వారు తెలుసుకోవాలని భావించిన ఉపాధ్యాయుడు. సత్యాన్ని తెలుసుకున్న మనిషి తను మారగలుగుతాడు. సమాజాన్ని మార్చగలుగుతాడు. కానీ భారతదేశం బుద్ధిజం తరువాత మళ్ళీ సంప్రదాయ, బ్రాహ్మణీయ శక్తుల ఆధిపత్యంలోకే వెళ్లింది. జ్ఞానాన్ని, దానికి కీలకమైన చదువును తమ చేతుల్లో పెట్టుకోవడం ద్వారా ఆధిపత్యశక్తులు రాజ్యం మొత్తాన్ని తమ అదుపులోకి తెచ్చుకోగాలిగారు.
జ్ఞానాన్ని కొందరు తమ సంపదగా, వారసత్వంగా భావించ డం, దాన్ని వారి కబంధ హస్తాల్లో నుంచి విడిపించడం కోసం అనేకమంది సుదీర్ఘకాలం పోరాటాలు చేయడం ఒక్క భారతదేశంలో కనిపిస్తుంది. బ్రాహ్మణీయ వర్గాలు పన్నిన ఈ కుట్ర దేశా న్ని ఒక అసమానతల నమూనాగా, వివక్షకు నిర్వచనంగా మార్చివేశాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా జ్ఞానాన్ని సకల జనులకు సమానంగా అందించే ప్రయత్నం అనేక దశల్లో సాగింది. మొఘల్‌ల కాలంలో బ్రాహ్మణీయ శక్తుల ప్రాబల్యం నుంచి, విద్య వైద్యంతోపాటు భూమి ఇతర వనరులను కూడా విముక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆది కుదరలేదు. అలాగే భక్తి ఉద్యమం కూడా అనేక రకాలుగా జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేసింది. కబీరు, తుకారాం, గురు రవిదాస్, చోకమేల, బాబా నాందేవ్, ఆ తర్వాత వేమన, పోతులూరి వీరవూబహ్మం ఇట్లా అనేక మంది బ్రాహ్మణీయ సమాజాన్ని సంస్కరించాలని మనుషులందరూ సమానమేనని చాటి చెప్పినవారే. కానీ ప్రయత్నాలేవీ పరిపూర్ణం కాలేదు.

ఆధునిక సమాజంలో మళ్ళీ మనకు జ్యోతిరావు, సావివూతిబా యి పూలే, నారాయణగురు, అంబేద్కర్ అవసరమైనారు.విద్యను ప్రజాస్వామీకరించే ప్రయత్నంలో మెకాలే ప్రవేశపెట్టిన ఆధునిక విద్యావ్యవస్థను ఒక ముందడుగుగా కొందరు భావిస్తారు. ఇది ప్రజాస్వామ్యీకరించడానికి కొంత దోహదపడిందేమో కానీ విద్య ను సంపూర్ణంగా సమాజపరం చేయలేకపోయింది. మెకాలే ప్రవేశపెట్టిన ఆధునిక విద్య వ్యవస్థ పనిముట్లను తయారు చేయగలిగింది కానీ ప్రజలను మనుషులుగా మార్చడంలో సఫలం కాలేదు. ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటగా చేసింది అంబేద్కర్.ఆయన ఆధునిక సమాజంలో చదువు విలువ ఏమిటో సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి. అప్పటివరకు చదువును ఒక సంస్కారంగా, సంస్కరణకు సాధనంగా భావించారు. కానీ అంబేద్కర్ దాన్నొక ఆధునిక విప్లవ కేతనంగా మలిచే ప్రయత్నం చేశాడు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన తన ఆలోచనలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ అమలు కాలేకపోతున్నాయని రాజ్యాంగం రాసుకుని దశాబ్దాలు దాటినా అవి ఆచరణ సాధ్యం కాలేకపోతున్నాయని, చివరకు విద్యాహక్కు చట్టంతో సహా ఏ ఒక్కటీ అమలు కాలేకపోతున్నాయని ఆందోళన చెందుతారు నరసింహాడ్డి. అయి నా సరే సమాజంలో ఒక మనిషి ‘నాగరికత సమకూర్చిన సమస్త వస్తు సంపద వాడుకోవచ్చునేమోగానీ,అంతకంటే విలువైన విద్య ను, అది అందించే ఫలాలను సంపూర్ణంగా అనుభవించే అవకాశాలను హక్కులను మాత్రం కోల్పోకూడదన్న’ అంబేద్కర్ సూక్తి అంతర్లీనంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే ఆయన ఒక ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాతగా చదువుని సామాన్యుడికి చేరువచేసి అంతరాలు దూరం చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టే ఈ వ్యాసాలకు అంతటి బలం ఉంది. అలాగే మానవాభివృద్ధికి చదువు ఒక మౌలికమైన సరుకని నరసింహాడ్డి నమ్మారు.

వీటిలో ఆయనకున్న మార్క్సిస్టు అవగాహన వ్యక్తమౌతుంది. చదువంటే సమాజ పరివర్తనకు ముందు షరతుగా ఉండాలన్న వాదన మొదలౌతుంది. విద్య వ్యక్తి సంపూర్ణ వికాసానికి, సమాజ సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని అది జరగాలంటే సామాజిక అంతరాలు, వివక్ష తొలగిపోవాలని నరసింహాడ్డి ఆకాంక్షిస్తారు. ఏదో ఒక మహావిప్లవం సంభవిస్తే తప్ప అది సాధ్యం కాదని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన మేరకైనా ప్రయత్నాలు జరగాలని కోరుకుంటాడు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు లక్ష్యాలపట్ల కొంత విశ్వాసం వ్యక్తం చేస్తూనే అవి అమలు కాకుండాపోతున్న అన్యాయమైన పరిస్థితులను చూసి ఆగ్రహిస్తాడు. ప్రపంచీకరణ తరువాత విద్య కార్పొరేటు శక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళిపోతున్నది? విద్య లక్ష్యాన్ని సాధించకుండానే ఎలా నిర్వీర్యమైన, నిస్సారమైన వ్యవస్థగా ఎలా మారిపోతున్నదీ వివరించే పుస్తకం ఇది.
పొఫెసర్ ఘంటా చక్రపాణి
(‘సామాజిక విద్య-ఒక మిథ్య’ పుస్తకానికి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి