శనివారం, ఆగస్టు 04, 2012

ఒక బాబు.. రెండు కళ్లు.. మూడు రంగులు


ఆ మధ్య ఊసర పేరుతో ఒక సినిమా వచ్చినప్పుడు ఇదేం పేరని అనుకున్నా! అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఊసర చాలా అరుదైన కీటకం. పరిస్థితిని బట్టి రంగులు మార్చుకునే అవకాశం ఒక్క ఊసర ఉంది. ఇది సృష్టిలో ఏ జీవికీ లేని అవకాశం. అందుకే కొన్ని దేశాల్లో ఊసర పెంచుకుంటున్నారట! కానీ మనదేశంలో మాత్రం ఊసర పెంచుకో దగినంత మంచిపేరు లేదు. దానితో ప్రజలకు అంత సఖ్యత, సాన్నిహిత్యమూ లేవు. పాములనైనా పెంచుకోగలిగే వాళ్ళను చూశాం. కానీ ఊసర పెంచుకునే వాళ్ళు మనకసలు కనిపించరు. అలాంటిది ఊసర అనే పేరుతో జూనియర్ సినిమా ఎందుకు చేశాడో మొదట అర్థం కాలేదు. ఆ సినిమా కథ ఏమిటో కూడా తెలియదు, గానీ పేరు మాత్రం వాళ్ళ మామ చంద్రబాబునాయుడును తలపిస్తోంది. రాజకీయాల్లో ఆయన పాత్ర ఇప్పుడు ఊసర కూడా తల దించుకునే విధం గా ఉంది. ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఊసర మీద కొంత ఆసక్తి పెరిగింది. ఇంట్నట్‌లో వాటి జీవనశైలి గురించి వెతకడానికి గూగుల్‌లో ప్రయత్నించాను. ఆశ్చర్యం. అక్కడా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే వికీపీడియాలో దర్శనమిచ్చింది!


సాధారణంగా మనం రాజకీయ నాయకులను ఊసర పోల్చుతుంటాం. అలా ఎందుకు మొదలయ్యిందో గానీ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత చంద్రబాబునాయుడుకు ఆ పేరు స్థిరపడిపోయింది. బహుశా రెండు మూడేళ్ళుగా చంద్రబాబు పోకడలు, రాజకీయ ఎత్తుగడలు గమనిం చే విమర్శకులు ఆయనకు ఆ పేరు స్థిరపరిచి ఉంటారు. ఇదంతా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా సరే ఊసర గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. కానీ మనం అనుకుంటున్నట్టు ఊసర ఎప్పుడు పడితే అప్పుడు రంగులు మార్చుకోలేవు. అలాగే ఉన్నట్టుండి ఏ రంగు పడి తే ఆ రంగు పులుముకోవు. వాటి జీవితం పరిమితమయినట్టే వాటి రంగు లు కూడా అతిపరిమితం. ఎంత పెద్ద ఊసర అయినా సరే రెండుమూడు సందర్భాలను మించి రంగులు మార్చుకోలేవు. వాటికి రాజకీయాలులేవు కాబట్టి పరిస్థితులను బట్టి కాకుండా కేవలం వాటి మానసికస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఉష్ణోక్షిగత, వెలుతురును బట్టి మాత్రమే అవి రంగులు మార్చుతా యి.

తెలంగాణ విషయంలో చంద్రబాబునాయుడు ఊసర కంటే ఎక్కువసార్లే మాటమార్చారు. ఇంకా మారుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం. ఊసర ఎంత రంగులు మార్చే శక్తి ఉన్నా అది ఒక కాలంలో, ఒక దశలో ఒకే రంగులో ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి పలు రంగు ల్లో ఉండే ప్రయత్నం చేయదు. అది సాధ్యం కాదు కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఒకేసారి పలురంగుల్లో దర్శనం ఇస్తున్నాడు. అదీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కనిపిస్తున్నాడు.

తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులకు, ముఖ్యంగా టీ టీడీపీ నాయకులు ఎర్రబెల్లి, కడియం, నర్సింహులు లాంటి వారికి ఆయన వీర తెలంగాణ పోరాట యోధుడిగా ఎర్రెపూరటి రంగులో దర్శనం ఇస్తున్నారు. ఆయన నేడో రేపో అదే రంగు సిరాతో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారని కూడా వాళ్లింకా నమ్ముతున్నారు. ప్రజలందరినీ నమ్మింపజేయ చూస్తున్నారు. అదే సమయంలో చుక్క నీరు లేకపోయినా, నాగలి దున్ని నారుపోసిన కోస్తా నేతలు కోడెల శివవూపసాద్, దేవినేని ఉమకు ఆయన అపర భగీరథుడై కనిపిస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆయన కచ్చితంగా తమ కోసం నాగార్జునసాగార్‌ను నిలువునా కొల్లగొట్టి నీళ్ళు తేస్తాడన్న గట్టి నమ్మకంతో వాళ్ళిప్పుడు నీటి యుద్ధానికి సిద్ధమౌతున్నారు. దానికి తానే సారథ్యం వహిస్తానని ఆయన ఆకుపచ్చరంగులో దర్శనం ఇచ్చి అభయం కూడా ఇచ్చేశారు. ఇకపోతే నిన్నటికి నిన్న ఆయన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి శ్రీకృష్ణ దేవరాయలై కనిపిస్తున్నారు. ప్రత్యేక రాయలసీమ కావాలని కొత్త పాట మొదలుపెట్టిన బైరెడ్డికి ఇప్పుడు ఆయన రాయలలాగే నలుపు రంగులో అగుపిస్తున్నారు.

కానీ ఇప్పుడు చంద్రబాబుకు తన అసలు రంగు ఏమిటో అర్థం కానీ స్థితి వచ్చింది. ఆయన రంగు ఏమిటో ఆయనకు బోధపడకపోయినా తెలంగాణ ప్రజలకు మాత్రం అది బాగానే అర్థమయ్యింది. ఆయనది అసలు సిసలు పసుపు రంగు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల కింద ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో వాళ్ళ మామ ఎన్‌టీ రామారావు అద్దిన ఆ రంగు అది. చంద్రబాబు తరచూ అలా మార్చి మార్చి ఇప్పుడు ఆయన అసలు రంగు ఏమిటో తెలుసుకోలేని అయోమయంలో పడిపోయారు. ఊసర ఈ సౌలభ్యం లేదు. ఎందుకంటే అది దాని శరీరధర్మం. వ్యూహాత్మక లక్షణం కాదు. కానీ చంద్రబాబుది రాజకీయ వ్యూహం. ఆయనకాయన అలవరచుకున్న లక్షణం. ఇప్పుడు ఆ లక్షణమే రుగ్మతగా మారిపోయి ఆ పార్టీ రంగు వెలిసిపోయే స్థితి కి తీసుకు వచ్చింది. వెరసి ఆ పార్టీ తన రాజకీయ లక్షణాన్ని కోల్పోతోంది. లేకపోతే గొంతెండి పోతున్న వాళ్ళ గురించి మాట్లాడకుండా, నారుమళ్ల కోసం పరితపించడం పోరాటాలు చేయడం ఎక్కడి న్యాయం? 

చంద్రబాబు సరే! తెలంగాణకు అన్యాయం జరిగిపోతున్నదని, తెలంగాణ సాధనే తమ ధ్యేయమని అరిచి గీపెట్టిన టీ టీడీపీ నేతలకు ఏమయ్యింది? సాగర్ జలాశయంలో కనీస నీటిమట్టం లేకుండా నీళ్లన్నీ కొల్లగొడుతుంటే వాళ్లెమైపోయా రు? అటువంటి జల దోపిడీకి తమ నాయకుడే ఉసిగొలుపుతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు, తప్ప ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేకపోయారు? నల్లగొండకు చెందిన ఒక నాయకుడు ఆ మధ్య హైదరాబాద్‌లో పసుపుపచ్చ ఉరితాడు పట్టుకుని ఊరేగుతూ కనిపించేవాడు. ఇప్పుడు అదే తాడుతో చంద్రబాబునాయుడు అక్కడి ప్రజలకు ఉరి పేనుతున్నాడు. ఆయన జిల్లాలోనే నాగార్జునసాగర్ ఉన్నది. ఆయన నియోజకవర్గంలో సగం మందికి పైగా ప్రజలు ఫ్లోరైడ్ పీడితులు. తాగునీరు లేక తల్లడిల్లుతున్న వాళ్ళు. ఇప్పుడు ఆ నీళ్ళనే కృష్ణా డెల్టాకు తరలించాలని చంద్రబాబు పోరాడుతున్నారు. నల్లగొండ జిల్లా ప్రజ లు ప్రాణాలకు తెగించి కృష్ణా నదిలోకి దిగి నీళ్ళు అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం పత్తాలేడు. 

ఇక ఇంకొక నేత ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన టీ టీడీపీకి నాయకుడు కూడా. ఆయనది వరంగల్ జిల్లా. అక్కడే కాకతీయ మెడికల్ కాలేజీ ఉన్నది. ఆ కాలేజీకి రావాల్సిన సీట్లు రాకుండాపోయాయి. లక్షలమందితో పోటీ పడి వందల్లో ర్యాంక్‌లు సాధించిన వేలాదిమంది పిల్లలకు ఇది అశనిపాతం అయ్యింది. ఒక్క ఆ కాలేజీలోనే కాక తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఇదే జరిగింది. ఫలితంగా తెలంగాణ పల్లెపల్లె తమ పిల్లలకోసం ఆరాట పడింది. ఆందోళన చెందింది. పొరపాటున తెలంగాణ పోరాటపు తొలి పేరు అయిన పాలకుర్తికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన మాత్రం పత్తా లేడు. బాబు ఆదేశించినప్పుడల్లా, కేసీఆర్ మీద, తెలంగాణ ఇతర ఉద్యమకారులమీద కస్సుమని లేచే ఆయన ఈ అన్యాయం గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదు.

ఆయన బాబు గారు కూడా నోరు విప్పలేదు. ఇదంతా చంద్రబాబు అసలు రంగు ఫలితమే. ఆ రంగు ప్రకాశిస్తుంది. చుట్టున్న పరిసరాలమీద, వ్యక్తుల మీదా ప్రతిఫలిస్తుంది. ఊసర రంగుకు ఆ శక్తి లేదు!
నిజానికి తెలుగుదేశం పార్టీ రేంజ్ అది. తెలుగు ప్రజలను సమైక్యం చేసిన పార్టీగా, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా పసుపురంగులో పుట్టిన తెలుగు దేశం ఇప్పుడు రకరకాల రంగుల్లో కనబడుతూ క్రమక్షికమంగా వివర్ణమైపోతోంది. దీనికి బాధ్యుడు చంద్రబాబు. తెలంగాణ నినాదం రాజకీయ ఎజెం డాగా మారిన కాలంలో రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న ఆయన తెలుగుజాతి సమైక్యత, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం అంటూ గంభీరమైన మాటలతో గర్జిం చే వారు. ఆయన పాలనలో తెలంగాణ అనే పదాన్ని చట్టసభల్లో ఉచ్చరించడానికి కూడా వీలు లేకుండా కంటి చూపుతోనే కట్టడి చేశాడు. అప్పటికి ఆ పార్టీలో ఆయనొక్కడే నాయకుడు. ఆయన మాటే ఆ పార్టీకి వేదం. కానీ 2004లో తెలంగాణ దెబ్బతో ఆ కోట కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల్లో మూలుగుతూ ఐదేళ్ళ మేధోమథనం తరువాత ఆయన తనకు జ్ఞానబోధ కలిగిందని తను మారానని తెలంగాణ నినాదంతో జనం ముందుకు వచ్చారు.

ఆంధ్రాలో ఉన్న తన అనుచరులతో ఆ మేరకు తీర్మానాలు చేయించా డు. ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన మహాగర్జనలో ఆ మాటే చెప్పి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. తెలంగాణ ప్రజలు నిజంగా నే తెలుగుదేశం పార్టీని నమ్మారు. ఆ నమ్మకంతోనే టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో దాదాపు డ్బ్భై శాతం అభ్యర్థులను గెలిపించారు. అదే ఆంధ్రాలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచింది ముప్ఫై శాతంలోపే. రాయలసీమలో ఆ పార్టీ బలం పదిశాతం స్థానాలే. అయినా ఆయన అటువైపే మొగ్గు చూపుతూ ఇంకా తీరని ద్రోహం చేస్తున్నారు.

తెలంగాణ విషయంలో కట్టుబడి ఉన్నామని మొదటిసారి రంగు మార్చిన చంద్రబాబు ఆ తరువాత అధికారంలోకి రాకపోవడంతో మళ్ళీ పాతరంగు కే పరిమితం అయిపోయారు. కనీసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే కేసీఆర్ దీక్షతో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొని ఉండాల్సింది, అలా చేయలేదు సరికదా ఉద్యమానికి తూట్లు పొడవాలని ప్రయత్నించాడు. అది ఆయన చేసిన రెండో తప్పు. అయితే అక్కడ ఆయన ఓడిపోక తప్పలేదు. ప్రజాక్షిగహానికి బలికావాల్సి వస్తుందని గ్రహించిన ఆయన విధిలేక 2009 డిసెంబర్ ఏడో తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని తక్షణమే విభజించాలని, తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానం మీద తన పార్టీ తరఫున సంతకం చేయించాడు. ఆ మరుసటి రోజు రాష్ట్ర శాసనసభలో కూడా అదే మాట చెప్పాడు. నిజానికి ఆ మాటమీద ఉన్నా తెలంగాణ ప్రజలు ఆయనను క్షమించి వదిలేసేవాళ్ళు! కానీ ఆయన తలలోనే ఉన్న అధికారపు రంగుల కల మూడో రోజుకల్లా బాబుగారి రంగును మరోసారి మార్చివేసింది. ఊసర కూడా ఇలా పూటకోరంగు మార్చలేవని పరిశోధకులు అంటున్నారు.

డిసెంబర్ 9న ఢిల్లీ లో వెలువడ్డ తెలంగాణ ప్రకటన ఇంకా పూర్తిగా తెలుగు మీడియాలో ప్రసా రం కాకముందే ఆయన మన సు మార్చుకున్నాడు, మాట మార్చివేశాడు. తెలంగాణను అడ్డుకున్న తొలివ్యక్తిగా ఆయన చరివూతలో నిలిచిపోయారు. అంతే కాదు ఆయనే పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులను కూడగట్టి సమైకాంధ్ర ఉద్యమానికి స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. పాపం ఆయనకు అక్కడా చేదు అనుభవమే ఎదురయ్యింది.

తెలంగాణను వ్యతిరేకించిన వాడిగా మిగిలిపోయి, కరుడు గట్టిన సమైక్యవాదిగా రేపు కనీసం సీమాంధ్ర రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కావొచ్చని కూడా కొంతకాలం కలల్లో తేలిపోయారు. కానీ జగన్ రూపంలో వచ్చిన ఉపవూదవం ఆయన పార్టీకి సమూలంగా కోత పెట్టి ఆయనకు ఇప్పుడూ కలతనే మిగిల్చింది. సీమాంధ్ర ప్రజలు నాయుడు గారిని నమ్మడం లేదు, అలా గే సమైక్యాంవూధనూ కోరుకోవడం లేదు. ఈ సంగతి ఆయనకు అక్కడ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత మాత్రమే అర్థమయ్యింది! ఇప్పుడు ఆయన కోలుకోలేని మానసిక ఆందోళనలో పడిపోయారు. ఆయన మనసిప్పుడిప్పుడే స్థిమిత పడే సూచనలు కూడా కనిపించడం లేదు. అందుకే ఆయన అనాలోచితంగా ఉంటున్నారు. అయోమయంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు రంగుల వల ఒక దేవినేని ఉమకు తెలిసినంతగా, ఒక బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తెలిసినంతగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు తెలియకపోవడం అజ్ఞానమో ఆత్మ వంచనో ప్రజలే ఆలోచించాలి. కనీసం వాళ్ళలో అన్యాయాన్ని న్యాయమని వాదించే సత్తా ఉంది, వీళ్ళకు న్యాయా న్ని న్యాయం అనగలిగే ధైర్యం లేకపోవడం అవమానకరం. ఇంకా ఆత్మ పరి శీలన చేసుకోకుండా అలాగే ఉంటే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ జీవితానికి కచ్చితంగా రంగు పడుద్ది.

చంద్రబాబులో ఎన్నిరంగులున్నాయో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ఏడాది లోనే అర్థం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయనను చంద్రబాబు మామ రూపంలో మచ్చిక చేసుకున్నాడు. ఆ తరువాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయనకు ట్యూషన్ చెప్పించి రాజకీయాలు నేర్పించే గురువుగా గంభీరమైన ఫోజు ఇచ్చాడు. రేపటి తెలుగుదేశం నీదే అని చెప్పి, దానికోసం ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని పురికొల్పాడు. పాపం ఆ ఉత్సాహంలో ప్రమాదానికి గురై అనవసరంగా ఎన్టీఆర్ తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నా డు.

పాపపరిహారమనుకున్నాడో ఏమోగానీ చందబాబే పిల్లను వెతికి పెళ్ళికూడా చేశాడు. అంతలోనే రాజకీయం మారిపోయింది. రంగులూ మారిపోయాయి. ఇప్పుడు జూనియర్‌ను ఆ చాయలకు కూడా రానివ్వడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ చతురుడు, బహుశా ఇవన్నీ గమనిస్తు న్న కాలంలోనే ఆయన ఊసరవెల్లి అనే సినిమా చేసి ఉంటాడు. హీరో తనే అయినా పేరు మాత్రం మామది పెట్టుకుని ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ మధ్య చందబాబు గురించి ఇదేమాట చెప్పాడు. కాకపోతే ఇంకొంచెం ఘాటుగా చెప్పాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి